సాక్షి, విజయవాడ: ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకొస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు చంద్రబాబు ఏం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుది వైశ్యుల పట్ల కపట ప్రేమ అని, కొంతమంది ఆర్యవైశ్యులు టీడీపీలో చేరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘‘టీజీ వెంకటేష్, అంబికా కృష్ణ, కవిత వంటి వారు ఎందుకు టీడీపీ నుంచి బయటికి వచ్చారు. కావాలనే కొందరు ఆర్యవైశ్య మహాసభ పై బురద జల్లాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది. ఆర్య వైశ్యులకు సంబంధించి దేవాదాయశాఖలో ఉన్న ఆస్తులను ఆర్యవైశ్యుల ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆర్యవైశ్యుల మనోభావాల మేరకు చింతామణి నాటకాన్ని రద్దు చేశారు. ఎవరెన్ని చేసినా ఆర్యవైశ్య మహాసభ చెక్కు చెదరదు. చిన్న చిన్న మనస్పర్ధలను సరిచేసుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారు: డిప్యూటీ స్పీకర్
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని, ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఆర్యవైశ్య మహాసభకు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నాం. కొన్ని అవాంతరాలు వచ్చినా మహాసభను పటిష్టం చేసి భవన నిర్మాణం పూర్తి చేస్తాం. కొంతమంది మహాసభలో పదవుల కోసం టీడీపీలో చేరి సమ్మేళనాలు పెడుతున్నారు. సమ్మేళనం పెట్టినా తప్పులేదు కానీ ఆర్యవైశ్యులకు ఏం చేస్తారో చెప్పాలి. మహాసభను అగౌరవపరిస్తే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అగౌరవపడినట్టే’’ అని కోలగట్ల పేర్కొన్నారు.
చదవండి: లోకేశ్‌కు మంత్రి కాకాణి సెటైరికల్ పంచ్
Comments
Please login to add a commentAdd a comment