good result
-
‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
భోపాల్: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్ వెళ్లాడు. అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
ప్రతిభ ‘ఖోఖో’ల్లలు
లక్ష్య సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్న క్రీడాకారులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు చంద్రమాంపల్లి విద్యార్థులు చంద్రమాంపల్లి(పెద్దాపురం) : బోధకులు చూపించిన మార్గం.. క్రీడాస్ఫూర్తితో పోరాట పటిమ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో లక్ష్యసాధనే ధ్యేయంగా పరిగెడుతున్న ఆ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఖేలో ఇండియా జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా టీమ్‌లో చంద్రమాంపల్లిలో చదువుకున్న సాలిపల్లి మణికంఠ, వెన్నా వెంకటేష్, మాదాసు సాయి వెంకట్ లు స్థానం సంపాదించారు. ఈ నెలలో నెలలో నెల్లూరు, నరసారావుపేటలో జరిగే స్థాయి ఖోఖోలో తలపడనున్నారు. వ్యాయామ ఉపా«ధ్యాయుడు మట్టా సుబ్బారావు పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపా«ధ్యాయురాలు కె.గాయత్రి ప్రోత్సాహం సామర్లకోటలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు లక్ష్య సాధనే ధ్యేయంగా జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పుట్టిన గ్రామానికి, చదివిన పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. రైల్వేలో ఉద్యోగం సంపాదించాలి ఎప్పటికైనా ఆటల్లో రాణించి, క్రీడా కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాందించాలని ఉంది. క్రీడలపై ఉన్న మక్కువ, తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఆటల్లో రాణించగలుగుతున్నాం. –సాలిపల్లి మణికంఠ, ఇంటర్మీడియట్, దివిలి. కోచ్‌ను కావడమే ప్రధాన ధ్యేయం ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిలో క్రీడాస్ఫూర్తితో పాటు క్రీడారంగంలో రాణిస్తూ కోచ్ కావాలన్నదే ప్రధాన ధ్యేయం. చిన్నప్పటి నుంచి క్రీడలతో ఉన్న మక్కువతోనే కోచ్‌ను కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నాన్న చిరు వ్యాపారైనా.. ఆయన ప్రోత్సాహంతోనే క్రీడల పట్ల మక్కువను అలవర్చుకున్నాను. –వెన్నా వెంకటేష్, ఇంటర్మీడియట్, చంద్రమాంపల్లి వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలని.. క్రీడల్లో ప్రతిభ కనబరిచి విద్యకు ప్రాధాన్యమిస్తూ ఎప్పటికైనా వ్యాయామ ఉపాధ్యాయుడిగా భవిష్యత్తులో ఎదగాలని ఉంది. క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో పాటు మనతో పాటు మరింత మంది క్రీడాకారులను తయారు చేసే ఆలోచన ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడి ద్వారానే సాధ్యమని నా అభిప్రాయం. – మాదాసు సాయి వెంకట్, ఇంటర్మీడియట్, చంద్రమాంపల్లి క్రీడాకారులను ఆదుకోవాలి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వగలిగితే మరింత మంది క్రీడాకారులను దేశానికి అందించే వీలుంటుంది. ఖోఖో మంచి గుర్తింపునిచ్చి క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటే విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. – మట్టా సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు, జడ్పీ ఉన్నత పాఠశాల, చంద్రమాంపల్లి -
కీలక నిర్ణయాలకు వేదిక
సత్యదేవుని ఆలయ చరిత్రలో ఓ మైలురాయి 2016 పలు ఆధ్యాత్మిక, విప్లవాత్మక చర్యలకు నాంది అన్నవరం : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన అన్నవరం సత్యదేవుని ఆలయం 2016 సంవత్సరం అనేక కీలక పరిణామాలు, నిర్ణయాలకు వేదికగా మారింది. సత్యదేవుని దివ్య కల్యాణం , తెప్పోత్సవం, గిరిప్రదక్షిణ వంటి కార్యక్రమాలను ద్రో¯ŒS కెమేరాల ద్వారా చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రసార మాధ్యమాల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లిన ఘనత 2016 కే దక్కింది. అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు పాలనాపరంగా దేవస్థానానికి లబ్ధి చేకూరే పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం ఆరో వ్యవస్థాపక ధర్మకర్తగా ఇనుగంటి వంశానికి చెందిన రాజా ఇనుగంటి వేంకట రోహిత్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆగమ పాఠశాలకు శంకుస్థాపన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు 2016 నవంబర్‌లో శంకుస్థాపన జరిగింది. రూ.రెండు కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దాత సహకారంతో తూర్పు రాజగోపురం దిగువన సత్యదేవ యాగశాలకు గత ఏడాది శంకుస్థాపన జరిగినా ఈ ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం (మఖ) నాడు మాత్రమే జరిగే ఆయుష్యహోమం కంచి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామీజీ సూచనలతో రోజూ జరిగేలా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇది భక్తుల భాగస్వామ్యంతో రూ.రెండు వేలు టిక్కెట్‌తో నిర్వహిస్తున్నారు. అందువల్ల వారానికి రెండు లేదా మూడు పర్యాయాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ‘వృక్ష ప్రసాదం’ భక్తుల నామ, జన్మనక్షత్రాన్ని బట్టి నాటుకోవల్సిన వివిధ మొక్కలను ’వృక్షప్రసాదం’గా ఈ ఏప్రిల్ నుంచి దేవస్థానంలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో వీఐపీలకు మాత్రమే లభించే వేదపండితుల ఆశీస్సులు రూ.558 టిక్కెట్‌తో భక్తులు కూడా అందజేస్తున్నారు. కొండ దిగువ నుంచి ఎగువ వరకూ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తి గీతాలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినిపిస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎ¯ŒSఎంఆర్, వ్రత పురోహితులకు బయోమెట్రిక్ అటెండె¯Œ్స ఏర్పాటు చేసి విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బంది, పురోహితులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 సీసీ కెమేరాలు ఉండగా 96 కెమేరాలకు పెంచారు. రెండు ఘాట్‌రోడ్లు, మెట్లదారితో బాటు దేవస్థానంలోని అన్ని ప్రాంతాలను సీసీ కెమేరాల పరిధిలోకి తెచ్చారు. ఇది అటు భద్రతా చర్యల కింద ఉపయోగపడడంతో బాటు, విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బందిని గుర్తించేందుకు ఉపకరిస్తోంది. హుండీ లెక్కింపునకు ఈ ఏడాది నుంచే టేబుల్స్ ఉపయోగిస్తున్నారు. గతంలో సిబ్బంది తివాచీల మీద కూర్చుని లెక్కిండం వల్ల ఆలస్యమయ్యేది. టేబుల్స్ మీద నగదు పరిచి లెక్కించే విధానం ప్రారంభించాక రూ.కోటి అయినా సాయంత్రానికి లెక్కింపు పూర్తి చేస్తున్నారు. పెరిగిన కానుకలు సత్యదేవుని నిత్యకల్యాణంలో స్వామివారికి పట్టువస్రా్తలు సమర్పించేందుకు రూ.558 టిక్కెట్ పెట్టారు. రోజూ కనీసం పదిమంది ఈ టిక్కెట్ కొనుగోలు చేసి పట్టువస్రా్తలు సమర్పిస్తున్నారు. సత్యదేవుని ప్రధానాలయం వద్ద పెద్ద హుండీ ఏర్పాటు చేసి ఆ హుండీ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే ఏర్పాటు చేశారు. దీంతో ఆ హుండీలో పడే కానుకలు పెరిగాయి. వ్రతాలు, కేశఖండన శాలలో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేసే పద్ధతిని నిరోధించారు. çఫలితంగా ఆ మేరకు ఆదాయం కూడా పెరిగింది. 2017లో దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందేలా కృషి చేస్తామని చైర్మ¯ŒS రోíßహిత్, ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. వెబ్‌సైట్‌కు ప్రశంసలు అన్నవరం దేవస్థానం వెబ్సైట్ అటు డిజై¯ŒS పరంగా, సమాచార పరంగా అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు పొందింది. ఈఓ కే నాగేశ్వరరావుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ మేరకు అభినందనలు తెలియచేసి జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది సత్యదేవుని కల్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణం ద్రో¯ŒS కెమేరాతో చిత్రీకరించారు. -
సాక్షి స్పెల్‌బీకి అనూహ్య స్పందన
రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగిన ‘సాక్షి’ ఎరీనా వ¯ŒS స్కూల్ ఫెస్ట్ స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్ పరీక్షకు అనూహ్య స్పందన లభించింది. నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పరీక్షలకు 236 మంది విద్యార్థులు హాజరయ్యారు. ‘సాక్షి’ టీవీలో బి–మాస్టర్ అడిగిన స్పెల్లింగులను విద్యార్థులు జవాబు పత్రంపై రాశారు. రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరంలోని త్రిపుర నగర్‌లోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగిన ‘సాక్షి’ ఎరీనా వ¯ŒS స్కూల్ ఫెస్ట్ స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ పరీక్షకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై ఈ పరీక్షలు రాశారు. ఇందులో ప్రతిభ చూపిన వారు త్వరలో జరిగే సెమీఫైనల్ పరీక్షల్లో పాల్గొంటారు. నాలుగు కేటగిరీల్లో.. నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పరీక్షకు 236 మంది హాజరయ్యారు. కేటగిరీ–1లో 37 మంది, కేటగిరీ–2లో 54 మంది, కేటగిరీ–3లో 75 మంది, కేటగిరీ–4లో 70 మంది విద్యార్థులు సాక్షి టీవీలో బి–మాస్టర్ అడిగిన స్పెల్లింగులను జవాబు పత్రంపై రాశారు. క్వార్టర్ ఫైనల్ పరీక్షలను సాక్షి రాజమహేంద్రవరం యూనిట్ ఇ¯ŒSచార్జి వీవీ శివుడు, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత్రి బాలాత్రిపుర సుందరి, యాడ్ ఆఫీసర్ ఉమాశంకర్ పర్యవేక్షించారు. కాగా..స్పెల్‌బీ పరీక్ష ఇంగ్లిషు భాషపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా ఉపయోగంగా ఉంది స్పెల్‌బీ పరీక్ష వల్ల ఇంగ్లిషుపై పూర్తిగా అవగాహన కలుగుతోంది. అలాగే ఇతర సబ్జెకులపై కూడా అవగాహన పెరుగుతోంది. చాలా ఉపయోగంగా ఉంది. – కార్తీక్, తొమ్మిదో తరగతి, కోనసీమ విద్యాశ్రమం, ముక్తేశ్వరం. ఇంగ్లిషుపై పట్టు పెరిగింది స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావడం వల్ల ఇంగ్లిషుపై పట్టు పెరిగింది. అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతున్నాను. భాషాదోషాలు తగ్గాయి. – లక్ష్మిప్రసన్న, ఐదోతరగతి, ఆదిత్య స్కూలు, కాకినాడ. విద్యార్థులకు వరం ప్రతి ఏటా సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష విద్యార్థులకు వరం అనవచ్చు.ఈ పరీక్ష కారణంగా ఇంగ్లిషుతో పాటు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించాను. – మేఘన భండారీ, పదో తరగతి, ట్రిప్స్ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం స్పెల్‌బీ ఒక మంచి వేదిక ఇంగ్లిషుపై పట్టు సాధించడానికి సాక్షి స్పెల్‌బీని ఒక మంచి వేదికగా తీసుకువచ్చింది. ఏటా సాక్షి స్పెల్‌బీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.దీని కారణంగా విద్యార్థులు ఇంగ్లిషులో మాట్లాడడంతో నైపుణ్యం సాధిస్తున్నాను. – సుచిత్ర, విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరం ‘సాక్షి’కి హేట్సాఫ్ ఇంగ్లిషుపై పట్టుసాధించేందుకు సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష ప్రాధాన్యతను రెండు తెలుగురాష్ట్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించారు. విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీపడుతున్నారు. ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న ‘సాక్షి’కి హేట్సాఫ్. – బండి అజయ్‌బాబు, విద్యార్థి తండ్రి, రాజమహేంద్రవరం -
శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి
నడకుదురు(కరప): రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటించి, సాగుచేస్తే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ చైర్మన్ డి.వెంకటనరసింహరాజు సూచించారు. నడకుదురులోని కరప సబ్‌డివిజన్ ఏడీఏ కార్యాలయంలో మంగళవారం రైతులతో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఆత్మ కరప బ్లాకు ద్వారా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో సాగు మెళుకువలు వివరిస్తామన్నారు. వారి సూచనలు పాటిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలన్నారు. కరప ఏడీఏ ఎన్.రమేష్ మాట్లాడుతూ రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా పంటతెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్నారు. ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.నందకిశోర్‌లు మాట్లాడుతూ వరిలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడా ఎర్రనల్లి, సుడిదోమ కనిపిస్తున్నాయని తెలిపి, రైతులకు నివారణ చర్యలు వివరించారు. ఎర్రనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా ఇధియాన్ 2 మి.లీ. ఏదో ఒక మందును ఒక లీటరుకు కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఒక ఎకరాకు పిచి కారీ చేయాలన్నారు. సుడిదోమ నివారణకు ఇమిడాక్లోఫెడ్ 25 మి.లీ, లేదా డైనోతెప్యురాన్ 80 గ్రాములు లేదా టైమెప్రోజీన్ 120 గ్రాములు ఏదో ఒకదాన్ని ఒక ఎకరాకు పిచికారీచేయాలన్నారు. దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఎపిఫేట్ 300 గ్రాములు లేదా ఎటోఫిన్పాక్స్ 400 మి.లీ. ఏదో ఒకమందును ఒక ఎకరాకు పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. కరప బ్లాకులో ఆత్మద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేయిన్తున్న ట్టు ఆత్మ ఏటీఎం పెందుర్తి అమర్నాథ్ తెలిపారు. కషాయాల తయారీ, వాటిని ఏయే తెగుళ్ల నివారణకు ఎలా వా డాలో తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించి, రైతుల కు పంపిణీ చేశారు. కరప, తాళ్లరేవు, కాజులూరు ఎంఏఓలు ఎ.అచ్యుతరావు, ఎం.సుజాత, మురళీధరన్ పాల్గొన్నారు. -
ఆకుతోట సాగులో ఆదాయం మెండు
సంగం : ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఆకుకూరల సేద్యం రైతుల పాలిట వరంగా మారింది. సాగులో ఖర్చులు తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువకావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అరవపాళెం, అన్నారెడ్డిపాళెంలోని పల్లిపళెం, మస్తాపురంలోని పల్లిపాళెం, పడమటిపాళెంలోని పల్లిపాళెంలో ఎక్కువగా ఆకుకూరలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా తోటాకు చిర్రాకు, పనగంటాకు, పాలాకు సాగుచేస్తున్నారు. సన్నకారు రైతులు ఈ ఆకుతోటల పై ఎక్కువగా దష్టి సాధిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో రెండు, మూడు రకాల ఆకుకూరలు వేస్తున్నారు. 20 సెంట్ల భూమిలో ఆకుతోట సాగుకు విత్తనాలకోసం రూ.2 వేలు, రసాయన ఎరువుల కోసం రూ.500 ఖర్చవుతుంది. విత్తనాలు చల్లిన 40 రోజులకే రూ.6 వేలు విలువైన ఆకుకూరలు దిగుబడి వస్తోంది. తోటలో పండిన ఆకుకూరలను స్థానిక మహిళలే కొనుగోలు చే సి, వాటిని పెరుకుతున్నారు. దీంతో రైతులకు ఆ ఖర్చు కూడా తగ్గిపోతుంది.దీంతో ఎక్కువమంది కష్టంలేని నష్టంరాని ఆకుకూరల సాగుపై దష్టి సాగిస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘మార్పు’
మెదక్, న్యూస్‌లైన్: మాత, శిశు సంరక్షణే లక్ష్యంగా.. నిరుపేద మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కలెక్టర్ స్మితాసబర్వాల్ ‘మార్పు’ పథకానికి ఊపిరి పోశారు. ఫలితంగా ఇంత వరకూ కాన్పుకు నోచుకోని ప్రభుత్వాస్పత్రుల్లో అనునిత్యం ప్రసవాలు జరుగుతున్నాయి. చిన్నారుల కేరింతలు... బోసి నవ్వులతో ప్రభుత్వాస్పత్రులు కళకళలాడుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఒకేరోజు ఆరు కాన్పులు జరగడం ఇందుకు నిదర్శనం. కాని కొన్ని సౌకర్యాలలేమి వల్ల అక్కడక్కడా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల్లో సైతం అధునాతన సౌకర్యాలు కల్పిస్తే నిజమైన ‘మార్పు’ వస్తుందని పల్లెజనం పేర్కొంటున్నారు. రామాయంపేట క్లస్టర్ పరిధిలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు మెదక్, రామాయంపేట పెద్దాస్పత్రులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో పాపన్నపేటలో 19, పొడ్చన్‌పల్లిలో 4, సర్ధనలో 6, వెల్దుర్తిలో 8, డి.ధర్మారంలో 8, చిన్నశంకరంపేటలో 4, చేగుంటలో 2, దౌల్తాబాద్‌లో 1, నార్సింగిలో 7 ప్రసవాలు జరిగాయి. మెదక్‌లో 107, రామాయంపేటలో ఒక ప్రసవం నమోదయ్యింది. సాధారణంగా మారుమూల గ్రామాల్లో గతంలో మంత్రసానులే ప్రసవాలు చేసేవారు. అప్పట్లో మాత, శిశు మరణాలు కూడా అధికంగా ఉండేవి. కాలం మారుతున్న తరుణంలో నిరుపేద మహిళలు సైతం పట్టణంలోని ప్రైవేట్ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు అవసరమైనా..లేకున్నా..90 శాతం కాన్పులకు సిజేరియన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. ఒక్కకాన్పునకు ఎంతలేదన్న రూ.10 నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మార్పుతో మారిన పరిస్థితులు కలెక్టర్ స్మితాసబర్వాల్ చొరవతో ఊపిరి పోసుకున్న మార్పు పథకం. సత్ఫలితాలిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం 20 ప్రసవాలైనా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సుమారు 12యేళ్లుగా ప్రసవాలు నమోదు కాని సర్ధన, పొడ్చన్‌పల్లి లాంటి ఆస్పత్రుల్లో కూడా వరుసగా ప్రసవాలు జరుగుతున్నాయి. పాపన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ఈనెల 18న ఆరు ప్రసవాలు జరగడం గమనార్హం. ఇందులో ఓ ప్రభుత్వ మహిళా టీచర్, ఒక రెవెన్యూ అధికారి కుమార్తె ఉండటం విశేషం. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటే జననీ సురక్ష యోజన పథకంతోపాటు ఇతర ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అసౌకర్యాలతో అపశ్రుతులు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలలేమితో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల 11న మెదక్ ఏరియా ఆస్పత్రిలో కౌడిపల్లి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మంజుల ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం 24 గంటలలోపు మృత్యువాత పడింది. అదే విధంగా డిసెంబర్ 1న సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్‌కు చెందిన రుద్రోత్ రేవతి అనే బీడీ కార్మికులు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా చివరి సమయంలో మా వల్ల కాదంటూ పట్టణానికి పంపడంతో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇటీవల నర్సాపూర్‌లో సైతం ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రసవాలు జరిగే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనస్తీషియన్, డీజీఓ, పిడియాట్రిషియన్, బ్లడ్‌బ్యాంకు, వార్మర్, ఇంక్యుబెటర్, ఆక్సిజన్, అంబులెన్స్ లాంటి సౌకర్యాలుంటే సుఖంగా ప్రసవాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.