
ఫైల్‌ఫోటో
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. విశాఖ, గుంటూరు రైల్వేస్టేషన్లపై సంఘ విద్రోహులు దాడి చేసే అవకాశముందని సీపీ తెలిపారు. దీంతో.. రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వారితో సంప్రదించినట్టు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment