కొచ్చివెల్లి– గువహటికి ప్రత్యేక రైళ్లు
నగరంపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా కొచ్చివెల్లి– గుహవటికి ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కే. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై న్‌నెం 06336 కొచ్చివెల్లి–గుహవటి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఆదివారాలలో అంటే నవంబరు 13,20,27, డిసెంబరు 4,11,18,25 తేదీలలో కొచ్చివెల్లిలో 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 13.05 గంటలకు న్యూగుంటూరు చేరుకుంటుంది. 13.07కి బయలుదేరి గుహవటికి బుధవారం 08.45కి చేరుకుంటుంది. ట్రై న్‌నెం 06335 గుహవటి– కొచ్చివెల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం అంటే నవంబరు 16,23,30, డిసెబరు 7,14,21,28 తేదీలలో గుహవటిలో 23.25 గంటలకుS బయలుదేరి రెండవ రోజు (శుక్రవారం) 20.55గంటలకు చేరుకుంటుంది. 20.57గంటలకు బయలుదేరి కొచ్చివెల్లికి ప్రతి శనివారం 22.30 కి చేరుకుంటుంది. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఎనిమిది స్లీపర్ కోచ్‌లు, సాధారణ ప్రయాణికుల కోసం ఆరు జనరల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది.