special train
-
Delhi Stampede: రెండు రైళ్లు.. ఒకే పేరు
న్యూఢిల్లీ: రెండు రైళ్లకు ఒకేలాంటి పేరు. ఇరుకైన ఓవర్ బ్రిడ్జి. సమాచార లోపం. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఇవే ప్రధాన కారణాలని తేలింది. మహా కుంభమేళాకు బయల్దేరిన ప్రయాణికుల్లో చాలామంది 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ‘ప్రయాగ్‌రాజ్ స్పెషల్’ రైలు 12వ ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు ప్రకటన రావడంతో తమ రైలే ఫ్లాట్‌ఫాం మారిందని భావించారు. భారీ జనసందోహం నడుమ ఏమాత్రం ఆలస్యమైనా రైలు అందదేమోనని భయపడ్డారు. 12వ ప్లాట్‌ఫాంకు చేరేందుకు ఉన్నపళంగా పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జిపైకి దారితీసే మెట్ల మార్గంపైకి వేలాదిగా ఎగబడ్డారు. దానికి తోడు ఓవర్ బ్రిడ్జి కూడా సన్నగా ఉంది. వాటిపై ప్రయాణికులు పరస్పరం నెట్టేసుకుంటూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలామంది ఊపిరాడక కన్నుమూశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా అరుపులు కేకలతో ఏమీ విన్పించలేదు. ఈ దారుణంలో మృతుల సంఖ్య ఆదివారం 18కి పెరిగింది. వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 30 మంది గాయపడ్డారు. తొక్కిసలాట తర్వాత మెట్ల మార్గం, ఓవర్ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా చెప్పులు, చిరిగిన బ్యాగులే కనిపించాయి. రెండు రైళ్లకు ప్రయాగ్‌రాజ్ పేరుండడం అయోమయానికి దారి తీసిందని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. వాస్తవానికి న్యూఢిల్లీ స్టేషన్ నుంచి శనివారం నాలుగు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాల్సి ఉంది. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో ఆ ఐదు రైళ్లలో వెళ్లాల్సిన వారంతా ప్లాట్‌ఫాంలపైనే ఉండిపోవడంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆదివారమూ అదే రద్దీ దుర్ఘటన జరిగినా న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి వేలాది మంది తరలివచ్చారు. రైళ్లు ఎక్కడానికి పడరాని పాట్లు పడ్డారు. అధికారులు సైతం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.సమాచార లోపానికి తోడు ప్రయాణికులు గందరగోళానికి గురికావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విచారణకు కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రిన్సిపల్ స్టేషన్‌లోని వీడియో ఫుటేజీ అందజేయాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది. వైష్ణవ్ రాజీనామా చేయాలితొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆదివారం డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే ఆయన్ను తొలగించాలన్నారు. రైల్వేస్టేషన్‌కు వేలాది మంది జనం తరలివచ్చినా భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘‘దేశంలో ఇప్పుడు రెండు హిందూస్తాన్లు ఉన్నాయి. ఒక హిందూస్తాన్లో పాలకులు తమ మిత్రులకు స్వయంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. మరో హిందూస్తాన్లో సామాన్యులు ఇలా రైల్వేస్టేషన్లలో బలైపోతున్నారు. కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడుస్తోంది’’ అని ఆక్షేపించారు.రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. -
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు
-
జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచి్చ, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి.సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కలి్పంచారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ రూ.14,250, 3 ఏసీ రూ.21,900, 2 ఏసీ రూ.28,450గా ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం గాని సెల్ : 9281495848, 8287932312 నంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. -
అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, గోరంట్లలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే క్రైస్తవ మహాసభలు (గుడారాల పండుగ)కు తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. అనకాపల్లి–గుంటూరు ప్రత్యేక రైలు (07225) ఈనెల 6న రాత్రి 7.40 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈరైలు (07226) ఈనెల 10న రాత్రి 10.30 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. -
29 నుంచి అయోధ్యకు ఆస్తా రైళ్లు
సాక్షి. హైదరాబాద్: రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత రాష్ట్రంలోని భక్తులను అయోధ్య రామ మందిరానికి రైళ్లలో తీసుకువెళ్తామని హామీనిచి్చ న భారతీయ జనతాపార్టీ ఆ మేరకు ప్రత్యేక ఆస్తా రైళ్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 200మందిని తీసుకువెళ్లనుంది. ఆ ప్రత్యేక ఆస్తా రైలులో మొత్తం 20 బోగీలు ఉంటాయనీ, ఒక్కో ట్రైన్లో 14 వందల మందికి ప్రయాణించే అవకాశం ఉంటుందనీ, అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు 5 రోజుల సమ యం పట్టనుందని వెల్లడించింది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు జనవరి 29 వ తేదీన బయలుదేరుతుందనీ, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు జనవరి 30న, హైదరాబాద్ ప్రయాణికుల రైలు జనవరి 31, కరీంనగర్– ఫిబ్రవరి 1న, మల్కాజ్గిరి– ఫిబ్రవరి 2న, ఖమ్మం– ఫిబ్రవరి 3న, చేవెళ్ల– ఫిబ్రవరి 5, పెద్దపల్లి– ఫిబ్రవరి 6, నిజామాబాద్– ఫిబ్రవరి 7, అదిలాబాద్– ఫిబ్ర వరి 8, మహబూబ్‌నగర్– ఫిబ్రవరి 9. మహబూబ్‌బాద్– ఫిబ్రవరి 10, మెదక్– ఫిబ్రవరి 11, భువనగిరి– ఫిబ్రవరి 12, నాగర్ కర్నూల్ – ఫిబ్రవరి 13, నల్లగొండ – ఫిబ్రవరి 14, జహీరాబాద్ ప్రయాణికుల రైలు– ఫిబ్రవరి 15న బయ లుదేరుతాయి. సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాల ప్రయాణీకుల రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరతాయనీ, నల్లగొండ, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయని బీజేపీ పేర్కొంది. -
వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త
క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 19న వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వెళ్లే అభిమానుల రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. మూడు ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. మరొకటి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రైలు సర్వీసును నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లు శనివారం సాయంత్రం ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు(ఆదివారం) ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుంటాయని తెలిపింది. అంతేగాక అన్ని సాధారణ రైలు రిజర్వేషన్లు నిండినందున.. ప్రత్యేక రైలు టికెట్లు విమాన, మిగతా రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పింది. ఈ రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 620.. రూ.1,525కే 3ఏసీ ఎకానమీ బెర్త్.. రూ.1,665కే స్టాండర్డ్ 3ఏసీ.. రూ.3,490కే ఫస్ట్ క్లాస్ ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా అహ్మాదాబాద్‌కు ప్రస్తుతం విమాన టికెట్ ధర రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఉంది. అదే విధంగా మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానులు ప్రత్యేక రైళ్లలో తిరిగి వెళ్లే సదుపాయం కూడా కల్పిస్తుంది రైల్వే సంస్థ. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైళ్లు బయల్దేరనున్నాయని చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లను ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తెలిపింది. చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ కాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే తుదిపోరులో టీమిండియా- అయిదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్- ఆసీస్‌లు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు జంట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఆసీస్-భారత జట్లు చివరగా 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయంగా మారింది. బసచేసే హోటళ్లు, తినే ఆహారం రేట్లు అన్నీ వేలు, లక్షల్లో పలుకుతున్నాయి. అసాధారణ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న క్రికెట్ అభిమానులకు రైల్వే ప్రకటించిన సదుపాయం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది. చదవండి: CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే! -
Meri Maati Mera Desh: దేశ రాజధానికి చేరుకున్న తెలుగునేల మట్టి కలశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు. -
విజయవాడ నుంచి ఢిల్లీకి ‘అమృత్ కలశ్’ ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): నా భూమి.. నా దేశం ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్ కలశ్యాత్ర ప్రత్యేక రైలు బయలు దేరింది. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ జెండా ఊపి రైలును సాగనంపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూమి.. నా దేశం’ పేరుతో అక్టోబర్ 30, 31 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,100 మంది వలంటీర్లు 824 కలశాలతో రైలులో బయలు దేరారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1.5. కి.మీ. పొడవు జాతీయ జెండాతో భారత్ మాతాకు జై.. అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. -
రేపు కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ రెండో తేదీన సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు (07071) నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు రెండో తేదీ రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07072) మూడో తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది. -
కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ–ఖుర్దారోడ్డు (07223) రైలు ఈ నెల 24న రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్డు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07224) ఈ నెల 25న ఖుర్దారోడ్డులో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటలకు కాచిగూడ చేరుతుంది. రెండు మార్గాలలో ఈ రైలు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెరంపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే..
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ఏపీ వాసుల్లో 267 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. 113 మంది ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 82 మంది రైలులో ప్రయాణించలేదని తెలిపారు. మరోవైపు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించిన ఏపీ వారిలో 49 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండగా .. 10 మంది ట్రైన్లో ప్రయాణించలేదని చెప్పారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్ కీలక ప్రెస్‌మీట్ రెండు రైళ్లలో ఏపీకి చెందిన వారి ప్రయాణికుల వివరాలు ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 250 మందిని ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు P/13671 భద్రక్ స్టేషన్ నుంచి బయల్దేరి చెన్నైకు చేరుకోనుందని పేర్కొన్నారు. ఈ రైలు ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ రానుంది.అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని అధికారులు చెప్పారు ఈ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు బరంపురంలో, 41 మంది విశాఖపట్నంలో, ఒకరు రాజమహేంద్రవరంలో, ఇద్దరు తాడేపల్లి గూడెంలో, 133 మంది చెన్నైలో దిగుతారు. ఈ రైలు ఆదివారం చెన్నై చేరుకుంటుంది. కాగా ఒడిశాలోని బాలాసోర్ శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 280 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులైనట్లు అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు మే 11న ప్రత్యేక రైల్వే సేవలు ప్రారంభిస్తున్నట్టు సౌత్ స్టార్ రైల్ ప్రతినిధులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ‘సౌత్ స్టార్ రైల్’ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా ‘సౌత్ స్టార్ రైల్’ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబుదూర్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులని తెలిపారు. ఇందులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతులు అందిస్తున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ వివరించారు. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నంబర్ లేదా ఠీఠీఠీ.ట్చజీ ్టౌuటజీటఝ.ఛిౌఝలో సంప్రదించవచ్చని సూచించారు. -
మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకార్వో) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి.. వైస్ ప్రెసిడెంట్స్ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్ మేనేజర్‌గా, ఎస్.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్ మెయింటెనెన్స్‌లో, ట్రైన్ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్ మేనేజర్స్‌గా, టికెట్ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్ డివిజన్ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు. -
Araku Valley: అరకు పర్యాటకుల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్‌క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్‌కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది. -
మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్
సాక్షి, హైదరాబాద్: రానున్న మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండప్రదానాలు సమర్పించే వారి కోసం హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. స్వదేశ్ దర్శన్ రెండో ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు (ఐదు రాత్రులు, 6 పగళ్లు) మహాలయ పిండ్ దాన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, విశాఖ, భువనేశ్వర్ మీదుగా గయ, వారణాసి, ప్రయాగ సంగమం వరకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్ చేరుకోనుంది. రైలు చార్జీలతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర సదుపాయాలతో స్లీపర్ క్లాస్‌లో ఒక్కొక్కరికీ రూ. 14,485 చొప్పున, థర్డ్ ఏసీ రూ. 18,785 చొప్పున ఉంటుంది. ఈ పర్యటనలో ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి నాన్ ఏసీ హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. నేచర్ టూర్స్ ►కశ్మీర్, కేరళ, కన్యాకుమారి, రామేశ్వరం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో నేచర్ టూర్లను ఆస్వాదించే మరో సదుపాయాన్ని కూడా ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25, సెప్టెంబర్ 8, 23 తేదీల్లో హైదరాబాద్ నుంచి లేహ్, లద్దాక్‌లకు విమాన టూర్లను ప్రవేశపెట్టింది. ఈ పర్యటనలో లేహ్, శ్యామ్ వ్యాలీ, నుబ్రా, తుర్టక్, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ చార్జీ ఒక్కొక్కరికి రూ. 38,470 చొప్పున ఉంటుంది. ►సెప్టెంబర్ 13 నుంచి రాయల్ రాజస్తాన్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో జైపూర్, జోధ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఫ్లైట్ చార్జీలతోపాటు అన్ని వసతులకు ఒక్కొక్కరికీ రూ. 29,400 చొప్పున చార్జీ ఉంటుంది. ►కేరళ డిలైట్స్ పేరుతో ఐఆర్సీటీసీ మరో టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 7న ఈ టూర్ మొదలవుతుంది. అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. రూ. 35,500 చొప్పున చార్జీ ఉంటుంది. ►సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్లో భాగంగా కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. నవంబర్ 1 నుంచి 6 రాత్రులు, 7 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఒక్కొక్కరికీ రూ. 30,200 చొప్పున చార్జీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ ఫోన్ నంబర్ల 040–27702407/9701360701 ను సంప్రదించవచ్చు. -
గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు
లక్ష్మీపురం: గుంటూరు నుంచి వయా నంద్యాల, కడప మీదుగా తిరుపతికి రోజూ ప్రత్యేక రైలును నడపనున్నట్టు గుంటూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శరత్‌బాబు చెప్పారు. స్టేషన్లో గురువారం గుంటూరు–తిరుపతి ప్రత్యేక రైలును ఆయనతోపాటు సీఐ గంగా వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మట్లాడుతూ రైలు(ఎక్స్‌ప్రెస్) నంబర్ 17261 రోజూ సాయంత్రం 4.30 గంటలకు గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. అలాగే రైలు నెంబర్ 17262 రోజూ రాత్రి 7.35 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుకుంటుందని వెల్లడించారు. (క్లిక్: ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..) -
యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యశ్వంత్‌పూర్–కాచిగూడ (16569/ 16570)స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. (క్లిక్: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
నాంథేడ్–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాంథేడ్ – తిరుపతి– నాంథేడ్ల మధ్య (07633/07634) ఈనెలలో నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. నాంథేడ్ నుంచి తిరుపతికి వచ్చే రైలు ఈనెల 16, 23 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. నాంథేడ్లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు కడపకు, 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. తిరుపతి నుంచి నాంథేడ్‌కు వెళ్లే రైలు ఈనెల 17,24 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. పలు రైళ్లకు స్టాపింగ్‌లు జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలిపేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుమల, హరిప్రియ, రాయలసీమ రైళ్లను ఆపనున్నారు. ఈనెల 14 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రాజంపేట, నందలూరులో ఆపనున్నారు. ఈనెల 15 నుంచి హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను ఓబులవారిపల్లి, నందలూరులో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15నుంచి రైల్వేకోడూరు,ఓబులవారిపల్లి, రాజంపేట స్టేషన్లలో ఆపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరు నెలలు మాత్రమే ఈ అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించారని తెలిపారు. -
ఆర్ఆర్బీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: రెల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ తెలిపారు. కడప– బెంగళూరు–కడప మధ్య ఒక రైలు, కడప– నల్గొండ–కడపల మధ్య మరో రైలు నడుపుతున్నామన్నారు. ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు కడప రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైలు(నంబర్–07582) బయలుదేరి రాజంపేట, రైల్వేకోడూరు, కాట్పాడి, జోలార్‌పేట మీదుగా బెంగళూరుకు అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ఈనెల 12వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కడపకు చేరుకుంటుందన్నారు. అలాగే నల్గొండ నుంచి కడపకు ఈనెల 10వ తేదీ ప్రత్యేక రైలు బయలుదేరిందని, 13న ఉదయం 6 గంటలకు కడప నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, శెట్టిపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా సాయంత్రం 4.45 గంటలకు నల్గొండ చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్ఆర్బీ పరీక్ష రాసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
సికింద్రాబాద్– కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ శాటిలైట్ స్టేషన్ రాయనపాడు మీదుగా సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07193) 23వ తేదీ (నేడు) రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, రేపు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07194) 24వ తేదీ (రేపు) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది. -
శివమొగ్గ – చెన్నై మధ్య బైవీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం శివమొగ్గ–చెన్నై సెంట్రల్ మధ్య బై వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ రైలు (నం:06223) శివమొగ్గ నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో బయలుదేరుతుంది. ఈ రైలు ఏప్రిల్ 17 నుంచి జూన్ 28వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో (రైలు నం: 06224) చెన్నై సెంట్రల్ నుంచి సోమ, బుధవారాల్లో బయలుదేరుతుంది. ఈ నెల 18 నుంచి జూన్ 29వ తేదీ వరకు మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు శివమొగ్గ, భద్రావతి, తరికెరె, బీరూర్, అజాంపురా, హసదుర్గ, చిక్జాజూర్, చిత్రదుర్గ, చెళ్లికెర, మొలకాల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, వైఎస్సార్ కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అర్కోణం నుంచి చెన్నై సెంట్రల్‌కు చేరుతుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. -
18 నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అయ్యప్పభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–కొల్లాం (07133/07134) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 19వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–కొల్లాం(07135/07136) ప్రత్యేక రైలు ఈ నెల 22వ తేదీ ఉదయం 5.30కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ సాయంత్రం 7.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30కి కాచిగూడ చేరుకుంటుంది. నాందేడ్–కొల్లాం (07137) స్పెషల్ ట్రైన్ ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.40 కి కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం–తిరుపతి (07506) ప్రత్యేక రైలు ఈ నెల 25న అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.10కి కొల్లాం చేరుకుంటుంది. తిరుపతి–నాందేడ్ (07138) స్పెషల్ ట్రైన్ ఈ నెల 26వ తేదీ రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
రీఫండ్‌కు రెడ్ సిగ్నల్, ఇదేందంటూ ప్రయాణికుల విస్మయం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కాలంలో నడిపిన ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లుగా మార్చిన రైల్వే అదనపు చార్జీలు తిరిగి చెల్లించడంపై మాత్రం చేతులెత్తేసింది. ప్రత్యేక చార్జీలపై అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి అదనపు సొమ్మును తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు మరో రెండు, మూడు నెలల పాటు రెగ్యులర్ రైళ్లలో సైతం ప్రత్యేక చార్జీలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్‌లకు కూడా రెగ్యులర్ చార్జీలను వర్తింపజేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా టికెట్ చార్జీలు పెంచినప్పుడల్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రయాణికులపై కూడా వీటి పెంపు భారాన్ని విధించే అధికారులు.. చార్జీలను తగ్గించినప్పుడు మాత్రం ఆ మేరకు రీఫండ్ చేయకపోవడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లపై అన్యాయం.. ♦ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణానికి 120 రోజుల ముందే రిజర్వేషన్లు బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. అంటే కనీసం మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. ♦ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల స్థానంలో అందుబాటులోకి వచ్చిన అన్ని రెగ్యులర్ రైళ్లలో వచ్చే సంక్రాంతి వరకు ప్రయాణాలు నమోదయ్యాయి. లక్షలాది మంది ఇందుకోసం 30శాతం అదనంగా చెల్లించారు. కానీ ఇప్పుడు అదనపు సొమ్ము మాత్రం వారికి తిరిగి చెల్లించడం లేదు. ♦సాధారణంగా చార్జీలు పెంచినప్పుడు పాత చార్జీలపై టికెట్ బుక్ చేసుకున్న వారి నుంచి ప్రయాణ సమయంలో పెంచినవాటిని రాబట్టుకుంటారు. ముందే చెల్లించిన ‘అదనపు’ చార్జీలు తిరిగి ఇవ్వడానికి మాత్రం నిరాకరించడం అన్యాయమని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం ‘ప్రత్యేకం’... ♦ కోవిడ్ దృష్ట్యా గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో అన్ని రైళ్లను రద్దు చేశారు. ఎంఎంటీఎస్‌తో పాటు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అత్యవర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య ‘రెగ్యులర్’ రైళ్లకే వాటి నంబర్లకు ప్రారంభంలో ‘సున్నా’ను చేర్చి ప్రత్యేక రైళ్లుగా నడిపారు. ♦ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మొదట్లో 22 రైళ్లతో ప్రారంభించి దశలవారీగా సుమారు 150కిపైగా రెగ్యులర్ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రూట్లలో రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లకు సైతం ‘సున్నా’ను చేర్చి ‘స్పెషల్’గా నడిపారు. ♦ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై మరో 30 శాతం వరకు అదనంగా పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖకు సాధారణ థర్డ్ ఏసీ చార్జీలు సుమారు రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.700 వరకు పెరిగింది. ♦అన్ని రూట్లలోనూ చార్జీలు పెంచి నడిపారు. మరోవైపు దసరా, సంక్రాంతి వంటి పండగ రోజుల్లోనూ ప్రత్యేక దోపిడీ కొనసాగింది. కోవిడ్ కాలంలో పట్టాలెక్కించిన ఈ ‘ప్రత్యేక’ రైళ్లు ఇటీవల కాలం వరకు నడిచాయి. ♦ తాజాగా ఈ రైళ్లన్నింటినీ వాటి నంబర్లకు ప్రారంభంలో ఉన్న ‘సున్నా’ను తొలగించి పాత పద్ధతిలో, పాత నంబర్లతో పునరుద్ధరించారు. 30 శాతం అదనపు చార్జీలను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లలో, పాత చార్జీలపై ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
సికింద్రాబాద్–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్–విజయవాడ మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేక ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు (07567) ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు (07568) మధ్యాహ్నం 3.55 గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మౌలాలీ, చెర్లపల్లి, బీబీ నగర్, రామన్నపేట, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
Dussehra Special Trains: దసరాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిల్లో విశాఖపట్టణం–సికింద్రాబాద్ (08579/08580) ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.40కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే విశాఖ–సికింద్రాబాద్ మధ్య మరో రైలు (08585/08586) ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 5.35కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50కి విశాఖ చేరుకుంటుంది. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేస్తోంది..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, అది స్పెషల్ ట్రైన్గానే ప్రయాణికులకు సేవలందించనుందని పేర్కొన్నారు. తిరుపతి–జమ్ముతావి (02277/02278) ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఏప్రిల్ ఒకటి నుంచి పునరుద్ధరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు నడుపనున్నట్లు గతంలో ప్రకటించిన 30 ప్రత్యేక రైళ్లను జూన్ నెలాఖరు వరకు పొడిగించినట్లు సీపీఆర్వో పేర్కొన్నారు. చదవండి: ఒక్కరూ లేరు, వింటే చోద్యం.. చూస్తే ఆశ్చర్యం హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే? -
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో దక్షిణమధ్య రైల్వేకు కేంద్రం నుంచి మూడు పురస్కారాలు లభించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డులు ప్రకటించింది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వర్చువల్ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సోమేశ్‌కుమార్‌కు ఈ పురస్కారాలు అందించారు. పరిశ్రమ/రైల్వే వర్క్‌షాప్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకోòÙడ్ ప్రథమ బహుమతి పొందింది. భవనాలు/ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో సికింద్రాబాద్‌లోని ఎస్సీఆర్ అకౌంట్స్ కార్యాలయ భవనం రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌పోర్టు/జోనల్ రైల్వే కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే ‘జోన్ మెరిట్ సర్టిఫికెట్’సాధించింది. తిరుపతి–సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07456) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. -
ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ –06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్ కోయిల్–ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. -
యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విశాఖలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలకు అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటుచేశారు. ఈ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠీ తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖ–ఇచ్ఛాపురం మధ్య ఈ ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖ స్పెషల్ రైలు (05831), తిరుగు ప్రయాణంలో (05832) నంబరుతో నడవనుంది. రైలులో ప్రయాణించే అభ్యర్థులు విధిగా అడ్మిట్ కార్డ్ వెంట తెచ్చుకోవాలి. ఈ స్పెషల్ రైలుకు స్టేషన్ల బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు ఇవ్వనున్నారు. -
క్వారంటైన్ భయంతో రైలు చైన్ లాగి..
గువహతి : ముంబై నుంచి శ్రామిక్ రైలులో స్వస్ధలాలకు చేరుకుంటున్న వలస కూలీలు రెండు వారాల క్వారంటైన్‌ను తప్పించుకునేందుకు రైలులో ఎమర్జెన్సీ చైన్ లాగిన ఘటన వెలుగుచూసింది. ఈ ఉదంతంలో 61 మందిని అరెస్ట్ చేయగా రైల్వేలు, అసోం పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ముంబై నుంచి దిబ్రూగఢ్ వెళుతున్న లోక్మాన్య తిలక్ శ్రామిక్ రైలు మంగళవారం అర్ధరాత్రి హజోయి రైల్వేస్టేషన్‌కు చేరుకునే సమయంలో వలస కూలీలు చైన్ లాగారు. హజోయి వద్ద రైలు దిగిన 56 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదేరోజు రాత్రి అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో అసోం పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబై నుంచి వీరందరూ తిరిగి వస్తుండటంతో హజోయి స్టేషన్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇక అసోం లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి : ఒక కుటుంబం ఆరు చపాతీలు.. -
నగరానికి చేరుకున్నఢిల్లీ స్పెషల్ ట్రైన్
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ఏర్పాటుచేసిన వీక్లీ స్పెషల్ ట్రైన్ (02438) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నగరానికి చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం రైల్వేశాఖ నడుపుతున్న 15 ప్రత్యేక రైళ్లలో భాగంగా ఢిల్లీ–సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఇది. ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరి సోమవారం నగరానికి చేరుకుంటుంది. తిరిగి ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ రకంగా సోమవారం మొట్టమొదటి వీక్లీ స్పెషల్ 528 మంది ప్రయాణికులతో చేరుకుంది. ఫస్ట్ ఏసీలో 20 మంది, సెకండ్ ఏసీలో 141 మంది, థర్డ్ ఏసీలో 407 మంది ప్రయాణికులు వచ్చారు. సికింద్రాబాద్ చేరుకున్న ఈ ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిబంధనల మేరకు థర్మల్ పరీక్షలు చేశారు. అలాగే ప్రతి ప్రయాణికుడి వివరాలను, ఫోన్ నెంబర్లను నమోదు చేసుకున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణికులు హోం క్వారంటైన్‌కు చేరుకొనే వరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నెల 20న ఢిల్లీకి స్పెషల్ ట్రైన్... సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (02437) ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇప్పటికే ఈ ట్రైన్ కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకున్నారు. సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీలో వెయిటింగ్ లిస్టు నమోదుకావడం గమనార్హం. -
శ్రామిక్ రైలులో 167 మంది అదృశ్యం!
హరిద్వార్ : లాక్డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా వారి వారి స్వస్థలాకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గుజరాత్‌లోని సూరత్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వలస కార్మికులను తరలిస్తున్న ప్రత్యేక రైలు నుంచి 167 మంది ఆచూకీ లేకుండా పోయారు. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. అధికారులు గణంకాల ప్రకారం 1,340 మంది వలస కార్మికులతో తో మే 12న సూరత్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది. అయితే రైలు హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 మంది వలస కూలీలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.(చదవండి : శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు) దీంతో అధికారులు అదృశ్యమైన వలస కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అధికారులు చెప్పారు. వలస కార్మికుల సంఖ్యలో వ్యత్యాసానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్ట చెప్పారు. ఈ మేరకు సూరత్‌లోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. కనిపించకుండా పోయిన వలస కార్మికులు రైలు బయలుదేరినప్పుడు అందులోనే ఉన్నారా, లేక మధ్యలో ఎక్కడైనా దిగిపోయారా అనే కోణాల్లో కూడా విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
రైలు దిగగానే.. స్టాంప్ వేసేశారు!
రాయ్‌పూర్: రైళ్ల పునరుద్ధణ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన రాజధాని ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మధ్యాహ్నం చత్తీస్గడ్ చేరుకుంది. రైలు దిగిన ప్రయాణికులతో రాయ్‌పూర్ రైల్వేస్టేషన్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రయాణికులను రైల్వేస్టేషన్ నుంచి క్వారెంటైన్‌ను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చెరగని సిరాతో ప్రయాణికుల అరచేతిపై క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. స్పష్టంగా కనిపించేలా పెద్ద స్టాంప్‌తో కుడి చేతిపై ముద్రిస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వస్థలానికి రావడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. రైలులో ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. ‘ప్రయాణం బాగుంది. సరైన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించామ’ని ప్రయాణికులు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం బయలుదేరిన 8 ప్రత్యేక రైళ్లు గమ్యానికి చేరుకున్నాయి. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. ) చత్తీస్‌గఢ్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 54 మంది కోలుకున్నారు. కోవిడ్-19 కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. (ప్రధాని మోదీ ప్రసంగం.. అర్థం ఏంటో!) -
ప్రత్యేక రైలులో గుంతకల్లు చేరుకున్న వలస కార్మికులు
సాక్షి, అనంతపురం : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న అనంత వాసులు బుధవారం గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో దాదాపు 1,100 వలస కార్మికులు స్వరాష్ట్రానికి చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపగా.. రైల్వే శాఖ ముంబై నుంచి గుంతకల్లుకు 24 బోగీల ప్రత్యేక రైలుకు నడిపింది. మంగళవారం రాత్రి ముంబై నుంచి బయలుదేరిన ఈ రైలు నేడు గుంతకల్లుకు చేరింది. వీరిలో అత్యధికంగా ఉరవకొండ ప్రాంత కార్మికులు ఉన్నారు. వలస కార్మికులకు రైలు టిక్కెట్ చార్జీలు, భోజనం, టిఫిన్, మంచినీరు ఇతర ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేసింది. గుంతకల్లు చేరుకున్న కార్మికులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించిన అధికారులు.. ప్రత్యేక బస్సుల్లో వారిని సంబంధిత క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అలాగే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ముంబైలో చిక్కుకుపోయిన తమను ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలస కార్మికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
మహారాష్ట్రకు వలస కార్మికులు తరలింపు
సాక్షి, కృష్ణా జిల్లా: లాక్డౌన్ నేపథ్యంలో ఏపీలో చిక్కుకున్న మహారాష్ట్రలోని గచ్చిరొలి జిల్లాకు చెందిన 1,004 వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు మంగళవారం ఆనందంగా పయనమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలస కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి మిర్చికోత పనులకు 3,479 మంది కార్మికులు వచ్చారు. లాక్డౌన్ కారణంగా తిరిగి వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం ఊటుకూరు, పెనుగులను దుందిరాలపాడు, తునికిపాడు లో ఉన్న వలస కార్మికుల తరలింపునకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజీవీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మొదటి విడతగా నిన్న 1200 మంది వలస కార్మికులను 48 బస్సుల ద్వారా విజయవాడకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక రైలు ద్వారా మహారాష్ట్రకు తరలించారు. ప్రతి బస్సులో 25 మంది చొప్పున సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. వలస కార్మికులకు వైద్యులు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. వలస కార్మికులకు మాస్కులు,స్నాక్స్ లను అందించి క్షేమంగా వారు తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. గుంతకల్లుకు చేరనున్న శ్రామిక్ ఎక్స్‌ప్రెస్.. అనంతపురం: లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులు ఏపీకి రానున్నారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు ముంబై నుంచి గుంతకల్‌కు ప్రత్యేక రైలు శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ చేరుకోనుంది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకునే 1150 మంది వలసకూలీలందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని.. అనంతరం క్వారంటైన్‌కు తరలిస్తామని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.జిల్లాలో 7000 క్వారంటైన్ పడకలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. -
తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు
సాక్షి హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి వలస కార్మికులతో రెండో ప్రత్యేక రైలు బయలు దేరింది. 1250 మంది కార్మికులతో ఘట్కేసర్ నుంచి పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బిహార్ కార్మికులను గుర్తించి ప్రత్యేక రైలులో వారిని పంపించారు. గత రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైలులో 1225 వలస కూలీలను తరలించిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ నోడల్ అధికారి సందీప్ సుల్తానీయతో రైల్వే జీఎం గజానన్ మాల్యా ఈ ఉదయం భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడపడంపై చర్చలు జరపనున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ షెల్టర్స్, పోలీసు స్టేషన్లలో, ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికుల వివరాల ఆధారంగా కార్యాచరణ చేపట్టనున్నారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో వలస కార్మికులను తరలించే అవకాశముందని సమాచారం. (బోయిన్పల్లి టు కాకినాడ.. ఓ తండ్రి పయనం) -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు ఊపిరి పీల్చు కుంటున్నారు. వారిని వారి స్వస్థలాలకు తరలింపు మొద లైంది. వారిని రైళ్ల ద్వారా తర లించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఈ మేరకు రైల్వే బోర్డు అనుమతి ఇవ్వటంతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 1,225 మంది వలస కూలీలతో కూడిన తొలి రైలు శుక్రవారం ఉదయం 4.50కి లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌లోని హతి యాకు బయల్దేరింది. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఈ వలస కూలీలు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆందోళనకు దిగటం, అది కాస్తా ఉద్రిక్తతకు దారితీయటం, పోలీసు వాహనాలు ధ్వంసం కావటానికి దారితీసిన సంగతి తెలిసిందే. వారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసు కెళ్లటంతో రైలు ద్వారా తరలింపునకు అంగీకరిం చింది. సీఎస్ సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఈ తరలింపు వ్యవహా రాన్ని పర్యవేక్షించే నోడల్ అధి కారి సుల్తానియా తదితరులు అర్ధరాత్రి వరకు పర్యవేక్షించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా వేరే ప్రాంతాలకు చెంది లాక్ డౌన్ వల్ల మరో చోట ఇరుక్కు పోయిన వారందరినీ రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా ఆ తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు ఇదే. చదవండి: తెలంగాణలో 6 రెడ్ జోన్ జిల్లాలు ముందు ప్రకటించకుండా.. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షల మంది ఉంటున్నారు. సెలవు రోజుల్లో వీరు సొంత ప్రాంతాలకు వెళ్లి వస్తుండటం సహజం. లాక్డౌన్ వల్ల వీరు గత 40 రోజులుగా ఇక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్‌కు ఎప్పుడు విముక్తి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా సొంత ప్రాంతాలకు వెళ్లాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, కొందరు అక్రమంగా వాహనాల్లోని సరుకుల మధ్య కూర్చుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఏపీకి చెందిన వేలాది మంది ప్రత్యేక అనుమతి పొంది సరిహద్దు వరకు వెళ్లగా, అక్కడి అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. చివరకు క్వారంటైన్‌కు అంగీకరించిన కొందరు మాత్రమే వెళ్లగలిగారు. మిగతావారు తిరిగి నగరానికి వచ్చారు. ఇప్పుడు వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపటంతో, వారి మాటున ఉద్యోగులు, ఇతరులు కూడా వెళ్లేందుకు యత్నిస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరలించటం సాధ్యం కాదు. వలస కూలీల కోసం రైళ్లను నడుపుతున్న సంగతి ముందే తెలిస్తే.. వీరు కూడా పెద్ద సంఖ్యలో ఆయా స్టేషన్లకు వచ్చే ప్రమాదం ఉందని రైల్వే భావిస్తోంది. ఇటీవల ముంబైలో ఇలాగే వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌కు రావటంతో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో రైల్వే అధికారులు ఈ రైలు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ స్థానిక స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఉదయం రైలు బయల్దేరే వరకు అదే విభాగంలోని మిగతావారికి కూడా తెలియకపోవటం విశేషం. ఓ నేత హడావుడితో గందరగోళం.. రాష్ట్రంలో ఇరుక్కుపోయిన వేరే ప్రాంతాల వారిని రైళ్ల ద్వారా తరలించనున్నట్లు ఓ ముఖ్య నేత శుక్రవారం బాహాటంగా ప్రకటించటం గందరగోళంగా మారింది. రైళ్లను నడిపి వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను తరలించనున్నామని కేంద్రం సమాచారం ఇచ్చిందని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఉంటున్న వేరే ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు రైల్వే అధికారులకు ఫోన్లు చేసి తమను కూడా తరలించాలని పేర్కొనటం ప్రారంభించారు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులు రైల్వే బోర్డు దృష్టికి తెచ్చారు. రైళ్లు ఆపరేట్ చేస్తున్న విషయాన్ని బాహాటంగా ప్రకటించొద్దని, గోప్యంగా ఉంచాలని, వేరే వాళ్లు వస్తే సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు చెందిన వారు ఏ రోజు ఎక్కడి నుంచి రైళ్లు నడుపుతారో తెలుసుకునే పనిలో పడ్డారు. చదవండి: వలస కూలీలు ఓటర్లు కారనుకున్నారా? రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే.. వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను పంపే క్రమంలో తెలంగాణతో పాటు, వారు వెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తేనే రైళ్లు నడపనున్నట్టు రైల్వే బోర్డు పేర్కొంటోంది. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ రైల్వే స్టేషన్‌కు తెచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, వారు దిగిన తర్వాత వారిని క్వారంటైన్ చేయటమా, ఇతర షెల్టర్లకు పంపటమా, ఇళ్లకు చేర్చటమా అని నిర్ణయించి తరలించే బాధ్యత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వారికి భోజన, పానీయాల వసతి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని, ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటే మాత్రం రైల్లో వారికి భోజనం, నీళ్లు అందిస్తామని రైల్వే బోర్డు నిర్ణయించింది. అన్నీ తానై నడిపించిన స్టీఫెన్ రవీంద్ర.. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న బిహార్, ఒడిశాకు చెందిన 1,200 కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించడం వెనుక జరిగిన పోలీస్ ఆపరేషన్ ఫలించింది. ఈ మొత్తం ఆపరేషన్‌ను వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర అత్యంత రహస్యంగా, విజయవంతంగా పూర్తి చేశారు. ఏడీజీ జితేందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్టీఫెన్ రవీంద్ర.. బుధవారం రాత్రే కూలీల వద్దకు వెళ్లారు. అందరినీ సొంత రాష్ట్రాలకు పంపుతామని వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. ఎప్పుడు, ఎలా పంపుతారన్న విషయం ఆఖరు నిమిషం వరకు కూలీలకు కూడా తెలియనివ్వలేదు. గురువారం రాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు మొత్తం 1,200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ వచ్చింది. అప్పుడే లింగంపల్లి రైల్వే అధికారులకు కూలీలను తీసుకొస్తున్నామని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెప్పించిన దాదాపు 30కి పైగా బస్సుల్లో తరలించారు. తెల్లవారుజామున 2.30 తర్వాత బస్సులు లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరాయి. ప్రత్యేక రైలులో అంతా ఎక్కాక వారికి ఆహారం, వాటర్ అందించారు. తెల్లవారుజామున 3.30 గంటలు దాటాక రైలు బయల్దేరింది. -
సంక్రాంతి పండగ రద్దీ
-
చలో ‘భారత్ దర్శన్’.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: నగర పర్యాటకుల కోసం త్వరలో ‘భారత్ దర్శన్’ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది. ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పర్యటనలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్సీటీసీ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టామని, దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని చెప్పారు. ఏటా 50,000 మందిపైనే.. నగరం నుంచి ఏటా 50 వేల మందికి పైగా పర్యాటకులు ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు రైళ్లలో తరలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలిసి ఎక్కువ లగేజీతో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్ టూరిస్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవి కావడమే కాక కొన్నిసార్లు మోసాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగర పర్యాటకుల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. శ్రీరంగం టు కాంచీపురం సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మొదట శ్రీరంగం చేరుతుంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ సందర్శన.. తంజావూర్ బృహదీశ్వరాలయ పర్యటన అక్కడి నుంచి 2,500 ఏళ్ల నాటి పురాతన పట్టణమైన మధుర మీనాక్షి ఆలయ సందర్శన.. ఇంకా, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ దేవాలయం, వివేకానందరాక్ మెమోరియల్ ఆలయ సందర్శనాల అనంతరం మహాబలిపురం చేరుతుంది. అనంతరం కాంచీపురం చేరుకొని అక్కడి నుంచి తిరుగు పయనమై.. జనవరి 10వ తేదీ మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుతుంది. ‘భారత్ దర్శన్’ జర్నీ ఇలా.. జనవరి 3, తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది. 10న మధ్యాహ్నం తిరిగి సికింద్రాబాద్ చేరుతుంది. ప్రయాణం మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది. ఈ రైలుకు ఉండే 16 బోగీల్లో 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ త్రీటైర్, ఒక ప్యాంట్రీ కార్ ఉంటాయి. మిగతా రెండూ గార్డ్ బోగీలు. స్లీపర్ క్లాస్ జర్నీకి రోజుకు రూ.945, థర్డ్ ఏసీకి రూ.1,150 చొప్పున చార్జీ (రైలు ప్రయాణంతో పాటు, అల్పాహారం, టీ, కాఫీ, భోజనం, రోడ్డు రవాణా తదితర వసతులన్నీ కలిపి) వసూలు చేస్తారు. మొత్తంగా 8 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం స్లీపర్ క్లాస్‌కు రూ.7,560, థర్డ్ ఏసీకి రూ.9,240 చొప్పున ప్యాకేజీ నిర్ణయించారు. ఫోన్ కొడితే సమాచారం.. ‘భారత్ దర్శన్’ సమాచారం కోసం సికింద్రాబాద్ ఐఆర్సీటీసీ జోనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు: 82879 32227, 82879 32228. -
ఒంటరిగా రండి.. జంటగా వెళ్లండి
బీజింగ్: ఒక్కరే ముద్దు లేదా అసలే వద్దు సిద్దాంతం చైనా జనాభాలో భారీ మార్పులు తీసుకు వచ్చింది. ఈ విధానం వల్ల జననాల సంఖ్య తగ్గడమే కాక స్త్రీ, పురుష జనాభాలో విపరీతమైన తారతమ్యం చోటు చేసుకుంది. ఫలితంగా ప్రస్తుతం చైనాలో పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. గతేడాది చైనాలో 1000 మందిలో కేవలం 7.2శాతం మందికి మాత్రమే వివాహం అయ్యిందని అధికారులు తెలిపారు. రాగల ముప్పై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు పెళ్లి కానీ ప్రసాదులుగా మిగిలిపోనున్నారట. ఈ నేపథ్యంలో పెళ్లి కానీ యువతీ యువకుల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది చైనా. ఒంటరి పక్షుల కోసం ‘లవ్ పర్స్యూట్’ పేరుతో మూడేళ్ల క్రితం ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైలులో ఒక్కో ట్రిప్‌లో దాదాపు 1000 మంది పెళ్లి కానీ యువతీ యువకులను ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. చాంగ్కింగ్ నార్త్ స్టేషన్ నుంచి కియాంజియాంగ్ స్టేషన్ వరకు రెండు పగళ్లు, ఒక రాత్రి సాగే ఈ ప్రయాణంలో యువత తమకు జీవితభాగస్వామిగా సరిపోయే వ్యక్తులను అన్వేషించుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే వారితో స్నేహం చేసి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని.. ఆ తర్వాత అన్ని బాగున్నాయనుకుంటే.. పెళ్లి చేసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించడమే కాక వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. లవ్ పర్స్యూట్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తాను తన జీవితభాగస్వామిని గుర్తించానని యాంగ్ హువాన్ తెలిపింది. తిరుగు ప్రయాణంలో తాము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామన్నది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే అని తేలడంతో వివాహం చేసుకున్నామన్నది. ఈ ప్రయాణంలో తోడు దొరకకపోయినా.. మంచి మిత్రులు పరిచయం అవుతారంటుంది యాంగ్. -
ఆయన అంతిమ ప్రయాణం అందులోనే!
వాషింగ్టన్ : అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయన భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’ అని పేరు కూడా పెట్టారు. ఇక బుష్ పార్థివ దేహానికి వాషింగ్టన్లో నివాళులు అర్పించిన అనంతరం తిరిగి హూస్టన్‌కు తీసుకువచ్చిన తర్వాత టెక్సాస్‌లోని జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందుకు గానూ ‘4141’ అనే ప్రత్యేక రైలును ఉపయోగిస్తున్నారు. అంతిమ ప్రయాణం అందులోనే! సీనియర్ బుష్ అంతిమ ప్రయాణం ఆయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన రైలులో సాగనుండటం విశేషం. అమెరికాలోని అతిపెద్ద రైలు రవాణా సంస్థ యూనియన్ పసిఫిక్ తమ దేశ 41వ అధ్యక్షుడు బుష్ గౌరవార్థం ఓ ప్రత్యేక లోకోమోటివ్ను రూపొందించింది. 4141 నంబరు గల ఈ లోకోమోటివ్ను 2005లో సీనియర్ బుష్ ప్రారంభించారు. తమ లోకోమోటివ్‌లకు భిన్నంగా 4141ను అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ లుక్ ప్రతిబింబించేట్లుగా నీలం, తెలుపు రంగులో దీనిని రూపొందించారు. దీనిపై జార్జ్ బుష్ 41 అనే అక్షరాలను పొందుపరిచారు. స్వయంగా ఆయనే నడిపారు.. ‘4141 ఆవిష్కరణ సమయంలో నేను రైలు నడపవచ్చా అని బుష్ అడిగారు. చిన్నపాటి ట్రెయినింగ్, కొన్ని మెళకువలు చెప్పిన అనంతరం ఇంజనీర్ పర్యవేక్షణలో సుమారు రెండు మైళ్ల దూరం పాటు బుష్ లోకోమోటివ్ను నడిపారు’ అని యూనియన్ పసిఫిక్ రిటైర్డ్ జనరల్ డైరెక్టర్ మైక్ ఇడెన్ ఆనాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 1969 తర్వాత మొదటిసారి.. మాజీ అధ్యక్షుల పార్థివ దేహాలను అంతిమ ప్రయాణానికి రైళ్లను ఉపయోగించే సంప్రదాయం అబ్రహం లింకన్ కాలం నాటి నుంచే కొనసాగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షులు గ్రాంట్, గారీఫీల్డ్, మెకన్లే, హార్డింగ్, రూజ్వెల్ట్ భౌతిక కాయాలను కూడా రైళ్లలోనే తరలించినట్లు యూనియన్ పసిఫిక్ పేర్కొంది. అయితే 1969లో ఐసన్‌హోవర్ తర్వాత మొదటిసారిగా బుష్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లడానికి, ఆయన పేరు మీదుగా రూపొందించిన లోకోమోటివ్ను ఉపయోగించనుండటం తమకు ప్రత్యేకమని తెలిపింది. ‘రెండో ప్రపంచ యుద్ధంలో నేవీ పైలట్‌గా, అధ్యక్షుడిగా తన జీవిత కాలాన్నిఅమెరికా కోసం వెచ్చించిన అధ్యక్షుడు బుష్‌కు కృతఙ్ఞతలు. మీ గౌరవార్థం బుష్ లైబ్రరీ లోకోమోటివ్ను 2005లో ప్రత్యేకంగా రూపొందించాం. మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ విధంగా బుష్‌ను చివరిసారిగా దర్శించుకుని, నివాళి అర్పించే అవకాశం 4141 ద్వారా టెక్సాన్లకు దక్కింది. కాగా వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. Thank you, President Bush, for a life of service, including serving as a Navy combat pilot in World War II. We were honored to pay you tribute with a custom-painted locomotive at the Bush Library in 2005. Our thoughts and prayers are with your family. #Bush41 pic.twitter.com/rPg96allQP — Union Pacific (@UnionPacific) December 1, 2018 -
సండే స్పెషల్ ఇక డైలీ!
పశ్చిమగోదావరి , నరసాపురం: నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి ప్రతి ఆదివారం హైదరాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును శాశ్వతంగా కొనసాగించాలని రైల్వేశాఖ భావిస్తోంది. రెండున్నర నెలలుగా నడుస్తున్న ఈ రైలులో విపరీతమైన రద్దీ ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు వారం రోజుల్లో తెలియజేస్తామని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధు తెలిపారు. ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాం తాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. గత మే 6 నుంచి ఈరైలు సర్వీస్ ప్రారంభమైంది. నిజానికి వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపాలని ప్రవేశపెట్టారు. అయితే వేసవి ముగిసినా రద్దీ ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ స్పెషల్ రైలును ఆగస్ట్ నెలాఖరు వరకూ మరో రెండు నెలలుపాటు పొడిగించారు. అయితే రద్దీ తగ్గకపోవడంతో ఈ రైలును శాశ్వతంగా నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రతి ఆదివారం సా యంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. నాలుగు జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుంది. డెల్టా, కోనసీమ వాసులకు ఉపయోగం సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం నుంచి తొలగించి ఆరు మాసాలుగా నిడదవోలు నుంచి కొనసాగిస్తున్నారు. దీంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచే ట్రాక్ స్టేషన్లో ఖాళీగా ఉంటుంది. దీంతో ఈ ప్రత్యేక రైలును నరసాపురం నుంచి ప్రవేశపెట్టడానికి వీలు చిక్కింది. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రిళ్లు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్, పగలు నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ న డుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవ రం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూ ర్పుగోదావరి జిల్లా నుంచి కోనసీమ ప్రాంతాల వారు హైదరాబాద్ చేరడానికి ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా ఈ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. పండుగలు, సెలవు రోజుల్లో మరింత రద్దీ ఉంటోంది. దీంతో వీకెండ్లో తిప్పుతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని శాశ్వతం చేసే యోచనలో రైల్వేశాఖ ఉంది. -
16 రోజుల యాత్ర స్పెషల్ ట్రైన్
న్యూఢిల్లీ : రైల్వేశాఖ రామాయణంలో ప్రస్తావించిన ప్రముఖ ప్రదేశాలన్నింటిని ఒకే యాత్రలో సందర్శించుకునే ఆవకాశాన్ని కల్పిస్తోంది. అందుకోసం నవంబర్ 14న ప్రత్యేక పర్యాటక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్’ ను నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. హిందూ చరిత్రలో రామాయణానిది ప్రత్యేక స్థానం. అందుకే రాముని జీవితంతో సంబంధం ఉన్న ప్రధాన ప్రాంతాలను యాత్రికులు సందర్శించుకునేలా ఈ స్పెషల్ ట్రైన్‌కు రూపకల్పన చేసింది. ఢిల్లీలో ప్రారంభమై తొలుత అయోధ్యలోని గర్హి రామ్‌కోట్, కనక్ భవన్ ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్వర్పూర్, చిత్రకూట్, హంపీ, నాసిక్‌ల మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్లో 800మంది ప్రయాణించవచ్చు. 16 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. ఒక్కో వ్యక్తికి 15,120 రూపాయలు వసూలు చేయనున్నారు. అందులోనే భోజన సదుపాయం, ధర్మశాలలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.వాటి కోసం ప్రత్యేక టూర్ మేనేజర్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇందుకు సంబంధించిన బుకింగ్ త్వరలో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. రామాయణ యాత్రను ఐఆర్సీటీసీ రెండు ప్యాకేజ్‌లుగా విభజించింది. ఒకటి భారత్‌లో ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు కాగా, మిగిలినది శ్రీలకంలో సాగనుంది. యాత్రికులను విమానంలో శ్రీలంకు తీసుకెళుతారు. ఈ పర్యటనలో భాగంగా కండీ, నువారా ఎలియా, కొలంబో, నీగోమ్బోలను సందర్శించవచ్చని రైల్వేశాఖ తెలిపింది. శ్రీలంక 5 రోజుల పర్యటనకై ప్రత్యేంగా 47,600 రూపాయలతో ప్యాకేజ్ రూపొందించింది. ఈలోపే రామాయణంలోని ప్రధాన ప్రదేశాలను సందర్శించేలా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు మరో ప్రత్యేక రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అది త్రివేండ్రం నుంచి ప్రారంభమవుతోందని తెలిపింది. -
8న తిరుపతికి ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి (7429/7428) కి ప్రత్యే క రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి హైదరాబాద్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు
పశ్చిమగోదావరి, నరసాపురం : ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపనున్నారు. తరువాత కూడా అదే తరహాలో రద్దీ ఉంటే ఈ సర్వీస్‌ను శాశ్వతంగా కొనసాగిస్తారని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధుబాబు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. 4 జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని స్టేషన్ మాస్టర్ చెప్పారు. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రి పూట నరసాపూర్ ఎక్స్‌ప్రెస్, పగటిపూట నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఈ రైళ్లలో రిజర్వేషన్ దొరకని పరిస్థితి. పండుగలు, సెలవులు సమయాల్లో అయితే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్లో నడపబోతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడనుంది. -
చెన్నై కోసం పుణెకు ప్రత్యేక రైలు
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, తమిళనాట కావేరీ జల వివాదం వేడెక్కడంతో చెన్నై మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వేలాది అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇలా జరిగినందుకు వారేమీ బాధపడలేదు. పుణెను సొంతగడ్డగా భావించి మ్యాచ్‌లాడుతున్న తమ జట్టుకు ఎలా అయినా మద్దతు ఇవ్వాలనుకున్నారు. వారి అభిలాషను ఆ జట్టు యాజమాన్యానికి తెలిపారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖను సంప్రదించి చెన్నై నుంచి పుణెకు ప్రత్యేక రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనకు అధికారులు కూడా పచ్చజెండా ఊపడంతో ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ప్రత్యేక రైలు గురువారం చెన్నై నుంచి క్రికెట్ అభిమానులతో పుణె బయలుదేరింది. పసుపు రంగు జెర్సీలు, పచ్చ జెండాలతో రైలంతా పసుపుమయంగా మారిపోయింది. ‘సీఎస్కే.. సీఎస్కే’అనే నినాదాలతో ట్రైనంతా మార్మోగిపోయింది. ఇంతకీ ఈ రైలు పేరేంటో తెలుసా ‘విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్’. టోర్నీలో భాగంగా శుక్రవారం పుణె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్–రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. -
విజయవాడ నుండి ఢిల్లీకి వైఎస్ఆర్సీపీ ప్రత్యేక రైలు
-
వైఎస్సార్సీపీ ఢిల్లీ ధర్నాకు ప్రత్యేక రైలు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తల కోసం విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం (2వ తేదీ) సాయంత్రం 7 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలన్నారు. రైలు రాత్రి 10 గంటలకు బయలు దేరుతుందని తెలిపారు. 5వ తేదీ ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు ఢిల్లీ నుండి రైలు తిరిగి బయలుదేరి 7వ తేదీ ఉదయం విజయవాడకు చేరుకుంటుందన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఢిల్లీలో వసతి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
17న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, తిరుపతి: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ఈనెల 17వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెం.07430) ఈనెల 17వ తేదీ రాత్రి 8.10గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.35గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. -
30న ‘భారత్ దర్శన్’ రైలు వరంగల్ రాక
రైల్వే గేట్(వరంగల్): భారత్ దర్శన్‌లో భాగంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు ఈనెల 30న అర్ధరాత్రి 2 గంటలకు(31 తెల్లవారు జామున) రానున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 12 కోచ్‌లు, ఏసీ 3 టైర్ బోగీలతో 2,440 బెర్త్‌లతో కూడిన రైలు వరంగల్ వస్తున్నట్లు చెప్పారు. ఎనిమిది రోజులు, ఏడు రాత్రులతో కూడిన ఈ ప్రయాణంలో ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ గుడి, భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్, ఆంధ్రలో విశాఖపట్నం బుర్రా కేవ్స్, అరకు వ్యాలీ, సింహాచలం, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చని వివరించారు. ఒకరికి రూ.7895(స్టాండర్డ్ స్లీపర్), రూ.9575(కంఫర్ట్ ఏసీ 3 టైర్) కింద చెల్లించాల్సి ఉంటుందని, ఆన్లైన్, రైల్వే బుకింగ్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్ 040–27702407, 9701360701, 9701360690లలో సంప్రదించాలని సంజీవయ్య కోరారు. ఈ ప్రయాణికులకు అల్పాహారం, భోజనం, వసతి, ఉచితంగా ఆలయ దర్శనాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాచిగూడ–కాకినాడ ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ (07452/07453) ప్రత్యేక రైలు ఈ నెల 23న (శనివారం) సాయంత్రం 7.50 కి కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ (సోమవారం) రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు. -
నర్సాపూర్– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్– సికింద్రాబాద్(07255/07256) ప్రత్యేక రైలు ఈ నెల 26న సాయంత్రం 6.15కి నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రా బాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 27న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ మణుగూరు వరకు.. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కొల్హాపూర్– హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మణుగూర్ వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో వెల్లడించారు. ఈ మేరకు కొల్హాపూర్– మణుగూర్ (11304/ 11303) ఎక్స్‌ప్రెస్‌గా సేవలం దించనుంది. కొల్హాపూర్‌లోని ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మి నల్ నుంచి ఉదయం 7.35కి బయలుదేరి మరుసటి రోజు మధ్యా హ్నం 1.30కి మణుగూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యా హ్నం 3.30కి మణుగూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి కొల్హాపూర్ చేరుకోనుంది. మార్చి 14 నుంచి ఈ రైలు నాంపల్లి స్టేషన్‌కు బదులు వయా సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించనుంది. -
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ ఇన్చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెంబరు 07207) అక్టోబర్ 1 తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రైలు నెంబరు 07208 సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు అక్టోబర్ 2వ తేదీ సికింద్రాబాద్‌లో రాత్రి 11.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో కోరారు. -
వారెక్కాల్సిన రైలు ఆగలే...
♦ ఆమదాలవలసలో ఆగని స్పెషల్ ట్రైన్ ♦ అవాక్కయిన 25 మంది ప్రయాణికులు ♦ చీపురుపల్లిలో 25 నిమిషాలపాటు నిలిపివేత ♦ వెనుకనుంచి పాసింజర్ రైల్లో వచ్చి రైలు ఎక్కిన వైనం చీపురుపల్లి: సాంకేతిక పరంగా రైల్వే ఎంతో అభివృద్ది చెందినప్పటికీ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రైల్వే అధికారుల పొరపాటో లేక సమాచారం లేకనో తెలియదు గాని మొత్తం మీద ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. రైల్వే అధికారుల పొరపాటు కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో 25 మంది ప్రయాణికులు రైలు ఎక్కక అవస్థలు చెందగా వారి కోసం స్పెషల్ రైలును చీపురుపల్లిలో 25 నిమిషాలు నిలిపి అందులో ఉన్న వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి. 07163 నంబరు గల హౌరా– సికింద్రాబాద్ రైలు మంగళవారం వచ్చింది. అందులో ఎక్కేందుకు ఆమదాలవలసలో 25 మంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకుని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో ఆ రైలు వచ్చినప్పటికీ ఆగలేదు. కంగుతిన్న ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. ఎలాగైనా తమను సికింద్రాబాద్ అదే రైలులో పంపించాలని ప్రయాణికులు పట్టుబట్టారు. స్టేషన్ మాస్టర్ ఉన్నత అధికారులతో చర్చించి ఆ స్పెషల్ రైలును చీపురుపల్లిలో నిలిపివేయించారు. అనంతరం అప్పటికే ఆలస్యంగా వస్తున్న పలాస– విశాఖపట్నం ఈఎమ్యూలో ప్యాసింజర్ రైలులో ఆ 25 మంది ప్రయాణికులను చీపురుపల్లి పంపించి హౌరా– సికింద్రాబాద్ రైలులో ఎక్కించారు. అంతవరకు చీపురుపల్లిలోనే ఆ రైలు నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా రైల్వే అధికారుల పుణ్యమాని వందలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డాదు. వాస్తవానికి ఆ రైలుకు ఆమదాలవలసలో హాల్టు లేదనీ అందువల్లే స్టేషన్ మాస్టర్‌కు గాని కంట్రోలర్‌కు గాని సాంకేతిక సమాచారం అందలేదని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే హాల్టు లేకుండా రిజర్వేషన్ ఎలా ఇచ్చారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. -
సికింద్రాబాద్-హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా గౌహతి మార్గంలోని రెగ్యులర్ రైళ్లు రద్దు కావడంతో సికింద్రాబాద్-హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం. ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. సికింద్రాబాద్-హౌరా స్పెషల్ (రైల్ నెంబర్: 02513) సికింద్రాబాద్ నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు హౌరా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో.. హౌరా-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 02514) హౌరా నుంచి ఈ నెల 25వ తేదీ తెల్లవారుజాము 1.05 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. -
భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): భోపాల్‌లో నిర్వహించే జాతీయస్థాయి ఇస్తెమాకు కర్నూలు నుంచి ప్రత్యేక రైలు నడుపుతామని రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ఏడాది నవంబరు 25, 26, 27 తేదీల్లో ఇస్తెమా నిర్వహించనున్నారని తనకు తెలిసిందన్నారు. జిల్లాకు చెందిన ముస్లింలు వేల సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. జీఎం సానుకూలంగా స్పందించారని.. నవంబరు 23న రాత్రి కర్నూలు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అలాగే 27వ తేదీ భోపాల్ నుంచి తిరిగి ప్రయాణమవుతుందని చెప్పారు. బుధవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. -
మే7 నుంచి హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - కాకినాడ మధ్య (07005) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు, సికింద్రాబాద్ నుంచి 7.20 గంటలకి బయలుదేరుతుంది. రాత్రి 12.30 గంటలకు గుంటూరుకు, రాత్రి 1.30 సమయానికి విజయవాడకు చేరుకుంటుంది. 8న ఉదయం 5.35 గంటలకు రైలు కాకినాడ చేరుకుంటుందని సీపీఆర్వో చెప్పారు. -
పుదుచ్చేరి–సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి –సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పుదుచ్చేరి–సంత్రగచ్చి (06010) ప్రత్యేక రైలు ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో నడుస్తుంది. సంత్రగచ్చి–పుదుచ్చేరి (06009) రైలు ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో నడుపుతారు. 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు: వెయిటింగ్ లిస్ట్ ప్రయా ణీకుల సౌకర్యార్ధం మార్చి 5 నుంచి జూన్ 1 వరకు 22 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గుంటూరు– వికారాబాద్ (పల్నాడు), విజయవాడ–సికింద్రాబాద్ (శాతవాహన), విజయ వాడ–చెన్నై (పినాకిని), విజయవాడ–విశాఖపట్టణం (రత్నా చల్), సికింద్రా బాద్ – గుంటూరు (ఇంటర్ సిటీ), సికింద్రాబాద్ –కర్నూల్ టౌన్ (తుంగ భద్ర), సికింద్రాబాద్–విజయవాడ (ఇంటర్ సిటీ), తిరుపతి–ఆదిలాబాద్ (కృష్ణా) రెండు వైపులా నడిచే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
- పరిసరాలు శుభ్రంగా లేకపోతే చర్యలు – రైల్వే డీఆర్ఎం అరుణాసింగ్ కర్నూలు (రాజ్‌విహార్): పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాదు డివిజినల్ మేనేజర్ అరుణాసింగ్ హెచ్చరించారు. 3వ తేదీన జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ పర్యటన సందర్భంగా బుధవారం ఆమె హైదరాబాదు నుంచి ప్రత్యేక రైలులో పరిశీలించుకుంటూ కర్నూలు చేరుకున్నారు. సిటీ స్టేషన్‌తోపాటు కృష్ణానగర్ కోట్లా హాల్ట్, దుపాడు, ఉలిందకొండ, వెల్దుర్తి, డోన్ తదితర స్టేషన్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఆర్ఓ ప్లాంట్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అన్ని భాగాల డివిజన్ అధికారులు కర్నూలు స్టేషన్ మేనేజర్ మక్బుల్ హుసేన్ పాల్గొన్నారు. -
విజయవాడ- తెనాలి-గుంటూరు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరువలో ఉన్న నగరాలను కలుపుతూ ప్రత్యేక ట్రైన్ ను వేయాలని గురువారం ఏపీ సర్కారు నిర్ణయించింది. మొత్తం 125 కిలోమీటర్ల పాటు ఉండనున్న ఈ మార్గానికి రూ.10వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రత్యేక ట్రైన్ విషయంపై సీఆర్ డీఏ అధికారులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు విశాఖపట్టణం మెట్రో అలైన్ మెంటుకు కూడా ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది. మొత్తం నాలుగు కారిడార్లతో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ఏడీ జంక్షన్ నుంచి బొమ్మది, గాజువాక జంక్షన్ లకు రెండు కారిడార్లు, గురుద్వారా నుంచి పోస్టాఫీసుకు, తాడిచెట్టపాలెం నుంచి చినవాల్తేరుకు మరో రెండు కారిడార్లను నిర్మించనున్నారు. -
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
సాక్షి, అమరావతి: వర్దా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. డిసెంబర్14, 15వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 14వ తేదీన: 12616 ఢిల్లీ ఎస్ రోహిలా– చెన్నై సెంట్రల్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, 12622 న్యూఢిల్లీ– చెన్నై సెంట్రల్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 57273 హుబ్లి– తిరుపతి ఇంటర్సిటీ ప్యాసింజర్ 15వ తేదీన..: 16094 లక్నో– చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, 12296 పాటలీపుత్ర– బెంగళూరు సిటీ సంగమిత్ర ఎక్స్‌ప్రెస్, కాచీగూడ – చెంగల్పట్టు ప్రత్యేక రైలు ప్రయాణీకుల రద్డీని దృష్టిలో పెట్టుకొని కాచీగూడ– చెంగల్పట్టు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక రైలు (నెంబర్ 07652) 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాచిగూడలో బయలుదేరి రాత్రి 7.10కి చెంగల్పట్టు చేరుకుంటుంది. -
భోపాల్‌కు బయలుదేరిన ప్రత్యేక రైలు
– ఇస్తెమాకు వెళ్లిన కర్నూలు ముస్లింలు – జెండా ఊపి ప్రారంభించిన హఫీజ్ ఖాన్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈనెల 26, 27, 28వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ముస్లింల భారీ ఇస్తెమా ఉండటంతో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ప్రధానితో మాట్లాడి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు గురువారం రాత్రి 12 గంటలకు కర్నూలు చేరుకుంది. కర్నూలులో వేలాది మంది ముస్లింలు రైలులో బయలుదేరి వెళ్లారు. రైలు బయలుదేరడానికి ముందు మౌల్వీలు ప్రయాణం సుఖవంతంగా జరగాలని దువా చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ జెండా ఊపి రైలు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ముస్లింలను హఫీజ్‌ఖాన్ ఆలింగనం చేసుకుని ఇస్తెమాకు వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనిషిలో మానవత్వాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో మౌలానా మజరుల్ హక్, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు మహమ్మద్ పాషా, ఫారుక్ అలీ, నజీర్ అహ్మద్ ఖాన్, మాజీ కార్పొరేటర్ దాదామియ, వైఎస్ఆర్ సీపీ నాయకులు మాలిక్, అన్వర్, షాదిక్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలు
– ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నవంబరు 8న ప్రారంభం – మాత వైష్ణోదేవి, అమృత్సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మధుర, ఆగ్రాల సందర్శనం – 11రోజుల యాత్ర టికెట్ ధర రూ.9,625, ఏసీలో రూ.13,075 – ఇందులోనే రవాణా, భోజన చార్జీలు – కర్నూలు మీదుగా తొలి ప్రత్యేక రైలు : డీజీఎం సంజీవయ్య కర్నూలు(రాజ్‌విహార్): ఉత్తర భారత యాత్రకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. అలాంటి వారి కోసం కర్నూలు మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటర్నింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) డీజీఎం ఎన్. సంజీవయ్య వెల్లడించారు. బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లోని మేనేజరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రైలు ద్వారా ఉత్తర భారతదేశంలోని మాత వైష్ణో దేవి ఆలయంతోపాటు అమృత్సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రాలను సందర్శించవచ్చని చెప్పారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, టీ ఉచితంగా అందిస్తామన్నారు. రైలు చార్జీలతోపాటు స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్ ఏసీ బస్సు సౌకర్యం, రాత్రి బసకు ధర్మశాలలు లేదా డార్మెటరీ హాలు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికి కలిపి సాధారణ స్లీపర్ బోగీలో బెర్త్‌కు రూ.9,625, ఏసీ త్రీ టైర్ బోగీలో బెర్త్‌కు రూ. 13,075 చార్జీ ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల వయస్సు పైబడిన వారందరికీ పూర్తి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందనా్నరు. కర్నూలు మీదుగా తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలును రాయితీ చార్జీలతో నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో స్టేషన్ మేనేజరు మక్బూల్ హుసేన్, ఐఆర్సీటీసీ మేనేజరు ఎ.ప్రసన్న, ఎగ్జిక్యూటీవ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. - యాత్ర ఇలా.. నవంబరు 8వ తేదీన మధ్యాహ్నం 12:20గంటలకు రేణిగుంటలో బయలుదేరి కడపలో 14:20కి, ఎర్రగుంట్ల 15:00, తాడిపత్రి 16:05, కర్నూలు సిటీ 17:10 (సాయంత్రం 5:10గంటలు), మహబూబ్ నగర్ 21:15, కాచిగూడ 23:30, కాజీపేట 9న 01:35 గంటలకు చేరుతుంది. ఈ స్టేషన్లలో ఐదు నిమిషాలు ఆగి కదులుతుంది. కేవలం యాత్రికుల కోసమే కావడంతో ఇతరులు ఎక్కడం, దిగడం ఉండదు. కాజిపేట నుంచి నేరుగా 10న సాయంత్రం జమ్మును చేరుకుంటుంది. అక్కడి నుంచి 40కిలో మీటర్లు బస్సులో కాట్రా వరకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి 14కిలో మీటర్లు కాలి నడక లేదా గుర్రాలు, డోలీల ద్వారా వెళ్లవచ్చు. 11న మాత వైష్ణో దేవి దర్శనం అనంతరం 12 ఉదయం అమృత్‌సర్‌కు బయలుదేరుతారు. రాత్రి హరిద్వార్‌కు బయలుదేరి 13న చేరుకుంటారు. అక్కడ గంగా స్నానం, మానసాదేవి ఆలయం దర్శించుకుని రాత్రి ఢిలీకి బయలుదేరి 14న చేరుకుంటారు. అక్కడ 15వరకు స్థానిక ప్రదేశాల సందర్శన, షాపింగ్‌కు సమయం ఉంటుంది. 16న మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం, ఆగ్రాలో తాజ్‌మహాల్ చూపిస్తారు. అదే రోజు రాత్రి బయలుదేరి 17న రాత్రి 21:10లకు కాజీపేట, కాచిగూడకి 23:10గంటలకు చేరుకుంటారు. 18వ తేదీన తెల్లవారు జామున 03:25గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. - వసతులు: ఈరైలులో 72బెర్త్‌లతో కూడిన 13బోగీలు, 64బెర్త్‌లతో కూడిన 2బోగీలు ఉంటాయి. పక్కా బెర్త్ రిజర్వేషన్, రైలులో, ఉండే చోట సూపర్వైజర్లు, గైడు ఉంటారు. యాత్రికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. సమయానికి టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, టీ ఇస్తారు. స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్ ఏసీ బస్ సౌకర్యం, ఉండేందుకు వసతి, భద్రత (సెక్యూరిటీ) ఉంటుంది. కర్నూలులో రైలు ఎక్కితే యాత్ర అనంతరం తిరిగి ఇక్కడ దించుతారు. టికెట్లు ఇలా పొందాలి: యాత్ర టికెట్లును ఆన్లైన్ వెబ్సైట్ www.irctctourism.com నుంచి లేదా సికింద్రాబాదులోని ఎస్డీ రోడ్డులో ఉన్న ఆక్స్ఫర్డ్ ప్లాజాలోని కార్యాలయం నుంచి పొందవచ్చు. యాత్రికుల సంఖ్య పది మందికి పైగా ఉంటే సంస్థ ప్రతినిధి ఇక్కడికి వచ్చి టికెట్లు ఇస్తారు. వివరాలకు 040- 27702407, 97013 60701 నంబర్లకు సంప్రదింవచ్చు. -
బ్రహ్మోత్సవ బండి.. రాలేదండి
అవస్థలు పడుతున్నాం బ్రహ్మోత్సవాలు, పెరటాసి నెల శనివారాల్లో తిరుమలకు వచ్చి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. రైళ్ల వసతి లేకపోవడం ప్రధాన కారణం. ప్రతిసారీ తమిళనాడు నుంచే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. - మురుగేష్, ధర్మపురి,తమిళనాడు చార్జీలు భరించలేకున్నాం... బస్సు చార్జీలతో పోల్చుకుంటే రైలుచార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. విజయవాడ, వాణిజ్య రాజధాని విశాఖపట్నం నుంచి ఆశించిన స్థాయిలో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించలేదు. దీంతో బస్‌చార్జీలను భరించలేక, స్వామివారి మొక్కు చెల్లిం చుకోవాలనే తపనతో అవస్థల ప్రయాణం చేస్తున్నాం. -మనోహర్, విజయవాడ తిరుపతి అర్బన్: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాల భక్తుల కోసమైనా ఏర్పాటు చేస్తారేమోనని ఆశించినా భంగపాటే ఎదురైంది. అత్యధిక భక్తుల తాకిడి ఉండే తమిళనాడు యాత్రికుల కోసమైనా ప్రత్యేక రైళ్లు , అదనపు బోగీల ఏర్పాటు జరుగుతుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం చెన్నై, కొయంబత్తూరు, వేలూరు నగరాలకు నడుస్తున్న ఒకట్రెండు రైళ్లు మినహా ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేవు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్నా ఉన్నతాధికారులు స్పందించలేదు. బస్ చార్జీలు రెండింతలు.. బ్రహ్మోత్సవాలకు తమిళనాడు, కర్ణాటక భక్తులు బస్సుల ద్వారా చేరుకోవాలంటే బస్సులకు ఎక్కువ మొత్తం చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈరెండు రాష్ట్రాల నుంచి ఏటా రద్దీ ఉంటుంది. వారంతా బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఆదాయం సమకూర్చడంలో సికింద్రాబాద్ తరువాత తిరుపతిదే పైచేయి. ఏడాదికి సుమారు రూ.22కోట్లకు పైగా ఆదాయం తిరుపతి నుంచే వస్తున్నా ప్రాధాన్యత చూపడం లేదు. రైల్వేబోర్డు అధికారుల నుంచి జోనల్ అధికారుల వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 65 రైళ్లు.. 80 వేల మంది యాత్రికులు తిరుపతి నుంచి, తిరుపతి మీదుగా రోజూ 60 నుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 60 వేల మంది ప్రయాణిస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లో ఈసంఖ్య 80 వేలకు పైగా ఉంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవాల్లో రోజుకు లక్ష దాటొచ్చని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. భక్తుల్లో సరిహద్దురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట, ఒడిస్సాకు చెందిన వారే ఎక్కువ గా ఉంటారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో తిరుపతికి రైళ్లు లేవు. చెన్నై-తిరుపతి మధ్య సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లు మూడు ట్రిప్పులు, 2 ప్యాసింజర్ రైళ్లు రెండు ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి శేషాద్రి, హౌరా, ఇంటర్ సిటీ(వారంలో రెండు రోజులు మాత్రం) ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మైసూర్ ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ముంబై నుంచి కూడా రోజుకు 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే వస్తున్నాయి. అలాంటి ప్రతిపాదన లేదు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా లేవు. ఈసారి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సూచన మేరకు అవసరమైన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తాం. ఒక రైలుకు సరిపోయేంత రద్దీ ఎదురైతే ప్రత్యేక రైలును నడిపేందుకు ఉన్నతాధికారుల ఉత్తర్వులతో చర్యలు తీసుకుంటాం. -కుప్పాల సత్యనారాయణ, సీనియర్ లైజన్ ఆఫీసర్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి. -
పూనమ్.. ఇదేం చోద్యం?
జాబల్పూరు: మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం బినా-భోపాల్ ప్రత్యేక రైలులో ఆమె ప్రయాణించడంపై వివాదం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మే 31న జరిగిన మహారాష్ట్ర సాగర్ జిల్లాలోని బినాలో జరిగిన కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన కోసం భోపాల్ నుంచి పశ్చిమమధ్య రైల్వే ప్రత్యేక రైలు పంపింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇదే రైలులో భోపాల్ వెళ్లాల్సివుంది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలో వెళ్లాలనుకున్నారు. అయితే కార్యక్రమం ఆలస్యంగా పూర్తికావడంతో ఆయన బినా నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో వెళ్లిపోయారు. అయితే బీజేపీ పూనమ్ మహాజన్ ప్రత్యేక రైలులో బినా నుంచి భోపాల్ కు వెళ్లారు. దీనిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. రైల్వే మంత్రి కోసం పంపిన ప్రత్యేక రైలులో ప్రయాణించి ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అయితే పూనమ్ ప్రత్యేక రైలులో ప్రయాణించడం యాధృచ్చికంగా జరిగిందని, ఆమెను వీఐపీగా చూడలేదని పశ్చిమమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రమేశ్ చంద్రా తెలిపారు. ఎంపీలకు ప్రత్యేక రైళ్లు నడపరాదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. -
ఎంపీ కోసం స్పెషల్ రైలు.. వివాదాస్పదం!
భోపాల్: మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కోసం భారత రైల్వే స్పెషల్ గా మహారాష్ట్ర లోని బినా నుంచి భోపాల్ కు రైలును నడపడం వివాదాస్పదంగా మారింది. భోపాల్ కు చేరుకొని అక్కడి నుంచి పూనమ్ ముంబైకి ఫ్లైటులో వెళ్లాల్సి ఉంది. ముంబైలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా కార్యక్రమానికి ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె బినాకు చేరుకునే లోపే భోపాల్ కు వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం ప్రత్యేక రైలును నడిపారు. ప్రత్యేక రైలులో భోపాల్ చేరుకున్న పూనమ్ అక్కడి నుంచి విమానంలో ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్లో లేని రైలు వల్ల పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. -
పాడైన బోగీలతో.. కానిచ్చేశారు..!
ముంబై: రైళ్ల రాకపోకల సమయాల్లో, నిర్ణయాల్లో జాప్యం చేసే రైల్వే శాఖ శుక్రవారం రాష్ట్ర మంత్రి చొరవతో అరకొర వసతులున్న రైలును ఎనిమిది గంటల్లోనే ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా వెళ్లే విధంగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది. వివాహాల సీజన్ కావడంతో రైళ్లలో ఖాళీలు లేక ఉత్తర భారతదేశానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు ముంబై స్టేషన్లోనే పడుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అందించిన సమాచారంతో కదిలిన మహారాష్ట్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెంటనే ప్రత్యేక సర్వీసులను నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన రైల్వే శాఖ ఆదేశాలు అందిన రెండు గంటలలోపే వాడుకలో లేని కోచ్‌లను త్వరగా రప్పించి శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ప్రత్యేక రైలును గోరఖ్‌పూర్ వరకు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎస్టీ, వాడి బన్డర్, మజ్గావ్, దాదర్ రైల్వే యార్డుల నుంచి రెండు చొప్పునా, బైకుల్లా యార్డు నుంచి నాలుగు వాడుకలో లేని, పూర్తిగా పాడై ఉన్న కోచ్‌లను ఎంపిక చేశారు. వీటిని రిపేర్ చేయడం, శుభ్ర పరచడం కోసం 25 మంది రైల్వే సిబ్బంది కేటాయించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రిపేర్ చేసిన 12 కోచ్‌లు ముంబై స్టేషన్‌కు చేరుకున్నపుడు పరిశీలిస్తే బోగీలన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబై నుంచి గోరఖ్‌పూర్, వారణాసి, పాట్నాలకు 84 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నరేంద్రపాటిల్ తెలిపారు. -
సికింద్రాబాద్-గౌహతీకి ప్రత్యేక రైలు
వేసవికాలం శెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - గౌహతీ - సికింద్రాబాద్‌కు గుంటూరు రైల్వే స్టేషను మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుపుతున్నట్లు అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు వి సత్యనందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నెం 07149 సికింద్రాబాద్ - గౌహతీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం అనగా ఎప్రిల్ 22,29 మే 6,13,20,27 తేదిలలో సికింద్రాబాద్‌లో 07.30కి బయలుదేరి గుంటూరుకు 12.40కి వచ్చి బయలుదేరి ఆదివారం (రెండవరోజు) 08.45కి గౌహతీ చేరుకుంటుంది. ట్రైన్ నెం 07150 గౌహతీ-సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి సోమవారం అనగా ఎప్రిల్ 25, మే 2,9,16,23,30 తేదిలలో గౌహతీలో 06.15కి బయలుదేరి బుధవారం (రెండవరోజు) 01.55కి వచ్చి బయలుదేరి సికింద్రాబాద్‌కు 09.15కి చేరుకుంటుంది. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఎసీ టూటైర్, మూడు ఎసీ త్రీటైర్, 12 స్లీపర్ కోచ్‌లు సాదరణ ప్రయాణికుల కోసం రెండు ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా వి సత్యానందరావు తెలిపారు. -
సికింద్రాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక రైలు
హైదరాబాద్: హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02793/02794) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి 9.40 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 10 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ శుక్రవారం ఉదయం 9.30కు పాట్నా నుంచి బయలుదేరి శనివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
హైదరాబాద్ : వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07201 నెంబర్ గల రైలు కాకినాడలో జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి జూన్ 2న (07202) సికింద్రాబాద్‌లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. -
జూన్ 5న 'సికింద్రాబాద్- పట్నా' ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ - పట్నా మధ్య ప్రత్యేక రైలును నడుపనున్నారు. నంబర్ 02791 రైలు జూన్ 5న ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు పట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంబర్ 02792 రైలు జూన్ 7 మధ్యాహ్నం 1.30 గంటలకు పట్నాలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, నాగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. -
కాకినాడకు ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్-కాకినాడ (07011/07012) స్పెషల్ ట్రైన్ ఈ నెల 13వ తేదీ రాత్రి 8.30 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కాజీపేట, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడుదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. -
ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు కోసం కృషి
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హామీ సాక్షి, ముంబై : ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు కోసం కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఒంగోలు లోక్‌సభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధికార పర్యటన నిమిత్తం నగరానికి విచ్చేసిన ఆయనను స్థానిక తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా కనిగిరి వాస్తవ్యుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కనిగిరి ప్రజలకు ముంబై నుంచి ప్రత్యేక రైలు కోసం కృషి చేస్తాననీ చెప్పారు. ముఖ్యంగా తాను నెల్లూరు, తిరుపతి ఎంపీలతో కలిసి నడికుడి-కాళహస్తి రైలు మార్గం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముంబై నుంచి కనిగిరికి ప్రత్యేక రైలు ఆవశ్యకత గురించి తనకు చెప్పారన్నారు. ముంబై, పుణే ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ, వారు ప్రతిసారి గుంతకల్ స్టేషన్లో దిగి మరో రైలు ద్వారా గమ్యస్థానం చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని వెంకయ్యనాయుడు తనతో చెప్పారన్నారు. ఇదే విషయాన్ని కనిగిరి ప్రజలు కూడా తన దృష్టికి తీసుకు వచ్చారని ఈ విషయమై తాను తప్పకుండా రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. వచ్చే రైల్వే బడ్జెట్లో ఈ విషయమై ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఇందుకోసం ముంబైలో ఉంటున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి తమ సహకారం అందించాలని సూచించారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో తాను మరింత ఎక్కువ సమయం వెచ్చించి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెల్గొండ ప్రాజెక్టు పూర్తి అవడానికి శాయ శక్తుల కృషి చేస్తాననీ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు రూప కల్పనకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని ఆయన చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాననీ ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తాననీ సుబ్బారెడ్డి చెప్పారు. అదేవిధంగా జిల్లాలో రామయ్యపట్నం పోర్ట్ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నాననీ తెలిపారు. తను అనుకున్న లక్ష్యాలు నెరవేరితే జిల్లా అభివృద్ధి చెందడమేకాకుండా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు, తర్వాత కూడా ఆయనకు ఆయన కుటుంబానికి వై.వి.సుబ్బారెడ్డి వెన్ను దన్నుగా నిలిచారనీ పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్కు వై.వీ.సుబ్బారెడ్డి ఎంతగానో సహకరించారని అన్నారు. అదేవిధంగా ముంబైతోపాటు పుణేలో ఉన్న కనిగిరి ప్రజల కోసం ప్రత్యేక రైలు నడిపించేందుకు ఒంగోలు ఎంపీ చర్యలు తీసుకోవాలని కొండారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నవీముంబై బీజేపీ అధ్యక్షులు సీ.వి.రెడ్డితోపాటు వల్లభరావు, వి.వి.రెడ్డి, కేటీవీ రెడ్డి, ఎం.టీ.రెడ్డి, ఎస్.కాశిరెడ్డి, కే.భాస్కర్‌రెడ్డి, మోహన్రావ్లు పాల్గొన్నారు. ఎస్వీ క్లాసెస్ కరెస్పాండెంట్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు
ఈ నెల 9,16, 23, 30వ తేదీలలో విశాఖ- హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖకు.. విశాఖపట్నం సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పుకోస్తా రైల్వే విశాఖ-హైదరాబాద్ మధ్య ఒక రైలును నడపనుంది. ఈ నెల 9,16,23,30వ తేదీలలో ఈ రైలు విశాఖ నుంచి రాజధానికి బయలుదేరుతుంది. ఇందులో ఎనిమిది జనరల్ బోగీలుంటాయి. ఒక సెకండ్‌ఏసీ, ఒక థర్డ్ ఏసీ, అయిదు రిజర్వేషన్ బోగీలుంటాయి. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఆయా తేదీల్లో విశాఖలో హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 17, 24,31వ తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మర్నాడు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అయ్యప్పస్వాముల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-కొల్లాం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-కొల్లాం (07625) ప్రత్యేక రైలు ఈ నెల 14న సాయంత్రం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30కు కొల్లాం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 15న రాత్రి 11.50 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండవరోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, కట్పడి, జోలార్‌పట్టి, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పలక్కాడ్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకులం, కొట్టాయం, తిరువళ్ల, చింగన్నూర్, కాయంకులళం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు బుధవారం (డిసెంబర్ 10) నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని సీపీఆర్వో వెల్లడించారు. -
ఛత్ భక్తుల కోసం ప్రత్యేక రైలు
న్యూఢిల్లీ: జరిగే ఛత్ పూజకు వెళ్లేవారి సౌకర్యార్థం పాట్నాకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఉత్తర రైల్వే నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడిన ఉత్తర భారతదేశ ప్రజలు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీవరకు ఛత్ పూజ నిమిత్తం సొంత గ్రామాలకు తరలుతున్నారు. వేలాదిగా ఉన్న వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నుంచి ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి పాట్నా వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి నీరజ్ శర్మ తెలిపారు. పండగల సీజన్ నిమిత్తం సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 10వ తేదీవరకు ఉత్తర రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు నవరాత్రి, ఈద్, దసరా, దీపావళి పండుగలు ముగియగా, ప్రస్తుతం ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయని, ఈ పండగ సీజన్ మొత్తం సుమారు 3 వేల అదనపు ట్రిప్పులు నడిపామని ఆయన వివరించారు. అలాగే దీనికోసం 130 అదనపు కోచ్‌లను ఆయా రైళ్లకు కలిపామని చెప్పారు. సాధారణంగా పండగల సీజన్లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 30 నుంచి 40 శాతం అదనంగా పెరుగుతుందని శర్మ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 30 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు. ఛత్‌పూజను బీహార్ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. -
సమైక్య దండుగా..సంగ్రామానికి..
‘బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి..’ అన్న మాటలు వారి గుండెల నిండా విశ్వాసాన్ని నింపాయి. చేయీచేయీ కలిపి.. ‘సమైక్య దండు’గా ఐక్యమై హస్తినపై సమరానికి కదిలారు. అటు శ్రీకాకుళం నుంచి.. ఇటు రాజమహేంద్రి వరకూ వేల గొంతుల్ని ఒక్కటి చేసి.. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ ధ్యేయమంటూ నినదించారు. ఢిల్లీ గద్దెపై ఏలుబడి సాగిస్తూ.. తెలుగుతల్లిని ముక్కచెక్కలు చేసేందుకు పరమ తెంపరితనంతో యత్నిస్తున్న కాంగ్రెస్ ‘పెద్దల’కు తెలుగోడి సత్తాను రుచి చూపుతామంటూ ప్రతినబూనిన సమైక్యవాదులు ప్రత్యేక రైళ్లలో కురుక్షేత్రం దిశగా సాగారు. తమ అభిప్రాయాన్ని మన్నించకుంటే మహాసంగ్రామం తప్పదంటూ హెచ్చరించారు. సాక్షి, రాజమండ్రి :‘సోనియమ్మా.. తెలుగువారిని ముక్కలుచెక్కలు చేసే అధికారం నీకెవరిచ్చారో ఢిల్లీలోనే తేల్చుకుందాంరూ. అని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తిన దిశగా కదిలాయి. రాజ్యాంగ నిబంధనలను తోసిరాజని.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును అప్రజాస్వామికంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద సమైక్య ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాజమండ్రి వరకూ నాలుగు జిల్లాల కార్యకర్తలు, నేతలు ప్రత్యేక రైలులో శనివారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ రైలు రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. మొక్కవోని దీక్షతో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్య పోరాటంలో పాలుపంచుకునేందుకు రైలులో వెళ్తున్న సమరయోధులకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అదే సమయంలో మాజీ మంత్రి, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అంతటా ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ‘మేం ఇక్కడ ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదు. అసలు రాష్ట్రానికి సంబంధం లేనివారు దీనిని ముక్కలు చేస్తున్నారు. తెలంగాణలో ఎవరికో అధికారం కట్టబెట్టాలని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చుకోవాలని ఒక రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది యూపీఏ ప్రభుత్వం’ అని ఈ సందర్భంగా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు మాగోడు పట్టకపోతే మేమే ఢిల్లీ వచ్చి మావాణి ఎంత బలమైనదో వినిపిస్తాం. మీ దాష్టీకాన్ని అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఇతర నేతలు ఆదిరెడ్డి వాసు, ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. 22 బోగీల్లోని 2,200 మందికి వీటిని పంపిణీ చేసినట్టు ఆదిరెడ్డి అప్పారావు హైదరాబాద్ నుంచి ఫోన్లో తెలిపారు. కాకినాడ నుంచి ఏపీఎన్జీవోలు పయనం కాకినాడ సిటీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీఎన్జీవోలు శనివారం మధ్యాహ్నం కాకినాడ నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. కాకినాడ నుంచి 18 బోగీలతో ఈ రైలు బయలుదేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధ్ల నాయకత్వంలో వివిధ శాఖల ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఆశీర్వాదం మాట్లాడుతూ స్లీపర్ బోగీలకు సొమ్ము చెల్లించినప్పటికీ జనరల్ బోగీలు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చలో ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెనకడుగు వేసేది లేదని ఢిల్లీలో సమైక్యాంధ్ర సత్తా చాటుతామని చెప్పారు. -
చలో ఢిల్లీ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమవారం నాడు ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వెళ్తున్న ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సమీపంలో కొంతమంది దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. దాంతో కొన్ని బోగీల అద్దాలు పగిలిపోయాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఈ రైలునే లక్ష్యంగా కొంతమంది దుండగులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. కేవలం సమైక్య నినాదాలతోనే తాము వెళ్తున్నామని, తమను తాము రక్షించుకోడానికి కూడా ఎలాంటి అవకాశం లేదని శ్రీనివాస్ అనే ప్రత్యక్ష సాక్షి ఫోన్ ద్వారా తెలిపారు. -
షిర్డీకి ప్రత్యేక రైలు
సాక్షి, గుంటూరు: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. డిసెంబరు 5వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నాగర్సోల్ వరకు ప్రత్యేక వీక్లీ స్పెషల్ ట్రైన్ నడవనుంది. వారంలో రెండు రోజుల పాటు ఈ రైలు గుంటూరు, నల్లగొండ జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూలును బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లేందుకు విజయవాడ, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లే మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు అధిక మొత్తంలో చార్జీలు కూడా అవుతున్నాయి. నల్లగొండ జిల్లా భక్తులు కూడా విధిగా సికింద్రాబాద్ వెళ్లి రెలైక్కాల్సి వ స్తోంది. దీనికితోడు గుంటూరు డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి షిర్డీకి రైలు నడపండని రైల్వే అధికారులను కోరుతున్నారు. ఎట్టకేలకు అధికారులు డిసెంబరు 5 నుంచి న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ మీదుగా నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. గుం టూరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సీ రామకృష్ణ షిర్డీ రైలు ప్రారంభాన్ని బుధవారం సాయంత్రం ధ్రువీకరించారు. డిసెం బరు 5 నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వరకూ ట్రైన్ నెంబరు 17231 నడుస్తుంది. అదేవిధంగా నాగర్సోల్ నుంచి నర్సాపూర్‌కు శుక్ర, సోమవారాల్లో (17232) ఈ బండి నడుస్తుంది. షిర్డీ రైలు షెడ్యూలు ఇలా... గురువారం ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరే 17231 ట్రైన్ అదేరోజు మధ్యాహ్నం 2.55 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుతుంది. ఐదు నిమిషాల విరామం తరువాత ఇక్కడి నుంచి బయల్దేరి 3.40 గంటలకు సత్తెనపల్లి, 4.15 గంటలకు పిడుగురాళ్ల, 4. 36 గంటలకు నడికుడి, సాయంత్రం 6 గంటలకు నల్లగొండ చేరుతుంది. రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకునే షిర్డీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి నాగర్సోల్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాగర్సోల్ చేరుతుంది. శుక్ర, సోమవారాల్లో ఉదయం 11.15 గంటలకు నాగర్సోల్ నుంచి బయలుదేరే 17232 ఎక్స్‌ప్రెస్ ఔరంగాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్‌ల మీదుగా రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 2014 ఫిబ్రవరి 7వ తేదీ తరువాత నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్లే రైలు శుక్ర, ఆదివారాల్లోనూ, నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే రైలు అదేనెల 8 తరువాత శని, సోమవారాల్లోనూ నడుస్తాయని గుంటూరు సీనియర్ డీసీఎం రామకృష్ణ వివరించారు. 21 బోగీలతో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో 10 కోచ్‌లు సెకండ్‌క్లాస్ స్లీపర్, టూ టైర్, త్రీ టైర్ ఏసీ కోచ్‌లు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. త్వరలో అడ్వాన్సు రిజర్వేషన్ వివరాలను వెల్లడిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. -
కదులుతున్న ‘సమైక్య’దండు
=సమైక్య శంఖారావానికి సిద్ధమైన సమైక్యవాదులు =అన్ని సంఘాల నుంచి సర్వత్రా మద్దతు =పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు =భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి 55 బస్సులు =చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిల నేతృత్యంలో మరో రైలు తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లా నుంచి శుక్రవారం అన్ని దారులూ హైదరాబాద్ వైపే మళ్లనున్నాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దయెత్తున వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోవడానికి ఏ ర్పాట్లు చేసుకున్నారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మినీ, ఐదు ఓల్వో బస్సు లు బయలుదేరనున్నాయి. కొంతమంది రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు. మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి ఆధ్వర్యం లో చిత్తూరు నుంచి శుక్రవారం సాయంత్రం 4.30 గం టలకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఇది 5.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక్కడున్న వారిని ఎక్కించుకుని హైదరాబాదుకు వెళుతుంది. పీలేరు నుంచి పది బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ చంద్రగిరి, శ్రీకాళహస్తి ని యోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు చంద్రగిరి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి రాత్రి 8గంటలకు చేరుకుంటుంది. శ్రీకాళహస్తి నుంచి ఆరు ప్రత్యేక రైలు బోగీలను ఏర్పాటు చేశారు. పలమనేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆ ద్వర్యంలో వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నుంచి వెళ్లే రైళ్లు శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయానికి తిరిగి చేరుకుంటాయి. హాజరుకానున్న వివిధ సంఘాల నేతలు పార్టీ శ్రేణులతోపాటు జిల్లాకు చెందిన వివిధ సంఘాల నేతలు, సభ్యులు సమైక్య శంఖారావానికి హాజరుకానున్నారు. తిరుపతి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, టీటీడీ యూనియన్ నాయకులు, ఎస్వీ యూనివర్సిటీకి చెందిన వెయ్యి మంది విద్యార్థులు బయలుదేరుతున్నారు. చిత్తూరు నుంచి ఎన్జీవో నాయకులు, విద్యార్థులు వెళుతున్నారు. పలమనేరు జేఏసీ నాయకులు చిత్తూరు నుంచి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్ చేయించుకున్నారు. కొన్ని ప్రయివేటు బస్సులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో మండలానికి రెండు వందల మంది చొప్పున వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. సత్యవేడు ప్రాంతానికి చెందిన జేఏసీ నాయకులు జిల్లాలో బస్సులు దొరక్క తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు.