ఘనంగా శ్రీ వాసవీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవి జ‌యంతి ఉత్స‌వాలు ! | Vasavi Kanyaka Parameswari jayanti celebration | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీ వాసవీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవి జ‌యంతి ఉత్స‌వాలు !

Published Tue, May 21 2024 11:05 AM | Last Updated on Tue, May 21 2024 11:28 AM

Vasavi Kanyaka Parameswari jayanti celebration

హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బ‌జార్ ఆధ్వ‌ర్యంలో శ్రీ వాసవీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవి జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా శ‌నివారం నిర్వ‌హించారు. ఇది ఇసామియా బ‌జార్‌లోని న‌ర‌సింహాస్వామి ఆల‌యం ద‌గ్గ‌ర జ‌రిగింది. ఈ కార్య‌క్రమంలో ఉద‌యం ఫ‌ల‌హారం, అభిషేకం, స‌హ‌స్త్ర నామార్చ‌నతోపాటు హోమ‌ము నిర్వ‌హించి అనంత‌రం తీర్థ ప్రసాద విత‌ర‌ణ జ‌రిపారు. 

ఇక సాయంత్రం 5 గంట‌ల నుంచి సంఘం స‌భ్యులంద‌రికీ ప‌గ‌డి క‌ట్ట‌డం జ‌రిపారు. ఈ స‌మయంలోనే సామూహిక కుంకుమార్చ‌న సంఘంలోని మ‌హిళ స‌భ్యులు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమాల అనంత‌రం, అమ్మ‌వారి ఊరేగింపు జ‌రిగింది. ఈ ఊరేగింపులో సంఘం స‌భ్యులంతా దాండియా ఆడుతూ సంద‌డి చేశారు.  

ఈ కార్య‌క్రమంలో ఆర్య‌వైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ ఆలంప‌ల్లి ర‌వికుమార్, ట్రెజ‌ర‌ర్ ఎర్రం ల‌క్ష్మ‌ణ్, ఐపిపి మ్యాడ‌మ్ అశోక్‌. ప్రాజెక్ట్ క‌న్వీన‌ర్ హ‌రినాతినీ శ్రీ‌నివాస్, ప్రాజెక్ట్ చైర్మ‌న్‌ క‌ల్వ‌కుంట్ల శ్రీ‌నివాస్‌. కోక‌న్వీన‌ర్స్‌: పారెపల్లి మ‌ల్లేష్, ప‌ల్లెర్ల హ‌రీష్ కుమార్, చీక‌టిమ‌ర్ల సంగ‌య్య‌. కో చైర్మ‌న్‌: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖ‌ర్, నూనె నాగ‌రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement