
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటిలక్ హీట్ పుట్టిస్తోంది. పీఎం మోదీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, పర్యటనలో భాగంగా మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ బయట రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
- నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేసుకుంటారు.
- 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్ (అనధికార సమావేశం)
- 2.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి రామగుండం బయలుదేరుతారు.
- 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు.
- 4.15 నుంచి 5.15 గంటల వరకు రామగుండంలో సభ
- 5.30 గంటలకు రామగుండం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు.
- 6.35 గంటలకు బేగంపేట చేరుకుంటారు.
- 6.40 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇక, ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ బయట మోదీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పరిశీలిస్తున్నారు.
గత పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ.. ఐబీఎం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ బయట ప్రధాని మాట్లాడారు. సమతా మూర్తి విగ్రహం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. అలాగే, హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment