- సత్యదేవుని ఆలయ చరిత్రలో ఓ మైలురాయి 2016
- పలు ఆధ్యాత్మిక, విప్లవాత్మక చర్యలకు నాంది
కీలక నిర్ణయాలకు వేదిక
Published Fri, Dec 30 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
అన్నవరం :
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన అన్నవరం సత్యదేవుని ఆలయం 2016 సంవత్సరం అనేక కీలక పరిణామాలు, నిర్ణయాలకు వేదికగా మారింది. సత్యదేవుని దివ్య కల్యాణం , తెప్పోత్సవం, గిరిప్రదక్షిణ వంటి కార్యక్రమాలను ద్రో¯ŒS కెమేరాల ద్వారా చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రసార మాధ్యమాల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లిన ఘనత 2016 కే దక్కింది. అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు పాలనాపరంగా దేవస్థానానికి లబ్ధి చేకూరే పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం ఆరో వ్యవస్థాపక ధర్మకర్తగా ఇనుగంటి వంశానికి చెందిన రాజా ఇనుగంటి వేంకట రోహిత్ ఈ బాధ్యతలు స్వీకరించారు.
ఆగమ పాఠశాలకు శంకుస్థాపన
సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు 2016 నవంబర్‌లో శంకుస్థాపన జరిగింది. రూ.రెండు కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దాత సహకారంతో తూర్పు రాజగోపురం దిగువన సత్యదేవ యాగశాలకు గత ఏడాది శంకుస్థాపన జరిగినా ఈ ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం (మఖ) నాడు మాత్రమే జరిగే ఆయుష్యహోమం కంచి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామీజీ సూచనలతో రోజూ జరిగేలా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇది భక్తుల భాగస్వామ్యంతో రూ.రెండు వేలు టిక్కెట్‌తో నిర్వహిస్తున్నారు. అందువల్ల వారానికి రెండు లేదా మూడు పర్యాయాలు చేస్తున్నారు.
తక్కువ ధరకు ‘వృక్ష ప్రసాదం’
భక్తుల నామ, జన్మనక్షత్రాన్ని బట్టి నాటుకోవల్సిన వివిధ మొక్కలను ’వృక్షప్రసాదం’గా ఈ ఏప్రిల్ నుంచి దేవస్థానంలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో వీఐపీలకు మాత్రమే లభించే వేదపండితుల ఆశీస్సులు రూ.558 టిక్కెట్‌తో భక్తులు కూడా అందజేస్తున్నారు. కొండ దిగువ నుంచి ఎగువ వరకూ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తి గీతాలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినిపిస్తున్నారు.
పాలనాపరమైన నిర్ణయాలు
రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎ¯ŒSఎంఆర్, వ్రత పురోహితులకు బయోమెట్రిక్ అటెండె¯Œ్స ఏర్పాటు చేసి విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బంది, పురోహితులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 సీసీ కెమేరాలు ఉండగా 96 కెమేరాలకు పెంచారు. రెండు ఘాట్‌రోడ్లు, మెట్లదారితో బాటు దేవస్థానంలోని అన్ని ప్రాంతాలను సీసీ కెమేరాల పరిధిలోకి తెచ్చారు. ఇది అటు భద్రతా చర్యల కింద ఉపయోగపడడంతో బాటు, విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బందిని గుర్తించేందుకు ఉపకరిస్తోంది. హుండీ లెక్కింపునకు ఈ ఏడాది నుంచే టేబుల్స్ ఉపయోగిస్తున్నారు. గతంలో సిబ్బంది తివాచీల మీద కూర్చుని లెక్కిండం వల్ల ఆలస్యమయ్యేది. టేబుల్స్ మీద నగదు పరిచి లెక్కించే విధానం ప్రారంభించాక రూ.కోటి అయినా సాయంత్రానికి లెక్కింపు పూర్తి చేస్తున్నారు.
పెరిగిన కానుకలు
సత్యదేవుని నిత్యకల్యాణంలో స్వామివారికి పట్టువస్రా్తలు సమర్పించేందుకు రూ.558 టిక్కెట్ పెట్టారు. రోజూ కనీసం పదిమంది ఈ టిక్కెట్ కొనుగోలు చేసి పట్టువస్రా్తలు సమర్పిస్తున్నారు. సత్యదేవుని ప్రధానాలయం వద్ద పెద్ద హుండీ ఏర్పాటు చేసి ఆ హుండీ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే ఏర్పాటు చేశారు. దీంతో ఆ హుండీలో పడే కానుకలు పెరిగాయి. వ్రతాలు, కేశఖండన శాలలో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేసే పద్ధతిని నిరోధించారు. çఫలితంగా ఆ మేరకు ఆదాయం కూడా పెరిగింది. 2017లో దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందేలా కృషి చేస్తామని చైర్మ¯ŒS రోíßహిత్, ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు.
వెబ్‌సైట్‌కు ప్రశంసలు
అన్నవరం దేవస్థానం వెబ్‌సైట్ అటు డిజై¯ŒS పరంగా, సమాచార పరంగా అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు పొందింది. ఈఓ కే నాగేశ్వరరావుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ ఈ మేరకు అభినందనలు తెలియచేసి జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది సత్యదేవుని కల్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణం ద్రో¯ŒS కెమేరాతో చిత్రీకరించారు.
Advertisement
Advertisement