తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత | Telangana Assembly Budget Session February 14th Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Published Wed, Feb 14 2024 9:06 AM | Last Updated on Wed, Feb 14 2024 1:57 PM

Telangana Assembly Budget Session February 14th Updates - Sakshi

Telangana Assembly Budget 2024 Session Updates

ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి

  • నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను 
  • అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు 
  • ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది 
  • సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు
  • సీఎం చెప్పేదొకటి చేసేదొకటి 
  • అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు
  • ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం

అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి 

  • చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి
  • రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు
  • సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది
  • ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు
  • ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు
  • బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు
  • కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా?

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

  • మీడియా పాయింట్‌ వద్దకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్‌
  • సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు
  • కొత్తగా ఈ రూల్స్‌ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్‌ వాగ్వాదం
  • మీడియా పాయింట్‌ వద్దకు వెళ్లేందుకు యత్నం
  • స్పీకర్‌ నుంచి తమకు ఎలాంటి నోట్‌ రాలేదన్న బీఆర్‌ఎస్‌
  • కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పోలీస్‌ పాలన:బీఆర్‌ఎస్‌
  • సభలో మైక్‌ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా?
  • ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్‌ఎస్‌ నిరసన
     

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

  • సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం

మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్‌రెడ్డి

  • సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు
  • రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి
  • రేపు సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి.

ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి

  • పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు
  • కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి

ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్‌ అంటారా?:  సీఎం రేవంత్‌

  • మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్‌
  • ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు
  • కేసీఆర్‌ మాట్లాడిన భాష సరిగా ఉందా?
  • తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్‌ మాట్లాడారు
  • ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్‌ అంటారా?
  • ఇప్పటికే కేసీఆర్‌ ప్యాంట్‌ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు
  • ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి
  • అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు
  • సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది
  • కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం

కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

  • ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్‌కు థాంక్స్: కడియం
  • ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు
  • గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం.
  • ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు
  • గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు 
  • టీసీఎస్‌ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు
  • కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్‌ఎస్‌ బురదజల్లుతుంది.

కాంగ్రెస్ మేడిగడ్డ టూర్‌పై సభలో స్పందించిన బీఆర్‌ఎస్‌

  • మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి
  • విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది
  • మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి
  • మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి
  • జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి.

అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి

  • మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్
  • మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్‌ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్
  • భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం
  • కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం
  • భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం

ఇరిగేషన్‌పై తెలంగాణ శాసనసభలో రసాభాస

  • కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • పదేళ్లు మా యువరాజు  సిరిసిల్లకు అన్యాయం చేశారు
  • కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు
  • గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్
  • లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది.

శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస

  • ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు
  • ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది
  • ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి
  • ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు
  • ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు.
  • ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం 
  • వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం

బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు

  • ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే
  • ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం
  • కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి
  • పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా?

నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే

  • మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి
  • బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి
  • అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ
  • ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు
  • గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది?
  • అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు?

తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ

  • బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి
  • రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి.
  • బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్  లేరు: కడియం శ్రీహరి
  • బడ్జెట్‌పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు

అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి
  • ఇరిగేషన్‌పై సభలో మంత్రి ఉత్తమ్‌ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు

నేడు తెలంగాణ అసెంబ్లీలో.. 

  • కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
  • తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ
  • సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
  • ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ
  • ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల 
  • మేడిగడ్డ విజిలెన్స్‌ రిపోర్ట్‌, కాగ్‌ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • ఇరిగేషన్‌పై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement