సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
అంతకుముందు, కేసీఆర్ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, అసెంబ్లీ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతరం బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ pic.twitter.com/0QJDqd8ERD
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2024
Video Credit: Telugu scribe
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం, తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.
KCR sir entering into Telangana Legislative Assembly
— Krishank (@Krishank_BRS) February 1, 2024
Jai Telangana pic.twitter.com/bCrtRwUfP7
Comments
Please login to add a commentAdd a comment