హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంటూరు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సహాయ మండల వాణిజ్య అధికారి ఆలీఖాన్ తెలిపారు. ఈనెల 23న నెం.07005 రైలు హైదరాబాద్‌లో 18.50 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 19.15, కు నల్గొండకు 21.05, మిర్యాలగూడకు 21.32, పిడుగురాళ్లకు 22.32, సత్తెనపల్లికి 23.07కు చేరుతుందన్నారు. గుంటూరుకు 00.30కు, విజయవాడకు 01.30, కాకినాడ పోర్టుకు 05.35 గంటలకు చేరుతుందని తెలిపారు.
నెం.07006 రైలు ఈ నెల 26న కాకినాడ పోర్టులో 17.50 గంటలకు బయలుదేరి విజయవాడకు 21.50, గుంటూరుకు 23.00, సత్తెనపల్లికి 23.48, పిడుగురాళ్లకు 00.10, మిర్యాలగూడకు 01.10, నల్గొండకు 01.45, సికింద్రాబాద్‌కు 04.20, హైదరాబాద్‌కు 05.10 గంటలకు చేరుకుంటుందని వివరించారు.