ఆకుతోట సాగులో ఆదాయం మెండు
ఆకుతోట సాగులో ఆదాయం మెండు
Published Fri, Aug 5 2016 12:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
సంగం : ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఆకుకూరల సేద్యం రైతుల పాలిట వరంగా మారింది. సాగులో ఖర్చులు తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువకావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అరవపాళెం, అన్నారెడ్డిపాళెంలోని పల్లిపళెం, మస్తాపురంలోని పల్లిపాళెం, పడమటిపాళెంలోని పల్లిపాళెంలో ఎక్కువగా ఆకుకూరలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా తోటాకు చిర్రాకు, పనగంటాకు, పాలాకు సాగుచేస్తున్నారు. సన్నకారు రైతులు ఈ ఆకుతోటల పై ఎక్కువగా దష్టి సాధిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో రెండు, మూడు రకాల ఆకుకూరలు వేస్తున్నారు. 20 సెంట్ల భూమిలో ఆకుతోట సాగుకు విత్తనాలకోసం రూ.2 వేలు, రసాయన ఎరువుల కోసం రూ.500 ఖర్చవుతుంది. విత్తనాలు చల్లిన 40 రోజులకే రూ.6 వేలు విలువైన ఆకుకూరలు దిగుబడి వస్తోంది. తోటలో పండిన ఆకుకూరలను స్థానిక మహిళలే కొనుగోలు చే సి, వాటిని పెరుకుతున్నారు. దీంతో రైతులకు ఆ ఖర్చు కూడా తగ్గిపోతుంది.దీంతో ఎక్కువమంది కష్టంలేని నష్టంరాని ఆకుకూరల సాగుపై దష్టి సాగిస్తున్నారు.
Advertisement
Advertisement