భోపాల్‌ ఇస్తెమాకు ప్రత్యేక రైలు | special train to bhopal istema | Sakshi
Sakshi News home page

భోపాల్‌ ఇస్తెమాకు ప్రత్యేక రైలు

Published Wed, May 24 2017 11:43 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

భోపాల్‌ ఇస్తెమాకు ప్రత్యేక రైలు - Sakshi

భోపాల్‌ ఇస్తెమాకు ప్రత్యేక రైలు

– ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): భోపాల్‌లో నిర్వహించే జాతీయస్థాయి ఇస్తెమాకు కర్నూలు నుంచి ప్రత్యేక రైలు నడుపుతామని రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ఏడాది నవంబరు 25, 26, 27 తేదీల్లో  ఇస్తెమా నిర్వహించనున్నారని తనకు తెలిసిందన్నారు. జిల్లాకు చెందిన ముస్లింలు వేల సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో బుధవారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎంను కలిసి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. జీఎం సానుకూలంగా స్పందించారని.. నవంబరు 23న రాత్రి కర్నూలు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అలాగే  27వ తేదీ భోపాల్‌ నుంచి తిరిగి ప్రయాణమవుతుందని చెప్పారు. బుధవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement