
పోలీసుల బలగాల ఎంట్రీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి ఒక్కసారిగి మారిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది.
ఈ సందర్బంగా డీఆర్‌ఎమ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మరో గంటలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశాము. 15 రైళ్లను దూరప్రాంతాల నుంచి నడుపుతున్నాము.
7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. రెండు లగేజీ, రెండు సాధారణ భోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. కాసేపట్లో నుంచి మెట్రో రైళ్లు కూడా ప్రారంభం కానున‍్నట్టు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం రాకేశ్ డెడ్‌బాడీని స్వస్థలమైన వరంగల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment