
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్‌ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.
పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ
‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్‌రావు సూచించారు.
పోలీసుల మరణ మృదంగం..
ప్రభుత్వానికి పట్టింపు లేదా ?
ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024
Comments
Please login to add a commentAdd a comment