మే7 నుంచి హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - కాకినాడ మధ్య (07005) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు, సికింద్రాబాద్ నుంచి 7.20 గంటలకి బయలుదేరుతుంది. రాత్రి 12.30 గంటలకు గుంటూరుకు, రాత్రి 1.30 సమయానికి విజయవాడకు చేరుకుంటుంది. 8న ఉదయం 5.35 గంటలకు రైలు కాకినాడ చేరుకుంటుందని సీపీఆర్వో చెప్పారు.