
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో గురువారం(జులై 25) తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణభవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌శాసనసభాపక్ష భేటీకి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతురుణమాఫీ సహా పలు అంశాలపై పోరాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ హాజరవలేదు.
Comments
Please login to add a commentAdd a comment