ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి
Published Mon, Jun 12 2017 10:29 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM
– ఎంపీ బుట్టా రేణుకను కలిసిన ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి ప్రతినిధులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి జిల్లా శాఖ నాయకులు ఎంపీ బుట్టారేణుకను కోరారు. సోమవారం వారు ఎంపీని జోహరాపురంలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకు వ్యాపార, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలు ఉన్నారని, వారికి కారొ్పరేషన్ ఉంటే మేలు జరుగుతుందన్నారు. దీనిపై ఎంపీ బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీని వారు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విఠల్‌శెట్టి, ప్రతినిధులు నాగేళ్ల రాజగోపాల్, గూడూరుగోపాల్, విజయ్, భాస్కర్, శేషగిరిశెట్టి, కె.కిరణ్, కె.నవీన్, కె.కిశోర్, పి.సుధాకర్, వి.హరి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జ్ఙానేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement