Butta Renukha
-
బుట్టా రేణుకకు చేదు అనుభవం
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలనకు వచ్చిన బుట్టా రేణుకను గ్రామస్తులు అడ్డుకున్నారు. తక్షణమే క్వారీని సీజ్ చేసి తమకు ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్వారీ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను స్వరాష్ట్రానికి పంపించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు. అయితే వీరిని అంబులెన్స్‌లో తరలించడానికి కుదరదంటున్నారు అంబులెన్స్ సిబ్బంది. మృతదేహాలను హైదరాబాద్ వరకు మాత్రమే తీసుకెళ్తామంటున్నారు. మార్చురీ ఫ్రీజర్లలో ఉంచిన పది మృతదేహాల్లో కేవలం నాలుగింటిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలిన వారి వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. -
బుట్టాకు ఆహ్వానం.. విజయసాయి ఫైర్
సాక్షి, ఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరును వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆహ్వానించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బుట్టా రేణుకను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండా బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీపై అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ను నిలదీశారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు.. లోకేష్‌కు కనీసం తెలుగు రాదని ఎద్దేవా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వాదనకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అమ్ముడుపోయిన ఎంపీని ఏ అధికారంతో పిలిచారని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం నిబంధనలకు విరుద్ధమని, నీతి బాహ్యమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుక అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. బుట్టారేణుక నేమ్ ప్లేట్ తీసేస్తారా.. సమావేశాన్ని బాయ్‌కాట్ చేయలా అని వైఎస్సార్సీపీ ఎంపీ పేర్కొన్నారు. విధిలేక సమావేశంలో బుట్టా రేణుక నేమ్ ప్లేట్ తొలగించినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ-టీడీపీ కలిసి ఈ పని చేశాయని ఆయన విమర్శించారు. ఈ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ మోదీ ఉన్నప్పుడే మాట్లాడానన్నారు. ‘విభజన హామీలు అమలు చేయాలి. అఖిలపక్ష సమావేశంలో నాలుగు అంశాలు మాట్లాడాను. సీఎం రమేష్‌కు తెలుగు రాదు.. ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత టీడీపీది. విభజన అంశాలు ప్రస్తావిస్తే ప్రధాని స్పందించలేదు. విశాఖ-చెన్నై కారిడార్ పూర్తి అయినట్లు టీడీపీ చెబుతోంది. ఎక్కడ పూర్తి అయిందో నాకు మాత్రం కనిపంచలేదు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. మహిళల రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టం చేయాలి. ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. బుట్టా రేణుక విషయాన్ని నేరుగా ప్రధానికి చెప్పాను. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలను టీడీపీ ఎంపీలు గాలికొదిలేశారు. సీఎం రమేష్ లాంటి వాళ్లను పార్లమెంట్‌కు పంపిస్తే ఏంచేస్తారు? సభా సజావుగా సాగాలనే ఉద్దేశం టీడీపీ ఎంపీలకు లేదు. ప్రజల ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు కాపాడలేరు. హోదా సాధించాలన్న తపన టీడీపీ ఎంపీలకు ఏ మాత్రం లేదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఏపీకి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. హోదా పోరాటాన్ని కొనసాగిస్తాం. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, తెలుగు దొంగల పార్టీ ఎంపీలందరూ కలిసి దాదాపు 26 మంది ఉన్నారు. ఈ దొంగలు విపక్షాలను కలుస్తున్నారు. వాళ్లేం చేస్తారో పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తోంది. ఇది టీడీపీ- బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని’ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. -
ఇది టీడీపీ-బీజేపీ కలిసి అడుతున్న నాటకమే
-
ఎంపీ బుట్టా రేణుక ఇల్లు ముట్టడి
కర్నూలు(అర్బన్): ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడిచిందని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇంటిని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్‌కుమార్, బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, పీడీఎస్యు నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు జీఓనెం.550ని అమలు చేయకపోవడంతో 496 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారన్నారు. ఈ జాబితాలో అనర్హులైన అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించారని, ఈ ప్రవేశాలకు సంబంధించి రూ.500 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్ విద్యార్థులను తీసుకోవాలని కనీస పరిజ్ఞానం కూడా అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడక పోవడం దురదృష్టకరమన్నారు. జీఓ నెం.550 ప్రకారం రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ బుట్టా రేణుక విద్యార్థి సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నాని, రంగస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
బుట్టా రేణుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో
పెరవలి (మద్దికెర) : బుట్టా రేణుక తిన్నింటి వాసాలు లెక్కగట్టే రకమని వైస్సార్సీపీ నాయకులు, బసినేపల్లి నీటి సంఘం మాజీ అధ్యక్షడు భద్రయ్య, మాజీ సర్పంచ్ ప్రతాప్ విమర్శించారు. శనివారం వారు మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటున్న బుట్టా రేణకకు జగన్మోహన్రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే స్వార్థం కోసం పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీ పంచన చేరారని ఆరోపిస్తున్న రేణక.. ఏమి ఆశించి టీడీపీలో చేరారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విమర్శలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు చౌడప్ప, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
బుట్టా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆదోని టౌన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక...మా ఎంపీలను విమర్శించడం హేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవనకొండ మండలంలో గురువారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో వైఎస్ఆర్ ఎంపీలపై బుట్టా చేసిన విమర్శలపై శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు... ఆమరణ దీక్షలపై బుట్టా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. హోదా, డబ్బుకోసం పార్టీ ఫిరాయించిన మీకు రాజకీయ విలువలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులోఉంచుకోవాని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న తీరును ఓర్వలేక విమర్శలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్‌మండల అధ్యక్షుడు కల్లుపోతుల సురేష్, మహిళౠ విభాగం నాయకురాలు శ్రీలత, కౌన్సిలర్ సుధాకర్, నాయకులు రామలింగేశ్వర యాదవ్, నజీంవలి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బాబ్బాబు.. మాతో రండి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తన వెంట టీడీపీలో ఎవ్వరూ చేరలేదన్న అపప్రదతో ఇప్పుడు కొద్ది మంది నేతలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కొద్ది మంది ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని అభ్యర్థిస్తున్నట్టు సమాచారం. సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఇలా ఆ పదవిలోకి వచ్చేందుకు ఎంత ఖర్చు చేశారని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం తాము ఇస్తామని, టీడీపీలో చేరాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తద్వారా తనతో పాటు పలువురిని అధికార పార్టీలో చేర్పించినట్టు ప్రకటించుకోవడంతో పాటు తన వెంట కొద్ది మంది ప్రజా ప్రతినిధులు కూడా వచ్చారని చెప్పుకునేందుకు ఉపయోగపడుతుందనేది ఎంపీ వర్గీయుల ఆలోచనగా ఉంది. అయితే, ఇదేమీ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎవ్వరూ రాలేదా! వాస్తవానికి ఎంపీ బుట్టా రేణుక గెలిచిన మూడు రోజులకే ఆమె భర్త నీలకంఠం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడి, ప్రశ్నల పరంపరతో బుట్టా రేణుక అప్పట్లో పార్టీ మారలేదు. తాను వైఎస్సార్సీపీని వీడనని కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. చివరకు అధికార పార్టీ నుంచి వచ్చిన ఆఫర్లతో ఆమె ఇటీవల పార్టీ మారారు. ఆమెతో పాటు పలువురు టీడీపీలో చేరుతున్నట్టు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కండువాలు కూడా కప్పించారు. అయితే..వారిలో అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న వారు కొందరు కాగా.. మరొకరు ఏకంగా ఎంపీ కార్యాలయ ఉద్యోగి కావడం గమనార్హం. దీనిపై విమర్శలు రావడంతో పాటు ఎంపీ మినహా పార్టీ ఎవ్వరూ మారలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. సీఎంకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరువు నిలబెట్టుకునేందుకు కొద్ది మంది ప్రజా ప్రతినిధులను టీడీపీలో చేర్పించేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఎంత ఖర్చు అయ్యిందో అంత మొత్తం తాము ఇస్తామని అంటుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎంపీ పార్టీ మారినందుకు వచ్చిన మొత్తంలో నుంచి కొంత ఈ విధంగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘టీడీపీలో చేరలేదు.. మద్దతే ఇస్తున్నా’
సాక్షి, అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని, మద్దతు మాత్రమే ఇస్తున్నానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును ఆమె మంగళవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను వైఎస్సార్సీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని, తన భర్త వైఎస్సార్సీపీతో విభేదించినా.. తాను మనస్ఫూర్తిగానే పార్టీకోసం పనిచేశానని చెప్పారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో విశ్లేషించేంత అనుభవం తనకు లేదని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంపై అందరికీ స్పష్టత ఇవ్వడానికే బహిరంగంగా వచ్చి బాబుకు మద్దతు తెలిపానని రేణుక చెప్పారు. కాగా, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులవుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇంకా కొంతమంది త్వరలో టీడీపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. -
ప్రజా సంక్షేమానికి నవరత్నాలు
– ఇంటింటికి వెళ్లి ప్రజల్ని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చేయాలి – కర్నూలు నియోజకవర్గ నవరత్నాల సభలో ఎంపీ బుట్టా రేణుక – ఇద్దరు టీడీపీ నాయకులు పార్టీలో చేరిక కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజాసంక్షేమం కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను తీసుకొస్తున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక చెప్పారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి వాటి గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన నవరత్నాల సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ బుట్టా రేణుక అతిథిగా హాజరై ప్రసంగించారు. నవరత్నాల గురించి బూత్ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఎక్కడ నీరు ఉంటే అక్కడే అభివృద్ధి.. నీరు ఎక్కడ పుష్కలంగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని ఎంపీ అన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞనం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే, ఆయన అకాల మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తారని చెప్పారు. రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు పార్టీశ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సైనికులు కాదు..యోధులు: హఫీజ్‌ఖాన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సైనికులు కాదు యోధులని, వారి పోరాటాలే పార్టీకి కొండంత బలమని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. నంద్యాలలో అధికార పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు..బెదిరింపులకు గురిచేసి గెలిచారన్నారు. వాస్తవంగా నైతిక గెలుపు తమదేనని చెప్పారు. జగనన్న ప్రవేశపెట్టిన తొమ్మిది రకాల పథకాల గురించి ప్రజలకు తెలియజేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. టీడీపీలో రౌడీషీటర్లు ఉన్నారని సామాన్యుడు తిరగబడితే వారు కొట్టుకుపోతారని చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించడంలో, దోమల నివారణ చర్యలు చేపట్టడంలో నగర పాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ఎంపీ నిధుల నుంచి నగరంలో బోర్లు వేయించి నీటి ఎద్దడి నుంచి ఉపశమనం కలిగించాలని హఫీజ్ ఖాన్ ఎంపీని కోరారు. అంతకుముందు తెర్నేకల్ సురేందర్‌రెడ్డితో పాటు మైనారిటీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, మద్దయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయకుమారి, సలోమి మాట్లాడారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, వివిధ శ్రేణుల పార్టీ నాయకులు డి.కె.రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, సాంబశివారెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జగన్‌రెడ్డి, జాన్, ధనుంజయాచారి, మహమ్మద్ తౌఫిక్, పేలాల రాఘవేంద్ర, సఫియా ఖాతూన్, వాహిద తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన టీడీపీ నాయకులు.. టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డితో పాటు మహిళా నాయకురాలు జమీలా ఎంపీ బుట్టా రేణుక, హఫీజ్ఖాన్ల సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
– కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక - ఘనంగా ఒలింపిక్ డే – ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో ప్రజాప్రతినిధుల రన్ – భారీగా తరలి వచ్చిన విద్యార్థులు, క్రీడాకారులు – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు (టౌన్): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టారేణుక క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఒలింపిక్ డేను పురస్కరించుకొని శుక్రవారం కర్నూలు నగరంలో ఔట్డోర్స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ఒలింపిక్ సంఘం రాష్ట్ర చైర్మన్ కె.యి. ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి ఏడాది ఒలింపిక్ డే నిర్వహిస్తున్నారన్నారు. నగరంలో ఇంతపెద్ద ఎత్తున రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణిస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికీ లేని గుర్తింపు క్రీడాకారులకే ఉందన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీజీవీ సంస్థల అధినేత టీజీ భరత్ మాట్లాడుతూ క్రీడారంగానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆధునిక ఒలింపిక్ జ్యోతులకు అయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మన్ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఒలింపిక్ డే వేడుకల్లో పాలొ్గని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ సీబీ హరినాథ్‌రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మల్లికార్జున పాల్గొన్నారు. ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో రన్ ఒలింపిక్డేను పురస్కరించుకొని నగరంలోని ఐదు ముఖ్య కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థినీ, విద్యార్థులు భారీ రన్ నిర్వహించారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నుంచి టీజీ భరత్, సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, మల్లికార్జున, చెన్నమ్మ సర్కిల్ నుంచి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, పాత బస్తీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మెన్ కేఈ ప్రభాకర్, కార్యదర్శి పురుషోత్తం, ఏపీఎస్పీ పోలీసు పటాలం నుంచి కమాండెంట్ శామ్యూల్‌జాన్, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి క్రీడా జ్యోతులను వెలిగించి జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఐదు కూడళ్ల నుంచి స్థానిక రాజ్‌విహార్ సెంటర్‌కు వెళ్లి అక్కడి నుంచి స్టేడియానికి చేరుకున్నారు. విజేతలకు బహుమతులు ఒలింపిక్ డే రన్‌ను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు, మెడల్స్‌ను అందించారు. అంతర్జాతీయ క్రీడాకారులైన డేవిడ్ (సాఫ్ట్‌బాల్), జాఫ్రిన్ (టెని్నస్), లావణ్య (వాలీబాల్)ను కమిటీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌తో పాటు అతిథులు ఘనంగా సన్మానించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఒలింపిక్ డే రన్‌ను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని అలరించాయి. శ్రీలక్ష్మి, మాంటిస్సోరి, ఇండస్ పాఠశాలల విద్యార్థులు, సైక్లోన్ డ్యాన్స్ అకాడమి నృత్యకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కమిటీ సభ్యులు రవూఫ్, విజయ్‌కుమార్, రామాంజనేయులు, శ్రీనివాసులు, కబడ్డీ సంఘం కార్యదర్శి రాజశేఖర్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి హర్షవర్దన్, స్కేటింగ్ సంఘం కార్యదర్శి సునీల్‌కుమార్, త్రోబాల్ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్, పీఈటీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్, జాకీర్, సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి గంగాధర్, వెయిట్‌లిఫ్టింగ్ కార్యదర్శి పాపా పాల్గొన్నారు. -
పేదలకు సేవ చేయడం అదృష్టం
– పుట్టిన రోజు వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక – పేద మహిళలకు చీరల పంపిణీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పేదలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. బుధవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ బుట్టా రేణుక..జన్మదిన వేడుకలను యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రాజవిష్ణువర్దన్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై..ఎంపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుట్టా రేణుక.. ముఖ్యఅతిథుల సమక్షంలో భర్త నీలకంఠం, కుమారుడు అమోగ్లతో కలసి 46 కేజీల కేకును కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తరువాత వందమంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నాని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్‌తో పలు గ్రామాల్లో మంచినీటి పథకాలు, రోడ్లు, మురుగు కాలువలను నిర్మించినట్లు వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లీగల్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు కర్నాటి పుల్లారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, నాయకులు కటారి సురేష్, సాంబ, పర్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్కరూ సంతోషంగా లేరు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో కొన్ని కోట్లు వెచ్చిస్తే పూర్తయ్యే చిన్న చిన్న పనులు కూడా పూర్తి కావడంలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పూర్తి చేసిన పనులు కూడా గత మూడేళ్లుగా అలాగే ఉన్నాయన్నారు. సాగునీటి, తాగునీటి రిజర్వాయర్ల తుది నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజలకు చేరాల్సిన పథకాలు వారికి అందడం లేదని, ఎన్నోసార్లు బాబుకు పిటిషన్లు పెట్టినా పరిష్కరించడం మాటేమో గానీ, కనీసం పిటిషన్ తమవద్దకు చేరిందన్న అక్నాలెడ్జ్మెంట్ కూడా తిరిగి పంపలేదని విమర్శించారు. ఒక పార్టీ వారిని కోట్లు పెట్టి కొనేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజకీయ నేతలు చేసే వ్యాపారాలపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టే అలవాటు ప్రభుత్వాలకు ఉందంటున్న బుట్టా రేణుక అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా వచ్చింది? నా భర్త ప్రోత్సాహమే కారణం. ఆయన, మా సోదరుడు యుగేందర్ కూడా నన్ను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. విద్యతో పాటు రిటైల్, ఆటోమొబైల్ బిజినెస్‌లో ఉన్నాం. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాలపై అంత ఆసక్తి చూపేవాళ్లం కాదు. వైఎస్ జగన్ అన్న కొత్తగా అభ్యర్థుల కోసం చూస్తున్న సమయంలో కొంతమంది రాజకీయ స్నేహితుల వల్ల పరిచయాలు పెరిగాయి. నా భర్తకు ఆఫర్ వచ్చింది. రాజకీయాల్లోకి నాకంటే నీవే ఉత్తమం అని చెప్పి నా భర్త నన్ను ప్రోత్సహించారు. అంతకుముందు పూర్తిగా విద్యపైనే దృష్టి పెట్టాను. ఎంపీగా ఎన్నికైన వెంటనే కాస్త గడబిడి అయినట్లుంది కదా? అది అనుకోకుండా జరిగిన సందర్భం. ఎస్పీవైరెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన పార్టీ మారి టీడీపీలో చేరిన సమయంలో నా భర్త అక్కడే ఉన్నారు. ఆ క్షణంలో అలా జరిగింది. నేను వెళ్లలేదు. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. నేను వైఎస్సార్ సీపీలో ఉన్నాను. మా ఆయన టీడీపీలో ఉండటం అసంభవం. ఆయన గైడెన్స్ నాకు అవసరం కదా. ఆయనకు బాబుతో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇక్కడ, మీవారు టీడీపీలో ఉంటే సేఫ్ గేమ్ ఆడొచ్చుకదా..? లేదండి. అంత గేమ్స్ ఆడే స్థాయికి నేనింకా ఎదగలేదు (నవ్వుతూ), నా భర్త గైడెన్స్ వల్లే నియోజకవర్గంలో ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. నియోజకవర్గంలో ఇలా తిరగాలి, ప్రజలను ఇలా చేరాలి, వారి పనులు ఏవిధంగా చేయాలి. ఎలాంటి మేలు చేయాలి అనే అంశాల పట్ల ఆయన నాకు వెనుక నుంచి మార్గనిర్దేశనం చేస్తుంటారు. చాలాసార్లు ఆయన పార్టీ మీటింగులకు వస్తూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ మారమని మీపై ఒత్తిడి చేయలేదా? లేదండి. పార్టీనుంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తీసుకోవడం అనేది రాజ్యాంగబద్ధం కాదు. చట్టబద్ధం కాదు. ఒక పార్టీ నుంచి ఎన్నికయినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. ప్రజలకు అలా సందేశం కూడా ఇవ్వాలి. మనలో మారాలనే సంసిద్ధతను బట్టి అవతలివాళ్లు ఆఫర్లు చేస్తారు. మీకలాంటి ఆఫర్లు పంపలేదా? ప్రలోభాల వల్లే మీ జిల్లాలో 5 గురు పార్టీ మారారా? నా నియోజకవర్గం విషయం చూస్తే మావాళ్లపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఏ పనులూ జరగలేదు. ప్రత్యేకించి ఎమ్మెల్యే స్థాయిలో మా పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టడం, కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం.. ఇలాంటివి కొన్ని నా నోటీసుకు వచ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోవడం ఎమ్మెల్యేలకు కొంచె కష్టం. చంద్రబాబు పాలన ఎలా ఉందనుకుంటున్నారు? కచ్చితంగా ప్రజలు సంతోషంగా లేరు. పథకాలు తీసుకోండి. చేసిన వాగ్దానాలు తీసుకోండి.. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. నిజం చెప్పాలంటే నా నియోజకవర్గం వరకు చూస్తే ఎలాంటి అభివృద్ధీ కనిపించడం లేదు. నా నియోజకవర్గంలో ఒక చిన్న ప్రాజెక్టు.. రిజర్వాయర్ ఉంది. దానికి 20 కోట్లు ఖర్చుపెడితే చాలు వస్తుంది. సాగునీరు, మంచినీరు సమస్యలు తీరిపోతాయి. 20 కోట్లు అనేది ప్రభుత్వానికి చాలా తక్కువ మొత్తం. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేడు పూర్తి కాని పరిస్థితులే ఉన్నాయి. రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారు. వాటికి కూడా 25 లేక 30 కోట్లు ఖర్చుపెడితే అవి వినియోగంలోకి వస్తాయి. పార్టీ మారితే 40 కోట్లు ఇస్తున్నారు.. అంత ఖర్చుపెట్టావు. నీకేం మిగిలింది, ఏం సాధించావు అని మీ పిల్లలు మిమ్మల్ని అడగరా? లేదండి. పార్టీ మారినవారికి, పార్టీలోనే ఉన్నవారికి ప్రజల్లో ఉన్న గౌరవం, వ్యత్యాసం చూస్తే అసలు ఆ ఆలోచనే రాదు. పైగా వ్యాపార నేపథ్యం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాల్లో పార్టీలు మారడం కంటే బిజినెస్ చేసుకుంటే ఇంకా ఉత్తమం అనే ఎరుకతో ఉన్నాం. రాజకీయాల్లో కంటే బిజినెస్‌లో గౌరవప్రదమైన సంపాదన ఉంటుంది. అందుకే రాజకీయాలను బిజినెస్ చేయకూడదు. జగన్ నాయకత్వంపై మీ అభిప్రాయం? అన్నను చాలాసార్లు కలిశాను. ఎంతో సహృదయం ప్రదర్శించారు. మంచి వ్యక్తి, సమస్యలు వచ్చినప్పడు కూడా చక్కటి సలహాలు ఇస్తారు. నా విషయానికి వస్తే, ‘కొంచెం బలంగా ఉండాలమ్మా, ఇంకా గట్టిగా ఉండాలి’ అని చెబుతారు. అంటే వాయిస్‌ని కొంచెం పెంచాలి అని సూచిస్తారు. తప్పకుండా పికప్ అవుతానన్నా అంటాను. కొంచెం కొంచెంగా మార్పు వస్తోంది. విమర్శించడం నా స్వభావం కాదని కూడా అన్నతో చెప్పాను. నేనే నేరుగా చెప్పిన తర్వాత అన్న ఎందుకు ఫోర్స్ చేస్తారు? ఈ మూడేళ్లలో అన్న నన్ను చక్కగా అర్థం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ వస్తుందా? అన్న పిలిచి చెప్పేంతవరకు నేను ఎవరి మాటా నమ్మను. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పుకార్లు ఉన్నాయి. కానీ మా అధినేత ఈ విషయంపై ఏదీ చెప్పనప్పుడు నేనెందుకు బాధపడాలి? ఇప్పటికైతే నా ఆసక్తి ఎంపీగా కావాలనే. రేపు ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. నా ఆసక్తి, పార్టీ ఆసక్తి రెండింటిపైనే నేనేమిటి అనేది ఆధారపడి ఉంటుంది. జగనన్న ఇప్పటివరకు నా విషయంలో హ్యాపీగానే ఉన్నారు. జగన్ సీనియర్లను కూడా లెక్కచేయరని అధికార పార్టీ నేతల విమర్శ? నాకు తెలిసినంతవరకు అన్న అందరినీ గౌరవిస్తుంటారు. నా మూడేళ్ల అనుభవంలో తను మంచి వ్యక్తిగానే కనిపించారు. చిన్నవాళ్లం, తానూ మేమూ సేమ్ బ్యాచ్. మాకే అంత గౌరవం ఇస్తున్నప్పుడు పెద్దవారికి గౌరవం ఇవ్వరా? తనకంటే పెద్దవారైన నేతలకు అన్న ఎలాంటి గౌరవం ఇస్తారో కళ్లారా చూశాను కూడా. వైఎస్ రాజశేఖరరెడ్డిపై మీ అభిప్రాయం? నిజం చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆయనను నేను వ్యక్తిగతంగా కలవలేదు. చూడలేదు. ఆయనని కలవకున్నా, ఇంటరాక్ట్ కాకున్నా, ప్రజలద్వారా నాకు తనపై మంచి అభిప్రాయం కలిగింది. రియల్లీ గ్రేట్ లీడర్. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆయన పేరు చెపితేనే వారి ముఖాల్లో అంత సంతోషం కనబడుతుంది. ఒక నాయకుడు ప్రజల్లో అంత మంచి గౌరవాన్ని పొందడం నిజంగా గొప్ప విషయం. మరి మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? మొత్తంమీద మా పార్టీ పరిస్థితి అన్ని ప్రాంతాల్లోనూ బాగానే ఉంది. 2014లో అతి తక్కువ మెజారిటీ ఓట్లతో మేం దెబ్బ తినడం విచారకరం. ఇప్పుడయితే ప్రజల్లో మాకు చాలా మంచి గుర్తింపు ఉంది. మంచి మంచి నేతలు మా పార్టీలోకి రావటం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మా పార్టీపై మాకు ఎంతో నమ్మకం ఉందండి. 2019లో తప్పకుండా మేం అధికారంలోకి వస్తాం. ప్రజల్లో కూడా ఆ నమ్మకాన్నే ఇస్తున్నాం. మేం గెలుస్తాం, పనులు చేయగలుగుతాం అని నమ్మకంగా చెబుతున్నాం. (బుట్టా రేణుకతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/QoF28k https://goo.gl/uJJzMN -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి
– ఎంపీ బుట్టా రేణుకను కలిసిన ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి ప్రతినిధులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి జిల్లా శాఖ నాయకులు ఎంపీ బుట్టారేణుకను కోరారు. సోమవారం వారు ఎంపీని జోహరాపురంలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకు వ్యాపార, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలు ఉన్నారని, వారికి కారొ్పరేషన్ ఉంటే మేలు జరుగుతుందన్నారు. దీనిపై ఎంపీ బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీని వారు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విఠల్‌శెట్టి, ప్రతినిధులు నాగేళ్ల రాజగోపాల్, గూడూరుగోపాల్, విజయ్, భాస్కర్, శేషగిరిశెట్టి, కె.కిరణ్, కె.నవీన్, కె.కిశోర్, పి.సుధాకర్, వి.హరి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జ్ఙానేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం
– జగనన్న పాలనలో చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం – రాయితీతో రేషన్ సరఫరా, కొత్త మగ్గాలు మంజూరు – ఎంపీ బుట్టా రేణుక ఆదోని టౌన్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని, జగనన్న పాలనలో చేనేత రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్ల ఇంటి స్థలం, పక్కా గృహం, రాయితీతో రేషన్, కొత్త మగ్గాలు అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్యర్యంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస యోజన కింద శిక్షణ పొందిన 200 మంది చేనేత కార్మికులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం పొందే అవకాశం ఉందన్నారు. పింఛన్లు రాని వారి జాబితాను ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని తెలిపారు. చేనేతలకు వైద్య చికిత్స శిబిరం, ఐడీ కార్డులు మంజూరు చేయిస్తామన్నారు. ఆదోని ఒకటి, కోడుమూరులో 2, ఎమ్మిగనూరులో 3 క్లస్టర్ల ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. క్లస్టర్ ద్వారా చేనేతల అభివృద్ధికి కేంద్రం 1.7 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. మగ్గాల నేసేందుకు వర్కుషెడ్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. టెక్స్టైల్, అపెరల్ పార్కు ఏర్పాటుతో చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్ జిల్లాలోని ముస్లింలు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేల సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం వినతిమేరకు ముస్లింల పుణ్యక్షేత్రమైన పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్ రైలును స్టాపింగ్ చేయించామని ఎంపీ తెలిపారు. కోడుమూరులో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.56 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ పోస్టుల భర్తీ, వసతులు కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఆదోని రైల్వేస్టేషన్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఎన్టీసీ మిల్లు పున:ప్రారంభానికి కృషి చేస్తానన్నారు. పెనుకొండలో కేకే ఎక్స్‌ప్రెస్ ఆగేలా చేయడం ముస్లింలకు శుభవార్త అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
రక్షణ కల్పించండి
– ‘కేవీఆర్’ ప్రహరీ కోసం పోరాడినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుల దాడి – జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు ఎంపీ బుట్టా, హఫీజ్‌ఖాన్ వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు విన్నవించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీని కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జీ హాఫీజ్ఖాన్తో కలసి బెదిరింపు కాల్స్ వివరాలు, తాజాగా అశోక్‌పై జరిగిన దాడిని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కర్నూలులోని కేవీఆర్ కళాశాల ఆట స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పట్టుబడితే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలతో కలసి పోరాటం చేశారన్నారు. దాదాపు 2500 మంది బాలికలు చదువుకునే కళాశాల ఆటస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డి అక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టడం లేదని, హ్రహరీని నిర్మించి బాలికలకు రక్షణ కల్పిస్తామని తనకు హామీ ఇచ్చారన్నారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు దీన్ని ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఎలాగైనా అక్కడ షాపింగ్ కాంప్లెక్ కట్టి లక్షలాది రూపాయలను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ‘కేవీఆర్’ వ్యవహారాన్ని ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేసిన అశోక్ అనే కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుడు షరీఫ్ ప్రోద్భదలంతో చిన్నా, అతని స్నేహితులు నగరంలోని ఎన్ఆర్పేటలో దాడి చేశారన్నారు. బెదిరింపు కాళ్లపై చర్యలేవి? గతంలోనూ హాఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డితోపాటు అనేక మందికి టీడీపీ నాయకుల నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని ఎంపీ తెలిపారు. ఇప్పటి వరకు వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. తమ సహనాన్నిచేతగాని తనం అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే తమ పార్టీ కార్యకర్త అశోక్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బుట్టారేణుక వినతిపై ఎస్పీ స్పందించి జరిగిన సంఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రమణమూర్తిని ఆదేశించారు. నాయకులు సురేందర్‌రెడ్డి, నాగరాజుయాదవ్, ఎస్కే రహమాన్, అనిల్‌కుమార్, సఫీయాఖాతూన్, వాహిదా, గౌసియా, జాన్ పాల్గొన్నారు. నారాయణరెడ్డి కుటుంబానికి భద్రతను కల్పించాలి – ఎస్పీని కలిసిన కుటుంబ సభ్యులు, ఎంపీ బుట్టా వైఎస్ఆర్ సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబానికి భద్రతను కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణను కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంపీతోపాటు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి, అన్న ప్రదీప్‌రెడ్డితో కలసి ఎస్పీని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..అధికార పార్టీ నాయకులు నారాయణరెడ్డి శత్రువులకు అభయహస్తం ఇచ్చి చెరుకులపాడులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పెద్దలు స్వచ్ఛంద ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నారాయణరెడ్డి కుటుంబీల నుంచి ప్రాణహాని ఉందని గ్రామస్తులతో చెప్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నారాయణరెడ్డి భార్య శ్రీదేవి, అన్న ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో, ఆ తర్వాత కూడా(పదేళ్లు) తమ గ్రామంలో చిన్నాపాటి ఘర్షణ కూడా జరగలేదని, అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏకంగా నారాయణరెడ్డినే హత్య చేశారన్నారు. చెరుకులపాడులో ఉంటే తమను చంపేస్తారేమోనన్న భయం వేస్తోందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు టీడీపీ వారికే అనుకూలంగా వ్యవహరించి తమ భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమను పట్టించుకోవడంలేదన్నారు. తమకు పోలీసుల రక్షణ కల్పించాలని, లేదంటే తమ ప్రాణాలకు భద్రత ఉండదని వారు ఆవేదనతో ఎస్పీకి విన్నవించారు. -
కేవీఆర్ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం
– కొందరి స్వార్థం కోసం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే సహించం – అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బుట్టా రేణుక – ఎంపీ రాకతో కబ్జా స్థలంలోని పునాదుల్లో మార్పులు – టౌన్ ప్లానింగ్ ప్రకారం దగ్గర ఉండి కొలతలు వేయించిన హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలు సిటీ: రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నేతల మాటలు విని ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో స్టే ఉన్నా కేవీఆర్ కాలేజీ క్యాంపస్ స్థలాన్ని కబ్జా చేయాలని అధికార పార్టీ నేతల అనుచరులు గోడను కూల్చి వేయడంతో రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బుట్టారేణుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్, కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి కేవీఆర్ కాలేజీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి గోడను కూల్చివేయడం, తదితర పరిణామాల గురించి హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ ఎంపీకి వివరించారు. ఆ తరువాత నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆమె చర్చించారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రి మహిళ కాలేజీ గోడను కూల్చి వేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కొందరికి ప్రయోజనం చేకూర్చడ కోసం కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం తగదన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. గతంలో మాదిరిగా 6 మీటర్ల వరకు మాత్రమే స్థలాన్ని తీసుకోవాలని ఇంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రహరీ గోడ కూల్చివేతతో విద్యార్థినులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ ప్రకారమే రోడ్లు విస్తరించాలని చెప్పారు. అనంతరం అందుకు సంబంధించిన మ్యాప్‌లు తెప్పించి, ప్రస్తుతం తీసిన పునాదుల నుంచి బయటి వైపునకు 2 మీటర్లు వదిలి గోడ నిర్మాణం జరపాలని సూచించారు. ఇందుకు కమిషనర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచా్చరు. అలాగే విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం టౌన్ ప్లానింగ్ ప్రకారం హఫీజ్‌ఖాన్ దగ్గర ఉండి కొలతలు వేయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అద్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు యాదవ్, నాయకులు రాఘవేంద్రరెడ్డి, రాజశేఖర్, ట్రేడ్ యూనియన్ సిటీ నాయకులు కటారీ సురేష్, జాన్, బుజ్జీ, రవి, అశోక్, కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్, రాజు, కిరణ్, సాంబ, ఏసన్న, ప్రవీణ్, లోకేష్, చెన్నప్ప, చంద్రశేఖర్‌గౌడు, తాఫీక్, శీను, విద్యార్థి సంఘాల నాయకులు రంగన్న, చంద్రప్ప, రామకృష్ణ, భాస్కర్, రాజ్‌కుమార్, రమేష్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుదాం
– మూడేళ్ల పాలనలో టీడీపీ ప్రజలకు చేసిందేమీ లేదు – వైఎస్ఆర్ హయాంలోనే పేదలకు లబ్ధి – జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు తిరిగి వైసీపీ అభ్యర్థులకే - కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక ఆలూరు రూరల్/ఆలూరు: అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుదామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. శనివారం ఆలూరులో నియోజకవర్గస్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆలూరు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానిక ఆస్పత్రి సర్కిల్ నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు కార్యకర్తలు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక సెయింట్‌జాన్స్ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల అభిమానం చూరగొనకుండా ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలతో రాజ్యాధికారం కావాలనికోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శమమన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో గత ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. ఆ స్థానాల్లో తిరిగి వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో తిరిగితే నిలదీస్తారు: సాయిప్రసాద్‌రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే ఎన్నికల ముందు అన్నివర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేనిపోని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంతవరకు అమలు కాలేదు. టీడీపీ నాయకుల్లో గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు నిలదీసే రోజులు దగ్గరపడ్డాయి. డబ్బుతో ఓటర్లను కొనలేరు: శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అక్రమంగా సంపాదించిన డబ్బుతో వచ్చే ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ప్రజలు డబ్బుకు లొంగకుండా ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకునికే ఓట్లువేసి గెలిపించాలని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకోం: బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఓడిపోయిన టీడీపీ నేతలకు నియోజకవర్గ ఇన్చార్జ్ అంటూ నిధులు మంజూరు చేయడం దారుణం. వారి అరాచకాలు ఎన్ని రోజులూ సాగవు. అవసరమైతే తాము ఆ అరాచకాలను ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్ధమే. ప్రజా సంక్షేమమే ధ్యేయం: గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారు. అలాంటినేత తనయుడు జగన్మోహన్రెడ్డి నాయకత్వం తిరిగి రావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే రాజన్న రాజ్యం తిరిగి జగనన్న సాధిస్తాడు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తమ పార్టీకే మద్దతు తెలపాలి. తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. -
భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): భోపాల్‌లో నిర్వహించే జాతీయస్థాయి ఇస్తెమాకు కర్నూలు నుంచి ప్రత్యేక రైలు నడుపుతామని రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ఏడాది నవంబరు 25, 26, 27 తేదీల్లో ఇస్తెమా నిర్వహించనున్నారని తనకు తెలిసిందన్నారు. జిల్లాకు చెందిన ముస్లింలు వేల సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. జీఎం సానుకూలంగా స్పందించారని.. నవంబరు 23న రాత్రి కర్నూలు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అలాగే 27వ తేదీ భోపాల్ నుంచి తిరిగి ప్రయాణమవుతుందని చెప్పారు. బుధవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. -
మంత్రాలయం రైల్వేలైన్‌కు రీసర్వే
ఎంపీ బుట్టా రేణుక అభ్యర్థనను అంగీకరించిన రైల్వే అధికారులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నుంచి మంత్రాలయం రైల్వేలైన్ పనులకు రీసర్వే చేపట్టాలంటూ ఎంపీ బుట్టా రేణుక చేసిన అభ్యర్థనపై రైల్వే శాఖ అధికారులు స్పందించారు. బుధవారం ఎంపీ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ వినోద్కుమార్యాదవ్ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. కర్నూలు–మంత్రాలయం రైల్వేలైన్ రీసర్వే పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం.. ఎంపీకి హామీ ఇచ్చారు. అలాగే డోన్ పట్టణంలోని 150, 166 రైల్వే గేట్లను ప్రజల సౌకర్యార్థం యథావిధిగా కొనసాగించాలనే అభ్యర్థనపై జీఎం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థన మేరకు బెంగుళూరు–యశ్వంత్‌పుర రైలును మద్దికెర రైల్వే స్టేషన్లో ఆపే సదుపాయం కల్పించనున్నట్లు జీఎం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది. -
నీటి సమస్యను పరిష్కరించుకుందాం
-జీడీపీ నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ అవసరం - రూ. 56 కోట్లతో నాబార్డుకు ప్రతిపాదనలు -అఖిలపక్ష పారీ్టల నేతల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కోడుమూరు రూరల్: పార్టీలకతీతంగా కలసి కట్టుగా మంచినీటి సమస్యను పరిష్కరించుకుందామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. శనివారం ఎంపీ కోడుమూరులో నెలకొన్న మంచి నీటి సమస్యపై స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అఖిలపక్ష పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టడమొక్కటే మార్గమన్నారు. కోడుమూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 56కోట్లు అవసరమని నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. గడిచిన మూడేళ్లల్లో కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులకు రూ.2.17కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. అన్ని పార్టీల నేతలు కలసి వస్తే నీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీ సూచించారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగం, నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. తన పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి సంవత్సరం పుస్తకం ముద్రిస్తున్నట్లు చెప్పారు. -
కర్నూలు-మంత్రాలయం లైన్ రీసర్వే చేపట్టండి
- అమరావతి సమావేశంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ను కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ నిర్మాణానికి రీసర్వే నిర్వహించాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కర్నూలు రైల్వే స్టేషన్‌ను మాడరన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని జీఎంను కోరారు. కర్నూలు, మద్దికెర, కోసిగి స్టేషన్లలో అదనపు రిజర్వేషన్ కౌంటర్లు, ఆదోని క్రాంతినగర్ వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జీ, వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ దృష్ట్యా అదనపు రైలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు- అమరావతి లైన్ నిర్మాణంతో పాటు కొత్త ట్రైన్స్ నడపాలన్నారు. బుట్టా రేణుక ప్రతిపాదనలపై జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. -
మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతా
–ఎంపీ బుట్టా రేణుక ఆదోని: ఆదోని రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్‌తో బెంచీలు కొనుగోలు చేసి స్టేషన్‌లోని విశ్రాంతి గదిలో ఏర్పాటు చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితో కలిసి వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆçదోని, కర్నూలు, మంత్రాలయం రెల్వే స్టేషన్లలో బెంచీల కోసం రూ.7.73లక్షలు మంజూరు చేశానన్నారు. ఇందులో సగం కుషన్ చైర్లు కాగా మిగిలినవి మెటల్ బెంచీలన్నారు. క్రాంతినగర్ వాసుల వినతి మేరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని, ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చిస్తున్నట్లు తెలిపారు. స్టేషన్లో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు మంజూరు చేస్తామని, ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని డీఆర్ఎం అమితాబ్ ఓఝాకు సూచించారు. అంచనా మేరకు కలెక్షన్్స రాలేదని ఆదోని మీదుగా తిరిగే రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను అధికారులు రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే పునరుద్ధరించి కనీసం ఏడాది పాటు కొనసాగించాలని, అప్పటికీ కలెక్షన్్స రాకపోతే రద్దు విషయమై ఆలోచిద్దామని డీఆర్ఎంకు సూచించారు. రాష్ట్ర రాజధాని విజయవాడకు ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం సీహెచ్ రమేష్, స్టేషన్ మాస్టరు వెంకటేశ్వర్లు, కమర్షియల్ విభాగం సూపర్వైజర్ లక్ష్మయ్య, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, రాముడు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన ఎంపీ
-
ఫలించిన ఎంపీ కృషి
మూడు రోడ్లకు జాతీయ స్థాయి – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి బుట్టా రేణుక కృతజ్ఞతలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక రెండేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. తన నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారులను జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఎంపీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీకి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ మేరకు కర్నూలు నియోజకవర్గం గుండా వెళ్లే మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి గడ్కారీకి ఎంపీ బుట్టా రేణుక కృతజ్ఙతలు తెలియజేశారు. జాతీయస్థాయికి అప్‌గ్రేడ్ అయిన రోడ్లు ఇవే.. 1) ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గుత్తితో అనుసంధానమై ఉన్న పత్తికొండ, ఆదోని, మదిరే, హనవల్, కుంతనహాయ్, ఉప్పరహాల్, కౌతాళం, ఉరుకుంద, హాల్వి, కుంబాలనూరు, మాన్వి ప్రాంతాలు కలిపే రోడ్డు (ఏపీలో 135 కి.మీ., కర్ణాటకలో 15 కి.మీ.ల మేరకు) 2) కొత్తకోట, గూడూరు, మంత్రాలయంను కలిపే రోడ్డు 167వ జాతీయ రహదారిగా మార్పు కానుంది.(ఏపీ 22 కి.మీ., తెలంగాణాలో 70 కి.మీ.) 3) ఏపీలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద క్రాస్ అయ్యే 167వ జాతీయ రహదారి నుంచి కర్ణాటకలోని బళ్లారితో అనుసంధానం. (ఏపీలో 2 కి.మీ., కర్ణాటకలో 26 కి.మీ.) -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (లీగల్): న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న న్యాయవాద సంఘ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరశీలించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ఎవరికి రాని అవకాశం న్యాయవాదులు తనకు ఇచ్చినందుకు సంతోషంగానూ, గర్వంగా ఉందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.50 లక్షలు కేటాయించానని, భవిష్యత్తులో ఎంపీ నిధులు పెరిగితే తప్పకుండా కర్నూలు మహిళా న్యాయవాదులకు కూడా సహకారం అందిస్తానన్నారు. జిల్లాలో తీవ్రంగా మంచినీటి సమస్యను ప్రజలు ఈ ఏడాది ఎదుర్కొంటున్నారని, మంచినీటి సమస్య పరిష్కారానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నారు. కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తనను ఇంతగా అభిమానించిందని వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. పార్లమెంటులో లా కమిషన్ ప్రతిపాదనను వ్యతిరేకించి న్యాయవాదులకు అండగా నిలుస్తామన్నారు. బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయవాద వృత్తికి ఉరితాడుగా మారేలా కమిషన్ ప్రతిపాదనలున్నాయని, పార్లమెంటులో ఆ బిల్లును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ఎంపీ తన గళం విప్పి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ రూ.50 లక్షలు ఎంపీ నిధులు కేటాయించి ఎంపీ బుట్టా రేణుక న్యాయవాదులపై తన అభిమానం చాటుకున్నారన్నారు. సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మిదేవి, ఓంకార్, రంగారవికుమార్, పి.నిర్మల, సంపత్‌కుమార్, ఎన్.నారాయణరెడ్డి, సువర్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కె.పుల్లారెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు మాట్లాడి ఎంపీ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఒక విద్యావేత్త, మహిళ అయిన బుట్టా రేణుక ప్రజల సమస్యల çపట్ల స్పందిస్తున్న తీరును వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఎంపీ బుట్టా రేణుకను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అనిల్‌కుమార్, కరీం, తిరుపతయ్య, గీతామాధురి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
అనాథలకు అండగా నిలవడం అభినందనీయం
– విజ్ఞాన పీఠానికి సోలార్, ఆర్ఓ వాటర్ ప్లాంట్, కూలింగ్ వాటర్ ఫ్రిజ్ వితరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అనాథలకు అండగా నిలవడం అభినందనీయమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక కితాబిచ్చారు. శనివారం విజ్ఞాన పీఠంలోని అరక్షిత శిశుమందిర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని శ్రీసాయి ఆదరణ సేవా సమితి ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను సమకూర్చింది. అలాగే నందిరెడ్డి వినీల్‌రెడ్డి మిత్ర బృందం ఆరు పలకల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్, దొనపాటి యల్లారెడ్డి అనే యువకుడు..వాటర్ ఫ్రిజ్‌ను తమ సొంత ఖర్చులతో సమకూర్చారు. శనివారం ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వాటిని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విజ్ఞాన పీఠంలోని బాలబాలికల కోసం ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్లను నిర్మించాలని వీహెచ్‌పీ దక్షణాది రాష్ట్రాల అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కోరగా అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మానానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చింది. అనంతరం విజ్ఞాన సేవా సమితి, రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలను సన్మానించి మెమొంటోలను అందజేశారు. విజ్ఞాన పీఠానికి దాతలు చేసే సాయానికి ఆదాయపు పన్ను మినాయింపును ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచి అనాథల సేవకు ముందుకు రావాలని కోరారు. అంతకముందు విజ్ఞాన పీఠానికి రామకృష్ణ అనే వ్యక్తి రూ.50 వేలు, తిరుపాల్, అతని మిత్ర బృందం రూ.లక్షను ఎంపీ బుట్టా రేణుక చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ గురుమూర్తికి అందజేశారు. విజ్ఞాన పీఠంలోని అనాథలకు అన్నదానం కోసం ఎంపీ తమ బుట్టా ఫౌండేషన్ నుంచి రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బసవన్నగౌడ్, నగర అధ్యక్షుడు లక్కీరెడ్డి అమరసింహరెడ్డి, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్‌శర్మ, శ్రీధర్, ఏకాంబరరెడ్డి, బీసీ నాయకుడు నాగరాజుయాదవ్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరీ విజయకుమారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో నీట్ సెంటర్ ఏర్పాటు చేయాలి
– ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో నీట్ ( Neet) సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..బుధవారం పార్లమెంటులో ఇద్దరు మంత్రులను కలిసినట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లను వేర్వేరుగా కలిసి కర్నూలులో నీట్ ఆవశ్యకతను ఎంపీ వివరించారు. ఎంతోమంది నీట్‌కు సిద్ధమవుతున్నారని, ఇక్కడ పరీక్ష కేంధ్రఃలేనందున అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏపీలో నాలుగు చోట్ల మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇవి కర్నూలు నియోజకవర్గం నుంచి సుమారు 300 నుంచి 400 కి.మీ. దూరంలో ఉన్నాయని, విద్యార్థులు అక్కడికి చేరుకోవడానికే 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని చెప్పారు. -
‘కర్నూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’
– జేపీ నడ్డాకు ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి న్యూఢిల్లీ: నీట్–2017 పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయకారిగా ఉండేందుకు కర్నూలులో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కోరారు. రాష్ట్రంలో గుంటూరు, వైజాగ్, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నప్పటికీ అవన్నీ 300 కి.మీ.పైబడి దూరంలో ఉన్నాయని వివరించారు. కాగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ బుట్టా రేణుక దంపతులు పార్లమెంటులో స్పీకర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదు
ఎమ్మెల్యే జయరాం, ఎంపీ బుట్టా రేణుక ఆలూరు : టీడీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. ఆదివారం ఆస్పరి మండలం శంకరబండ సమీపంలో రూ.5 లక్షలతో నిర్మించిన బస్టాండు, తొగలగల్లులో రూ.6.50 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని వారు ప్రారంభించారు. తొగలగల్లులో సర్పంచ్ హరిజన కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అరకొర రుణమాఫీతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయిస్తున్నారని, ఇది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా విదల్చలేదన్నారు. గతంలోని పాలకుల ప్రణాళిక లోపంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశామన్నారు. ఇప్పటికే తాగునీటి సమస్య, విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల మంజూరుకు ఎంపీ హామీ ఆస్పరి మండలంలోని మారుమూల గ్రామాలైన యాటకల్లు, తొగలగల్లు, తువరగల్లు తదితర గ్రామాల్లో రోడ్ల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఎంపీని పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు విక్రాంత్‌రెడ్డి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, హాలహర్వి మండలాల కన్వీనర్లు చిన్న ఈరన్న, దొరబాబు, లుమాంబ, ఆస్పరి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాసులు, గోవర్ధన్, దత్తాత్రేయరెడ్డి, కేశవరెడ్డి పాల్గొన్నారు. ప్రొటోకాల్‌ను విస్మరించిన ఆస్పరి అధికారులు : ఆస్పరి మండలం శంకరబండ, తొగలగల్లు, కారుమంచి తదితర గ్రామల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే హాజరైతే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు హాజరుకావాలి. ఇక్కడ అధికారులు గైర్హాజవడంపై ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీకి ఫిర్యాదు చేశారు. -
‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి
- డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు పీఎంను ఆహ్వానిస్తాం - ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(హాస్పిటల్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఊపిరిపోసే ఎక్మో చికిత్సా యంత్రాన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్‌జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని కళాశాలలోని కార్డియాలజీ విభాగంలో ఎక్మో చికిత్సపై వర్క్‌షాప్ నిర్వహించారు. అమెరికాకు చెందిన డాక్టర్ పూబోని సునీల్‌కుమార్, బృందం సభ్యులు కలిసి ఎక్మో చికిత్సా విధానం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఎంతో ఖరీదైన దన్నారు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న రోగికి చికిత్స అందిస్తే 60 నుంచి 70 శాతం సక్సెస్ రేటు ఉందని వైద్యుల మాటలను బట్టి తెలుస్తోందన్నారు. కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చదువుకున్న కళాశాల అభివృద్ధికి కృషి యూకేకు చెందిన ఎక్మో చికిత్సా నిపుణులు డాక్టర్ పూబోని సునీల్‌కుమార్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్నానని, కళాశాల అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచిస్తుంటానని అన్నారు. 2003లో ఓసారి ఎక్మో చికిత్సపై ఈ కళాశాలలో వర్క్‌షాప్ నిర్వహించానని, ఇప్పుడు ఈ ప్రక్రియ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పరికరాలు, ఎలా పనిచేస్తుందనే విషయాలపై చర్చిస్తామన్నారు. ఎక్మో చికిత్స కార్డియాలజీ కార్డియోథొరాసిక్, పీడియాట్రిక్, అనెస్తెషియా వైద్యులు చేయాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో ఎక్మో ఏర్పాటు చేస్తే సాంకేతికంగా తమ వైపు నుంచి ప్రోత్సాహమందిస్తామన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఆధునిక విధానమన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలోని 13 బోధనాసుపత్రుల వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్మో చికిత్సా విధానంపై డాక్టర్ పూబోని సునీల్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్. వెంకటరమణ, రేడియాలజి విభాగాధిపతి డాక్టర్ ఒ.జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం
– కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): పాస్‌పోర్టు సేవా కేంద్రం జిల్లా ప్రజలకు ఓ వరమని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని బుధవారం ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వెతలు స్వయంగా చూశానని, హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి సిఫార్సు లేఖలు కూడా రాయించుకునే వారని తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదిస్తే మొదట క్యాంప్ తరహాలో నిర్వహిస్తామన్నారు. పోస్టాఫీసులకు అనుబంధంగా ప్రధాని 100 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం, అందులో మొదటి విడతలోనే కర్నూలుకు మంజూరు చేయడం అదృష్టమన్నారు. ఉద్దేశం నెరవేరింది.. పాస్‌పోర్టు సేవలు ప్రజల వద్దకు అనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందని రీజనల్ పాస్‌పోర్టు అధికారి ఎన్ఎల్పీ.చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 50 అప్లికేషన్లు ప్రాసెస్ చేయగలమని, పూర్తిస్థాయిలో సెంట్రల్ ప్రాసెసింగ్‌తో అనుసంధానమైన తర్వాత ఆ సంఖ్యను 100కు పెంచవచ్చని తెలిపారు. పోస్టల్ డైరెక్టర్ సంతాన రామన్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఙానం పెరగడం వల్ల గతంలో పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీయించుకునేందుకు పట్టే సమయంలో ఏకంగా పాస్‌పోర్టునే తయారు చేయగలుగుతున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కర్నూలు చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో మొదటి స్థానం సాధించిన డివిజన్ హెడ్ కెవీ సుబ్బారావుతో పాటు డైరెక్టర్ సంతాన రామన్‌ను ఎంపీ సన్మానించారు. అలాగే పాస్‌పోర్టు కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎంపీని పోస్టల్ అధికారులు సత్కరించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ షేక్షావలి, వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, పోస్టల్ ఏఎస్పీ నాగానాయక్, పోస్టుమాస్టర్ డేవిడ్ పాల్గొన్నారు. -
ఎక్కువ నిధులు ఇవ్వండి
– ప్రధాని నరేంద్రమోదీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ):కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని ఎంపీ బుట్టా రేణుక..ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలోని తన నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. చేనేత కార్మికులు, ముస్లిం మైనారిటీల సంక్షేమం, పర్యాటక స్థలాల అభివృద్ధి, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి ఎక్కువ నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఙప్తి చేశారు. ‘ద నేషనల్ కమిషన్ ఫర్ సోషియల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్’ (ఎన్సీఎస్బీసీ)కి రాజ్యాంగ హోదా ప్రతిపత్తి కల్పించినందుకు ప్రధాన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఎంపీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. -
నేతన్నలకు చేయూతనివ్వండి
- ప్రధానిని కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): చేనేత కార్మికులకు చేయూతనిచ్చి ఆత్మహత్యలు నివారించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని మోదీని కోరారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రధానితోపాటు జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన ఇచ్చారు. ఒక్క కర్నూలు నియోజకవర్గంలోనే సుమారు 2 లక్షల మంది చేనేత కార్మికులున్నారని, పేదరికం కారణంగా వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోలేక, గిట్టుబాటు ధరలు పొందలేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. చేనేత వస్త్రాలను నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించి, ఆధునిక పరికరాలు వాడే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు. చేనేతలకు గృహంతో కూడిన వర్క్‌షెడ్ నిర్మాణ పథకం వర్తింపజేయాలన్నారు. ఎంఎన్‌ఆర్‌జీఈఏతో పాటు ఇతర పథకాలను అమలు చేయాలని, పేదరికం నుంచి విముక్తి కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ బుట్టా రేణుక పార్లమెంటులో ప్రధాని, మంత్రిని కోరారు. -
‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా అన్నారు’
‘ప్రత్యేక హోదా’ అమలు చేయాలి: ఎంపీ బుట్టా రేణుక న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. ఎన్ఐటీ, ఎస్ఈఆర్ సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్కో హామీని కేంద్రం నెరవేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అశాంతికి గురిచేస్తోందని చెప్పారు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ను నెలకొల్పడం సంతోషకరమని పేర్కొన్నారు. తిరుపతిని విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధిపరచాలని కోరారు. సైన్స్ ఎడ్యుకేషన్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. శాస్త్రీయ పరిశోధనలపై అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న వ్యయంతో పోలిస్తే మన దేశం చేస్తున్న ఖర్చు చాలా స్వల్పమని చెప్పారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బుట్టా రేణుక కోరారు. -
పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయాలి
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రఖ్యాత ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. శుక్రవారం ఎంపీ.. ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ మహేశ్ శర్మను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎర్రగుడిలోని అశోకుని శిలా శాసనాలు, మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం, పెద్దతుంబళంలోని ప్రాచీన శ్రీరామ దేవాలయం, ఆదోనిలోని కోటా ప్రాంతం, జామా మసీదు, ఎల్లార్తి దర్గా, ఉరుకుంద దేవాలయం, సుంకేసుల డ్యామ్ ప్రాంతాలను పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ట్రిపుల్ఐటీ కర్నూలులో త్వరగా ప్రారంభించాలి.. ట్రిపుల్‌ఐటీని కర్నూలులో త్వరగా ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి కోరారు. కర్నూలుకు మంజూరైన ట్రిపుల్ ఐటీ తరగతులను రెండేళ్లుగా కాంచీపురంలోని ట్రిపుల్ఐటీకి అనుబంధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నగరంలో కేటాయించిన స్థలంలో అవసరమైన నిర్మాణాలు త్వరగా చేపట్టి ఇక్కడే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. దీనిపై మంత్రి జవదేకర్ స్పందిస్తూ.. తన మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కర్నూలులో ప్రారంభించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కర్నూలు జిల్లాకు రావాలంటూ ఇద్దరు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ఈమేరకు ప్రకటన వెలువడింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని.. ఆదోనిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మైనారిటీల కోసం మంజూరైన వివిధ పనులను ప్రారంభించాలని కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పార్లమెంట్ సమావేశాల తర్వాత పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి నక్వి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని..ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించాలని కోరామని, చేనేత కార్మికుల ఇబ్బందులను వివరించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. -
అంతటా నో క్యాష్ బోర్డులే: ఎంపీ రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో ఎక్కడ చూసినా నగదు నిల్వలు లేవంటూ ఏటీఎంల ముందు బోర్డులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. పెద్ద నోట్లరద్దు ప్రక్రియను తాము స్వాగతి స్తున్నామని, అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. బ్యాంకులకు వెళ్లినా నగదు ఉపసంహరణ సేవలు అందడం లేదన్నారు. ప్రజల కష్టాలను ఇకనైనా తొలగిం చాలన్నారు. -
నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి
– పాస్‌పోర్టు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈ నెలాఖరు లోపు అని్న సదుపాయాలతో కర్నూలులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సూచించారు. ఎంపీ సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పాస్‌పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవా కేంద్రం మూడు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి ఎ.కె.మిశ్రా, వైజాగ్ పాస్‌పోర్టు కార్యాలయ సూపరింటెండెంట్ కల్యాణ్, కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ వైపే ఓటరు చూపు
► వెన్నపూస గోపాల్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డిల విజయం తథ్యం ► కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వెల్దుర్తి రూరల్ : త్వరలో జరుగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు చూపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల వైపే ఉందని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. బుధవారం చెరుకులపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి స్వగృహంలో పార్టీ మండల ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి గోపాల్‌రెడ్డి, స్థానిక సంస్థల అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిల విజయం తథ్యమన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన టీడీపీని ఓటర్లు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు.. ప్రజా సమస్యలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామాభివృద్ధికి రూ.70లక్షల నిధులు మంజూరు చేశానని, అలాగే దత్తత తీసుకున్న నందవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు కృషి చేశానని చెప్పారు. టెక్స్టైల్స్ పార్క్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, రైల్వే రిజర్వేషన్ సెంటర్ల పెంపు, పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదల..ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కర్నూలు, మంత్రాలయం రైల్వేలైన్ సర్వే కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించామని పేర్కొన్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి నివారణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వెల్దుర్తిలో నీటిసమస్య పరిష్కారానికి తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, గోవర్ధనగిరి, శ్రీరంగాపురం ఎంపీటీసీ సభ్యులు గోపాల్, సుంకిరెడ్డి, మండల నాయకులు రత్నపల్లె రమణారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, అగస్టీన్, ఆరీఫ్, ఆటో మోహన్, చెరుకులపాడు మోహన్ పాల్గొన్నారు. బోర్ల వినియోగంలో రాజకీయం తగదు ఎంపీ నిధుల ద్వారా వేసిన బోర్లు వినియోగించడంలో రాజకీయం చేయడం తగదని టీడీపీ నాయకులకు ఎంపీ బుట్టా రేణుక సూచించారు. కోయిలకొండ గ్రామ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మండ్ల మాదేవి కుమారుని వివాహ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎంపీ నిధులతో చాలా బోర్లు వేశామని, అన్నింటిలో నీరు పడిందన్నారు. కోయిలకొండలో వేసిన బోరుకు పంచాయతీ వారు పైపులైన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కృష్ణగిరి మండలంలో కటారుకొండ, జి.మల్లాపురం గ్రామాల్లో ఎంపీ నిధుల ద్వారా వేసిన బోర్లతో తాగునీరు అందుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రులు, స్థానిక సంస్థల అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెన్నపూస గోపాల్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి గెలుపునకు అందరూ కృషిచేయాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆరోపించారు. ఇదే మంచి తరుణమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆర్బీ వెంకటరాముడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు నక్క నాగరాజు, సుదర్శనాచారి, తిరుపాల్‌యాదవ్, రైతు సంఘం నాయకులు జయరామిరెడ్డి, బాలు, మండ్ల కృష్ణమూర్తి, రామచంద్రుడు పాల్గొన్నారు. -
ఇట్లయితే ఎట్టా బతకాలమ్మా?
- కాల్వల శుభ్రత లేదు.. దోమల నియంత్రణ పట్టదు - అర్ధరాత్రి నీటి సరఫరా - ఎంపీ బుట్టా రేణుక ఎదుట సమస్యలను ఏకరువు పెట్టిన పాతబస్తీవాసులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘కాల్వల్లో పూడిక పేరుకుపోతున్నా తొలగించరు.. ఫలితంగా దుర్వాసనతోపాటు దోమల బెడద పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. కుళాయిలకు అర్ధరాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండడంతో నిద్ర మేల్కొని జాగరణ చేయాల్సి వస్తోంది.. ఇలా ఎంతకాలం’ అంటూ కర్నూలు నగర పాతబస్తీవాసులు ఎంపీ బుట్టా రేణుక వద్ద ఏకరువు పెట్టారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఇటీవలే 3, 4, 5 వార్డుల్లో పర్యటించారు. కుమ్మరివీధి, నాయీబ్రాహ్మణుల వీధి, ఛత్రీబాగ్, బండిమెట్ట ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక వార్డు పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘క్లీనింగ్ లేదు, దోమల నివారణా లేదు, అర్ధరాత్రి నీళ్లు వస్తే ప్రజలు ఎలా పట్టుకుంటారు.. వాసన వచ్చే నీళ్లు ఎలా తాగుతారు.. పాతబస్తీ ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా వినియోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. బండిమెట్ట వీధిలో నిర్మించిన పురుషుల మరుగుదొడ్లు ఆరేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, మహిళల మరుగుదొడ్లలో సరైన నీటిసదుపాయం లేకపోవడం వల్ల వాడుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగమయ్యకట్టకు అరుగు నిర్మించాలని, దోమల బాధ నుంచి గట్టెక్కించాలని, మంచినీటి ఎద్దడిని నివారించాలని, సీసీరోడ్లు, కాల్వలు నిర్మించాలని కోరారు. 34-102 ఇంటి వద్ద బోరింగ్ పనిచేయడం లేదని, వీధిలైటు లేదని స్థానికులు ఎంపీకి విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ వారకి హామీ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కాలువలను వారం రోజులకోసారి కూడా శుభ్రం చేయడం లేదని, దోమల నివారణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల పాతబస్తీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నగరపాలక సంస్థ అధికారులు అవసరమైతే ఎక్కువమంది సిబ్బందిని నియమించి సమస్యలు తీర్చాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకులు ఎస్.ఎ.రహ్మాన్, బోదెపాడు భాస్కర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శేషుబాబు, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, డి.కె.రాజశేఖర్, పేలాల రాఘవేంద్ర, మహ్మద్ తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోల్స్’ స్థలాల ఆక్రమణ దారుణం
– కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (టౌన్): నగరంలో కోల్స్ కళాశాల స్థలాలను ఆక్రమించుకోవడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. స్థానిక కోల్స్ సెంటినీయల్ తెలుగు బాప్టిస్టు చర్చి ఎదుట బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేదీక్షలకు గురువారం ఆమె సంఘీభావం తెలిపారు. దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న కోల్స్ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కర్నూలు ప్రజలపై ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. క్రైస్తవుల ఆస్తులతో కొంతమంది నాయకులు వ్యాపారం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కోల్స్ స్థలాలను కోనుగోలు చేసిన, అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నగర కన్వీనర్ పి.జి. నరసింహాలు యాదవ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెహమాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, ఈశ్వర్ పాల్గొన్నారు. 22న భారీ ర్యాలీ.. కోల్స్ కళశాల స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 22వ తేదీన కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున క్త్రెస్తవుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు వెల్లడించారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ మాట్లాడుతూ..ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. -
ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను ఆదుకోండి
– ప్రస్తుత బడ్జెట్లోనే నిధులు కేటాయించండి – ఆర్థికమంత్రి అరుణ్ జెట్లీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని కోరారు. కోడుమూరుకు రూ. 56.70 కోట్లు, మంత్రాలయానికి రూ. 30 కోట్లు, ఆస్పరి, దేవనకొండ, ఆలూరులకు రూ. 90 కోట్లు, ఎమ్మిగనూరు (గోనెగండ్ల)కు రూ. 140 కోట్లు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలిలకు రూ. 105 కోట్లు, ఆదోని, కౌతాళంలకు రూ. 105 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ఆయా గ్రామాలకు ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన విధంగా వివిధ ప్రపంచ బ్యాంకు పథకాల ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు అందజేయాలని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు కూడా ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. -
మంత్రాలయం రైల్వే లైన్‌కు రీసర్వే
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(రాజ్‌విహార్): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైను నిర్మాణానికి రీ సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై పార్లమెంటులో ప్రశ్నించానన్నారు. అయితే కర్నూలు – మంత్రాలయం మధ్య రోడ్డు ట్రాఫిక్ అంతంత మాత్రంగానే ఉందని, ఈ క్రమంలో రైల్వే లైను వేస్తే ప్రయాణికుల రద్దీ లేక తమ శాఖకు నష్టం వాటిల్లుతుందనే సమాధానం వచ్చిందన్నారు. అయితే ఇది వరకే చేసిన సర్వే 2010 సంవత్సరం నాటిదని, ప్రస్తుతం ఏడేళ్లు గడిచాయని.. మంత్రాలయానికి భక్తుల రద్దీ పెరిగడంతో పాటు పశ్చిమ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరోసారి సర్వే చేయాలని ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. -
ఎంపీ బుట్టా రేణుకకు ఝాన్షీ లక్ష్మీబాయి అవార్డు
కర్నూలు(అర్బన్): కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కర్ణాటక కో ఆపరేటీవ్ హ్యాండ్ లూమ్స్ వీవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ధీర వీర వనిత ఝాన్షీలక్ష్మీబాయి అవార్డును ప్రదానం చేసింది. శనివారం బెంగళూరు కేఆర్ రోడ్డు (బన్శంకరి)లోని కర్ణాటక జైన్ భవన్లో జరిగిన కార్యాక్రమంలో ఈ అవార్డును బుట్టా రేణుకకు ప్రదానం చేసినట్లు కుర్ని సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. కావేరి హ్యాండ్ లూమ్స్, అఖిల భారత కుర్హిన శెట్టి విద్యార్థిని నిలయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక చేనేత ఫెడరేషన్ చైర్మన్, మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, కావేరి హ్యాండ్లూమ్స్ అధ్యక్షుడు విరుపాక్షప్ప, కన్నడ సినీ నటుడు కార్తీక్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వరి చిదానంద మన్సూర్, కర్ణాటక రాష్ట్ర చేనేత నాయకురాలు రూపా లింగేశ్వర్ హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్ని సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు తన పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. అలాగే బీసీ వర్గాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బుట్టా నీలకంఠం, కుర్ని సంక్షేమ సంఘం కర్నూలు పట్టణ అధ్యక్షుడు సీ అజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు బుట్టా రంగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు బందికె జగదీష్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
సమాజంలో స్త్రీ పాత్ర కీలకం
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు సిటీ: సమాజంలో స్త్రీ పాత్ర కీలకమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. సోమవారం స్థానిక కెవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో మహిళల హక్కులు– సమస్యలు, సాధ్యాసాధ్యాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. హక్కులు, చట్టాలను ప్రతి మహిళ తెలుసుకుని ఉండాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పోరాడి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర ఆవుల మంజులత, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లక్కరాజు జయశ్రీ, డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర సీవీ రాజేశ్వరిలు ప్రసంగించారు. శాతవాహనుల కాలంలో స్త్రీలకు ప్రాధాన్యత ఉండేదని.. రానురాను పురుషాధిక్యంలో స్త్రీ వివక్షతకు గురవుతోందన్నారు. చట్టం దృష్టిలో స్త్రీ, పురుషులు సమానమని, లింగ వివక్ష చూపకూడదన్నారు. మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మార్పులు రావాలంటే మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాలన్నారు. గర్భంలోనే ఆడపిల్లను చిదిమి వేడయం నేరమన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కాలేజీ అధ్యాపకులు ఇందిరా శాంతి, శ్రీదేవి, డాక్టర్ వీరాచారి, సుబ్బరాజ్యమ్మ, డాక్టర్స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
జూట్ కారిడార్‌కు అనుమతి
- జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరు - మొదట కోడుమూరు.. తర్వాత ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు - జాతీయ జనపనార బోర్డు కార్యదర్శితో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరైనట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. రాయలసీమ పరిధిలో కర్నూలు నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇక్కడి ప్రజల ఉపాధి కోసం జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రాల ఏర్పాటు కోసం ఈనెల 5వ తేదీన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ జనపనార బోర్డుకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు నేషనల్ జ్యూట్ బోర్డు (జాతీయ జనపనార బోర్డు) సానుకూలంగా స్పందించిందన్నారు. బోర్డు కార్యదర్శి, డైరెక్టర్ అరవింద్‌కుమార్ సోమవారం కర్నూలుకు వచ్చి ఎంపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలోగా కోడుమూరులో 25 మందికి మొదటి శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో కలకత్తా, హైదరాబాదుకు సంబంధించిన జ్యూట్‌బోర్డు సాంకేతిక అధికారులు నరసింహులు (ఎన్‌జేబీ ఎంపీఓ), ధనుంజయ్ (ఎన్‌జేబీ టీఏ) తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి పనివారిని ప్రోత్సహించండి
- బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఇవ్వండి - ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికి ఎంపీ బుట్టా రేణుక లేఖ కర్నూలు (ఓల్డ్‌సిటీ): జనాభాలో 70 శాతంగా ఉంటున్న బీసీ, ఓబీసీలకు న్యాయం చేసేందుకు వీలుగా చేతివృత్తులు, కులవృత్తులను ప్రోత్సహించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీకి లేఖ రాశారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, చేనేత, మత్స్యకారులు, గొర్రెల పెంపకం వంటి కులవృత్తులతో పాటు హస్తకళలు, వ్యవసాయ అనుబంధ వృత్తులు నిర్వహించుకునేందుకు కనీస పెట్టుబడి, మార్కెటింగ్‌కు డబ్బు అవసరమన్నారు. ఆ మేరకు స్థోమత లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, బడ్జెట్ (2017-18)లో ఎక్కువ మొత్తాలు కేటాయించి ప్రోత్సహించాలని లేఖలో పేర్కొన్నారు. -
డైజీ రికార్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంలో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): దివ్యాంగుల కోసం జిల్లాలో డైజీ రికార్డింగ్ సెంటర్‌కు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. బుధవారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా కర్నూలులోని అంధుల శిక్షణాభివృద్ధి కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు ఎస్. పుష్పరాజ్ అద్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలకు తాను హాజరవుతున్నానన్నారు. అంధుల సమాఖ్య తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు సోషల్ జస్టిస్ మంత్రితో కూడా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాకు సెన్సరీ పార్కు మంజూరు చేశామన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలన్నింటిని గ్రామ స్థాయి వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంధుల సమాఖ్య కార్యాలయ స్థలం కోసం పోరాడతానని చాంబర్‌ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి అన్నారు. మోడరన్ ఐ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతు , రోటరీ క్లబ్ న్యూసిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు , అంధుల సమాఖ్య జాతీయ కార్యదర్శి విశ్వనాథరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. అనీల్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సుబ్రమణ్యం, కేవీఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు బి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
గోరక్షణ శాలలో ఎంపీ బుట్టా పూజలు
కర్నూలు (న్యూసిటీ): నగరంలోని పెద్దపార్కు సమీపంలో ఉన్న గోరక్షణ శాలలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సోమవారం లక్ష్మీదేవికి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం దత్త గో ప్రదక్షిణశాలలో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. బుట్టా ఫౌండేషన్ రూపొందించిన 2017 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆధ్యాత్మిక శ్రీదండి అష్టక్షరి సంపత్కుమార రామానుజజియర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకు ముందుగా ఎంపీ బుట్టారేణుకను దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఎం.రామాంజనేయులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి మాజీ సభ్యుడు శ్రీకాంతనాయకుడు, గోరక్షణ శాల సిబ్బంది రమణ, గోపాలకృష్ణ, గోపా సహస్త్ర నామ మండలి అధ్యక్షుడు ఎం.నాగరాజు, మహిళలు పాల్గొన్నారు. -
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అర్బన్): కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాని ఏపీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా రూపుమాపేందుకు ఎంపీ చూపుతున్న చొరవను గుర్తించాలన్నారు. ఎంజీఆర్‌ఎస్ టెక్నాలజీస్ సహకారంతో చేపడుతున్న ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, జగదీష్, ఖాజా, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి పథకాలకు నిధులు మంజూరు
– కేంద్ర మంత్రికి ఎంపీ బుట్టా రేణుక కృతజ్ఙతలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎమ్మిగనూరు, గూడూరు నగర పంచాయతీలకు సంబంధించిన తాగునీటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఎంపీ బుట్టా రేణుక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఙతలు తెలియజేశారు. ఈ రెండు నగర పంచాయతీల పరిధిలోని తాగునీటి సమస్యను తాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించారన్నారు. మంగళవారం సాయంత్రం ఎంపీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మస్తాన్‌వలి, నగరపాలక సంస్థ ఎంఈ రాజశేఖర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులతో వివిధ పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మిగనూరుకు రూ. 42 కోట్లు, గూడూరుకు రూ. 189 కోట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు, ఆదోని నగరపాలక సంస్థల పరిధిలో అమృత్ పథకం నుంచి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆయా ప్రతిపాదనలను డీపీఆర్‌లను త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని ఆ ప్రకటనలో కోరారు. కర్నూలు పంచాయతీ రాజ్ ఈఈ పాల్గొన్నారు. -
ఈఎస్ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి
– కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టా వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలులోని ఈఎస్ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టారేణుక విన్నవించారు. బుధవారం ఎంపీ మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి తన నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వివిధ పరిశ్రమలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా, ఆరోగ్య సేవలు, కనీస వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాలు, ఐఐటీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలనా్నరు. అంతేగాక నిరుద్యోగులకు వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని, కర్నూలుకు మంజూరు చేసిన రీజినల్ ప్రావిడెండ్ ఫండ్ కార్యాలయాన్ని త్వరగా ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఓ ప్రకటనలో తెలిపారు. -
కేంద్రమంత్రులను కలసిన ఎంపీ బుట్టా
– సీపీఎస్‌ను రద్దుచేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నపం – ఉర్దూ, అరబిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అబ్బాస్ నక్వీకి వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్రమంత్రులు అబ్బాస్ నక్వీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. మొదట కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలసి మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూ, అరబిక్ పాఠశాలలు, అలాగే ఆదోనిలో బాలికల గురుకుల పాఠశాల, సద్భావన మంటపాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. జిల్లాకు ఎంఎస్‌డీపీ కింద పాలిటెక్నిక్, జూనియర్, ఐటీఐ కాలేజీలను మంజూరు చేసినందుకు ఆమె మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రి అబ్బాస్నక్వీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు. తర్వాత కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి నూతన పెన్షన్ విధానంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అలాగే ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను త్వరగా ఆమోదింపజేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
రేపు వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం
– పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకతో పాటు కమలాపురం శాసన సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఆ ప్రకటనలో సమావేశాల షెడ్యూలును కూడా విడుదల చేశారు. షెడ్యూలు దిగువ పేర్కొన్న విధంగా ఉంది. కర్నూలు నియోజకవర్గ సమావేశం.. కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రాయల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు: 1 మొదలు 5వరకు వార్డులు, 10 గంటల నుంచి 11 గంటల వరకు: 6 నుంచి 10 వార్డులు, 11 గంటల నుంచి 12 వరకు: 11 నుంచి 15 వార్డులు, మధ్యాహ్నం 12 నుంచి 1.00 గంట వరకు 16, 17, 18, 22, 23 వార్డులు, 1.30 గంటల నుంచి 2.30 వరకు: 24, 25, 41, 42, 43 వార్డులు, 2.30 నుంచి 3.30 గంటల వరకు: 44 నుంచి 48 వార్డులు, సాయంత్రం 3.30 నుంచి 4 గంటల వరకు 49 నుంచి 51 వార్డుల సమావేశాలుంటాయి. పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ (కార్పొరేషన్) సమావేశం.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పాణ్యం, కోడుమూరు వార్డుల విస్తృతస్థాయి సమావేశం బిర్లా కాంపౌండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు: 19, 20, 21, 26, 27 వార్డులు, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు: 28 నుంచి 32 వరకు వార్డులు, సాయంత్రం 6.30 నుంచి 8.00 గంటల వరకు: 33 నుంచి 40వ వార్డు వరకు -
భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
– నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభం – ఎంపీ బుట్టా రేణుక వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 26, 27, 28 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో నిర్వహించే ఇస్తెమాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ముస్లింలు అధికంగా వెళ్తారని వారి కోసం ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేయాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆమె విన్నపం మేరకు కేంద్ర రైల్వే బోర్డు నుంచి మంజూరు లభించింది. అందుకు సంబంధించిన ప్రతిని ఎంపీ గురువారం పత్రికలకు విడుదల చేశారు. ప్రత్యేక రైలు (నంబర్ 7423) ఈనెల 24వ తేదీ రాత్రి 10.55 గంటలకు డోన్‌లో బయలుదేరి 12 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. 12.10 గంటలకు కర్నూలు నుంచి వెళుతుంది. 25వ తేదీ రాత్రి 11.20 గంటలకు భోపాల్ చేరుకుంటుంది. అలాగే భోపాల్ ఇస్తెమా ముగిసిన తర్వాత ప్రత్యేక రైలు (నంబర్ 7424) 28వ తేదీ రాత్రి 9.00 గంటలకు భోపాల్‌లో బయలుదేరి 29వ తేదీ రాత్రి 9.15కు కర్నూలు, 11.30కు డోన్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని, ఇస్తెమాకు వెళ్లే ముస్లింలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. కాగా గత మూడేళ్లుగా ఆమె భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయిస్తుండటంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. -
ముస్లింలకు అండగా ఉంటా
– ఎంపీ బుట్టా రేణుక వెల్లడి - ఆమె సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ముస్లిం మహిళలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కష్టసుఖాల్లో ముస్లింలకు అండగా ఉంటానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అనా్నరు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ, లేబర్కాలనీలకు చెందిన సయ్యద్ సలీమ, సయ్యద్ అల్తాఫ్ అహ్మద్, షేక్ ఖాజా, సమి, షేక్ నస్రీన్, షేక్ ముంతాజ్, నూర్ అహ్మద్, షేక్ షబానాతో పాటు మరో 100 మంది ముస్లిం మహిళలు ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. మంగళవారం స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని ఎంపీ కార్యాలయంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలుగా ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని తెలిపారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నేతల దృష్టికి తీసుకోరావాలని కార్యకర్తలకు కోరారు. రెండేళ్లు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, నగర విద్యార్థి అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, గఫూర్ ఖాన్, సయ్యద్ షేక్షావలి, ఫారుక్ అలీ, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయాల అభివృద్ధికి కృషి
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆస్పరి: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాననిఽ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆస్పరి సమీపంలోని రామతీర్థంలో వెలసిన పంచముఖి గాయత్రీ మాత దేవాలయం ఆవరణలో సోమవారం వినాయక విగ్రహం, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రవికాంత్ శర్మ ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్ట, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి శంకరబండ, ఆస్పరి, చిరుమాన్‌దొడ్డి, హలిగేరి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కళాకారుల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టారేణుకను వేదపండితులు, గ్రామ పెద్దలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాయత్రీ మాత దేవాలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడు, ధ్వజ స్తంభాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు సమీపంలోని శ్రీగిరి క్షేత్రంలో సిమెంట్‌రోడ్లు, ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని ఎంపీనీ కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. సిమెంట్ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం బిణిగేరి గ్రామ పెద్దలు ఎంపీ బుట్టారేణుక, ధ్వజ స్తంభం దాత రెడ్డి శేఖర్ రావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దొరబాబు, ఎంపీటీసీలు సావిత్రమ్మ, రంగస్వామి, ఆపార్టీ నాయకులు మురళీరెడ్డి, దత్తాత్రేయరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తోయజోక్షప్ప, నాగేంద్రరెడ్డి, న రసింహులు, నల్లన్న, లింగన్న, లింగన్న, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన
– కార్తీక వనభోజనాల్లో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): బీసీలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగన్నబావి సమీపంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆమె హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే మంచి ఉద్దేశంతో కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ.. బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారి హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు దేశంలో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి ఎం. రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కె. రామకృష్ణ, నాయకులు బుర్రా ఈశ్వరయ్య, కేతూరి మధు, డా.పుల్లన్న, లక్ష్మినారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంముని పాల్గొన్నారు. -
విద్యార్థినులపై దాడులకు అధికారులదే బాధ్యత
– కేవీఆర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు సిటీ: రాష్ట్రంలో కె.వి.ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కళాశాల గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం తగదు. ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి దాడులు జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కేవీఆర్ కళాశాలను సందర్శించి కూల్చివేసిన గోడతో పాటు కాలేజీ హాస్టల్, కిచెన్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒకచోట గోడను కూల్చివేయాలనుకున్నప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకుడు చెప్పాడని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కళాశాల గోడ కూల్చివేయడం చట్టవిరుద్ధమన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా గోడను కూల్చివేయదలిస్తే ముందుగా అక్కడి ప్రజలకు రక్షణ గోడ నిర్మించిన తర్వాతే ఆ పని చేయాలన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులు దుకాణాలు నిర్మించుకునేందుకే రోడ్డు విస్తకరణ సాకుతో విద్యార్థినుల ఆట స్థలంలోకి చొచ్చుకుని రావడం సమంజసం కాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థినుల సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎంపీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రాథమికంగా గుర్తిస్తే క్యాన్సర్ దూరం
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా కర్నూలు క్యాన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ఆమె పింక్ రిబ్బన్ వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ క్యాన్సర్‌కు గల కారణాలు, లక్షణాలు ముందుగానే గుర్తించి, అవగాహనతో ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, దానిని సరైన చికిత్సతో దూరం చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత జీవనశైలిలో మార్పు తెచ్చుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రోగుల కోసం కర్నూలులో రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. క్యాన్సర్ లక్షణాలు, చికిత్సల గురించి డాక్టర్ రవీంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో క్యాన్సర్ సొసైటీ అధ్యక్షుడు జి. పుల్లయ్య, సభ్యులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ అల్లారెడ్డి, డాక్టర్ ఇందిర, ఎమ్మెల్యే సతీమణి విజయ తదితరులు పాల్గొన్నారు. -
గోపాల్ రెడ్డిని గెలిపించండి
– ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సులో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డిని ముందుండి గెలిపించుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమన్వయకర్త కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకుడు రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆరేళ్లలకు ఒకసారి వస్తాయని, ఈ ఎన్నికలను ఎవరూ ఆపలేరన్నారు. ఇతర ఎన్నికల్లాగా వీధుల్లో ప్రచారం చేసేది కాదని, విద్యావంతులు ఆలోచించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఓటరు నమోదుకు నవంబరు 5వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఈనెలాఖరులోపే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. మోసం..బాబు నైజం: ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (కడప–అనంతపురం, కర్నూలు) అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు.. ప్రమాణ స్వీకార సమయంలో ఫైల్‌పై సంతకం పెట్టి.. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల ప్రాతినిధ్యంతో విద్యా సంస్కరణలు చేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి మూడు పంటలు పండే 36 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారన్నారు. అద్భుతమైన రాజధానంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రజలకు, రైతులకు పనికొచ్చే రాజధాని నిర్మిస్తే చాలన్నారు. హోదా కోసం ఉద్యమిస్తే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు. 25న యువభేరి: హఫీజ్ ఖాన్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు డ్రైవ్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈనెల 25న వీజీఆర్ కన్వెషన్ హాల్లో జరిగే యువభేరి కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, ఎస్సీసెల్ కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.జహీర్ అహ్మద్ ఖాన్, వివిధ శ్రేణుల నాయకులు డి.కె.రాజశేఖర్, విజయకుమారి, సలోమి, టి.వి.రమణ, అన్వర్‌బాష, గోపినాథ్ యాదవ్, కటారి సురేశ్ కుమార్, పేలాల రాఘవేంద్ర, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విరివిగా రుణాలు ఇవ్వండి
– కెనరా బ్యాంకు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): వివిధ పథకాల ద్వారా ప్రజలకు విరివిగా రుణాలు అందించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కెనరా బ్యాంకు అధికారులను కోరారు. ఎంపీ స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని తన నివాసంలో మంగళవారం కెనరా బ్యాంకు రీజనల్, డివిజనల్ మేనేజర్ల, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), మైనారిటీల పథకాలు, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, జన్‌ధన్ యోజన, ముద్ర పథకాలను కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ అందేలా చూడాలని ఎంపీ కోరారు. ఆయా పథకాల అమలుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆర్ఎం తిరుపతయ్య, డివిజనల్ మేనేజర్లు బాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ ఉన్నారు. -
‘స్వచ్ఛంద’ వేదిక అభినందనీయం
– కేఎన్ఎన్ జిల్లా సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్జీవోలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ఎన్జీవోస్ నెట్వర్క్(కేఎన్ఎన్) మొట్టమొదటి జిల్లా సమాశాన్ని బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎన్జీవోలు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. అందరూ కలిస్తే రాష్ట్ర వ్యాప్త సేవలుఅందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్జీవోలందించే సేవల పట్ల ఎవరైనా అధికారులు పట్టించుకోకపోతే తన దష్టికి తేవాలన్నారు. తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ దష్టికి తీసుకెళతానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ ట్రస్టు ద్వారా ప్రజలకు విద్య, వైద్యపరమైన ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 132 సంస్థలు కలిశాయని కేఎన్ఎన్ జిల్లా చైర్మన్ మోహన్‌రాజ్ తెలిపారు. ప్రభుత్వం వెళ్లలేని చోటకు సేవా సంస్థలు వెళతాయన్నారు. కన్వీనర్ పాల్ రాజారావు మాట్లాడుతూ.. కరవు కాటకాలు వచ్చినా, సామాజిక సమస్యలు ఉత్పన్నమైనా ఎన్జీవోలు ముందుంటారన్నారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుకను సన్మానించారు. కార్యక్రమంలో హఫీజ్ ఖాన్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఎం.ఎ.మోయీజ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, కేఎన్ఎన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు మద్దిలేటి, నంద్యాల మురళీకష్ణ, ఆదోని ఓంకారాచారితో పాటు ప్రసాద్, శైలజ, త్యాగరాజు, రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం మైనార్టీలకు అండగా వైఎస్ఆర్సీపీ
– పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. మంగళవారం రాత్రి పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో 7వ వార్డు నాయకులు నవీద్, ఉమర్, చాంద్‌బాషా, ఫజ్లు, అమానుల్లా, సద్దామ్, నదీమ్, దావూద్‌తో పాటు 200 మంది ముస్లిం మైనార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గడ్డావీధిలో నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికలో ఎంపీ మాట్లాడుతూ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారనేందుకు చేరికలే నిదర్శనమన్నారు. చేయగలిగిందే చెబుదాం.. నమ్మిన ప్రజలను ఎప్పుడూ మోసం చేయకూడదని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచుగా చెబుతుంటారన్నారు. నీతి, నిజాయితీలే పునాదులుగా తమ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు మున్ముందు బ్యాంకర్లతో చర్చించి రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముస్లింలను టీడీపీ నాయకులు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప సముచిత స్థానం కల్పించడం లేదు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రహ్మాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్.. రాష్ట్ర కార్యదర్శి గుండం ప్రకాశ్‌రెడ్డి, అసెంబ్లీ పరిశీలకుడు శీలారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ లోక్‌నాథ్, నాయకులు సి.హెచ్.మద్దయ్య, రఘు, నూరుల్లా ఖాద్రి, గోపినాథ్, సురేశ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాబుకు ప్రజా సంక్షేమం పట్టదు: గౌరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా సంక్షేమ పథకాల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంది. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగం: బి.వై.రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన స్వర్ణయుగం. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అడగకుండానే ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేద రోగులకు లక్షలాది రూపాయల విలువ చేసే ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. మళ్లీ ఆ పాలన రావాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యం. -
స్వయం ఉపాధిలో రాణించాలి
–మహిళలకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపు – ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, రుణ మంజూరు పత్రాల పంపిణీ కర్నూలు(ఓల్డ్‌సిటీ): వృత్తి విద్యలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. ఎన్‌బీసీఎఫ్‌డీసీ సౌజన్యంతో, అపిట్కో ఆధ్వర్యంలో నగరంలోని మురికివాడలకు చెందిన వంద మంది మహిళలకు ఆధునిక దుస్తుల తయారీలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. విజయవంతంగా ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుక అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో సాధించిన నైపుణాన్ని వస్తువు తయారీలో చూపించాలన్నారు. అలాగే మార్కెటింగ్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తన వంతుగా మొదటి దశలో ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఎంపీ చొరవతో ముస్లిం మహిళలు ఇంట్లోనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. మహిళలు ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నేర్చుకున్న అంశంపై ఉత్తమ వర్క్‌బుక్‌లు తయారు చేసిన ఇద్దరు మహిళలకు హఫీజ్‌ఖాన్ ట్రస్టు ద్వారా నగదు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందిన మహిళలను వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు శిక్షణ పొందిన ఒక్కో మహిళకు రూ. 25 వేల చొప్పున ముద్ర రుణాల మంజూరు పత్రాలను ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమానికి అపిట్కో ఇన్చార్జి మోహన్‌రాజు అధ్యక్షత వహించగా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, నాయకులు డి.కె.రాజశేఖర్, ఎస్.ఎ.అహ్మద్, పి.వి.రాఘవ, సఫియా ఖాతూన్, అన్వర్‌బాషా, కేడీసీసీ బ్యాంక్ డైరక్టర్ లోక్‌నాథ్ యాదవ్, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం సద్భావన మండపాలు ఏర్పాటు చేయండి
– కేంద్ర మైనారిటీ శాఖ మంత్రికి ఎంపీ బుట్టా రేణుక లేఖ కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరం, ఆదోని పట్టణంలో ముస్లిం సద్భావనా మండపాలు నిర్మించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్త్యార్ అబ్బాస్ నక్వీని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆదివారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్నారని, వారి ప్రయోజనార్థం కేంద్ర మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి సద్భావనా మండపాలు నిర్మించాలని ఎంపీ ఆ లేఖలో కోరారు. ప్రధాన మంత్రి వికాస్ యోజన ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ముస్లిం సోదరుందరికీ తెలియజేసేలా ఈ మండపాలు 24 గంటలూ పని చేస్తాయన్నారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కేంద్రాల వద్ద తెలియజేస్తే 48 గంటల్లో కేంద్ర మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుందని తెలిపారు. సద్భావనా మండపాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాలు చూపాలని కోరారు. లేనిపక్షంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖాళీ స్థలాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
టీబీ బోర్డులోకి రాజోలిబండనా?
– ఎజెండా నుంచి తొలగించాల్సిందే – సీడబ్ల్యూసీ చైర్మన్‌తో మాట్లాడిన ఎంపీ బుట్టా, డిప్యూటీ సీఎం – ఈ నెల 20న తుంగభద్ర బోర్డు సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజోలిబండ డైవర్షన్ పథకాన్ని(ఆర్డీఎస్) తుంగభద్ర బోర్డులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఆర్డీఎస్కు నీటి విడుదల వ్యవహారంలో తన పట్టు పెంచుకోవడంతో పాటు ఆధునీకరణ పనులను కూడా మొదలు పెట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేరుగా కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్లు్యసీ) చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో టీబీ బోర్డులోకి రాజోలిబండను చేర్చవద్దని... సమావేశపు ఎజెండా నుంచి కూడా ఈ అంశాన్ని తొలగించాలని కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కి కూడా వివరించారు. ఒకవేళ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తితే.. వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని కూడా ఈఎన్సీకి సూచించారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కూడా ఈఎన్సీకి ఫోన్ చేశారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సుంకేసుల కూడా బోర్డు పరిధిలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇదీ వివాదం...! వాస్తవానికి రాజోలిబండ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా వివాదం తలెత్తింది. రాజోలిబండ ఆధునీకరణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆర్డీఎస్ ఎత్తు పెంపును మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రైతులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నేతత్వంలో అక్కడే బైఠాయించారు. ఆనకట్ట ఎత్తు పెంచితే తమకు నీళ్లు రావనేది ఇక్కడి రైతుల భావనగా ఉంది. మరోవైపు ఆర్డీఎస్ ఎత్తు పెంపు పనులను నిలిపివేస్తున్నారని.. ఇందుకు అనుగుణంగా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ను టీబీ బోర్డు పరిధిలోకి తెస్తే.. సులభంగా ఆధునీకరణ పనులను కొనసాగించవచ్చనేది తెలంగాణ ప్రభుత్వ భావన. ఇందుకు అనుగుణంగా టీబీ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా తెరమీదకు తీసుకొచ్చారు. దీనిని అడ్డుకోకపోతే జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మరింత నీటి కరువుతో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బోర్డు పరిధిలో ఉన్న ఎల్ఎల్సీలకు సరిపడినన్ని నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కోవలో రాజోలిబండ ఆయకట్టు ప్రాంతం కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళన ఇక్కడి రైతుల్లో వ్యక్తమవుతోంది. -
కల్యాణ మండపం ఏర్పాటుకు కృషి
–ఎంపీ బుట్టారేణుక ఆదోని: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సమాజానికి కల్యాణ మండపం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక హామీ ఇచ్చారు. బుధవారం ఆమె స్థానిక షరాఫ్ బజారులోని కాళికాకమఠేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఉత్సవాల నిర్వాహకులు మేళతాళాలతో ఆమె స్వాగతం పలికారు. ఎంపీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొంత స్థలం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక్కడ కల్యాణ మండపం నిర్మించాలని విశ్వబ్రాహ్మణ సమాజం పెద్దలు కోరారన్నారు. మండపం నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించవచ్చో లేదో పరిశీలిస్తానన్నారు. పట్టణ ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. అనంతరం సమాజం మహిళలు బుట్టా రేణుకకు చీర,సారె బహూకరించగా సమాజం పెద్దలు శాలువ కప్పి సత్కరించారు. స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేణుమాధవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, పట్టణ ప్రముఖులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శిల్పి గుండాచారి, శ్రీనివాస ఆచారి, ఉపాధ్యక్షుడు మహేష్ ఆచారి, కార్యదర్శి అనిల్ ఆచారి, సంఘం ప్రముఖులు రవికుమార్ ఆచారి, శ్రీకాంత్ ఆచారి, జగదీష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ సోషల్వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డులో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ బోర్డు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఒక భాగం. గత జూన్ నెల 20వ తేదీ నుంచే సభ్యత్వం ప్రారంభమైంది. బుట్టా రేణుక ఈ బోర్డులో మూడేళ్ల పాటు సభ్యురాలుగా కొనసాగుతారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు అధ్యక్షులందరు సభ్యులుగా ఉంటారు. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో బుట్టా రేణుకతో పాటు ప్రియాంక రావత్‌కు సభ్యత్వం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల అయింది. -
ప్రభుత్వ ముద్రణాలయ అభివృద్ధికి కృషి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాత బస్టాండు సమీపంలోని ప్రభుత్వ ముద్రణాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఫ్లోరింగ్, డ్రైనేజీ, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకుల ఆహ్వానం మేరకు శనివారం ఆమె ముద్రణాలయాన్ని పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ముద్రణాలయాన్ని, నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, కుంగిపోయిన బండ పరుపును పరిశీలించారు. దీనిపై స్పందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. ప్రతిపాదనలు పంపాలని అసిస్టెంట్ మేనేజర్ కె.సురేందర్బాబును కోరారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ కర్నూలులో దివ్యాంగుల కోసం నిర్మించతలపెట్టిన సెన్సరీ పార్క్‌ను సీతారామనగర్లోని ప్రభుత్వ ముద్రణాలయ స్థలంలో కాకుండా వేరేచోట నిర్మించాలని ఎంపీతో విన్నవించుకున్నారు. స్థల విస్తీర్ణం ఏడెకరాలు కాదని, 4.34 ఎకరాలు మాత్రమేనని, గతంలోనే ప్రెస్ కొత్త భవనం నిర్మాణానికి రూ. ఏడు కోట్ల నిధులు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఎంపీ బుట్టా రేణుక వెంటనే స్పందించి మానిటరీ సర్వే కమిటీ అధికారి (దివ్యాంగ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ పర్సనల్ సెక్రటరీ) రమేశ్ కుమారంతో ఫోన్లో మాట్లాడారు. సెన్సరీ పార్కు కోసం శుక్రవారం పరిశీలించిన స్థలం బదులుగా వేరే స్థలాన్ని చూడాలని కోరారు. అనంతరం ఆమె ఉద్యోగులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మీరు జిల్లా కలెక్టర్‌తో కూడా విన్నవించుకోవాలని సూచించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ, ఎస్సీసెల్ విభాగాల కార్యదర్శులు రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య, పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, పార్టీ నాయకులు బోదేపాడు భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు కటారి సురేశ్‌కుమార్, కిశోర్, మౌలాలి, సవారి, లాలు, బుజ్జి, గవర్నమెంట్ ప్రెస్ వైఎస్ఆర్టీయూసీ నాయకులు రవీంద్రస్వామి, బి.ఎస్.శ్రీనివాసులు, మహేశ్వరరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించని ప్రభుత్వం
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కర్నూలు ఎంపీబుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం పుల్లగుమ్మిని సందర్శించారు. - ఎంపీ బుట్టా రేణుక వెల్దుర్తి రూరల్: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తాను దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం పుల్లగుమ్మిని సోమవారం ఆమె సందర్శించారు. ఎంపీ నిధులతో నిర్మిస్తున్న రోడ్లు ముందుకు సాగకపోవడంతో పీఆర్ ఏఈ అచ్యుతానందరెడ్డిని వివరాలు అడిగి తెసుకున్నారు. మరో 30 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు.. ఎన్‌ఆర్‌ఇజియస్‌తో కలిపి మొత్తంగా గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఏఈని ఆదేశించారు. గ్రామంలో సభను నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో వీధి వీధి తిరిగి సమస్యలను గుర్తించారు. పాఠశాలలకు డెస్క్‌లు లేకపోవడం గమనించారు. బస్సెల్టర్ నిర్మాణం, కరెంటు స్తంభాల అవసరం గుర్తించారు. పుల్లగుమ్మి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని..అందుకు ప్రజలు సహకరించాలన్నారు. అభివృద్ధికి మోకాలడ్డు కేంద్ర ప్రభుత్వం తరఫున తాను నాగులదిన్నె గ్రామాన్ని, రాష్ట్రప్రభుత్వం తరఫున పుల్లగుమ్మి గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ఎంపీ బుట్టా రేణకు తెలిపారు. వాటికి 50 లక్షల రూపాయలకు మించి నిధులు విడుదల చేయించి అభివృద్ధి చేస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం సహకారం అందించడం లేదన్నారు. ఒక్క పని కూడా రాష్ట్ర సహకారంతో జరిగింది లేదన్నారు. కేంద్రప్రభుత్వంతో.. ప్రిన్స్‌పల్ సెక్రటరీలతో తాను వివిధ దశల్లో మాట్లాడిన ఫలితంగా హంద్రీనీవా పనులు, అభివృద్ధి పనులు కొద్దిగానైనా ముందుకు సాగుతున్నాయన్నారు. తాను చేస్తున్న అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డడం వింతగా కనిపిస్తోందన్నారు. అభివృద్ధి పట్ల అధికార పార్టీ నాయకులు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, తహసీల్దార్ శారద, ఎంపీడీవో అబ్దుల్ వహీద్, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు బొమ్మన సుబ్బారెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాగులదిన్నెలో కర్నూలు ఎంపీ రాత్రి బస
నాగులదిన్నె (నందవరం) : మండల పరిధిలోని నాగులదిన్నె గ్రామంలో ఎంపీ బుట్టా రేణుక గురువారం రాత్రి బస నిర్వహించారు. ఈ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు. గురువారం రాత్రి స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, మూడు నెలల్లో గ్రామంలో రూపురేఖలు మారుతాయని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పేదలందరికీ ఇళ్లు, చేనేత కార్మికుల కోసం షెడ్లు నిర్మిస్తామన్నారు. మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 12వేలు నిదులు మంజూరు చేస్తోందన్నారు. గ్రామానికి జూనియర్ కళాశాల మంజూరైందని, ఈ ఏడాది నుంచి ఇక్కడే ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం కోసం రూ. 10 లక్షలతో రెండు ఆర్వో ప్లాంటు నిర్మాణాలు మంజూరైనట్లు చెప్పారు. అనంతరం స్థానికులతో కలిసి ఎంపి సహపంక్తి భోజ నం చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడనే బసచేశారు. సమావేశంలో సర్పంచ్ ప్రభాకర్, తహశీల్దార్ రవికుమార్, ఇన్చార్జి ఎంపీడీవో రమణమూర్తి, ఈవోపీఆర్డీ ఎలీష, ఎస్ఐ వేణుగోపాలరాజు, ఎంపీ పీఏలు శ్రీనివాసరావు, శివశంకర్, కార్యదర్శి అయ్యపురెడ్డి, నక్కలమిట్ట శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, బాస్కర్‌రెడ్డి, స్థానిక పెద్దలు సంగాల సత్యన్న, రంగయ్యశెట్టి, రమేష్, సుదీర్‌బాబు పాల్గొన్నారు. -
ఈసారీ.. ఫలించని బుట్టా ప్రయత్నం
మంత్రాలయం-కర్నూలు కొత్త రైలు మార్గం ఏర్పాటు కోసం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తను గెల్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా నిధుల జాడ లేక ఆ ప్రాజెక్టు మూలనపడింది. ఈ విషయాన్ని ఆమె శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ స్పష్టం చేశారు. ఏటేటా పెరిపోతున్న అంచనాలు గతంలో రూపొందించిన రూ.165 కోట్లు అంచనా విలువ 2011 నాటికి రూ.900 కోట్లకు చేరింది. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10 కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. అయితే రైల్వే శాఖ నిబంధల ప్రకారం ఆ శాఖ మంజూరు చేసే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అందుకు సిద్ధపడితేనే పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు ముందు ప్రతిపాదనలు పంపుతారని సమాచారం. జిల్లాపైన టీడీపీ ప్రభుత్వం ఆది నుంచి వివక్ష ధోరణి ప్రదర్శిస్తోందన్న విషయం మరోసారి రుజువైంది. ఏళ్ల తరబడి ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుముఖత చూపకపోవడంతో మళ్లీ నిరాశే మిగిలింది. కర్నూలు రాజ్‌విహార్: ఒకటి కాదు.. రెండు కాదు.. నలభై మూడేళ్ల నిరీక్షణ... ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆధ్యాత్రిక కేంద్రమైన మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వే కొత్త మార్గానికి దిక్కులేదు. ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పైన పేర్కొన్న రైలు మార్గం ప్రస్తావనే లేదు. కొత్త రైలు ప్రాజెక్టుల జాబితాలో దీనికి స్థానం కల్పించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొన్న రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన తన వాటా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రెండు సార్లు సర్వే కోసం కేటాయించిన నిధులు వృధా అయ్యాయి. భూ సేకరణ, పనుల ప్రారంభానికి నిధులు మంజూరు కాకపోడంతో సర్వేతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో కోరుతున్నా... మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని పల్లెలు, కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైల్వే మార్గం నిర్మించాలన్నది దశాబ్దాల ప్రతిపాదన. 1970లో కర్నూలు ఎంపీ, ఎమ్మిగనూరు ప్రాంతనేత వై.గాదిలింగన్న గౌడ్ మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పార్లమెంటులో చర్చించారు. అప్పటి నుంచి ఇది కలగానే మిగిలింది. చివరకు 2004లో రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధికి ఈ లైను నిర్మించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు. సర్వే పూర్తి చేసి నివేదికలు సైతం అందజేశారు. అంతటితో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. 2010లో మళ్లీ ఒత్తిడి తెచ్చినా... ఎన్నికల అస్త్రంగా మారిన మంత్రాలయం రైల్వేలైన్ ఏర్పాటును కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, అప్పటి రైల్వే సహాయ మంత్రి మునియప్ప ద్వారా 2010లో మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో రైల్వే లైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ, భూ కొనుగోలు వ్యయం దృష్ట్యా రీసర్వే చేయాలని నిర్ణయించారు. 2011 ఫిబ్రవరి 23న రైల్వే పనుల సర్వేకు రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టరు ఒకరు టెండర్ దక్కించుకుని సర్వే చేసి 2011 డిసెంబర్లో సర్వే నివేదికలు సమర్పించారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని, మంత్రాలయం సమీపంలోని కొండాపురం వద్ద రైల్వే స్టేషను నిర్మించాలని సూచించారు. రైలు మార్గం ఏర్పాటయ్యే ప్రాంతాల్లోనే రైతుల పొలాల్లో హద్దులు కూడా నిర్ధరించారు. -
పొదుపు సంఘాల మహిళలతో ఎంపీ రేణుక సమావేశం
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీ బుట్టా రేణుక, జడ్పీ చైర్మన్ రాజశేఖర్ సోమవారం సమావేశమయ్యారు. వివిధ సంఘాల పనితీరును వారు సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంప్రదించాలని.. తామెప్పుడూ ప్రజల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు.