Guntur Junction Railway Station (GNT)
-
అగ్నిపథ్: విశాఖ, గుంటూరు రైల్వేస్టేషన్లలో దాడులకు అవకాశం!
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. విశాఖ, గుంటూరు రైల్వేస్టేషన్లపై సంఘ విద్రోహులు దాడి చేసే అవకాశముందని సీపీ తెలిపారు. దీంతో.. రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వారితో సంప్రదించినట్టు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గుంటూరు స్టేషన్లో హల్చల్ : ఆమె ఎవరు?
సాక్షి, గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ మహిళ తిట్లదండకం అందుకున్న ఘటనపై రైల్వే పోలీసులు స్పందించారు. రైల్వే సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన యువతిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సకాలంలో తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో రైలు మిస్సయిందన్న కోపంతో ఓ యువతి రైల్వే అధికారిని నోటికొచ్చిన తిట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపైనా ఒంటికాలిపై లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరిగింది.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్ కౌంటర్లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ.. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ.. ఉద్యోగులపై తిట్ల దండకాన్ని అందుకుంది. ‘పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ’ అంటూ నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసును కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. (వీడియోలో ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం) -
రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ : వైరల్ వీడియో
పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ఇవి గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిట్టేసింది. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపై కూడా ఒంటికాలిపై లేచింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్ కౌంటర్లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ సదరు ఉద్యోగిపై తిట్ల దండకం అందుకుంది. నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీస్‌ని కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. (ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం) -
రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ
-
గుంటూరు మీదుగా ఎలక్ట్రిక్ రైలు
త్వరలో గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తి గుంటూరు రైల్వే డివిజన్‌ను పరిశీలించిన రైల్వే జీఎం వినోద్ సాక్షి, లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే డివిజన్ పరిధిలోని మంగళగిరి, గుంటూరు, నల్లపాడు రైల్వేస్టేషన్లను పరిశీలించానని తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో వెయిటింగ్ హాల్ పనులు, ప్లాట్ ఫాం నెం–1 ఎక్స్టెన్షన్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ను 1వ నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి 8వ నెంబర్ ప్లాట్‌ఫాం వరకు 2018–19లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా గుంటూరు–గుంతకల్ విద్యుత్ లైను పనులు పూర్తి గుంటూరు నుంచి గుంతకల్ వరకు రైల్వే విద్యుత్ లైన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ 17లోగా పూర్తి కానున్నాయని రైల్వే జీఎం తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి గుంటూరు డివిజన్ మీదుగా ఎలక్ట్రిక్ రైలు రానుందని చెప్పారు. గుంటూరు – గుంతకల్ రైల్వే డబ్లింగ్ లైన్ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. రెండు గ్రామాల్లో భూసేకరణ సమస్య వల్ల గుంటూరు–తెనాలి మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ పనులు పూర్తి కాలేదని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే డీఆర్ఎం వి.జి.భూమా, ఏడీఆర్ఎం రంగనాథ్, సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, డివిజన్ పరిధిలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌కు పచ్చజెండా
సాక్షి, న్యూఢిల్లీ : గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైనును నిర్మించనున్నారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది. గుంటూరు–గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్ ఉందని, డబుల్ లైన్ నిర్మాణంతో భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లైన్ వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరేందుకు ఈ మార్గం సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. -
విశాఖపట్నం– తిరుపతికి ప్రత్యేక రైళ్లు
* యథావిధిగా కాచిగూడ– గుంటూరు డెబుల్ డెక్కర్ రైలు * ‘పల్నాడు’కు అదనపు కోచ్‌లు నగరంపాలెం: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం– తిరుపతి– విశాఖపట్నంకు సువిధ డబల్డెక్కర్ రైలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై న్ నెం 82851 విశాఖపట్నం– తిరుపతి ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబరు 21, 28, డిసెంబరు 5,12,19, 26 తేదీల్లో విశాఖపట్నంలో 22.55 గంటలకు S బయలుదేరి న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు మరుసటిరోజు 06.10/06.12కి చేరుకుంటుంది. తిరుపతికి 13.25 గంటలకు చేరుకుంటుంది. ట్రై న్నెం 82852 తిరుపతి– విశాఖపట్నం వీక్లీ ప్రత్యేక సువిధ రైలు నవంబరు 22,29, డిసెంబరు 6, 13, 20 ,27 తేదీల్లో తిరుపతితో 15.30 గంటలకు బయలుదేరి న్యూగుంటూరు స్టేషన్‌కు 22.20/22.22కు చేరుకుంటుంది.Sవిశాఖపట్నంకు మరుసటి రోజు 06.50కి చేరుకుంటుంది. డబుల్ డెక్కర్ రైలు పునరుద్ధరణ.. ట్రైన్ నెం– 22118/ 22117 కాచిగూడ– గుంటూరు– కాచిగూడ ఎసీ డబుల్ డెక్కర్ రైలు సర్వీసును పునరుద్దరించి యధవిధిగా నడుపుతున్నట్లు తెలిపారు. ట్రైన్ నెం– 12747/12748 గుంటూరు– వికారాబాద్–గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు నవంబరు 11 నుంచి 30 వ తేది వరకు అదనంగా ఒక ఏసీ చైర్ కారును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. -
కొచ్చివెల్లి– గువహటికి ప్రత్యేక రైళ్లు
నగరంపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా కొచ్చివెల్లి– గుహవటికి ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కే. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై న్నెం 06336 కొచ్చివెల్లి–గుహవటి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఆదివారాలలో అంటే నవంబరు 13,20,27, డిసెంబరు 4,11,18,25 తేదీలలో కొచ్చివెల్లిలో 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 13.05 గంటలకు న్యూగుంటూరు చేరుకుంటుంది. 13.07కి బయలుదేరి గుహవటికి బుధవారం 08.45కి చేరుకుంటుంది. ట్రై న్నెం 06335 గుహవటి– కొచ్చివెల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం అంటే నవంబరు 16,23,30, డిసెబరు 7,14,21,28 తేదీలలో గుహవటిలో 23.25 గంటలకుS బయలుదేరి రెండవ రోజు (శుక్రవారం) 20.55గంటలకు చేరుకుంటుంది. 20.57గంటలకు బయలుదేరి కొచ్చివెల్లికి ప్రతి శనివారం 22.30 కి చేరుకుంటుంది. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఎనిమిది స్లీపర్ కోచ్‌లు, సాధారణ ప్రయాణికుల కోసం ఆరు జనరల్, రెండు ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. -
డబుల్ డెక్కర్‌కు ఆదరణ కరువు
► కనీసం 10 శాతం కూడా నిండని రైలు ► రూటు, వారాలే కారణమంటున్న ప్రయాణికులు నగరంపాలెం : గుంటూరు రైల్వే డివిజనులో ఖాజీపేట నుంచి గుంటూరు వరకు నడుపుతున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. సికింద్రాబాద్ వైపునకు మరిన్ని రైళ్లు నడపాలని డివిజను ప్రజల విన్నపాలకు ప్రతిఫలంగా రెండేళ్ల కిందట రైల్వే ఉన్నతాధికారులు డివిజనుకు డబుల్ డెక్కర్ బైవీక్లీ రైలును ఏర్పాటు చేశారు. అయితే.. ఇది సికింద్రాబాద్ నుంచి కాకుండా ఖాజీపేట- గుంటూరు- ఖాజీపేటకు మంగళవారం, శుక్రవారాల్లో నడుస్తోంది. పూర్తి ఏయిర్ కండీషన్డ్‌తో 1200 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి పండుగల రద్దీ సమయంలో మినహా మిగతా సమయాల్లో 10 శాతానికి మంచి ప్రయాణీకులు ప్రయాణించడం లేదు. సమస్య ఎక్కడుందంటే.. ఇది వారం మధ్యలోని మంగళ, శుక్రవారాల్లో ఉండటం ఒక సమస్య అయితే.. గుంటూరు నుంచి ఖాజీపేట మాత్రమే వెళ్లటం మరో సమస్యగా మారింది. టిక్కెట్టు ధరలు ఎక్కువగా ఉండటం, ఖాజీపేటకు పిడుగురాళ్ల వైపు నుంచి రైలు ఉండటంతో ప్రయాణికులు ఎక్కువ ధర వెచ్చించి దీనిలో ప్రయాణించలేకపోతున్నారు. దీన్ని గుంటూరు నుంచి విజయవాడ వైపు ఖమ్మం మీదుగా సికింద్రాబాద్‌కు నడిపితే అనుకూలంగా ఉంటుందని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా నడిపే రోజులైనా వారంతం లేదా వారం మొదటి రోజుల్లో (ఆదివారం లేదా సోమవారం) నడిపితే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవి కావటంతో ప్రజలకు అనువైన రూట్లో డబుల్ డెక్కర్ నడిపితే ప్రయాణీకులకు సౌకర్యవంతగా ఉంటుందని, రైల్వేకూ లాభాదాయకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రైల్వే డివిజన్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
రైల్వే యూజర్స్ కమిటీ సమావేశంలో డీఆర్ఎం నగరంపాలెం (గుంటూరు) : గత ఏడాదితో పోలిస్తే ఈసారి గుంటూరు రైల్వే డివిజన్లో ప్రయాణికుల వృద్ధి రేటు పెరిగిందని డీఆర్ఎం విజయశర్మ తెలిపారు. పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్‌లోని కొండవీడు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన నాల్గవ డివిజను రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సరుకు రవాణాలో మార్పులు లేకపోయినా ప్రయాణికులు మాత్రం 6.6 శాతం పెరిగారన్నారు. రైల్వేస్టేషన్లలో బల్లలు, ఇతర అవసరాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే అనుమతులు ఇస్తామన్నారు. డివిజన్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆదాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో డీఆర్ఎం వివరించారు. డివిజన్ పరిధిలో రాజధాని ఏర్పాటు అవుతున్నందున గుంటూరు స్టేషను నుంచి నేరుగా ఢిల్లీకీ, వారణాసికీ రైళ్ళు నడపాలని మెంబరు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు త్వరగా పూర్తి చేసి విజయవాడ-గుంటూరు-తెనాలికి సర్క్యులర్ రైళ్ళు నడపాలని కోరారు. సమావేశంలో మెంబర్లు వి. శ్రీనివాసులు, ఆర్.కె.జె. నరసింహం, ఎం. కోటిరెడ్డి, జి.ఎన్. మూర్తి, కిలారి రామారావు, జి. కిరణ్, కె. వెంకటరెడ్డి, ఏడీఆర్ఎం అంబాడే పాల్గొన్నారు. -
రైల్వే సేవలకు అంతరాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సబ్వే ఏర్పాట్ల కారణంగా రెండు రోజుల పాటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలగనుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని రామన్నపేట, వలి గొండ, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లకు సంబంధించిన లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద పరిమిత ఎత్తులో సబ్‌వేలు ఏర్పాటు చే స్తున్న కారణంగా ఈనెల 7, 8 తేదీల్లో ఆయా స్టేషన్ల గుండా వెళ్లే రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.శ్రీరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రెండు రోజు ల్లో రాత్రి 7:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:45 నిమిషాల వరకు రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఈ సబ్‌వేల ఏర్పాటు పనుల కారణంగా నాలుగు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాచిగూడ-మిర్యాలగూడ-పిడుగురాళ్ల డెమూ ప్యాసింజర్ రైలు ఈనెల 7వ తేదీన, పిడుగురాళ్ల-మిర్యాలగూడ-కాచిగూడ ప్యాసిం జర్ రైలును ఈ నెల 8వ తేదీన రద్దు చేస్తున్నట్టు వెల్లడిం చారు. అదేవిధంగా ఈనెల 7న కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్‌ను నల్లగొండ, నడికుడి రూటు నుంచి కాకుండా ఖాజీపేట, విజయవాడల మీదుగా గుంటూరు స్టేషన్‌కు మళ్లించి నట్టు తెలిపారు. అదే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను నల్లగొండ, నడికుడి, గుంటూరు మీదుగా కాకుండా ఖాజీపేట, ఖమ్మంల మీదుగా విజయవాడకు మళ్లించినట్టు తెలిపారు. -
తప్పిన పెనుప్రమాదం
-
తప్పిన పెనుప్రమాదం
శ్రీకాకుళం: రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. అదే సమయంలో గుణుపూర్-విశాఖపట్టణం పాసింజర్ రైలు వస్తోంది. ఆర్టీసీ బస్సు ఆగిపోయిన విషయాన్ని గమనించిన రైలు డ్రైవర్ సకాలంలో స్పందించి ట్రైన్ ఆపడంతో ప్రమాదం తప్పింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గేటు కీపర్ గేటు వేయడం మరిచిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేటు కీపర్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుణుపూర్ రైలుకు పచ్చజెండా
పట్టాలెక్కనున్న గుణుపూర్-విశాఖ రైలు 9న ప్రారంభించనున్న రైల్వే మంత్రి విశాఖపట్నం సిటీ: గుణుపూర్-విశాఖపట్నం-గుణుపూర్(58505/06)ప్యాసింజర్ రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు తూర్పు కోస్తా రైల్వే శుక్రవారం పచ్చజెండా ఊపింది. గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ రైలు నడిపేందుకు ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వలేదు. గతంలోనే ఈ రైలుకు చెందిన రేక్‌లు వచ్చినా ఆ రేక్‌లను ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లకు వినియోగించారు. ఎట్టకేలకు ఈ కొత్త రైలును పట్టాలెక్కించడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభాక ర్ ప్రభు న్యూఢిల్లీలో రిమోట్ జెండా ఊపి గుణుపూర్ నుంచి విశాఖ రైలును ప్రారంభిస్తారు. ఆ రోజు ప్రత్యేక రైలుగా నడుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచీ రెగ్యులర్‌గా నడిచేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ-గుణుపూర్(58506) ప్యాసింజర్ రోజూ విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు 10. 50 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు గుణుపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గుణుపూర్-విశాఖ(58505) ప్యాసింజర్ రోజూ గుణుపూర్‌లో మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. తిరిగి 5.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, గుణుపూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో మొత్తం 12 బోగీలుంటాయి. అన్నీ జనరల్ బోగీలేనని ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాల్సిందిగా వాల్తేరు సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్‌యాదవ్ తెలిపారు. -
పోలీసులా... జులాయిలా?
గుంటూరు: మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమమే కాకుండా ఆమె భర్తను పోలీసులు చితకబాదిన దారుణ ఘటన గుంటూరు రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. ఓ మహిళ పట్ల కానిస్టేబుల్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న ఆమె భర్తపై మరో పది మంది పోలీసులు దాడి చేశారు. దీనిపై బాధితులు చేసినా స్థానిక సీఐ శరత్‌బాబు కేసు నమోదు చేయలేదు. బాధితుల మీదే ఎదురు కేసు పెడతానంటూ బెదిరించాడు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే జులాయిల్లా ప్రవర్తిస్తే ఎవరితో చెప్పుకోవాలని బాధితులు వాపోయారు.