ఆర్యవైశ్యుల అభివృద్ధి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. స్థానిక చెరుకూరి వీర్రాజు తోటలో వైశ్య హాస్టల్, వైఎంవీఏ, రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సంస్థలతో శిద్ధా రాఘవరావు ఆత్మీయ గౌరవ సత్కారం, ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. మంత్రి రాఘవరావు మాట్లాడుతూ కె.రోశయ్య చేతులమీదుగా
-
మంత్రి శిద్దా రాఘవరావు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
ఆర్యవైశ్యుల అభివృద్ధి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. స్థానిక చెరుకూరి వీర్రాజు తోటలో వైశ్య హాస్టల్, వైఎంవీఏ, రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సంస్థలతో శిద్ధా రాఘవరావు ఆత్మీయ గౌరవ సత్కారం, ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. మంత్రి రాఘవరావు మాట్లాడుతూ కె.రోశయ్య చేతులమీదుగా సత్కరించడం మరుపురానిదన్నారు. మాజీ గవర్నర్ కె.రోశయ్య మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. ఏపీఐసీసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంత్రి జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు రెడ్డిసుబ్రహ్మణ్యం, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, నగర మేయర్ పంతం రజనిశేషసాయి, మాజీ ఎంపీ హర్షకుమార్, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ, రాష్ట్ర వైశ్య నాయకులు కాళ్ళకూరి నాగబాబు, ఆర్యాపురం బ్యాంకు చైర్మ¯ŒS చల్లా శంకరరావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రమంత్రి శిద్ధా రాఘవరావు దంపతులను రోశయ్య చేతులమీదుగా ఆర్యవైశ్యులు సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు కార్పొరేష¯ŒS డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.