arya vysya
-
ఘనంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు !
హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇది ఇసామియా బజార్‌లోని నరసింహాస్వామి ఆలయం దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఫలహారం, అభిషేకం, సహస్త్ర నామార్చనతోపాటు హోమము నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి సంఘం సభ్యులందరికీ పగడి కట్టడం జరిపారు. ఈ సమయంలోనే సామూహిక కుంకుమార్చన సంఘంలోని మహిళ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం, అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సంఘం సభ్యులంతా దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఆలంపల్లి రవికుమార్, ట్రెజరర్ ఎర్రం లక్ష్మణ్, ఐపిపి మ్యాడమ్ అశోక్. ప్రాజెక్ట్ కన్వీనర్ హరినాతినీ శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ కల్వకుంట్ల శ్రీనివాస్. కోకన్వీనర్స్: పారెపల్లి మల్లేష్, పల్లెర్ల హరీష్ కుమార్, చీకటిమర్ల సంగయ్య. కో చైర్మన్: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖర్, నూనె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు -
బొండా ఉమా గో బ్యాక్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలవకపోయినా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా రావడంతో ఉద్రిక్తంగా మారింది. ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. చివరకు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్లో గల ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వనం మేరకు విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా అక్కడికి వెళ్లారు. వేదికపై వెళ్లి కూర్చోవడంతో ఆర్యవైశ్య కులానికి సంబంధం లేని బొండా ఉమా కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి ప్రశ్నించారు. పిలవకపోయినా అభినందించడానికి వచ్చారని, పిలవకపోయినా వస్తామంటూ బొండా ఉమా అనుచరుడు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. దీంతో బొండా ఉమా వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వివాదం విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఆ హాల్‌కు వెళ్లి.. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామంటేనే అనుమతులు ఇచ్చామని నిర్వాహకులతో చెబుతుండగా.. డూండి రాకేశ్ వచ్చి ఇది తమ అంతర్గత సమావేశమని, పోలీసులు ఎందుకు వచ్చారంటూ వాదనకు దిగారు. కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నామని పోలీసులు నిర్వాహకులతో చెప్పి హాలులో ఉన్న సభ్యులందరినీ బయటకు పంపించేశారు. డూండి రాకేశ్‌ను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. డూండి రాకేశ్ అత్యుత్సాహమే వివాదానికి కారణమని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెప్పారు. బొండా ఉమాకు తాము ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య ప్రముఖులకు మాత్రమే ఆహ్వనాలు పంపామని చెప్పారు. బొండా ఉమా కావాలనే తమ కార్యాక్రమానికి వచ్చి వివాదం రాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు ఆర్యవైశ్యులు వార్నింగ్
-
ఆర్య వైశ్యులపై అనుచిత వ్యాఖ్యలు..చిక్కుల్లో చంద్రబాబు..
-
వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించిన ఆర్య వైశ్య సంఘం
-
ఐర్లాండ్‌లో ఆర్యవైశ్య సమ్మేళనం
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్‌లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు. తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్యవైశ్యుల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకొస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు చంద్రబాబు ఏం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుది వైశ్యుల పట్ల కపట ప్రేమ అని, కొంతమంది ఆర్యవైశ్యులు టీడీపీలో చేరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘టీజీ వెంకటేష్, అంబికా కృష్ణ, కవిత వంటి వారు ఎందుకు టీడీపీ నుంచి బయటికి వచ్చారు. కావాలనే కొందరు ఆర్యవైశ్య మహాసభ పై బురద జల్లాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది. ఆర్య వైశ్యులకు సంబంధించి దేవాదాయశాఖలో ఉన్న ఆస్తులను ఆర్యవైశ్యుల ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆర్యవైశ్యుల మనోభావాల మేరకు చింతామణి నాటకాన్ని రద్దు చేశారు. ఎవరెన్ని చేసినా ఆర్యవైశ్య మహాసభ చెక్కు చెదరదు. చిన్న చిన్న మనస్పర్ధలను సరిచేసుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారు: డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని, ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఆర్యవైశ్య మహాసభకు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నాం. కొన్ని అవాంతరాలు వచ్చినా మహాసభను పటిష్టం చేసి భవన నిర్మాణం పూర్తి చేస్తాం. కొంతమంది మహాసభలో పదవుల కోసం టీడీపీలో చేరి సమ్మేళనాలు పెడుతున్నారు. సమ్మేళనం పెట్టినా తప్పులేదు కానీ ఆర్యవైశ్యులకు ఏం చేస్తారో చెప్పాలి. మహాసభను అగౌరవపరిస్తే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అగౌరవపడినట్టే’’ అని కోలగట్ల పేర్కొన్నారు. చదవండి: లోకేశ్‌కు మంత్రి కాకాణి సెటైరికల్ పంచ్ -
విజయవాడలో ఆర్యవైశ్యుల సమ్మేళనం
-
ధర్మపరిరక్షణకు ప్రభుత్వం కృషి
సాక్షి, అమరావతి: హైందవధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుతోపాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ధార్మికసంస్థలు, పీఠాలకు భూములు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి, అనంతపురంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధర్మప్రచారానికి ముందుకొస్తున్న ప్రభుత్వంపై పచ్చపత్రికలు కుట్ర పూరితంగా విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. స్వామీజీలకు కూడా రాజకీయాలను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పీఠాధిపతుల కోరిక మేరకు స్థలాలు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కావూరి సాంబశివరావుకు అప్పనంగా 400 ఎకరాలు ఇచ్చారని, విశాఖలో లోకేశ్ భూములను పంచిపెట్టినప్పుడు పచ్చపత్రికలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఈషా ఫౌండేషన్‌కు చంద్రబాబు స్థలం ఇస్తానని ప్రకటించగానే ఫౌండేషన్‌కు గొప్ప అవకాశం కల్పిస్తున్నారంటూ వార్తలు రాయలేదా అని నిలదీశారు. ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ వాసవీకన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీని తగ్గిస్తూ వాటి నిర్వహణను ఆర్యవైశ్యులకే అప్పగించేలా తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారన్నారు. ఆయన తనయుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను అమ్ముకోవడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణలో ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ లభించిందన్నారు. సీఎంకు ఆర్యవైశ్య సంఘం ధన్యవాదాలు సీఎం వైఎస్ జగన్‌ని ఏపీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గురువారం కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్లో తీర్మానం చేసినందుకు సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో మంత్రి వెలంపల్లి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఎం. ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు కె.విద్యాధరరావు తదితరులున్నారు. -
ఆర్యవైశ్య సభ సింగపూర్ విభాగానికి నూతన కార్యవర్గం
సింగపూర్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అంతర్జాతీయ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ సింగపూర్ విభాగానికి మంగళవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. వామ్ సింగపూర్ విభాగానికి అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా పట్టూరి కిరణ్ కుమార్, కోశాధికారిగా వుద్ధగిరి సతీష్, ఉపాధ్యక్షులుగా కంకిపాటి శశిధర్‌తో కూడిన నూతనకార్యవర్గం నియమితులైంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు భాస్కర్ గుప్త మాట్లాడుతూ అంతర్జాతీయ విభాగ సూచనలతో, అందరి సహాయ సహకారాలతో సింగపూర్‌లో నివశించే ఆర్యవైశ్యుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కొత్త కార్యవర్గానికి త్వరలోనే నియామకపత్రాలను జారీ చేస్తామని అంతర్జాతీయ కార్యదర్శి పసుమర్తి మల్లిఖార్జున గుప్త వెల్లడించారు. సింగపూర్ విభాగం అంటే తనకు ప్రత్యేక శ్రద్ధఅని, నూతన కమిటీ వినూత్న కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందగలదని తాను బలంగా నమ్ముతున్నానని వామ్ గ్లోబల్ ఎన్నారై చైర్మన్ యమ్.యన్.ఆర్. గుప్త పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి సింగపూర్ ఆర్యవైశ్యులు శుభాభినందనలు తెలిపారు. -
నాడు వైఎస్.. నేడు జగన్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం తలకిందులైన తరుణంలోనూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుకుంటూ పోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాదిలోపే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తొలి నుంచీ ఆర్యవైశ్యులంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన హయాంలోనే ఆర్యవైశ్యులే కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు, సత్రాలు చూసుకునేలా జీవోలు ఇచ్చారని తెలిపారు. గతంలో తాము అడిగిందే తడవుగా నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా వైఎస్ నామకరణం చేశారన్నారు. వారింకా ఏమన్నారంటే... బాబు మోసం చేశారు.. ► టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా రూ.30 కోట్లు ఇస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో రాష్ట్రంలోని ఆర్యవైశ్య ప్రముఖులు కట్టించిన ఎన్నో సత్రాలు, ఆలయాలన్నీ దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. ► మేము అడిగిన తరువాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆర్యవైశ్యుల ఆస్తులు వాళ్లే నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి జగన్ చెప్పటం గర్వకారణం. ఇళ్ల పట్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోనూ వైశ్యులు భాగస్వాములు అవ్వటం సంతోషంగా ఉంది. గతంలో వైఎస్సార్– కె.రోశయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు జగన్–వెలంపల్లి ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోంది. ఆర్యవైశ్యుల కల నెరవేర్చారు.. ► ఆర్యవైశ్యులకో కార్పొరేషన్ కావాలనేది ఎప్పటినుంచో ఉన్న కల. దానిని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. మేము నిధులు అడగ్గానే రూ.50 కోట్లను మంజూరు చేశారు. తరువాత మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. టీటీడీ బోర్డులో ఇద్దరు ఆర్యవైశ్యులను నియమించారు. ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా రేపాల శ్రీనివాస్‌ను నియమించారు. అన్నవరం, కనకదుర్గ, ద్వారకా తిరుమల క్షేత్రాల్లో ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. వెలంపల్లి శ్రీనివాస్ గారికి మంత్రిమండలిలో స్థానం కల్పించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్యవైశ్యులపై చూపిస్తున్న ప్రేమను చూసే మద్దాలి గిరి, శిద్దా రాఘవరావు వంటి ఆర్యవైశ్య ప్రముఖులు మద్దతు పలికారు. ► చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆర్యవైశ్యుల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతో గొప్పది. ఇప్పటివరకు జగన్ మాదిరిగా ఇంత ప్రాధాన్యత కలిగిన పదవులను వైశ్యులకు ఎవ్వరూ ఇవ్వలేదు. -
ఆర్య వైశ్యులకు టీడీపీ చేసిందేమీ లేదు: మంత్రులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్య వైశ్య వేల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కుప్పం ప్రసాద్ ప్రమాణం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్‌తో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. వైశ్యులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో 10 శాతం జనాభా ఆర్యవైశ్యులు ఉన్నారని.. వేల కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, నిబద్ధతకు నిదర్శనం అయితే.. చంద్రబాబు మోసం, దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు చేసిందని ధ్వజమెత్తారు. కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వైశ్యులకు కార్పొరేషన్ అండగా నిలవాలని కోరారు. ఆర్య వైశ్యులకు అండగా నిలవాలి.. ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు అండగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ప్రసాద్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పనిచేసి.. పేదలకు చేయూత నివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వానికి, వైశ్యులకు సంధాన కర్తగా ప్రసాద్ పనిచేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వైశ్యులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపి సీఎం జగన్ గౌరవించారని పేర్కొన్నారు. ఆయనకు వైశ్యులంతా అండగా ఉండాలని కోరారు. వైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ వాసవిమాత ఆలయ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ కోటిన్నర నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో పేదలైన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఆర్య వైశ్యుల్లో అధిక శాతం పేదలున్నారని.. కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్ జగన్ చిన్నచూపు చూశారనే ఆరోపణలు అవాస్తమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు జగన్ గౌరవించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ తన పోరాటం సోనియాగాంధీపై చేశారే తప్ప రోశయ్యపై కాదని వివరించారు. రోశయ్యను జగన్ ఎన్నడూ ఒక మాట కూడా అనలేదని.. రోశయ్య సీఎం గా ఉన్నంత కాలం జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్ వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించారని తెలిపారు. కార్పొరేషన్‌కు సీఎం జగన్ వచ్చే బడ్జెట్లో తగిన నిధులను కేటాయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులందరికీ కార్పొరేషన్ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైశ్యులంతా వైఎస్సార్సీపీ వెంటే.. ఆర్య వైశ్య సమాజం అంతా వైఎస్సార్సీపీ వెంట నడుస్తోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనా కృషి ఫలితంగానే ఆర్య వైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద వైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు మోసం చేశారు.. వైశ్యులంటే సేవ, నిజాయితీకి నిదర్శనమని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు అన్నారు. గత టీడీపీ పాలనలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అడిగితే వరాలు ఇచ్చేది దేవుడయితే... పేదల కళ్లలో కష్టాలు చూసి వరాలు ఇచ్చే దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. గాంధీజీ, పొట్టి శ్రీరాములు ఆశయ సాధనలో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు. -
వైఎస్సార్సీపీలోకి ఆర్యవైశ్యుల చేరిక
సాక్షి, కొవ్వూరు: రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ఆ పార్టీ సీజీసీ సభ్యులు పెండ్యాల కృష్ణబాబు కోరారు. పట్టణంలో సాయిలక్ష్మి రెసిడెన్సిలో మంగళవారం నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన మహిళకు టీడీపీ వారు టిక్కెట్టు ఇస్తే, ఇక్కడ స్థానికురాలైన తానేటి వనిత వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్నారు. వివాద రహితురాలిగా ఉండే వనితను గెలిపించుకుంటే రానున్న రోజుల్లో అందరికీ మేలు చేస్తారని చెప్పారు. అలాగే ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ని గెలిపించాలని కోరారు. తాను ఎప్పటికీ మీ మనిషిగానే అందుబాటులో ఉంటానని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, వాసవీక్లబ్ అధ్యక్షురాలు ఉప్పల శ్రీవల్లి, వాసవీక్లబ్ జోన్ చైర్మన్ కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్ సీపీకి ఆర్యవైశ్యులంతా అండగా ఉంటామని ఆ సంఘం నాయకులు మద్దతు పలికారు. పార్టీ నాయకుడు వాసవీక్లబ్ ఇంటర్ నేషనల్ ప్రోగాం కో–ఆర్డినేటర్ వలివేటి ప్రసాద్, కాకి అనిల్ సూర్య సారథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వాసవీక్లబ్ అధ్యక్షుడు ఉప్పల రవికుమార్, ఆర్యవైశ్య సంఘ నాయకులు మన్యం ఈశ్వర్, చక్కా సూర్య గౌతమ్, గ్రంధి గౌతమ్, దేవతు కృష్ణప్రసాద్, రాఘవ రమాకాంత్, నాగవరపు హనుమంతు, పీఎల్ రామ్‌కుమార్, తీగెల రవికుమార్, ముత్తా రామారావు, సత్యవరపు గురున్నాధం, జల్లూరి శ్రీకాంత్, అద్ధెపల్లి మూర్తితో పాటు మాజీ కౌన్సిలర్ బాలదారి బాబ్జీ వైఎస్సార్ సీపీలో చేరారు.కృష్ణబాబు, శివరామకృష్ణలు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొల్లేపర శ్రీనివాస్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. -
ఇదండీ.. బాబుగారి కార్పొరేషన్ కహానీ
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మార్చి 11 నుంచి అమల్లోకి రాగా, సరిగ్గా దానికి 20 రోజులుగా ముందుగా.. అంటే ఫిబ్రవరి 19వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ప్రకటించి చైర్మన్‌ను నియమించారు. అప్పటికే నాలుగున్నర సంవత్సరాలకుపైగా పరిపాలించిన ఆయనకు ఏనాడూ గుర్తుకురాని ఆర్యవైశ్యులు.. ఎన్నికలు రావడానికి కేవలం 20 రోజులే ఉందనగా గుర్తుకురావడం ఆ సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 20 రోజులకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అందువలన ఏ ఒక్కరికీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చలేకపోయామని టీడీపీ పాలకులు ముసలి కన్నీరు కార్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కేవలం ఓట్ల కోసమే ఎన్నికల కోడ్ రావడానికి 20 రోజులు ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి మభ్యపెట్టేందుకు ప్రయత్నించడాన్ని అర్థం చేసుకున్న ఆ సామాజికవర్గం ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేయకపోగా, మళ్లీ ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను నయవంచనకు గురిచేసిన చంద్రబాబుకు, టీడీపీకి ఈ నెల 11న జరిగే పోలింగ్‌లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారు. ఒక్కరికీ రుణం అందకపోవడంతో అసంతృప్తి వెల్లువ... హడావిడిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు, చైర్మన్ నియామకం వంటివి ఓట్ల కోసం మినహా ప్రజలకు లబ్ధిచేకూర్చేందుకు కాదని భావించని ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు రుణాల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఒక్కరికీ కూడా రుణం అందకపోవడం, కనీసం ఒక ప్రణాళిక కూడా రూపొందించకపోవడంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా ఆర్యవైశ్యులకు కేటాయించకపోవడంపై టీడీపీ పట్ల ఆ సామాజికవర్గంలో అసహనం వ్యక్తమవుతోంది. బాబుగారి కార్పొరేషన్ కహానీ వెనుకున్న కుట్రను అర్థం చేసుకున్న ఆర్యవైశ్యులు ప్రస్తుత ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. జగన్ పథకాలను కాపీ కొట్టి కార్పొరేషన్ ఏర్పాటు... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆయా కులాల్లోని పేదల అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగన్ పథకాలు ఎక్కడ తన కొంప ముంచుతాయోనని చంద్రబాబు వాటిని కాపీ కొట్టారు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన శిద్దా వెంకటేశ్వరరావును హడావిడిగా చైర్మన్‌గా నియమించి ఆ సామాజికవర్గం ఓట్లు కొల్ల గొట్టి మోసం చేయాలని ప్రయత్నించారు. రుణాల కోసం దరఖాస్తు చేసిన వారికి నిరాశ... ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కాగానే ఆ సామాజికవర్గానికి చెందిన ఆశావహులు రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 241 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో వాటి కోసం 2,473 మంది దరఖాస్తు చేశారు. త్రిపురాంతకం, ఉలవపాడు, యద్దనపూడి, బల్లికురవ, సీఎస్ పురం, దొనకొండ, హనుమంతునిపాడు, కందుకూరు, కొత్తపట్నం, లింగసముద్రం మండలాల్లో రుణాల లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేదు. బల్లికురవ, సీఎస్ పురం, హనుమంతునిపాడు, కందుకూరు, కొత్తపట్నం, లింగసముద్రం, త్రిపురాంతకం, ఉలవపాడు, యద్దనపూడి మండలాల్లో లబ్ధిదారుల ఎంపికకు కనీసం ప్రణాళికను కూడా అధికారులు నిర్దేశించలేదు. మిగిలిన మండలాలు, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అవకాశం కల్పించడంతో అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం మండలాల వారీగా అందిన దరఖాస్తులు... మండలం కేటాయించిన యూనిట్లు అందిన దరఖాస్తులు అద్దంకి 1 20 అద్దంకి అర్బన్ 25 79 అర్ధవీడు 3 28 బల్లికురవ 0 0 బేస్తవారిపేట 2 2 సీఎస్ పురం 0 0 చీమకుర్తి 4 18 చీమకుర్తి అర్బన్ 4 8 చినగంజాం 1 87 చీరాల 3 33 చీరాల అర్బన్ 4 64 కంభం 1 70 దర్శి 8 34 దొనకొండ 3 40 దోర్నాల 10 17 గిద్దలూరు 4 60 గిద్దలూరు అర్బన్ 3 111 గుడ్లూరు 2 25 హనుమంతునిపాడు 0 0 ఇంకొల్లు 3 87 జె.పంగులూరు 1 23 కందుకూరు 0 4 కందుకూరు అర్బన్ 4 9 కనిగిరి 3 10 కనిగిరి అర్బన్ 10 116 కారంచేడు 3 41 కొమరోలు 3 16 కొనకనమిట్ల 1 16 కొండపి 4 31 కొరిశపాడు 2 34 కొత్తపట్నం 0 0 కురిచేడు 6 45 లింగసముద్రం 0 29 మద్దిపాడు 1 1 మార్కాపురం 2 27 మార్కాపురం అర్బన్ 4 211 మర్రిపూడి 4 16 మార్టూరు 3 46 ముండ్లమూరు 4 27 నాగులుప్పలపాడు 3 39 ఒంగోలు 3 15 ఒంగోలు అర్బన్ 40 107 పామూరు 2 15 పర్చూరు 3 47 పెద్దారవీడు 9 39 పీసీ పల్లి 1 18 పొదిలి 4 46 పొన్నలూరు 2 16 పుల్లలచెరువు 3 32 రాచర్ల 3 16 సంతమాగులూరు 1 25 సంతనూతలపాడు 3 29 సింగరాయకొండ 4 45 టంగుటూరు 4 19 తాళ్లూరు 4 19 త్రిపురాంతకం 0 92 ఉలవపాడు 0 52 వెలిగండ్ల 2 26 వేటపాలెం 4 67 వలేటివారిపాలెం 2 13 యద్దనపూడి 0 0 యర్రగొండపాలెం 4 53 జరుగుమల్లి 4 23 మొత్తం 241 2,473 ఆర్యవైశ్యులకు అన్యాయం చేశారు ఆర్యవైశ్యులకు ప్రకటించిన కార్పొరేషన్ రుణాలు ఎక్కడా ఇవ్వలేదు. జిల్లాలో మంత్రిగా శిద్దా రాఘవరావు ఉన్నప్పటికీ ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యులకు తీవ్రంగా అన్యాయం చేశారు. టీడీపీని ఆర్యవైశ్యులు నమ్మే ప్రసక్తే లేదు. గిద్దలూరు ప్రాంతంలో సుమారు 12 వేల మంది ఆర్యవైశ్యులు ఉంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు జాబితాలో కేవలం ముగ్గురి పేర్లే ఉన్నాయి. వారికి కూడా నేటికీ రుణాలు మంజూరు కాలేదు. - గర్రె శ్రీనాథ్, ఆర్యవైశ్య యువజన సంఘ మండల అధ్యక్షుడు, గిద్దలూరు రుణం కోసం కాళ్లరిగేలా తిరిగా టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని ప్రకటించడంతో దరకాస్తు చేసుకుని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇంటి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది. - సుబ్రహ్మణ్యం, బుక్ స్టోర్ వ్యాపారి, గిద్దలూరు ఎన్నికల కోసం హడావిడి మినహా చేసిందేమీ లేదు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో చంద్రబాబు కూడా హడావిడిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మోసపూరిత మాటలు చెప్పారు. చైర్మన్, పాలకమండలి సభ్యులను నియమించడం మినహా ఒక్కరికి కూడా లబ్ధిచేకూర్చలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని సూచించడంతో పేద ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కరికీ రుణం మంజూరు చేయకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆర్యవైశ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడతాం. - కుప్పం ప్రసాద్, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య అధ్యయన కమిటీ రాష్ట్ర చైర్మన్ చంద్రబాబు మోసం చేశారు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఎన్నికలకు ముందు వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరికీ లబ్ధి చేకూర్చలేదు. కేవలం ఎన్నికలు, ఓట్ల కోసమే కోడ్ వచ్చేందుకు 20 రోజులు ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. - చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్, మార్కాపురం -
‘ఈబీసీ కోటాలో మా వాటా ఎంతో తేల్చండి’
సాక్షి, గుంటూరు : అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో తమ వాటా ఎంతో తేల్చాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ విషయంపై సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా ఈబీసీ రిజర్వేషన్లో కనీసం ఐదు శాతం వాటాను తమకు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ విషయమై మాజీ సీఎం రోశయ్యతో కూడా చర్చలు జరపాలని భావించిన ఆర్యవైశ్య సంఘం సీనియర్ నేతలు.. హైద్రాబాద్‌కు పయనమయ్యారు. రానున్న రెండు రోజుల్లో రిజర్వేషన్ విషయమై తమ పూర్తి డిమాండ్లను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు ఆర్యవైశ్య మహాసభ మద్దతు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్య మహాసభ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మల్లికార్జున్, రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, ప్రతినిధులు నిరంజన్, పిల్లలమర్రి కిషోర్, ప్రతాప్ తదితరులు మాట్లాడారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటి చైర్మన్ దామోదర రాజనర్సింహను ఆర్యవైశ్యులు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆవశ్యకతను వివరించగా సానుకూలంగా స్పందించారని, స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఆర్య వైశ్యుల సమస్యలు వినేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ హామీని కాపీకొట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మోసపూరిత వాగ్దానం చేయడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల కొడంగల్ సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆర్యవైశ్యులను కుక్కలుగా వ్యాఖ్యానించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజీవ్‌గాంధీ సద్భావనయాత్ర సందర్భంగా ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి చెందిన రోశయ్యకు అవార్డు ఇవ్వడం పట్ల ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. రోశయ్యను అవమానపర్చడం వైశ్య సామాజిక వర్గానికి జరిగిన అవమానమే అని పేర్కన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సినీనటి శైలజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ కండువా వేసి శైలజను పార్టీలోకి ఆహ్వానించారు. -
తెలంగాణ ఇయ్యలే.. గుంజుకున్నం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎవ్వరో ఇయ్యలేదని, గుంజుకున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కేటీఆర్ కలసి వారికి టీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ వాసవి క్లబ్‌ను ఏర్పాటు చేసింది కేసీ గుప్తా అని, కేసీ గుప్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, వైశ్యులకు ఎక్కడో సంబంధముందన్నారు. యాదాద్రి, హైదరాబాద్‌లో చారిటబుల్ ఆసుపత్రుల కోసం స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమిటో చెప్పాలన్నారు. 60 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలే అభివృద్ధి చేస్తే ఇప్పుడు అడగాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంకా దేశంలో వేలాది గ్రామాలకు కరెంటు దిక్కులేదన్నారు. అనేక గ్రామాలకు రోడ్లు లేవని, దీనివల్ల కోట్లాది మందికి కనీస సౌకర్యాలు ఎందుకు లేవో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. సోనియమ్మే తెలంగాణ ఇచ్చినట్టుగా కాంగ్రెస్‌వాళ్లు చెబితే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎవ్వరో ఇయ్యలేదని, తెలంగాణను తామే గుంజుకున్నామన్నారు. గోస పెట్టినందుకు కాంగ్రెస్‌ను ఓడించారు... తెలంగాణను గోస పెట్టినందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని ఓడించారని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు ఏదో యాత్ర పేరిట ప్రజలను చైతన్యం చేస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చైతన్యవంతులన్నారు. అదే చైతన్యంతో ఈసారి కూడా బీజేపీ నేతల వీపులు పగలగొడ్తారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చుడు పక్కా అని, కాంగ్రెస్ వాళ్ల కాళ్ల కిందకు నీళ్లు తెచ్చుడు పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారని చెప్పారు. అగ్రకులాల్లోని పేదలను ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ అగ్రకులాల్లోని పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంకో 15 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని జోస్యం చెప్పారు. ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులు వస్తరని హెచ్చరించారు. ఇంటింటికీ తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి, ఓట్లు వేసేదాకా మాయమాటలు చెప్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే అధికారమని చెప్పారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రజలతో నేరుగా సంబంధాలుంటాయని,. అలాంటి ఆర్యవైశ్యులు టీఆర్ఎస్లో చేరడం మంచి పరిణామమన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేద్దామన్నారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ గడికి గండి పెట్టుడు కాదని, ఢిల్లీలో బీజేపీ గడీకి గండి పెడుతున్నామన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ సమస్య ఏదైనా సరే కేటీఆర్‌కు చెప్తే సీఎం కేసీఆర్‌కు చెప్పినట్టేనన్నారు. ఈమధ్య కొందరు కొత్త బిచ్చగాళ్లు యాత్రల పేరుతో ప్రజలను కలుస్తున్నారని విమర్శించారు. గత 60 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా పాలించారో, అలానే పాలించాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా ఎలా నడుస్తామని తలసాని ప్రశ్నించారు. -
టీఆర్ఎస్లో చేరిన ఆర్యవైశ్యులు
-
ఆర్యవైశ్యులు అన్ని విధాలా ఎదగాలి: రోశయ్య
హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఆదివారం నాగోలులో నిర్వహించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర శాఖ, మహిళా విభాగం, యూత్ విభాగాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఏపీలో ఉన్న సంఘం తెలంగాణలో కూడా శాఖను ఏర్పాటు చేసి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గం ఇదే..: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పాండుగుప్త, ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరయ్యగుప్త, కోశాధికారిగా నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి, కోశాధికారిగా శాంతి, హైదరాబాద్ అధ్యక్షురాలిగా యాద మంజుల, యూత్ వింగ్ అధ్యక్షుడిగా సంపత్, సెక్రెటరీగా సందీప్, కోశాధికారిగా ఆకాశ్ తదితరులను ఎన్నుకున్నారు. -
సింగపూర్‌లో వాసవి జయంతి వేడుకలు
సింగపూర్ : ఆర్య వైశ్యుల కులదైవమైన వాసవిమాత జయంతి వేడుకలు వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఆర్య వైశ్య కుంటుంబాలు పాల్గొన్నాయి. పాయలేబర్లోని శ్రీ శివన్ టెంపుల్లో సామూహిక వాసవి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య మహిళలు వాసవి మాత కుంకుమార్చనలో పాల్గొని, అమ్మ వారి పాటలను సామూహికంగా గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా చార్టర్డ్ ప్రెసిడెంట్ నాగరాజ్ కైల నూతన కార్యవర్గ సభ్యులుగా అరుణ్ కుమార్ గొట్లూరి - ప్రెసిడెంట్, నరేంద్ర కుమార్ నారంశెట్టి - జనరల్ సెక్రటరీ, రామ్ ప్రసాద్ మామిడి, ట్రెజరర్లను పరిచయం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వాసవి సేవాదళ్ సభ్యులైన రవి కిరణ్, ప్రసాద్, ముక్క కిషోర్, శ్రీధర్, అనిల్, అజయ్, రాజ, సంతోష్ తదితరులు తమ వంతు కృషి చేశారు. -
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల సభ
తిరుపతి సెంట్రల్: దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల మహాసభను వచ్చే నెల 18న తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మహాసభ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు, మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ గురువారం మీడియాకు తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం తిరుపతికి చేరుకున్న సుధీర్‌కు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ(వామ్) రాయలసీమ జోన్ చైర్మన్ దిండుకుర్తి నరసింహులు స్వాగతం పలికారు. -
ఆర్యవైశ్యులను సీఎం ఆదుకుంటారు
శంషాబాద్(రాజేంద్రనగర్): ఆర్యవైశ్యుల డిమాండ్లను తీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం శంషాబాద్‌లో దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. వైశ్యులపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉందని సదస్సులో ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే ఆర్యవైశ్యులను ముఖ్యమంత్రి కలుసుకుని డిమాండ్లను నెరవేరుస్తారన్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించిన పలు డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. సమాచార హక్కు కమిషన్ బుద్ధా మురళిని మహాసభ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె.దామోదర్ గుప్తా అన్నారు. ఆర్యవైశ్యులకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ప్రముఖ ఆలయాల వద్ద ఆర్యవైశ్య మహాసభలకు ఐదెకరాల చొప్పున స్థలాలను కేటాయించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం, కల్యాణలక్ష్మి వంటి పథకాలను నిరుపేద ఆర్యవైశ్యులకు కల్పించాలంటు ఐదు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్మన్ సంపత్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.గణేశ్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొండె మల్లికార్జున్, సుమారు ఐదు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
కంచ ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'కోమటోళ్లు-సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆర్య వైశ్యులు ఆదివారం ధర్నా నిర్వహించారు. కంచ ఐలయ్య కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. -
వైశ్యులను విమర్శిస్తే వారికి మహిళలే కర్మకాండలు చేస్తారు: టీజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పాతగుంటూరు: ఆర్యవైశ్యులను విమర్శిస్తే ఆర్యవైశ్య మహిళలే వారికి కర్మకాండలు నిర్వహిస్తారంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో అర్య వైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామ వరపుకోటలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన టివీఏ.చిన రాజన్న ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. ఈ సభలో టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను స్మగ్లర్లుగా పేర్కొంటూ వివాదాస్పద పుస్తకం రాయడం సరికాదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కట్టడి చెయ్యకపోతే సమాజానికి ప్రమాదమన్నారు. అర్యవైశ్యులను విమర్శించిన వారికి అర్యవైశ్య మహిళలే కర్మకాండలు చేస్తారన్నారు. ఏలూరు ఎంపి.మాగంటి బాబు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని సాగనివ్వరా దన్నారు. అర్యవైశ్యులను ఎవరైనా విమర్శిస్తే వారి కాళ్లు విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. -
ఆర్యవైశ్యుల పాదయాత్రకు బ్రేక్
గజ్వేల్ : ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.1,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు వైశ్యులు వేర్వేరుగా చేపట్టిన పాదయాత్రలను పోలీసులు అడ్డుకున్నారు. సరైన అనుమతులు లేవన్న కారణంతో అడ్డుకోవడంతో నిర్వాహకులు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైశ్య కార్పొరేషన్ సాధనకు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ను కేంద్రంగా ఎంచుకొని ఆర్యవైశ్యులు సోమవారం ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు మహాపాదయాత్ర తలపెట్టారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ నేతృత్వంలో ఓ బృందం, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి (ఏసీపీఎస్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీ నేతృత్వంలో మరో బృందం పాదయాత్రగా బయలుదేరింది. వీరికి వైఎస్సార్ సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. తొలుత కలిసి వెళదామనుకున్న వీరు..తరువాత విడివి డిగా పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ్‌గాంధీ పాదయాత్ర ముందుగా వెళ్లింది. ఆపై ఉప్పల శ్రీనివాస్ నేతృత్వంలో పాద యాత్ర వెళ్తుండగా ప్రజ్ఞాపూర్‌లోని ఐడీబీఐ బ్యాంకు వద్ద గజ్వేల్ ఇన్చార్జి సీఐ వెంకటేశ్, ఎస్సై కమలాకర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్యవైశ్యులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈక్రమం లోనే ప్రేమ్‌గాంధీ నేతృత్వంలోని సభ్యులు రాజీవ్ రహదారిపై పాతూర్ కూరగాయల మార్కెట్‌ను దాటారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారినికూడా అడ్డుకు న్నారు. దీంతో ప్రజ్ఞాపూర్ ఐడీబీఐ బ్యాంకు వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్యవైశ్యులు రాజీవ్ రహదారిపై బైఠాయించడంతో వాహ నాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ నేత ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైశ్య కార్పొరేషన్ సాధించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. పాదయాత్ర విషయమై పోలీసు ఉన్నతాధికారుల తో రెండు మూడు రోజులనుంచే సంప్ర దింపులు జరిపామని, 5 వేల మందితో పాద యాత్ర చేపడతామని చెప్పగా వారు అంగీకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు పాద యాత్రను అడ్డుకోవడం ఎంత వరకు సమంజ సమని ప్రశ్నించారు. మరోవైపు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై చర్యలు తీసు కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాస్తారోకోతో వాహనాల రాక పోకలు స్తంభించడంతో పాటు ఉద్రిక్తత నెల కొనడంతో పోలీసులు ఆందోళనకా రులను వెనక్కి పంపేశారు. కాగా, ప్రేమ్ గాంధీ నేతృ త్వంలో ఆయనతోపాటు ఒకరి ద్దరు మాత్రం పోలీసులను తప్పించుకొని రాత్రి వరకు పాదయాత్ర కొనసాగించినట్టు తెలిసింది. ఈ విషయమై గజ్వేల్ ఇన్చార్జి సీఐ వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున పాద యాత్రను అడ్డుకున్నామన్నారు. -
ఖమ్మంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆర్యవైశ్యుల ర్యాలీ– బహుజన జేఏసీ ధర్నా సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్యులు.. ఆయనకు భద్రత కల్పించాలని బహుజన జేఏసీ వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాలతో బుధవారం ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఐలయ్య రాసిన పుస్తకంలో ఆర్యవైశ్యులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నగరంలోని జెడ్పీ సెంటర్‌కు చేరగా.. అదే సమయంలో బహుజన జేఏసీ నాయకులు ఐలయ్యకు భద్రత కల్పిం చాలని ధర్నా చేపట్టారు. దీంతో ఎదురుపడిన ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. ఆర్యవైశ్యుల ర్యాలీలో పాల్గొన్న కొందరు బహుజన జేఏసీ నాయకుల వైపు చెప్పులు చూపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జేఏసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆర్యవైశ్య సంఘానికి చెందిన కొందరు జెడ్పీ కార్యాలయంలోకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద
కాకినాడ: కంచె ఐలయ్యపై శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. వైశ్యులు తమ వ్యాపారాలను ఖచ్చితంగా చేస్తారు.. తమకు వచ్చిన దాంట్లో పది శాతం సమాజం కోసం ధర్మకార్యాలు చేసే పుణ్య చరిత్ర వైశ్యులదన్నారు. అలాంటి వాళ్ళను ఐలయ్య స్మగ్లర్లు అని అంటాడా అని నిలదీశారు. మతం మారిన తరువాత ఆయనకు మతిపోయిందన్నారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, మల్టీ నేషనల్ కంపెనీలు చేసిన దోపిడీపై ఐలయ్య ఏనాడు నోరు విప్పడు అని విమర్శించారు. దళితుడనే పేరు పెట్టుకుని దళితులనే మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. హిందుత్వ జోలికి వస్తే ఐలయ్య కధ కంచికి చేరుతుందని హెచ్చరించారు. దేశ భద్రతపై ఐలయ్య దెబ్బ కొడుతున్నాడంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచుకుని ఐలయ్య, ఆయన వెనక ఉన్నవారిపై దృష్టి పెట్టాలని కోరారు. జాకీర్ నాయక్ తరహాలో ఐలయ్యపై నిఘా పెట్టి విచారణ జరపాలని, లేదంటే తమ గళం, దళం, బలం ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు. -
ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి...కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఐలయ్యకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తక్షణమే వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించిన, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యలకు కారకులు
ఆర్యవైశ్యులపై ఐలయ్య - కోమట్లు చేపలు తినరు, కల్లు తాగరు - అందుకే నా పుస్తకాన్ని అర్థం చేసుకోలేదు హన్మకొండ అర్బన్: ‘‘ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలకు వ్యవసాయ మార్కెట్లలో కోమట్లు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. దాంతో రైతులు నష్టపోయి చివరకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులవుతున్నారు’’ అంటూ టీ–మాస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్కెట్లలో ఇకపై కోమట్ల ఆటలు సాగబోవు. టీ–మాస్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీలు వేస్తాం. అవి నిర్ణయించిన ధరకే రైతుల నుంచి వారు పంటకొనాలి’’అని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆదివారం టీ–మాస్ ఆవిర్భావ సభలో ఐలయ్య ప్రసంగించారు. ‘‘కోమట్లు చేపలు తినరు. కల్లు తాగరు. అందుకే నేను రాసిన పుస్తకాన్ని సరిగా అర్థం చేసుకోలే కపోయారు.గ్రామాల్లో తూకంలో దండె కొట్టడం మొదలు, బడా కంపెనీలు స్థాపించడం దాకా వారు ప్రజల్ని దోపిడీ చేశారు. నేను బయటికొస్తే మెడలో చెప్పులు వేస్తామని, నాలుక కోస్తామని బెదిరించి రోడ్డెక్కుతున్నారు. వీటికి భయపడబోను. నన్నెవరు చంపినా అందుకు కోమట్లే బాధ్యులు. ఆ సంఘం అధ్యక్షుడు రామకృష్ణను వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు పెద్దగా ఇంగ్లిష్ రాదు. నేను యాదవ కులంలో పుట్టి దుడ్డు కర్ర వదిలి ఉన్నత విద్య చదివా. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను’’ అన్నారు. వైశ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. ‘‘రిలయన్స్, అంబానీ, ఆదానీ, కిర్లోస్కర్ వంటి ఆర్యవైశ్యుల వ్యాపార లాభాల్లో ఏటా ఒక్క శాతం విరాళంగా ఇచ్చినా రూ.30 వేల కోట్లవుతాయి. నష్టపోయిన రైతు కుటుంబాలను ఆ డబ్బుతో ఆదుకోవచ్చు. ఆ కంపెనీల వారు బీజేపీకి ఇచ్చే విరాళాల్లో సగం మొత్తం చూసుకున్నా రూ.25 వేల కోట్లవుతాయి. దాంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవచ్చు. సైనిక, రైతు కుటుంబాలకు కోమటోళ్ల కంపెనీల్లో 5 శాతం ఉద్యోగాలివ్వాలి’’ అని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... రాష్ట్రంలో కు టుంబ పాలనను అంతం చేసి సామాజిక తెలంగాణ సాధించడమే టీ–మాస్ లక్ష్యమన్నారు. గద్దర్ పాల్గొ న్నారు. సభ ప్రారంభానికి ముందు ఆర్యవైశ్య సంఘా ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. -
ఆర్యవైశ్యుల్లో ఐక్యత తెచ్చిన ఐలయ్య: రోశయ్య
మచిలీపట్నంటౌన్ (మచిలీపట్నం): ప్రొఫెసర్ కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత వచ్చిందని రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. కృష్ణా జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాన్ని రాయటంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటంతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెరిగిందని చెప్పారు. అందువల్లే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే హుందాగా ఉంటుందన్నారు. -
జనగామలో ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం రైల్యే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యవైశ్యులను కించపరిచే విందంగా కుల-మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా వ్యవరిస్తున్న కంచె ఐలయ్య పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారపై రాస్తారోకో నిర్వహించి ఐలయ్య దిష్టి బొమ్మ దహనం చేశారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి -
ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం
-
అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్ జగన్ ఆగ్రహం
- మహిళలు, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు - వారెంట్లు లేకుండా ఇళ్లలోకి వచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు? - మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది - నంద్యాలలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత నంద్యాల: అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తోన్న పోలీసులు.. కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో కొందరి ఇళ్లను టార్గెట్ చేసుకుని.. సెర్ఛ్వారెంట్లు లేకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహించారు. శనివారం నంద్యాల టౌన్ హాలులో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఇతర కీలక నేతలంతా పాల్గొన్నారు. ‘సత్యనారాయణ, రమేశ్ లాంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి వేళల్లో దాడులు జరపాల్సిన అవసరమేముంది? పోనీ సోదాల్లో చివరికి ఏమైనా దొరికాయా అంటే, అదీ లేదు. ఇంట్లో ఏది దొరికితే దానిని సీజ్ చేస్తారు. అమృతరాజ్, నాగిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్, భువనేశ్వర్‌ల ఇళ్లపైనా దాడులు చేసి రూ.10 వేలు, రూ.20 వేలు సీజ్ చేశారు. ఈ దాడులకు సంబంధించి ఒక వారెంట్ ఉండదు, ఒకేసారి 40,50 మంది పోలీసులు బిలబిలా ఇళ్లలోకి వచ్చేస్తారు. వాళ్లను చూసి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. మోసం చేస్తోన్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చకుండా గడిచిన మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. సమాజంలోని అన్నివర్గాలనూ చంద్రబాబు మోసం చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో జెండా ఎగరేసి, జిల్లాకు చాలా హామీలిచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్న సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. మోసకారి చంద్రబాబుకు బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది’ అని వైఎస్ జగన్ అన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓట్లు వేసి జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుదాం
కార్పొరేషన్ ఏర్పాటు హామీపై ఆర్య వైశ్య మహాసభ హర్షం సాక్షి, హైదరాబాద్: తమ సంక్షేమం కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించినందుకు నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీకి వైశ్యులంతా ఓట్లు వేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలో తరలివచ్చిన వైశ్య ప్రముఖులు మంగళవారమిక్కడ జగన్‌ను కలుసుకున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ , పలువురు వైశ్య ప్రముఖులు జగన్‌ను కలసి వారిలో ఉన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలలో ఏ ఒక్కరికీ హాని చేయలేదని, ఎవరి దగ్గర నుంచీ ఒక్క సెంటు భూమి కూడా లాక్కోలేదని నంద్యాల వైశ్య ప్రముఖుడు ఎన్. సత్యనారాయణ అన్నారు. -
వైఎస్ జగన్‌కు ఆర్యవైశ్య మహాసభ ధన్యవాదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని నంద్యాల బహిరంగ సభలో ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. వైశ్యుల్లో బీదవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలే ఆదుకోవాలనే తమ ఆక్రందనకు అందరికంటే ముందుగా స్పందించిన జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలని అన్నారు. ఆర్య వైశ్యుల గురించి భారతదేశంలోనే తొలిసారిగా ఈ ప్రకటన చేసినందుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపున హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించండి
రోశయ్య డిమాండ్ కల్వకుర్తి: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పా టు చేసి రూ.1000 కోట్లు కేటాయిం చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన ఆర్యవైశ్యుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొం టున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలసి వివరిస్తానని చెప్పారు. ప్రధానంగా ఈబీసీ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి
– ఎంపీ బుట్టా రేణుకను కలిసిన ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి ప్రతినిధులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి జిల్లా శాఖ నాయకులు ఎంపీ బుట్టారేణుకను కోరారు. సోమవారం వారు ఎంపీని జోహరాపురంలోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులకు వ్యాపార, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలు ఉన్నారని, వారికి కారొ్పరేషన్ ఉంటే మేలు జరుగుతుందన్నారు. దీనిపై ఎంపీ బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీని వారు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విఠల్‌శెట్టి, ప్రతినిధులు నాగేళ్ల రాజగోపాల్, గూడూరుగోపాల్, విజయ్, భాస్కర్, శేషగిరిశెట్టి, కె.కిరణ్, కె.నవీన్, కె.కిశోర్, పి.సుధాకర్, వి.హరి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జ్ఙానేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పన్నీర్ సెల్వానికి కేరళ వైద్యం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరుసెల్వం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కోయంబత్తూరు వెళ్లారు. గురువారం పన్నీరుసెల్వంకు ఆయుర్వేద వైద్యులు పరీక్షలు చేసి, చికిత్స మొదలెట్టారు. నాలుగు రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. కాగా కోయంబత్తూరులోని ఆర్య ఆస్పత్రి కేరళ వైద్యానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ మూలికలతో కూడిన వైద్యం అందిస్తుంటారు. అయితే, కేరళ ఆయుర్వేద వైద్యం చేసుకోవాలనే పన్నీరు ఆస్పత్రిలో చేరినట్టు, ఆయనకు ఎలాంటి సమస్య లేదని పురట్చి తలైవి శిబిరం వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజుల పాటు ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంటారని చెప్పారు. -
ఇమ్మడిశెట్టికి కన్నీటి వీడ్కోలు
శ్రీశైలం ప్రాజెక్టు: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన భౌతిక కాయానికి శనివారం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో విజయవాడలో శుక్రవారం మృతి చెందగా.. ఆయన భౌతిక కాయాన్ని శనివారం తెల్లవారుజామున శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించారు. అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవురావు, సినీ నటీమణులు కవిత, పూజిత, ఏపీ జెన్కో డైరెక్టర్ అప్పారావు, యువ పారిశ్రామికవేత్త టీ జి భరత్, ఆర్యవైశ్యమహాసభ మాజీ అధ్యక్షులు, నెల్లూరు డిప్యూటీ మేయర్, ఆవోపా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు డి.వి నారాయణ, సొల్లేటి సత్యనారాయణ, గాదంశెట్టి సుబ్బారావు, చల్లా కిషోర్, గాదంశెట్టి వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వరరావు, మహేష్, శ్రీను, ఏఎఎల్ ప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా బుక్కాపురంలో జన్మించిన కోటేశ్వరరావు హైస్కూల్ చదువులకు స్వస్తి పలికి డ్యాం నిర్మాణ సమయంలో తన 12వ ఏట శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు భార్య సత్యవతి, కుమార్తెలు పూజిత, అర్షితలు ఉన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ముఖ్య అనుచరుడుగా ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు మెలిగారు. ఆయన మృతి పట్ల స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సేవా సంస్కర్తను కోల్పోవడం బాధాకరం: మంత్రి సిద్ధా రాఘవరావు నిరంతరం సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్న ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు అకాల మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని, రాష్ట్ర అటవీశాఖ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. కోటేశ్వరరావు భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన ఆయన కోటేశ్వరరావుతో ఉన్న సానిహిత్యాన్ని పంచుకున్నారు. ఆర్యవైశ్యుల ఎదుగుదల కోసం సేవా కార్యక్రమాలలో కోటేశ్వరరావు ఎంతో కష్టపడ్డారన్నారు. -
చెన్నైలో ఘనంగా సత్యదేవుని సామూహిక వ్రతాలు
సత్యదేవుని నామస్మరణతో ప్రతిధ్వనించిన టి.నగర్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహణ వ్రతాలు ఆచరించిన 600 జంటలు అన్నవరం : తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్ శుక్రవారం సత్యదేవుని నామంతో ప్రతిధ్వనించింది. రత్నగిరిపై కొలువైన సత్యదేవుని సామూహిక వ్రతాలను శుక్రవారం అక్కడ నిర్వహించారు. చెన్నైలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ వ్రతాలు జరిగాయి. అన్నవరం దేవస్థానం స్పెషల్‌గ్రేడ్ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ ఆధ్వర్యంలో పదిమంది పురోహితులు ఈ వ్రతాలు నిర్వహించారు. గత నెలలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావును వ్రతాల నిర్వహణ చెన్నై నిర్వహించాలని కోరడంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహించారు. అన్నవరం పండితులు వ్రతసామగ్రి, సత్యదేవుని రాగి మాడాలను, నమూనా విగ్రహాలను తీసుకుని చెన్నై బయల్దేరి వెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకూ 600 వ్రతాల నిర్వహణ చెన్నై టి.నగర్ ఉస్మా¯ŒSరోడ్‌లోని రామకృష్ణా స్కూల్ ఆడిటోరియంలో ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి అన్నవరం స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, తదితర పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం 7:30 గంటలకు స్వామివారి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. వ్రతాల అనంతరం సత్యదేవుని ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. నాలుగు బ్యాచ్‌లుగా నిర్వహించిన ఈ వ్రతాల్లో మొత్తం 600 జంటలు పాల్గొన్నాయి. మా జన్మ ధన్యమైంది: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ సత్యదేవుని వ్రతాల lనిర్వహణతో మా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ అన్నారు. అన్నవరం స్వామి చెంతకు వచ్చి వ్రతాలు ఆచరించే వీలు లేని వారి కోసం ఈ సామూహిక వ్రతాల కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. స్వామి, అమ్మవార్ల నమూనా విగ్రహాలతో పండితులు వచ్చి ఇక్కడ వ్రతాలు చేయించడం గొప్ప విషయమన్నారు. కాగా, అభ్యర్థించిన వెంటనే సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పండితులను పంపించిన దేవస్థానం ౖచైర్మ¯ŒS రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నవరం పండితులను ఘనంగా సత్కరించారు. -
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
- ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించం - ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంతకాల సేకరణ - ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ కర్నూలు(అర్బన్): ఆర్యవైశ్యుల్లోని పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్ పరిణయ హాలులో ఆదివారం జిల్లా ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించేది ఆర్యవైశ్యులే అయినా అనేక మంది పేదలున్నారని, వారి కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించడంతో పాటు పాలక, ప్రతిపక్ష నేతలకు ఉత్తరాలు రాస్తామని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణులకు రూ.75 కోట్లు, కాపులకు రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 10 శాతంగా ఉన్న ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ఈ నేపథ్యంలోనే సమితి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన ఇల్లూరు సుధాకర్, ఎం విఠల్‌శెట్టి, కోశాధికారి సత్యనారాయణ, అదనపు కార్యదర్శిగా జవహర్‌బాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ చిన్న వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్యవైశ్యులను ఎకనామికల్ బ్యాక్వర్డ్గా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కమిటీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీజీ శివరాజ్, పెండేకంటి కిరణ్, విట్టా రమేష్, మహిళా అధ్యక్షురాలు టి. జ్ఞానేశ్వరి, పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి కిరణ్, ఇల్లూరు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్
- ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి డిమాండ్ - రాష్ట్ర అధ్యక్షుడిగా టి.జి.భరత్ ఎన్నిక కర్నూలు(టౌన్): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పూలబజార్‌లోని చిన్న అమ్మవారి శాలలో ఈ సమితి ఏర్పాటయ్యింది. వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందిన నాయకులు సాధన సమితికి నూతన అధ్యక్షుడిగా టి.జి.భరత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. డిమాండ్లతో కూడిన కరపత్రాలను సమావేశంలో విడుదల చేశారు. వివిధ ఆర్యవైశ్య సంఘాలు టీజీ భరత్‌ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆర్యవైశ్యులను మాత్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హక్కుల సాధన కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటిస్తూ సమితిని జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ఆర్యవైశ్యునికి ప్రభుత్వం ఉచిత గృహం నిర్మించాలన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టి.జి.శివరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు వై.బాలకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, అవోపా నాయకులు రత్నప్రసాద్, వాసవీ సేవాదళ్, వాసవీ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తి ప్రసాద్, శేషగిరి శెట్టి, సుబ్రహ్మణ్యం, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఏర్పాటు ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి సమావేశం అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన టి.జి.భరత్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారి తిరుపాల్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఇల్లూరు సుధాకర్, కర్నూలు పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి కిరణ్‌లను ఎన్నుకున్నారు. -
ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తా
మంత్రి శిద్దా రాఘవరావు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఆర్యవైశ్యుల అభివృద్ధి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. స్థానిక చెరుకూరి వీర్రాజు తోటలో వైశ్య హాస్టల్, వైఎంవీఏ, రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సంస్థలతో శిద్ధా రాఘవరావు ఆత్మీయ గౌరవ సత్కారం, ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. మంత్రి రాఘవరావు మాట్లాడుతూ కె.రోశయ్య చేతులమీదుగా సత్కరించడం మరుపురానిదన్నారు. మాజీ గవర్నర్ కె.రోశయ్య మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. ఏపీఐసీసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంత్రి జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు రెడ్డిసుబ్రహ్మణ్యం, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, నగర మేయర్ పంతం రజనిశేషసాయి, మాజీ ఎంపీ హర్షకుమార్, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ, రాష్ట్ర వైశ్య నాయకులు కాళ్ళకూరి నాగబాబు, ఆర్యాపురం బ్యాంకు చైర్మ¯ŒS చల్లా శంకరరావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రమంత్రి శిద్ధా రాఘవరావు దంపతులను రోశయ్య చేతులమీదుగా ఆర్యవైశ్యులు సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు కార్పొరేష¯ŒS డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఆలయాల్లో చోరీ
పులివెందుల: పులివెందుల పట్టణంలోని పీబీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీమహాలక్ష్మి ఆలయంలోనూ, ఆర్యవైశ్య కాలనీ సమీపంలో ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి తాళిబొట్లు 2, గిన్నెబాట్లు 2, లక్ష్మీకాసులు 2, తీర్థం గిన్నెలు దోచుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారు అపహరణకు గురైంది. అలాగే హుండీలను పగులగొట్టి అందులోని నగదును కూడా ఎత్తుకెళ్లారు. ఆర్యవైశ్య కాలనీలోని శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో హుండీని పగులగొట్టి అందులోని నగదును మాత్రమే తీసుకెళ్లారు. ఒకే రోజు పట్టణంలోని రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులివెందుల అర్బన్ సీఐ ప్రసాద్‌తోపాటు కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. -
ఆర్యవైశ్యులకు ఐక్యతే బలం
పోరుమామిళ్ల: వైశ్యులు ఐక్యంగా ఉన్నపుడే బలోపేతమవుతారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని బుధవారం దర్శించారు. ఆయన వెంట నెల్లూరు ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, కడప ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు దొంతు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షుడు గుబ్బా చంద్రశేఖర్ కన్యకాపరమేశ్వరి, శివాలయం, రామాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన ప్రతిష్ఠ ఉత్సవాల్లో సేవలందించినవారికి టీజీ వెంకటేష్ మెమొంటోలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.టీజీ వెంకటేష్‌ను ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు గుబ్బా చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కన్యకాపరమేశ్వరి వెండి పటాన్ని అందజేశారు. మండల ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు తులసి సుధాకర్ ఆయనను సన్మానించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్‌ను కమిటీ సభ్యులు సన్మానించారు. -
ఆర్యవైశ్యులను నిరాశ పరిచిన ముఖ్యమంత్రి
అనంతపురం కల్చరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు కాగానే ఆర్యవైశ్యులు ఎంపీ దివాకర రెడ్డి ద్వారా అమ్మవారి శాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా ఒప్పించారు. అందుకు భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు. గుడి ముందు భారీ ఫ్లెక్సీలతో పాటు, సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. కానీ సోమవారం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం అమ్మవారి గుడికి రాకుండా నేరుగా ఆర్ అండ్ బీ గౌస్టుహౌసుకు వెళ్లిపోయారు. వాస్తవానికి రూ.లక్షల విలువ చేసే వజ్రాల చీరను వాసవిమాతకు సీఎం చేతుల మీదుగా సమర్పిస్తారని ఎంపీ వర్గీయులు జోరుగా ప్రచారం సాగించారు. అందుకు వారం రోజుల నుండి విరామం లేకుండా కష్టపడ్డారు. అయితే చంద్రబాబు రాకపోవడంతో నిరాశ చెందారు. విజయవాడలో విచక్షణ లేకుండా ఆలయాలు కూల్చివేసిన ప్రభుత్వానికి భగవంతుని పట్ల భయభక్తులు ఉంటాయనుకోవడం పొరపాటేనని కొందరు వాపోయారు. -
11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు
తమిళనాడు గవర్నర్ రోశయ్య రాక సదస్సు కన్వీనర్ కోలేటి దామోదర్ కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 11న గోదావరిఖనిలో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సదస్సు కన్వీనర్ కోలేటి మారుతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయన్నారు. పన్నుల రూపేణ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో టికెట్లు కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం పథకం, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను పేద ఆర్యవైశ్యులకు అందజేయాలని డిమాండ్‌చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సదస్సులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కన్న కృష్ణ, యాద అంజయ్య, ఎలగందుల మునీందర్, పెద్ది విద్యాసాగర్, మాడిశెట్టి శ్రీనివాస్, చింతకింది శ్రీనివాస్, తోడుగునూరి కరుణాకర్, సుధాకర్, గుండ చంద్రమౌళి, చిట్టుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరును ఆదర్శంగా తీసుకోవాలి
ప్రొద్దుటూరు టౌన్: క్రమశిక్షణ, కట్టుబాట్లు, ఐకమత్యం ఇవన్నీ ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల్లో ఉన్నాయని, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు వీటిని ఆదర్శంగా తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం శ్రీవాసవి కాటన్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో జరిగిన దివ్యశతాధిక సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల్లో ఒక ప్రత్యేక ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీవాసవికన్యకాపరమేశ్వరి దేవాలయం ఉందన్నారు. ఆర్యవైశ్య సంఘాలు కొన్ని కార్యక్రమాలను పరిమితంగా పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల శ్రుతిమించిన ఆలోచనలు జరుగుతున్నాయని, ఇలాంటివి మంచిది కాదన్నారు. మనలో ఐకమత్యానికి భంగం కలుగుతుందనే ఆందోళన తనకు ఉందన్నారు. ఆర్యవైశ్య సభను రాజకీయాలకు ముడిపెట్టవద్దని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు అందడం లేదన్నారు. ఈ సందర్భంగా రోశయ్యను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు, ఉపాధ్యక్షుడు శివశంకర్ సత్యనారాయణ తదితరులు పూలమాల, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రమణ్యం, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ మెంబర్ గుబ్బా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా?
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు కల్లూరు: రాష్ట్రంలోని కులాలను విడగొట్టి వారికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా అంటూ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కల్లూరులో నిర్వహించిన శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరిదేవి మహా కుంభాభిషేక వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. ఆయన ఇచ్చిన మాట మేరకు వెంటనే ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి, వెయ్యి కోట్ల రూపాయలతో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హామీ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భవిష్యత్ ఉండదన్నారు. -
అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురం: అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరపాలక సంస్థ అధికారులు పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసేందుకు శనివారం యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పన్ను చెల్లించలేదని స్థానికంగా ఉండే వాసవీ కల్యాణ మండపాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అందుకు నిరసగా మున్సిపల్ కార్యాలయాన్ని ఆర్యవైశ్యులు ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ కొవటం విజయభాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆర్యవైశ్యులను, విజయభాస్కర్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ తోపులాటలో తప్పించుకునే ప్రయత్నంలో విజయభాస్కర్ రెడ్డి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. -
పోరుబాట
► కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్‌పై ఆర్యవైశ్యుల ఆగ్రహం ► నేడు కీలక సమావేశం ► భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► సంఘాలన్నీ తరలిరావాలని పిలుపు సాక్షిప్రతినిధి, అనంతపురం:- ఆర్యవైశ్యులపై అధికారపార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. మొన్న గాంధీ విగ్రహావిష్కరణకు అడ్డుపడటం...నేడు కరెంటు బిల్లులపేరుతో కల్యాణ మండపాన్ని సీజ్ చే యడం చూస్తే అధికారపార్టీ నేతల శైలిని స్పష్టం చేస్తున్నాయి. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కావాలనే ఈ రకంగా వేధింపులకు పాల్పడి వారిని అగౌర పరచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్యవైశ్యులు అధికార పార్టీ నేతల వైఖరిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను తీవ్రంగా అవమానిసిస్తున్న అధికార పార్టీపై పోరుబాటకు సిద్ధమయ్యారు. నేడు కీలక సమావేశం అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలు వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసినట్లు వారు భావిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా శనివారం సమావేశం కానున్నారు. ఈ భేటిలో అధికారపార్టీ ఆగడాలపై చర్చించనున్నారు.గాంధీ విగ్రహ ప్రారంభానికీ అడ్డంకులు ‘అనంత’ క్లాక్‌టవర్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చే విషయంలో మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆర్యవైశ్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు వారు భావిస్తున్నారు. అయినా వారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహావిష్కరణకు అంతర్గతంగా అడ్డుపడుతూనే ఉన్నారనే భావనలో వారు ఉన్నారు. ఏడాదికిపైగా గాంధీ విగ్రహానికి ముసుగేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నెలరోజుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే తానే ఆవిష్కరిస్తానని ‘అనంత’లో మీడియా ముందు గతేడాది బీరాలు పలికారు. కేవలం ప్రభాకర్ చౌదరిపై వ్యతిరేకతతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి అలా మాట్లాడారని, గాంధీ విగ్రహంపై చిత్తశుద్ధి ఉంటే నెల దాటి నెలలు గడుస్తున్నా ఆయన ఏమయ్యారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ దురుద్దేశమే కారణమా..? తాజాగా కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్ చేయడం వెనుక కూడా రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలక వర్గంలోని కీలక నేతల సూచనలతోనే అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ విషయం శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు తీవ్రంగా స్పందించారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకే ‘అనంత’లోని వైశ్య హాస్టల్లో శనివారం సమావేశం అవుతున్నారు. దీనికి అన్ని సంఘాలు తరలిరావాలని కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మచ్చా నరసింహులు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నవేని తెలుస్తుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఫోన్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నట్లు తెలిసింది. కాగా కొత్తూరు అమ్మవారి శాలతో పాటు పాతూరు అమ్మవారి శాల కల్యాణ మండపాన్ని సైతం సీజ్ చేయడానికి అడిషనల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డీసీ అజయ్కిశోర్, ఆర్ఓ నవనీతకృష్ణ తదితరులు గురువారం వెళ్లారు. అయితే నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేసు చివరి నిమిషంలో కలుగజేసుకోవడంతో అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఇదంతా గమనిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు పక్కా ప్రణాళికతోనే తమను లక్ష్యంగా చేసుకుని అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. -
12న జడ్చర్లకు తమిళనాడు గవర్నర్ రోశయ్య
జడ్చర్ల: ఈ నెల 12న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య జడ్చర్లకు రానున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ముఖ్యఅథితిగా విచ్చేయనున్నారు. బాదేపల్లి వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో నిర్వహించే ఆర్యవైశ్య రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు రోశయ్యను ఆహ్వానించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వస్తానని ఆయన అంగీకరించినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమవారం మీడియాకు వివరించారు. -
‘ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’
సత్తెనపల్లి (గుంటూరు): రాష్ట్రంలో అన్ని కులాల మాదిరిగా ఆర్యవైశ్యులలోని పేదలకు చేయూతనిచ్చేందుకు రూ. వెయ్యి కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు అంశంపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే శాసనసభ్యులకు వినతి పత్రాలను అందించామన్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆర్యవైశ్యులతో చర్చించి రాజకీయంగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆమేరకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. ప్రధానంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, ఖాదీబోర్డు చైర్మన్లను ఆర్యవైశ్యులకు కేటాయిస్తే తద్వార గ్రంథాలయాలను అభివృద్ధి పరచడం, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి వ్యాపారాలను వృద్ధి చేస్తామన్నారు. రోజూ ఆర్యవైశ్యులు వ్యాపారాల ద్వారా రూ. 365 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. నీతి, నిజాయితీగా చేసే వ్యాపారులపై చట్టాల పేరుతో ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. రూ.20 కోట్లతో విజయవాడలో వాసవి హాస్పటల్ వసతి గృహం, ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు -
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
ఖైరతాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి తమ సత్తా చాటడంతో పాటు సీటు ఇచ్చిన ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల తరపున నలుగురు, ఇండిపెండెంట్‌గా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. వీరి విజయానికి మహాసభ కృషి చేస్తుందన్నారు. పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ మాట్లాడుతూ జంటనగరాల్లోని వంద సంఘాలతో సమావేశమై ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపిస్తామని, తమకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ఆర్యవైశ్యుల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, కొండ్లె మల్లికార్జున్, యాద అశోక్‌గుప్త, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు. -
‘అమరజీవి సేవలు చిరస్మరణీయం’
రాష్ట్రానికి అమరజీవి పొట్టిశ్రీరాములు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. అమరజీవి 62వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేకంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ... తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి త్యాగశీలి అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు. -
'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఎదగాలి'
గూడూరు: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని పీవీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వంశంలో పుట్టిన మనం వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందుకు తన వంతు సాయం కూడా అందజేస్తానని మంత్రి తెలిపారు. ఆర్యవైశ్యుల అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమంలో ఆర్యవైశ్యులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఎదో ఒక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన అన్నారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
తమిళనాడు గవర్నర్ రోశయ్య గుంటూరు: ఆర్యవైశ్యులు రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందనీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే, మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు అభినందన కార్యక్రమం మంగళవారం జరిగింది. మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి శ్రీరామనాగేశ్వరరావు(నాగబాబు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రోశయ్య మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు 14 మంది ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు ఉన్నారని, నేడు వారి సంఖ్య ముగ్గురికి పడిపోవటం బాధాకరమన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రోశయ్య శాలువాకప్పి సత్కరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవటం సాధారణమైన విషయం కాదని సేవచేస్తూ నలుగురి నోట్లో నాలుకలాగా మెలిగితే ఏ పార్టీ అయినా పిలిచి సీటు ఇస్తుందని చెప్పారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి లక్ష్మీపద్మావతి, పలు జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, మహిళా విభాగం, వాసవి సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో వచ్చేవారికి చేయూతనివ్వాలి
ఒంగోలు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు రాజకీయాల పట్ల ఉత్సాహం ఉన్నారని.. అలాంటివారికి చేయూతనిచ్చేందుకు ఆర్యవైశ్యులంతా సమష్టిగా కృషిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గిరీష్ సంఘీ మాట్లాడుతూ గతంలో తాను రథ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా చైతన్యం కలిగించానన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటి కవిత మాట్లాడుతూ తాను రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కూడా కష్టించి పని చేస్తున్నానని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్ఫూర్తిగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి(రాధ) మాట్లాడుతూ కవితకు ఎంఎల్సీ పదవి వచ్చేలే చేసే బాధ్యతను సురేష్, సునీతలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకురాలు, ఆల్ఇండియా ఆర్యవైశ్య మహిళా విభాగ్ జిల్లా అధ్యక్షురాలు మేడూరి శైలజ మాట్లాడుతూ 13 జిల్లాల్లో 49 మంది ఆర్యవైశ్య మహిళలు రాజకీయంగా రాణించారన్నారు. ‘ఆదర్శ హిందూ గృహం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సినీ నటి కవిత, లయన్స్‌క్లబ్ గవర్నర్ యడ్లపల్లి అమృతవల్లి, పోతుల సురేష్ దంపతులతో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆర్యవైశ్య మహిళా అధ్యక్షులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను స్మన్మానించారు. కార్యక్రమంలో ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, వాసవిసత్రం సముదాయం అధ్యక్షుడు యిమడిశెట్టి కోటేశ్వరరావు, ఆల్ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బదరి విశాల్ బన్సల్, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు శిద్దా సూర్యప్రకాశరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, వాసవీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు చలువాది బదరీనారాయణ, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు యిమ్మడిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కనుమర్లపూడి హరిప్రసాద్, లయన్స్‌క్లబ్ రీజనల్ చైర్మన్ సీహెచ్ హరిప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు కోడూరి ఇందిర, భారతి, బీ సునీత, పత్తి వెంకట నాగలక్ష్మి, కోడూరి లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
వెనుకబడిన కులాల జాబితాలోకి ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ చిక్కబళ్లాపురం : ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి కసరత్తు చేస్తున్నట్లు రాష్ర్ట సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ వెల్లడించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదివారం స్థానిక హర్షోదయ కల్యాణమంటపంలో ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సమాజంలో జాతి, కుల, మత విభేదాలు ఉండరాదని జాతిపిత మహాత్మగాంధీ అనాడే చాటి చెప్పారన్నారు. ఆర్యవైశ్యులకు వివిధ సౌలభ్యాలను అందించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని తెలిపారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి అంగీకరించారన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో నవంబరు నుంచి కులాలవారీగా గణన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విధానపరిషత్ సభాపతి డీహెచ్.శంకరమూర్తి మాట్లాడుతూ విద్యకు ఉన్న విలువ దేనికీ లేదన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను మంత్రి ఆంజనేయ, డీహెచ్.శంకరమూర్తిఅందజేశారు. అంతకు ముందు కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి శోభయాత్రను రాష్ర్ట విద్యాశాఖ కమిషనర్ నందకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధాకర్, మంజునాథ్, జగదీశ్‌కుమార్, ఎమ్మెల్సీ శరవణ, డీఐజీ గుప్తచరపద్మనయన. ఆర్యవైశ్య మండలి చిక్కబళ్లాపుర శాఖాధ్యక్షుడు నజుండరామశెట్టి, ఆర్యవైశ్యమహాసభా అధ్యక్షుడు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!
క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం. ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్‌కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
టీ.నగర్, న్యూస్‌లైన్ : నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి వారి అడుగుజాడల్లో ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య మహిళా రత్న పురస్కార గ్రహీత శ్రీ లక్ష్మీమోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక టీ.నగర్ పీఆర్సీసీ సెంటినరీ హాలు వేదికగా శనివారం తమిళనాడు ఆర్యవైశ్య మహిళాసభ ఆధ్వర్యంలో మద్రాసు యూనిట్ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ, ప్రపంచ తెలుగు సమాఖ్య, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్లలో విశేష సేవలందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న లక్ష్మీమోహనరావును తమిళనాడు ఆర్యవైశ్య మహిళాసభ (మద్రాసు యూనిట్) ఆర్యవైశ్య మహిళా రత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు. టీఎన్ఏవీఎంఎస్ అధ్యక్షురాలు శశికళా ఆంజనేయులు, సభ్యులు ఆమెకు శాలువా కప్పి మెమెంటోలు అందజేశారు. లక్ష్మీమోహనరావు మాట్లాడుతూ సన్మానాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డాక్టర్ గిరిజ సుజో చికిత్సా పద్ధతులపై సభ్యులకు అవగాహనా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో చివరిగా సభ కార్యదర్శి మణిమాల వందన సమర్పణ చేశారు. -
ఆడబిడ్డ జన్మిస్తే రూ.5వేల డిపాజిట్
బనగానపల్లె టౌన్, న్యూస్‌లైన్ : ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడపిల్లల జననాలను ప్రోత్సహించేందుకు ఆర్యవైశ్య మండల మహాసభ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మండలంలోని పేద ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడబిడ్డ పుడితే రూ.5వేలు డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని సంఘం మండల అధ్యక్షుడు తెలిపారు. స్థానిక శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆదివారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 11 మంది పేద ఆర్యవైశ్య మహిళలకు కుట్టుమిషన్లు, గ్రైండర్ మిషన్ పంపిణీ చేశారు. మహాసభ మండల అధ్యక్షుడు డి. వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ వ్యాపారాలతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని తోచిన మేరకు సాయం చేయలని ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటూ సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని, అప్పుడే రాజకీయంగా కూడా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. బనగానపల్లె ఆర్యవైశ్య సంఘం వారు ఆర్థికంగా వెనుకబడ్డ ఆర్యవైశ్య కుటుంబాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఇతరత్రా ఆదుకుంటుండడం మంచి పరిణామన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పెండేకంటి కిరణ్‌కమార్ మాట్లాడుతూ వ్యాపారాలు ఒక్కటే పరమార్థం కారాదని, ఇతరులకు సేవ చేయడం కూడా బాధ్యతగా స్వీకరించాలన్నారు. డి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పేద ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడబిడ్డ పుట్టిన వెంటనే బ్యాంకులో ఖాతా ప్రారంభించి రూ. 5వేలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. అనంతరం 11 కుట్టు మిషన్లు, ఒక గ్రైండర్ మిషన్‌ను ఆర్యవైశ్య మహిళలకు సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సొంతంగా పింఛన్ల పంపిణీ : కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య రూ. 200 ప్రకారం సొంతంగా నలుగురికి పింఛన్లు అందజేశారు. తాను మండలాధ్యక్షులుగా ఉన్నంత కాలం పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇల్లూరి సుధాకర్, బాలసుబ్రమణ్యం, బి.సత్యంశేట్టి, జి.వేణుగోపాల్‌శెట్టి, పీఎస్ఎస్ నారాయణ, గుండా శ్రీనివాసులు, రామకృష్టయ్య, శ్రీనివాసులు, హరిప్రసాద్, నూకల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.