sangam
-
ఘనంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు !
హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇది ఇసామియా బజార్‌లోని నరసింహాస్వామి ఆలయం దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఫలహారం, అభిషేకం, సహస్త్ర నామార్చనతోపాటు హోమము నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి సంఘం సభ్యులందరికీ పగడి కట్టడం జరిపారు. ఈ సమయంలోనే సామూహిక కుంకుమార్చన సంఘంలోని మహిళ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం, అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సంఘం సభ్యులంతా దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఆలంపల్లి రవికుమార్, ట్రెజరర్ ఎర్రం లక్ష్మణ్, ఐపిపి మ్యాడమ్ అశోక్. ప్రాజెక్ట్ కన్వీనర్ హరినాతినీ శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ కల్వకుంట్ల శ్రీనివాస్. కోకన్వీనర్స్: పారెపల్లి మల్లేష్, పల్లెర్ల హరీష్ కుమార్, చీకటిమర్ల సంగయ్య. కో చైర్మన్: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖర్, నూనె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు -
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
ఈ నెలలో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
రాపూరు: నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం వద్ద ఆదివారం ఆయన జిల్లా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న, జరగాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు, సంగం బ్యారేజీలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, వీటిని ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. తెలుగుగంగ కాలువ ద్వారా నీరందని చెరువులకు ఎత్తిపోతల పద్ధతిలో నీరిస్తామని తెలిపారు. కండలేరు, సోమశిల కాలువల పనులు పునఃప్రారంభిస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల రంగంలో సమస్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. వైఎస్ రాజÔశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదలశాఖలో జరిగిన అభివృద్ధి ఆ తరువాత ఆగిపోయిందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మళ్లీ కదలిక వచ్చిందని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల కాలువల పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సోమశిల–స్వర్ణముఖి (ఎస్ఎస్) లింకు కాలువ పనులను ప్రారంభించాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ కాలువ పనుల్ని అటవీ అనుమతులు లేవని గత ప్రభుత్వం నిలిపేసిందని చెప్పారు. కండలేరు డ్యాం నుంచి లి‹ఫ్ట్ ద్వారా వెలుగోను, రాపూరు చెరువుల మీదుగా ఆలూరుపాడుకు కాలువ తవ్వేందుకు, పోకూరుపల్లి రైతులకు లిఫ్ట్ ఇరిగేషçన్ ద్వారా నీరందించేందుకు రూ.528 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ పనుల్ని ప్రారంభించేందుకు, మద్దెలమడుగులో 18 అడుగుల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డిని తీసుకురావాలని కోరారు. అంతకుముందు మంత్రులు కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ను, ఫొటో ఎగ్జిబిçషన్ను పరిశీలించారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్, నీటిపారుదలశాఖ సీఈ హరినారాయణరెడ్డి, సోమశిల ఎస్ఈ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, జిల్లా పరిçషత్ ఉపాధ్యక్షురాలు ప్రసన్న, రాపూరు ఎంపీపీ చెన్నుబాలకృష్ణారెడ్డి, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
కన్నీరు పెట్టిన సంగం కాలనీ.. మీడియా అత్యుత్సాహం
సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్‌ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్‌తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అప్పుడే అన్నంపెట్టి వచ్చా నా కుమారుడు ఈశ్వర్ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది. – ఆదినారాయణమ్మ, ఈశ్వర్ తల్లి తల్లికి ఏమని చెప్పను బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది. – దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తండ్రి మీడియా అత్యుత్సాహం.. ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
Sangam Barrage: చెప్పాడంటే.. చేస్తాడంతే..
సంగం బ్యారేజీ.. జిల్లా రైతాంగానికి వరప్రసాదిని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తన హయాంలో రైతాంగానికి అంకితం చేసేందుకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తపించారు. ఆ కల నెరవేరకుండానే దూరమయ్యారు. సంగం బ్యారేజీకి తన స్నేహితుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా శాసనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదవండి: అదుపులోకి విద్యుత్ కొరత సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజవర్గంలోని సంగం బ్యారేజీకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం చేస్తూ తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ ప్రత్యేక జీఓ జారీ చేశారు. ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా శాసనం అయింది. గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న అకాల మరణం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంత్యంత సన్నిహితుడు, సంగం బ్యారేజీ కోసం తపన పడిన గౌతమ్‌రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని భావించారు. చేస్తానని చెప్పాడు.. శాసనసభలో శాసనం చేశాడు. ఈ మేరకు ఇంజినీరింగ్ శాఖ అధికారులు ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తూ మంగళవారం ప్రత్యేక జీఓ 13 జారీ చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ఇలా సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014 లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. టీడీపీ హయాంలో బ్యారేజీ పనులు మందగించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బ్యారేజీ ఉండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే సీఎంతో ప్రారంభోత్సవం సంగం బ్యారేజీ ఇప్పటికే దాదాపు 95 శాతం పూర్తి కావచ్చింది. కాంక్రీట్ వర్కు పూర్తి చేశారు. ఇక ఎర్త్ వర్క్ 3,461 క్యూబిక్ మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సరీ్వస్ గేట్స్ ఒకటి మాత్రమే పెండింగ్‌లో ఉంది. స్టాఫ్ లెగ్ గేట్స్ పైబ్రిగేషన్ పూర్తయింది, ఎరిక్సిన్ మాత్రం ఏడు పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డితో ప్రారం¿ోత్సం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మంత్రం చెప్పి.. చైన్ మాయం చేశాడు
సాక్షి, సంగం(నెల్లూరు): ఆ వృద్ధురాలు చిన్నపాటి అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. గుర్తుతెలియని యువకుడు ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం బాగా జరిగేందుకు మంత్రం వేస్తానని బంగారు చైన్ తీసుకున్నాడు. మంత్రం చదివి చైన్ మాయం చేశాడు. చైన్ అపహరించాడని గుర్తించిన వృద్ధురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మండల కేంద్రమైన సంగంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెసల భాగ్యమ్మ అనే వృద్ధురాలు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణం సమీపంలో అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె వద్దకు గుర్తుతెలియని యువకుడు వెళ్లాడు. దక్షిణ ఇస్తే జరగబోయేది చెబుతానని ఆమెను నమ్మించాడు. వ్యాపారం బాగా జరగాలంటే మెడలో ఉన్న చైన్ తీసి తనకు ఇస్తే మంత్రించి తమలపాకుల్లో పెట్టి పసుపు, కుంకుమ రాసి డబ్బాలో వేస్తానని భాగ్యమ్మతో అన్నాడు. ఆమె నిజమని నమ్మి తన రెండు సవర్ల బంగారు చైన్ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. అతను తమలపాకులో పెట్టినట్లుగా చూపించి చైన్ మాయం చేశాడు. మంత్రాలు చదివి తమలపాకు, పసుపు, కుంకుమ ఓ డబ్బాలో పెట్టి భాగ్యమ్మకు ఇచ్చి పరారయ్యాడు. యువకుడు వెళ్లిన పది నిమిషాలకు భాగ్యమ్మ డబ్బా తెరిచి చూడగా అందులో చైన్ కనిపించలేదు. తమలపాకు, పసుపు, కుంకుమ మాత్రమే ఉన్నాయి. దీంతో వెంటనే సంగం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి.. -
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు భావితరాల వారికి మార్గదర్శకంగా ఉన్నప్పుడే స్వరాష్ట్ర ఫలాలను రాబోయే తరాలు అనుభవిస్తారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ–2019 ఆవిష్కరణ కార్య క్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణల అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ జరిగింది. డైరీ ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, అధికారులందరూ తమ విధులు సక్రమం గా నిర్వర్తిస్తూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పనిచేయాలన్నారు. ఉద్యోగులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించ డం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందే లా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు జి.విష్ణువర్ధన్‌రావు, ఎస్.సహదేవ్, రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
సాక్షి, నెల్లూరు : పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారంటూ గిరిజనులు చేపట్టిన ఆందోళన సంగంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని నీలగిరి జలాశయం వద్ద రోజు మాదిరిగానే గిరిజజన మత్సకారులు చేపల వేటకు వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు.. మత్సకారులను తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో మత్సకారులకు పోలీసులకు గొడవ మొదలైంది. ఏ కారణం లేకుండా పోలీసులు కొట్టడంతో గిరిజనులు తిరగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు 8 మందిని మత్స్యకారులను అరెస్టు చేసి సంగం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీనిపై స్థానిక గిరిజన మహిళలు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు, ఏ కారణం లేకుండానే వారిని కొట్టారని ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న మత్సశాఖ అధికారిని వెంటనే పోలీసు స్టేషన్‌కు రావడంతో పోలీసులు అతడిని కూడా అడ్డుకున్నారు. -
ఆకట్టుకున్న ‘సంఘం.. శరణం.. గచ్ఛామి’ నృత్యరూపకం
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్యకళామందిర్‌లో సీపీఎం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ బ్యానర్‌పై టి.శివప్రసా«ద్ దర్శకత్వంలో ప్రదర్శించిన సంఘం.. శరణం.. గచ్ఛామి నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి పురస్కరించుకొని ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముందుగా సీపీఎం నాయకులు అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ అందరి వాడని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నాయకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో అంబేడ్కర్ జీవిత లక్ష్యాలు, బాల్యంలో ఆయన కులవివక్షత కారణంగా అనుభవించిన కష్టాలు, రామాబాయ్తో అంబేడ్కర్ వివాహా ఘట్టాలను, ఎర్రవాడ జైలులో అంబేడ్కర్ అనుభవించిన బాధలను చక్కగా ప్రదర్శించారు. కుల వివక్షతపై అంబేడ్కర్ చేసిన పోరాట దృశ్యాలు ప్రేక్షకుల హృదయాలను తడిపేశాయి. అంబేడ్కర్ ఆశయాల సాధనలో ప్రజాప్రతినిధులు విఫలయ్యారనే విషయాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు. అలాగే సమాజం నుంచి యువత ముందుకు వచ్చి అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే భావం ప్రదర్శనలో కనిపించింది. ఈ ప్రదర్శనలో బాల అంబేడ్కర్‌గా మనోహార్, యువ అంబేడ్కర్‌గా సజీవన్, ప్రధాన అంబేడ్కర్‌గా ఎం.జగ్గరాజు నటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.శేషుబాబ్జీ, నగర కార్యదర్శి పి.వీరబాబు, నాయకులు జి.బేబిరాణి, అయితాబత్తుల రామేశ్వరావు, కె. కోటీశ్వరావు, డాక్టర్ స్టాలిన్, గుడాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సంగం హోంగార్డుకు ప్రశంసలు
సంగం : కష్ణా పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న సంగంకు చెందిన మహిళా హోంగార్డ్ వినీల బుధవారం మూగబాలుడి ప్రాణాలు కాపాడి పోలీసు రివార్డు ప్రజల ప్రశంసలు పొందారు. కష్ణా పుష్కరాల సందర్భంగా సంగం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు వినీలను గుంటూరు జిల్లాలోని సీతానగర్ఘాట్ విధుల నిమిత్తం నియమించారు. బుధవారం గుడివాడకు చెందిన మురళీ (7) అనే మూగ బాలుడు కష్ణా నదిలో స్నానం చేస్తూ లోతుకి వెళ్లి మునిగిపోయాడు. ఇది గమనించిన వినీల నదిలోకి దూకి మురళీ ప్రాణాలను కాపాడింది. విషయం తెలిసుక్ను డీజీపీ నందూరి సాంబశివరావు ఆదేశాలతో గుంటూరు ఎస్పీ త్రిపాఠి వినీలకు నగదు రివార్డు అందజేశారు. -
2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి
చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు. మండల కేంద్రమైన సంగం పెన్నానదిలో నిర్మాణం జరుగుతున్న సంగం బ్యారేజీ, కనుపూరుకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను మంగళవారం ఆయన జిల్లా ఎస్ఈ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ మ్యాప్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఈఈ రమణ, బ్యారేజ్ ఇంజనీరు బాలాజీ సింగ్ ఉన్నారు. -
ఆనకట్టకు మరమ్మతులు
సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని పెన్నానదిపై ఉన్న ఆనకట్టకు శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. గతంలో కురిసిన వర్షాల వల్ల ఆనకట్టపై పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఈ ఆనకట్ట కింద 2.75 లక్షల ఎకరాలు సాగులో ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్‌శాఖ గుంతలు పడిన స్థానంలో కాంక్రీట్ పనులను ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఆకుతోట సాగులో ఆదాయం మెండు
సంగం : ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఆకుకూరల సేద్యం రైతుల పాలిట వరంగా మారింది. సాగులో ఖర్చులు తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువకావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అరవపాళెం, అన్నారెడ్డిపాళెంలోని పల్లిపళెం, మస్తాపురంలోని పల్లిపాళెం, పడమటిపాళెంలోని పల్లిపాళెంలో ఎక్కువగా ఆకుకూరలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా తోటాకు చిర్రాకు, పనగంటాకు, పాలాకు సాగుచేస్తున్నారు. సన్నకారు రైతులు ఈ ఆకుతోటల పై ఎక్కువగా దష్టి సాధిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో రెండు, మూడు రకాల ఆకుకూరలు వేస్తున్నారు. 20 సెంట్ల భూమిలో ఆకుతోట సాగుకు విత్తనాలకోసం రూ.2 వేలు, రసాయన ఎరువుల కోసం రూ.500 ఖర్చవుతుంది. విత్తనాలు చల్లిన 40 రోజులకే రూ.6 వేలు విలువైన ఆకుకూరలు దిగుబడి వస్తోంది. తోటలో పండిన ఆకుకూరలను స్థానిక మహిళలే కొనుగోలు చే సి, వాటిని పెరుకుతున్నారు. దీంతో రైతులకు ఆ ఖర్చు కూడా తగ్గిపోతుంది.దీంతో ఎక్కువమంది కష్టంలేని నష్టంరాని ఆకుకూరల సాగుపై దష్టి సాగిస్తున్నారు. -
వసతిగహాలను పున:ప్రారంభించాలి
అనుమసముద్రంపేట : సంక్షేమ వసతిగహాలను మూసివేయడం తగదని వెంటనే పున:ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ఉన్నతపాఠశాలలు, కళాశాలలును మూసివేయించి బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా బస్టాండు సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మెస్ చార్జీలను రూ.1,050కి పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిఫ్‌ల బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆసిఫ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు నాగూర్, రాహిల్, నాయకులు ఫహిమ్, వంశీ, చైతన్య, బాబు, జహిర్, మహిళా నాయకులు సుహన, సాలెహ షర్మిల పాల్గొన్నారు. సంగం : విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్లు సంగంలో సోమవారం విద్యాసంస్థలను మూయించి బంద్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతిగహాల్లో చదువుకునే విద్యార్థులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ మంఢలాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవని, వెంటనే కల్పించాలని కోరారు. నాయకులు వెంకటరమణ, హరి పాల్గొన్నారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
తప్పిన ప్రమాదం సంగం : సంగం చెక్‌పోస్ట్ మలుపులో ముందువెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొని బోల్తా పడి ప్రమాదం తప్పిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలు.. సంగం చెక్‌పోస్ట్ సెంటర్లో ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను గ్రావెల్‌తో సిద్దీపురం వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. దీంతో టిప్పర్ బోల్తాపడింది. సిమెంట్ ట్యాంకర్ స్వల్పంగా ధ్వంసమైంది. టిప్పర్ ట్యాంకర్‌ను ఢీకొన్న సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. -
అనుమతుల కోసం నివేదిక పంపాం
సంగం : సంగంలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నివేదికలు పంపామని ఐటీఐ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మురళీకష్ణ తెలిపారు. కళాశాల భవన నిర్మాణ జాప్యంపై ‘భూములిచ్చారు.. నిధులు మరిచారు’ అని ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. విద్యార్థి సంఘాలు సైతం నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దారు రామాంజనేయులు ప్రిన్సిపల్‌ను గురువారం తన కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. భవన నిర్మాణం కోసం రూ.7.3 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామని తహసీల్దారుకు తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని తహసీల్దారు మురళీకష్ణకు సూచించారు. -
చేమతో అన్నదాతలకు సిరులు
పెరిగిన దిగుబడి ఆదాయం రావడంతో ఆనందంలో రైతులు సంగం : చేమగడ్డలు సాగుచేస్తున్న రైతులు లాభాలబాట పట్టారు. మండలంలోని అనసూయనగర్, దువ్వూరు, అరవపాళెం గ్రామాల్లో వందల ఎకరాల్లో చేమ సాగులో ఉంది. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దిగుబడి బాగా వస్తుండటంతో రైతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎకరా చేమ సాగుకు సుమారు రూ.75 వేలు అవుతోంది. ఇందులో రూ.20 వేలు కౌలుకు ఇస్తుండగా, రూ.50 వేలు కూలీలు, తల్లిగడ్డలు, రవాణా చార్జీలు తదితరవాటి కోసం ఖర్చవుతోంది. 100 బస్తాల దిగుబడి వాతావరణం అనుకూలించడంతో ఎకరానికి నూరు 73 కేజీల బస్తాలు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బస్తా ధర రూ.1,300 పలుకుతోంది. దీంతో ఖర్చులుపోను ఎకరానికి రూ.55 వేల ఆదాయం వస్తోంది. పంట కాలం ఆరు నెలలు అయినా రూ.55 వేలు ఆదాయం రావడం తమకు ధైర్యానిచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంవత్సరం పొడుగుతూ రెండుకార్లు చేమపంటే వేయాలని కొందరు రైతులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయిన రైతులు తిరిగిన పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సీజన్లో పనికి వచ్చే తల్లిగడ్డ కోసం నెల్లూరు వైపు పరుగులు తీస్తున్నారు. నిత్యం తెగుళ్లు, సాగునీటి సమస్యలతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు సైతం చేమపంట వైపు దష్టి సారిస్తున్నారు. వరి పంట ఆదాయాలు తగ్గడంతో పాటు నష్టాలు వస్తుండటంతో ప్రత్యామ్నాయ పంటలపై మండల రైతాంగం అధికంగా దష్టిపెట్టింది. -
సంగంలో అటవీ భూముల పరిశీలన
సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని అటవీ భూములను అటవీశాఖ అధికారులు, అటవీ విజిలెన్స్ అధికారులు గురువారం పరిశీలించారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనుమతులకు మించి అటవీశాఖ భూములు వాడుకున్నారనే విషయంపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఫారెస్ట్ రేంజర్ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను అనుమతి ఇచ్చిన మేరకే అటవీ భూములను వినియోగించుకోవాలని, అంతకుమించి వాడితే అటవీ చట్టాల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు– ముంబై జాతీయ రహదారి, సంగం తిప్ప మీద నుంచి వెళ్లే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఫారెస్ట్ రేంజర్ రాంకొండారెడ్డి పాల్గొన్నారు. -
రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలి
సంగం : నీలాయపాలెం ప్రజల్లో చైతన్యం తెచ్చి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీడీఓ జయరామయ్య కొనియాడారు. మండలంలోని నీలాయపాలెం పంచాయతీలో సర్పంచ్ చొరవతో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తికావడంతో బుధవారం అభినందనసభ ఏర్పాటుచేశారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ దగ్గుమాటి కామాక్షమ్మ మాట్లాడుతూ నీలాయపాలెం బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా మండలంలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. తహసీల్దార్ రామాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, సంగం వైధ్యాధికారిని డా.రాగిణి ప్రసంగించారు.అనంతరం సర్పంచ్‌ను సన్మానించారు. మొక్కలు నాటారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గౌస్‌అహ్మద్, పీఆర్ ఏఈఈ మల్లికార్జున, హౌసింగ్ ఏఈ రాజారావు, ఏపీఎం రవిశంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఏటూరు సుధాకర్‌రెడ్డి, సీహెచ్ కష్ణారెడ్డి, వెంగారెడ్డిపాళెం వైఎస్సార్సీపీ నేత కనుమూరి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఐటీఐ నిర్మాణం చేపట్టాలని ధర్నా
సంగం : మండల కేంద్రమైన సంగం తిరుమనకొండ కాశీ విశేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ సమీపంలో ఐటీఐ నిర్మాణపనులను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలకు స్థలం కేటాయించి నాలుగేళ్లయినా ఇంకా నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. పలుమార్లు దీనిపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ధర్నాతో నెల్లూరు – ముంబై రోడ్డుపై ఇరువైపులా రాకపోకలు స్థంభించాయి. పోలీసుల చొరవతో ధర్నా విరమించారు. నాయకులు వెంకటరమణ, హరి, వెంకటేష్ పాల్గొన్నారు. -
అన్నదాతకు తెగుళ్ల బెడద
సంగం : ఆలస్యంగా వరి నాట్లు ప్రారంభించిన అన్నదాతలు తమ పంటకు మైక్స్ (ఆకునల్లి తెగులు) బెడద తగలడంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలోని దువ్వూరు, మర్రిపాడు, ఎండాదిబ్బ, పడమటిపాలెం, మత్తాపురం, అల్లారెడ్డిపాలెం, సంగం, పొలామెర్లి, తరుకుడుపాడు, వెంగారెడ్డిపాడు గ్రామాల్లో ఈ సంవత్సరం ఆలస్యంగా 4వేల ఎకరాలకు పైగా వరిపంటను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట పిలకకట్టే దశలో ఉంది. ఈ దశలో మైక్స్ చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంట ఆకులను మైక్స్ సోకి రసం మొత్తం పీల్చివేసి ఆకులను నిమ్మపండు రంగులోనికి తెస్తున్నాయి. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని అన్నదాతలు వాపోతున్నారు. మైక్స్ నివారణ కోసం పురుగు ముందల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రతిఒక్కరు పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేస్తూ బిజీగా ఉన్నారు. నివారణ చర్యలు చేపట్టండి : శైలజాకుమారి వ్యవశాయశాఖాధికారి, సంగం మండలంలో ఆలస్యంగా సాగుచేసిన వరి పంటకు మైక్స్ సోకుతోంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటర్ నీటికి డైకోపాల్ ద్రావణాన్ని 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. -
పల్లెల్లో అధ్వానంగా రోడ్లు
సంగం : మండలంలోని కోలగట్ల, తిరుమనతిప్ప, పెరమన, దువ్వూరు, పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా దళితవాడల్లో రోడ్లు దెబ్బతిని బురదమయమై ఉన్నాయి. దళితులు బురద రోడ్ల మీదనే నడుస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దష్టి పెట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ రోడ్లపై గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సైతం అంతర్గత రోడ్లు దెబ్బతినడంతో పొలాలకు రసాయనిక ఎరువులు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. జెండాదిబ్బ, అనసూయనగర్, దువ్వూరు, అరవపాళెం, పడమటిపాళెం గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పొలంలో నుంచి ప్రతినిత్యం పంటను నెల్లూరు మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. రోడ్లు దెబ్బతిని బండ్లు నడవలేకపోవడంతో ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తుందని సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎద్దల బండ్లపై పంటను తీసుకెళ్తే ఖర్చు తక్కువ. ట్రాక్టర్లపై తీసుకెళ్తే తడిసిమోపెడవుతోంది. రోడ్లు సరిగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి ట్రాక్టర్ల ద్వారా పంటను తరలిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని పలువురు సర్పంచులు అధికారుల దష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు అర్జీలు సైతం సమర్పించారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఛిద్రమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు, సన్నకారు రైతులు కోరుతున్నారు. నివేదికలు పంపాం : మల్లికార్జున, పంచాయతీరాజ్ ఏఈ మండలంలో పలు గ్రామాల్లో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని మరమ్మతులు చేసేందుకు నివేదికలు పంపాం. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం. -
మోడల్ వయోజన విద్య కేంద్రం ప్రారంభం
సంగం : మండలంలోని సిద్దీపురానికి మంజూరైన మోడల్ వయోజన విద్యాకేంద్రాన్ని ఎంపీపీ దగుమాటి కామాక్షమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయంలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయరామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. జిల్లాకు ఆరు కేంద్రాలు మంజూరు కాగా అందులో సిద్దీపురం ఒకటన్నారు. ఈ కేంద్రానికి రూ.2.50 లక్షలతో కంప్యూటర్, కుర్చీలు, వయోజనులకు అవసరమైన ఆటవస్తువులు, వేయింగ్ మిషన్, కుట్టుమిషన్ తదితర వస్తువులను అందజేశారన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ నిరక్ష్యరాసులపై సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని సిద్దీపురం గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి, వెంగారెడ్డిపాళెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించండి
సంగం : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది చివరినాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మంచు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆత్మగౌరవం జిల్లా కో–ఆర్డినేటర్ సుస్మితారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన సంగంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ జయరామయ్యకు ఆత్మగౌరవం కార్యక్రమంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అన్ని గ్రామల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని, వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాని తెలిపారు. లబ్ధిదారులకు బిల్లులు మంజూరులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట పీఆర్ ఏఈ మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూస్ అధికారి గౌస్‌అహ్మద్, ఈఓపీఆర్డీ రవికుమార్ తదితరులున్నారు.