
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని కేంద్రమంతి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఉత్తరం రాసిన రిప్లై ఇవ్వాలని ప్రధాని తమకు ఆదేశించారని, ప్రతినెలా తమకు వచ్చిన లేఖలపై రివ్యూ చేస్తామన్నారు. అయితే పంపిన లేఖలకు బదులిచ్చే సంస్కారం సీఎం కేసీఆర్‌కి లేదని ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రాసిన లేఖలో.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్రం కోటి రూపాయలు కేటాయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించాలని లేఖలు రాసినప్పటికీ కేసీఆర్ మాత్రం స్పందించలేదని మండిపడ్డారు. వివిధ అంశాలపై విడివిడిగా లేఖలు రాసినట్లు తెలిపారు. అందులో..
►సైనిక స్కూల్ కి భూమి అప్పగించాలని కోరారు
► యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు సాగడం లేదు
► ఎంఎంటీఎస్ సెకండ్ పేజ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు
► హైదరాబాద్ లో సైన్స్ సిటీ కోసం భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
►రైల్వేల పురోగతికి సహకరించాలని కోరిన కేంద్రమంత్రి
►దళిత విద్యార్థుల జాబితా కేంద్రానికి ఇవ్వకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇవ్వాల్సిన స్కాలర్ షిప్స్ అందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కిషన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment