hyderabad-kakinada
-
కాకినాడకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్– కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్– కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలు ఈ నెల 9, 11వ తేదీల్లో రాత్రి 8.50కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 10, 12 తేదీల్లో సాయంత్రం 7.30కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. -
హైదరాబాద్–కాకినాడ మధ్య రెండు రైళ్లు
సాక్షి, అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్–కాకినాడ టౌన్ మధ్య జూన్ 1, 4వ తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 1న హైదరాబాద్–కాకినాడ టౌన్ (07005) రైలు, జూన్ 4న కాకినాడ టౌన్–హైదరాబాద్ (07006) రైలు వయా గుంటూరు మీదుగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. -
మే7 నుంచి హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - కాకినాడ మధ్య (07005) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు, సికింద్రాబాద్ నుంచి 7.20 గంటలకి బయలుదేరుతుంది. రాత్రి 12.30 గంటలకు గుంటూరుకు, రాత్రి 1.30 సమయానికి విజయవాడకు చేరుకుంటుంది. 8న ఉదయం 5.35 గంటలకు రైలు కాకినాడ చేరుకుంటుందని సీపీఆర్వో చెప్పారు. -
హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంటూరు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సహాయ మండల వాణిజ్య అధికారి ఆలీఖాన్ తెలిపారు. ఈనెల 23న నెం.07005 రైలు హైదరాబాద్‌లో 18.50 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 19.15, కు నల్గొండకు 21.05, మిర్యాలగూడకు 21.32, పిడుగురాళ్లకు 22.32, సత్తెనపల్లికి 23.07కు చేరుతుందన్నారు. గుంటూరుకు 00.30కు, విజయవాడకు 01.30, కాకినాడ పోర్టుకు 05.35 గంటలకు చేరుతుందని తెలిపారు. నెం.07006 రైలు ఈ నెల 26న కాకినాడ పోర్టులో 17.50 గంటలకు బయలుదేరి విజయవాడకు 21.50, గుంటూరుకు 23.00, సత్తెనపల్లికి 23.48, పిడుగురాళ్లకు 00.10, మిర్యాలగూడకు 01.10, నల్గొండకు 01.45, సికింద్రాబాద్‌కు 04.20, హైదరాబాద్‌కు 05.10 గంటలకు చేరుకుంటుందని వివరించారు.