begumpet air port
-
HYD: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
Updates.. ►హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆలస్యం ►అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే ►అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలి ►ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే ►చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు ►కొంత మంది అవినీతి పరులు సుప్రీంను ఆశ్రయించారు ►నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ►కోర్టు వాళ్లకు షాక్ ఇచ్చింది ►తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి ►నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ►అభివృద్ధి కార్యక్రమాల్లో విఘాతం కలిగించొద్దు ►తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది ►తెలంగాణలో కుటుంబం పాలనతో అవినీతి పెరిగింది ►కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు ►ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి ►మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ►రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులుకేటాయించాం ►తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం ►తెలంగాణలో 4 హైవే లైన్లకు శంకుస్థాపన చేశాం ►తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు ►సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం ►ఏపీ-తెలంగాణు కలుపుతూ మరో వందేభారత్ ట్రైన్ ►హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌లు విస్తరణ ►ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు ►తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రధాని మోదీ ►అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని ►తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది ►తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యారు ►రిమోట్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం ►ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. ►తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ►భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. ►తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. ►తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగం ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది ►రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం ►రూ. 7,864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి ►తెలంగాణలో జాతీయ రహదారులకు రూ. 1.04లక్షల కోట్లు కేటాయించాం ►తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యం ►దేశంలో 14 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తే.. రెండు రైళ్లు తెలంగాణకు బహుమతిగా ఇచ్చారు ►రూ. 714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ ► పరేడ్ గ్రౌండ్స్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ► ప్రధాని పర్యటన, ప్రసంగం దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ► పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ ► పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. ► దేశంలోనే ఇది 13వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ప్రారంభమైన రెండో రైలు ఇది. ► రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న విద్యార్థులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ► సికింద్రాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులోకి ఎక్కారు. ► బేగంపేట నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ. ► ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ► ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ ► కాసేపట్లో ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు. ► బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ ► బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు కుర్చీను ఏర్పాటు చేశారు. ► అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీ వేశారు. ► సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులు మహమూద్ అలీ, హరీష్‌రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k — Narendra Modi (@narendramodi) April 8, 2023 సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సర్వం సన్నద్ధమైంది. ► ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి 1.30 గంటలకు తిరిగి వెళ్లే వరకు ప్రధాని పర్యటించే ప్రాంతాలు, మార్గాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)తోపాటు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు కలిపి ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ను అందంగా అలంకరించారు. ► సైనిక అమర వీరుల వార్ మెమోరియల్ పక్కనే ఉన్న పశ్చిమ ప్రధాన ద్వారం నుంచి ప్రధాని నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ► ప్రధాని అధికారిక కార్యక్రమం కావడంతో కేవలం లక్ష మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా 3 ప్రధాన షెడ్లను ఏర్పాటు చేశారు. ► ప్రధాని సభ అధికారిక కార్యక్రమం కావడంతో పరేడ్‌గ్రౌండ్ లోపల పార్టీ నేతల పోస్టర్లకు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ చుట్టూ రోడ్లు, మెట్రో పిల్లర్లు, భవనాలు అంతటా బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. బేగంపేట విమానాశ్రయం–సికింద్రాబాద్ స్టేషన్–పరేడ్ గ్రౌండ్స్ మధ్య మార్గాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జేఈఈ మెయిన్స్, ఎస్సై అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో చాలా స్కూళ్లు టెన్త్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఆంక్షలతో, సభకు వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని పోలీసులు అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు, విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. - ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు.. - 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. - 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. - మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. - 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు - 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం... - 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన. - 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం - 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం. -
రూ.400 కోట్లతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం
తెలంగాణలో మరో పరిశోధనా సంస్థ రూపుదిద్దుకుంటోంది. పౌర విమానయాన రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనా సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.400 కోట్లకుపైగా అంచనా వ్యయంతో బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఏఆర్వో)కు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో మున్ముందు విమానయాన రంగంలో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరగనున్నాయి. ‘గృహ–5’ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ కేంద్రంలో విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్, డొమైన్ సిమ్యులేటర్, నెట్వర్క్ ఎమ్యులేటర్, విజువలైజేషన్ – అనాలసిస్ ల్యాబ్స్, సరై్వలెన్స్(నిఘా) ల్యాబ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ – సిమ్యులేషన్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ – థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ – టూల్స్ సెంటర్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్‌సహా పలు పరిశోధనలు జరగనున్నాయి. -
పేదలను లూటీ చేసే ఎవరినీ వదలం: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ‘అవినీతి, కుటుంబ పాలన అనేవి ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులు. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. పేదలను లూటీ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోం. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను దోచుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశా. అవినీతిపరులు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కూటమిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. వారికి అంతా అర్థమవుతోంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతో వచ్చిన కొందరు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన రాజ్య మేలుతోందని.. దీనిని అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం ఇవ్వాలని.. అన్ని వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి చేసి చూపిస్తామని పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. బేగంపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్, కేసీఆర్‌ల పేర్ల ను ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించా రు. ప్రసంగం వివరాలు మోదీ మాటల్లోనే.. ‘తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టం. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు భారతమాత సేవ కోసం నిష్టతో కృషి చేస్తున్నారు. వారికి నా అభినందనలు. తెలంగాణతో బీజేపీకి బలమైన అనుబంధం ఉంది. 1984లో బీజేపీకి పార్లమెంటులో కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచి, బీజేపీకి అండగా నిలిచినదే. ఇప్పుడు బీజేపీ పార్లమెంటులో మూడు వందలకు పైగా సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోంది. త్వరలో తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇక్కడి ప్రజల మద్దతును చూస్తే తెలుస్తోంది. తెలంగాణ ప్రజలకు విశ్వాస ఘాతుకం చేశారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉంది. అవినీతిమయమై కుటుంబ పాలనలో చిక్కుకుంది. తెలంగాణ పేరుతో ముందుకొచ్చిన కొందరే అభివృద్ధి చెందారు. వారు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ అవినీతిని, కుటుంబ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. మునుగోడులో ఓటర్లు ఇచ్చిన మద్దతుతో తెలంగాణలో కమల వికాసం ఖాయమనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల పెరిగిన ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. మూఢ నమ్మకాల ప్రభుత్వాన్ని తరిమేద్దాం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలను ప్రభుత్వాలు పాటించడం బాధాకరంగా ఉంది. మూఢ నమ్మకాలను పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కార్యాలయాలు ఎక్కడుండాలి? ఎవరెవరిని మంత్రులు చేయాలి? ఎవరిని మంత్రివర్గం నుంచి తీసేయాలి అని చూస్తోంది. ఈ తంతును దేశప్రజలంతా గమనిస్తున్నారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి ప్రధాన విరోధులు. బీజేపీలో కుటుంబ పాలన లేదు. మూఢ నమ్మకాలు లేవు. అవినీతి, అక్రమాలు లేవు. ప్రజలను దోచుకుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇళ్లు ఇవ్వలేకపోయాం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. పలు రాష్ట్రాల్లో పథకాన్ని విజయవంతంగా అమలు చేసినా తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం వైఖరి కారణంగా చేయలేకపోయాం. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వలేదు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలుసు. ఇక దేశంలోని ఏ వ్యక్తి ఆకలితో చనిపోవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఏకంగా 2 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాం. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశాం. నన్ను తిట్టడమే వారి పని తెలంగాణలో అధికారంలో ఉన్నవారు మోదీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కొత్త తిట్లు వెతికి మరీ తిడుతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయంటే.. బీజేపీని, నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తాం.. పెద్దగా పట్టించుకోబోం. కానీ తెలంగాణ ప్రజలను తిడితే.. వారికి అన్యాయం చేస్తే.. వారి కలలను, ఆశలను వమ్ముచేస్తే ఊరుకునేది లేదు. ఇతర పార్టీల నాయకులు తిట్టే తిట్లకు బీజేపీ కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దు. ప్రజల సమస్యలు తీరుతాయంటే.. ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే తిట్లు తిట్టినా పట్టించుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు కదలండి. ప్రతివార్డులో ప్రతి ఇంటి తలుపుతట్టండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకొండి. అందని వారికి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నం కండి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటిలక్ హీట్ పుట్టిస్తోంది. పీఎం మోదీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, పర్యటనలో భాగంగా మోదీ.. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. - నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేసుకుంటారు. - 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్ (అనధికార సమావేశం) - 2.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం బయలుదేరుతారు. - 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. - 4.15 నుంచి 5.15 గంటల వరకు రామగుండంలో సభ - 5.30 గంటలకు రామగుండం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. - 6.35 గంటలకు బేగంపేట చేరుకుంటారు. - 6.40 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ బయట మోదీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పరిశీలిస్తున్నారు. గత పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ.. ఐబీఎం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ప్రధాని మాట్లాడారు. సమతా మూర్తి విగ్రహం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. అలాగే, హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. -
అత్యాధునిక ఇండియన్ హెలికాప్టర్
-
ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్సిళ్లు
-
‘వింగ్స్ ఇండియా-2020’ ప్రదర్శనలో కేటీఆర్
-
బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా ‘వింగ్స్ ఇండియా–2020’
-
అమిత్ షా తీరుపై బీజేపీ నేతల ఆశ్చర్యం
-
మార్చి 16 నుంచి హైదరాబాద్‌లో ఏవియేషన్ సదస్సు
కనువిందు చేయనున్న ఎయిర్‌బస్ ఏ350 వేదికవుతున్న బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైమానిక ప్రదర్శనకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది. 2016 మార్చి 16-20 తేదీల్లో ఇండియా ఏవియేషన్-2016 అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు జరుగనుంది. రెండేళ్లకోసారి బేగంపేటలో ఈ ఈవెంట్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఫిక్కీ సహకారంతో పౌర విమానయాన శాఖ దీనిని నిర్వహిస్తోంది. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 250కిపైగా కంపెనీలు ఇక్కడ తమ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర ఉపకరణాలు, సేవలను ప్రదర్శించనున్నాయి. బోయింగ్, బాంబార్డియర్, ఎయిర్‌బస్, డస్సాల్డ్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్, హనీవెల్, ఖతార్ ఎయిర్వేస్, ఎంబ్రాయర్, గల్ఫ్‌స్ట్రీమ్, రోల్స్ రాయ్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్ ఇండియా, పవన్ హన్స్ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయి. ఎయిర్‌బస్ నూతన మోడల్ ఏ350 విమానం ప్రత్యేక ఆకర ్షణగా నిలవనుంది. భారత్‌కు ఇది తొలిసారిగా అడుగు పెడుతోంది. ఇవీ ఏ350 విశేషాలు.. విమానం ధర మోడల్‌నుబట్టి రూ.1,800-2,300 కోట్ల వరకు ఉంది. వేరియంట్‌నుబట్టి 440 మంది వరకు కూర్చునే వీలుంది. వేగం గంటకు 940 కిలోమీటర్లు. ఒకేసారి 15,200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పొడవు 60.54 నుంచి 73.78 మీటర్లు. ఎత్తు 17 మీటర్లు. 64.75 మీటర్లమేర రెక్కలు విస్తరించాయి. బిజినెస్ క్లాస్‌లో 16 అంగుళాల సైజు స్క్రీన్స్‌ను పొందుపరిచారు. ఎయిర్‌బస్ తొలిసారిగా ప్రధాన బాడీతోపాటు రెక్కలను కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్‌తో తయారు చేసింది. గట్టిదనంతోపాటు తేలికగా ఉండడం ఈ మెటీరియల్ ప్రత్యేకత. చాలా ఖరీదైనది కూడాను. 25 శాతం అధిక మైలేజీ ఇస్తుంది. ఎయిర్‌బస్ ఇప్పటి వరకు ఏ350 మోడల్లో నాలుగు వేరియంట్లకుగాను 775 విమానాలకు ఆర్డర్లుంటే, 11 మాత్రమే డెలివరీ చేసింది. ప్రస్తుతం ఖతర్ ఎయిర్వేస్, వియత్నాం ఎయిర్‌లైన్స్, ఫిన్‌ఎయిర్ మాత్రమే వీటిని దక్కించుకున్నాయి.