satyadeva
-
గిరిపై మార్మోగిన వేదఘోష
అన్నవరం : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం సాయంత్రం నవదంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 125 మంది పండితులను సత్కరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి వేదిక మీద ప్రతిష్ఠించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. పండితులు నాలుగు గంటలకు అనివేటి మండపాన్ని చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవరకూ రత్నగిరి పరిసరాలు పండితుల వేదమంత్రోఛ్చాటనతో మార్మోగాయి. తరువాత దేవస్థానం వేదపండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులందచేశారు. అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. తొలుత మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మలను, తరువాత మిగిలిన పండితులను సత్కరించారు. వేదపండితుల పాండిత్యాన్ని అనుసరించి రూ.మూడువేలు, రూ.2,700, రూ.2,300, రూ.1,500 చొప్పున నగదు పారితోషికం, మామిడిపండు, స్వామివారి ప్రసాదం, విసనకర్ర బహూకరించారు. విశ్రాంత వ్రతబ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి, విశ్రాంత దేవస్థానం పంచాంగకర్త తొయ్యేటి సుబ్రహ్మణ్యంలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వాములు కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నవరంలో నేడు వైదిక కార్యక్రమాలు l తెల్లవారుజామున: 3.00 గంటలకు సుప్రభాతసేవ l ఉదయం: 8.00 గంటలకు చతుర్వేదపారాయణ l సాయంత్రం 4.00 గంటలకు: పేపర్ మిల్లు పార్కులో స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం l రాత్రి 9.00 గంటలకు : కొండ దిగువన స్వామి, అమ్మవార్లను వెండి వాహనంపై ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు l ఉదయం 6.00 నుంచి 9.00 గంటల వరకూ భజనలు l సాయంత్రం 5.00 నుంచి 6.00 గంటల వరకూ భక్తిరంజని l సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకూ భరతనాట్యం -
సత్తెన్న పెళ్లికొడుకాయెనే...
∙సత్యదేవుని దివ్య కల్యాణానికి సర్వం సిద్ధం ∙రత్నగిరిపై మొదలైన పెళ్లి సందడి ∙నేటి రాత్రి 9.30 నుంచి కల్యాణోత్సవం అన్నవరం : భక్తవరదుడు సత్యదేవుడు వరుడై... సిరులొసగే దేవేరి అనంతలక్ష్మీ అమ్మవారు వధువైన శుభవేళ రత్నగిరి పులకించింది. కల్యాణ కారకులైన స్వామి, అమ్మవార్లే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చిన తరుణంలో భక్తకోటి తరించింది. రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి దివ్యకల్యాణోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కల్యాణ వేడుకలకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అమ్మవార్లు, పెళ్లి పెద్దలు సీతారాములను సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక ఆసనంపై స్వామి, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను ప్రతిష్ఠించారు. పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం చైర్మ¯ŒS ఐ.వి.రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయ ప్రకారం ముత్తయిదువలు పసుపు దంచారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం రాత్రి ఏడు గంటలకు రత్నగిరి కళావేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం కనులపండువగా జరిగింది. స్వామి వారి తరఫున కొంతమంది పండితులు అమ్మవార్ల తరఫున మరికొంత మంది పండితులు మేము గొప్పంటే... మేము గొప్పని వాదించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. స్వామివారికి పట్టువస్త్రాలు శ్రీసత్యదేవుని కల్యాణానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీ పట్టు వస్త్రాలను దేవస్థానం పండితులకు అందజేశారు. నేడు సత్యదేవుని దివ్యకల్యాణం సత్యదేవుడు, అమ్మవార్ల దివ్యకల్యాణోత్సవం రత్నగిరి వార్షిక కల్యాణ వేదికపై శనివారం రాత్రి 9.30 గంటల నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ భక్తులు, మహిళలకు వేర్వేరు ఎ¯ŒSక్లోజర్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే భక్తులకు కల్యాణం స్పష్టంగా కనిపించేందుకు టీవీ, స్క్రీ¯ŒSల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కల్యాణ వేదికను, ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్, ఈఓ శుక్రవారం రాత్రి పరిశీలించారు. కల్యాణానికి మంత్రులు, కమిషనర్? సత్యదేవుని దివ్యకల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, మంత్రి సుజయ కృష్ణ రంగారావు, దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్నవరంలో నేడు వైదిక కార్యక్రమాలు తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతసేవ ఉదయం 8 గంటలకు చతుర్వేదపారాయణ 9 గంటలకు అంకురార్పణ, «ధ్వజారోహణ, కంకణధారణ, దీక్షావస్త్రధారణ రాత్రి 7 గంటలకు కొండ దిగువన స్వామి వారికి వెండి గరుడ వాహనంపై, అమ్మవారికి గజ వాహనంపై, సీతారాములకు వెండి పల్లకీపై ఊరేగింపు రాత్రి 9.30 నుంచి కొండ మీద వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్యకల్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ భజనలు 8 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భక్తిరంజని, 6 నుంచి 7 గంటల వరకూ గాత్ర కచేరీ -
సత్యదేవునికి రూ.5 లక్షల విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన ముగ్గురు సోదరులు వారి తల్లి ఈశ్వరమ్మ పేరుమీద గురువారం రూ.ఐదు లక్షల విరాళాన్ని దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావుకు కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు. ఈ మొత్తంలో రూ.లక్ష బొత్స తల్లి పేరు మీద బ్యాంక్‌లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ఏటా కార్తీకపౌర్ణమి నాడు అన్నదానం చేయాలని కోరారు. అలాగే రూ.లక్ష బొత్స సత్యనారాయణ పేరున డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ఏటా జూలై తొమ్మిదిన అన్నదానం చేయాలని కోరారు. బొత్స సోదరుడు అప్పలనర్సయ్య పేరు మీద డిపాజిట్ చేసిన రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏప్రిల్ 26, మరో సోదరుడు సతీష్ పేరున వేసిన రూ.లక్షకు వచ్చే వడ్డీతో సెప్టెంబర్ 19న, ఇంకో సోదరుడు ఆదినారాయణ పేరున ఉన్న రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్ 29న అన్నదానం చేయాలని అధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు. -
సిరిమంతుడు.. సత్యదేవుడు
అన్నవరం దేవస్థానం 2017–18 బడ్జెట్ రూ.142.59 కోట్లు ఆమోదించిన దేవస్థానం పాలకవర్గం అన్నవరం : భక్తుల కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరివాసుడు సత్యదేవుడు ‘సిరి’మంతుడుగా వెలుగొందుతున్నాడు. మూడేళ్ల క్రితం స్వామివారి ఆదాయం రూ.వంద కోట్లకు చేరిందని తెలిసి పలువురు ఆశ్చర్యపోయారు. అయితే 2015–16లో స్వామివారి ఆదాయం రూ.120 కోట్లు, 2016–17 లో రూ.132 కోట్లకు చేరింది. తాజాగా 2017–18లో సత్యదేవునికి రూ.142.59 కోట్ల ఆదాయం వస్తుందని గురువారం దేవస్థానంలో జరిగిన పాలకమండలి బడ్జెట్ సమావేశంలో అంచనా వేసింది. ఈ లెక్కన 2020 నాటికి సత్యదేవుని ఆదాయం రూ.200 కోట్లకు చేరినా ఆశ్చర్యపడనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 142.59 కోట్లతో 2017–18 బడ్జెట్ అంచనా అన్నవరం దేవస్థానంలో 2017–18 బడ్జెట్ ప్రతిపాదనలను గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల ద్వారా రూ.142,58,95,912 ఆదాయం వస్తుందని, దానిలో రూ.142.29 కోట్లు వ్యయమవుతుందని, రూ.29,95,912 మిగులు ఉంటుందని అంచనా వేశారు. దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో వ్యయాలు ఇలా.. కంట్రిబ్యూష¯ŒS కింద రూ.14.12 కోట్లు : ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎఫ్, అర్చక సంక్షేమ నిధి, ఆడిట్ ఫీజు, తదితర చెల్లింపుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.14.12 కోట్లు కేటాయించారు. దేవస్థానం ఆదాయంలో దాదాపు పదిశాతం ఈ చెల్లింపులకే కేటాయించారు. గత ఏడాది కూడా ఈ చెల్లింపులకు రూ.13.84 కోట్లు కేటాయించారు. సిబ్బంది జీతాలు రూ.26.64 కోట్లు : 2017–18లో దేవస్థానం సిబ్బంది జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.26.64 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015–16 లో ఈ వ్యయం రూ.23.74 కోట్లు మాత్రమే. ప్రసాదం తయారీ, ఇతర దినుసుల కొనుగోలుకు రూ.22.81 కోట్లు ∙సత్యదేవుని ప్రసాద తయారీలో వాడే గోధుమ, నెయ్యి, పంచదార, గ్యాస్ ఇతర దినుసుల కొనుగోలుకు, దుప్పట్లు, ఇతర వస్రా్తలు, పూలదండల కొనుగోలుకు రూ.22.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతేడాది ఈ మొత్తం రూ.22.69 కోట్లు మాత్రమే. ∙పురోహితుల, నాయీబ్రాహ్మణుల పారితోషకాల చెల్లింపునకు రూ.9.50 కోట్లు ∙సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేసే పురోహితుల పారితోషకం చెల్లింపునకు రూ.8.10 కోట్లు, నాయీబ్రాహ్మణుల పారితోషకం కింద రూ.40 లక్షలు, ప్రసాదం ప్యాకర్స్ పారితోషకం చెల్లింపునకు రూ.కోటి బడ్జెట్లో కేటాయించారు. ∙నిర్మాణాలకు రూ.ఎనిమిది కోట్లు : దేవస్థానంలో వివిధ నిర్మాణ పథకాల కోసం రూ.ఏడు కోట్లు, వాటర్‌వర్క్స్ కోసం రూ.కోటి కేటాయించారు. గతేడాదితో పోల్చితే రూ.15 లక్షలు తగ్గింది. ∙స్వామివారి వార్షిక కల్యాణానికి రూ.40 లక్షలు : ఈ ఏడాది మే నెలలో జరగనున్న సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాలకు రూ.40 లక్షలు, ఇతర ఉత్సవాలకు రూ.20 లక్షలు కేటాయించారు. ∙శానిటేష¯ŒS కొరకు రూ.4.31 కోట్లు : దేవస్థానంలో శానిటేష¯ŒS నిర్వహణ కోసం రూ.4.31 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గతేడాది రూ.3.75 కోట్లు మాత్రమే కేటాయించారు. ∙విద్యుత్ ఛార్జీల కోసం రూ.2.92 కోట్లు : దేవస్థానంలో విద్యుత్ చార్జీల కోసం రూ.2.92 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.3.92 కోట్లు కేటాయించారు. ∙ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు : దేవస్థానం ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు కేటాయించారు. ∙దేవస్థానంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్, ఇతర సిబ్బంది కోసం రూ.2.45 కోట్లు కేటాయించారు. ∙దేవస్థానంలో ఉద్యానవనాల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.కోటిన్నర కేటాయించారు. ∙వివిధ బ్యాంకుల్లో జమ చేసిన డిపాజిట్లను ఈ ఏడాదీ రెన్యువల్ చేస్తారు. ఈ విధంగా జమ చేసే డిపాజిట్లు రూ.32 కోట్లను కూడా వ్యయంగా బడ్జెట్లో చూపించారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్ట్‌కు విడిగా బడ్జెట్లు ∙దేవస్థానంలోని సత్యదేవుని అన్నదానపథకం ట్రస్ట్ గోసంరక్షణ నిధికి ప్రత్యేక బడ్జెట్లు రూపొందించారు. అన్నదానం ట్రస్ట్‌కు రూ.27,89,30,587తో అంచనా బడ్జెట్ రూపొందించారు. ∙గోసంరక్షణకు రూ.61 లక్షలతో బడ్జెట్ రూపొందించారు. కమిషనర్ పరిశీలనకు బడ్జెట్ ప్రతిపాదనలు : ఈఓ నాగేశ్వరరావు 2017–18 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపుతున్నాం. కమిషనర్ పరిశీలించిన తరువాత వాటిలో స్వల్పమార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేటాయింపుల్లో పెద్దగా మార్పులు ఉండవు. మూడేళ్లుగా ముఖ్య విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం 2017–18 బడ్జెట్ ఆదాయ అంచనాలు... (రూ.కోట్లలో) విభాగం.. 2014–15 2015–16 2016–17 2017–18 వ్రతాలు 19.19 21.76 23.70 27.00 ప్రసాద విక్రయాలు 17.57 19.45 19.62 21.50 శీఘ్రదర్శనం 2.95 5.02 4.24 6.00 సత్రాల అద్దెలు 5.57 5.79 6.57 7.00 బ్యాంక్ డిపాజిట్లు 17.74 32.02 22.90 32.00 లీజులు, డిపాజిట్లు 1.69 2.63 2.44 3.00 షాపు లీజులు 6.27 7.25 9.43 11.00 తలనీలాలు 1.20 1.71 1.28 1.00 కొబ్బరి ముక్కలు 0.34 0.45 0.41 0.50 టోల్గేట్ 0.48 0.36 0.18 0.21 కల్యాణాలు 0.50 0.56 0.59 0.70 కేశఖండన 0.35 0.50 0.51 0.60 -
రత్నగిరిపై పెళ్లి సందడి
సత్యదేవుని సన్నిధిలో 30కి పైగా వివాహాలు పెద్ద సంఖ్యలో ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు అన్నవరం : రత్నగిరి మామూలుగా వచ్చే భక్తులకు పెక్కు పెళ్లి బృందాలు తోడు కాగా సందడిగా మారింది. బుధవారం సత్యదేవుని సన్నిధి వివాహాలు చేసుకునే వధూవరులు, వారి బంధుమిత్రులు, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలతో కిటకిటలాడింది. ఉదయం 10.54 గంటల ముహూర్తంలో రత్నగిరిపై 30కి పైగా వివాహాలు, 40 ఉపనయనాలు, 50 అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ శుభ కార్యక్రమాలన్నీ ఒకే సమయంలో జరగడంతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. బుధవారం రాత్రి కూడా పెద్దసంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు. అక్షరాభ్యాస మండపం చాలక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వ్రతమండపాల ఆవరణలోనే అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు, నామకరణాలు జరిగేవి. అయితే ఈ నెల 9 నుంచి దర్బారు మండపం పక్కనే గల మండపంలో సరస్వతి విగ్రహం ఉంచి అక్కడే ఈ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మండపం చాలా చిన్నదిగా ఉండడంతో ఐదు అక్షరాభ్యాసాలు ఒకేసారి జరిగితేనే కిక్కిరిసి పోతోంది. బుధవారం ఒకేసారి 50 మంది తమ చిన్నారులతో సహ ఆ మండపంలోకి రావడంతో ఎవరికీ కూర్చోవడానికి కూడా స్థలం లేదు. దీంతో పురోహితులు పక్కనే గల మండపంలో, మండపం వెలుపల కొన్ని అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు జరిపించాల్సి వచ్చింది. రూ.700 వ్రతమండపంలో విధులు నిర్వర్తించే పురోహితులు చాలకపోవడంతో రూ.300 వ్రతమండపంలో పనిచేసే పురోహితులు కూడా ఈ కార్యక్రమాలకు రావల్సి వచ్చింది. కాగా బుధవారం 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వ్రతాలు 1,619 జరగగా, అన్ని విభాగాల ద్వారా రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. -
గిరి దిగివచ్చి గ్రామ వీధుల్లో...
ఏటా ధనుర్మాసంలో సత్యదేవుని ఊరేగింపు అన్నవరంలో వందేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అన్నవరం : సాధారణంగా డిసెంబర్ రెండో వారం చివరలో ప్రారంభమయ్యే ధనుర్మాసంలో సూర్యుడు ఉదయించినా చలి, మంచుల వల్ల సమయమెంతో తెలియదు. అయితే ఈ నెలంతా రత్నగిరి మెట్ల దారి నుంచి సత్యదేవుడు గ్రామోత్సవానికి వస్తున్నట్లు బాజాలు వినిపించగానే ‘ఉదయం ఏడు గంటలైనట్టుంది దేవుడు కొండ దిగుతున్నాడు’ అనుకుంటారు అన్నవరం వాసులు. ధనుర్మాసంలో ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు ఊరేగింపుగా కొండ దిగువకు రావడం, ఊరేగిన అనంతరం ఉదయం పది గంటలకు మరలా కొండమీదకు వెళ్లడం గత వందేళ్లుగా కొనసాగుతున్న ఆచారం. ఈ ఏడాది గత నెల 16న ప్రారంభమైన సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపు ఈ నెల 15న వచ్చే కనుమ నాడు జరిగే ప్రభోత్సవంతో ముగుస్తుంది. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో రత్నగిరికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. సత్యదేవుడు ఆవిర్భవించిన కొత్తలో సుమారు వందేళ్ల క్రితం కూడా డిసెంబర్, జనవరి నెలల్లో ఆలయానికి భక్తుల రాక బాగా తక్కువగా ఉండేది. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో స్వామివారిని నెలరోజుల పాటు ఊరేగించి వచ్చిన బియ్యం, ఇతర దినుసులను ఆలయ నిర్వహణకు ఉపయోగించే వారంటారు. అయితే ధనుర్మాసం కాబట్టే గ్రామంలో ఊరేగించేవారనే మరో అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనా ఈ ఆచారం సుమారు వందేళ్లుగా కొనసాగుతోంది. ఉదయం ఏడు నుంచి పది వరకూ.. ఉదయం ఏడు గంటలకు కొండ నుంచి స్వామి, అమ్మవార్లను గ్రామంలోకి పల్లకీ మీద తీసుకువస్తారు. ఉదయం పది గంటల వరకూ గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగించి తిరిగి రత్నగిరికి చేరుస్తారు. ఈఓ ఆదేశించడంతో ఊరేగింపులో దేవస్థానం వేదపండితులు, వ్రతపురోహితులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఊరేగింపును విస్తరించాలి.. వందేళ్ల క్రితం సత్యదేవుని ఊరేగింపు నిర్వహించేటపుడు గ్రామంలో ఉన్న నాలుగు ప్రధాన వీధుల్లో మాత్రమే స్వామివారి ఊరేగింపు జరిగేది. ప్రస్తుతం అన్నవరంలో 24 వీధులున్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపును మరిన్ని వీధులకు విస్తరించాలని గ్రామస్తులు ∙అభిప్రాయపడుతున్నారు. -
ముక్కోటి.. భక్తకోటి
రత్నగిరిపై అంగరంగ వైభవంగా వేడుక విష్ణుమూర్తి, లక్షీ్మదేవి అలంకరణలో దర్శనమిచ్చిన సత్యదేవుడు, అమ్మవారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించి పులకించిన భక్తజనం అలరించిన పుష్పాలంకరణ ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదిన వేడుకలు రత్నగిరిపై ఆదివారం రంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక మండపంలో శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తిగా సత్యదేవుడు, లక్షీ్మదేవిగా అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేశారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లను దర్శించి తరించారు. – అన్నవరం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి దర్శనం.. స్వామివారి ప్రధానాలయంలోని ప్రత్యేక మండపంలో స్వర్ణభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న సత్యదేవుడు, లక్షీ్మదేవి అవతారంలో గల సత్యవతీదేవి అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్లను తిలకించి దక్షణ ద్వారం ద్వారా ఆలయం వెలుపలకు వచ్చే ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుడు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణా రాయలసీమ నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. కదంబ ప్రసాదం పంపిణీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఆకుకూరలు అన్నం కలిపి వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన తరువాత భక్తులకు పంపిణీ చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. చాగల్లు, కత్తిపూడి లకు చెందిన కోలాటం బృందాలు చేసిన కోలాట నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు సత్యదేవుని వ్రతాలాచరించారు. వెండి రథంపై సత్యదేవుని ఊరేగింపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను స్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి వెండి రథంపై ఆశీనుల్ని చేసి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి రథం ఊరేగింపు ప్రారంభమైంది. సత్యదేవుని ఆలయం చుట్టూ మూడుసార్లు ఊరేగించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, భక్తులు వెండి రథం లాగారు. 55 కల్యాణాలు నిర్వహణ ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో ఆదివారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 20 వేల మంది వచ్చినట్టు అంచనా. రికార్డుస్థాయిలో 55 మంది భక్తులు టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. -
సత్యదేవుని సేవల్లో భక్తుల భాగస్వామ్యం
మూడు విలక్షణ సేవల ప్రారంభానికి పాలకవర్గం నిర్ణయం ఒక రోజు అన్ని సేవల్లో పాల్గొనేందుకు రూ.పది వేలు కొద్ది మార్పులతో రూ.8,500, రూ.7,500 టిక్కెట్లు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తుల్ని భాగస్వాముల్ని చేస్తూ మూడు రకాల టిక్కెట్ల తో ‘ఉదయాస్తమాన సేవలు’ ప్రారంభించాలని అన్నవరం దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. శనివారం సాయంత్రం దేవస్థానంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశం హాలులో ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రాత్రి విలేకర్లకు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో తెల్లవారు జామున సుప్రభాత సేవ వద్ద నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనేందుకు వివిధ రుసుములున్నాయి. అయితే ఒకే భక్తుడు అన్ని సేవల్లో పాల్గొనే వీలు లేదు. ఇప్పుడు కొన్ని మార్పులతో మూడు రకాల ‘ఉదయాస్తమాన సేవలు ’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్, ఈఓ తెలిపారు. ఈ సేవలు రూ.10,000, రూ.8,500, రూ.7,500 టిక్కెట్‌తో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులకు అనేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు వారు కోరుకున్న రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగించారు. రూ.పది వేల టిక్కెట్‌తో లభించే సదుపాయాలు నలుగురు భక్తులు(భార్యా భర్త, మరో ఇద్దరు) స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చనలో పాల్గొనవచ్చు. వారికి స్వామివారి నిత్యకల్యాణం, ఏసీ వ్రత మండపంలో వ్రతం నిర్వహిస్తారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం, యంత్రాలయంలో లోపల దర్శనం చేయిస్తారు. వేద పండితులతో వేదాశీర్వచనం ఏర్పాటు చేస్తారు. భక్తులు దేవస్థానంలో రెండ్రోజులు బస చేసేందుకు ఏసీ గది కేటాయిస్తారు. దంపతులకు వస్రా్తలు, స్వామివారి ఫొటో, అన్నదానప«థకంలో ప్రత్యేకంగా భోజనం, స్వామివారి ప్రసాదం ఇస్తారు. రూ.8,500 టిక్కెట్‌తో... స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చన నిత్య కల్యాణంలో పాల్గొనే అవకాశం తప్ప రూ.పదివేలు టిక్కెట్ తీసుకునే వారికి కల్పించే సదుపాయాలే వీరికి కూడా కల్పిస్తారు. అదనంగా వీరు స్వామివారి ఆయుష్యహోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. వీరికి ఏసీ గదిలో బస ఒకరోజు మాత్రమే కల్పిస్తారు. రూ.7,500 టిక్కెట్‌తో ... వీరికి ఒక రోజు ఏసీ గదిలో బస, ఏసీ మండపంలో వ్రతం, నిత్యకల్యాణం, వేదాశీర్వవచనం కల్పిస్తారు. నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనం, దంపతులకు వస్రా్తలు, ప్రసాదం, అన్నదాన పథకంలో భోజనం, స్వామివారి ఫొటో కూడా ఇస్తారు. భక్తులు ఈ అరుదైన అవకాశాలను ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ ఉదయాస్తమాన సేవలను భక్తులకు వివరించి టిక్కెట్లు కొనుగోలు చేసేలా చూసేందుకు కొంతమంది పండితులు, అధికారులు, వ్రతపురోహిత ప్రముఖులతో కమిటీలు వేసేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
సత్యదేవుని సన్నిధిలో భన్వర్‌లాల్
అన్నవరం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దంపతులు రత్నగిరిపై శనివారం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. తొలుత ఆలయం వద్ద వారికి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పండితులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భన్వర్‌లాల్‌ను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు, ఎస్ఐ పార్థసారధి తదితరులున్నారు. -
కీలక నిర్ణయాలకు వేదిక
సత్యదేవుని ఆలయ చరిత్రలో ఓ మైలురాయి 2016 పలు ఆధ్యాత్మిక, విప్లవాత్మక చర్యలకు నాంది అన్నవరం : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన అన్నవరం సత్యదేవుని ఆలయం 2016 సంవత్సరం అనేక కీలక పరిణామాలు, నిర్ణయాలకు వేదికగా మారింది. సత్యదేవుని దివ్య కల్యాణం , తెప్పోత్సవం, గిరిప్రదక్షిణ వంటి కార్యక్రమాలను ద్రో¯ŒS కెమేరాల ద్వారా చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రసార మాధ్యమాల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లిన ఘనత 2016 కే దక్కింది. అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు పాలనాపరంగా దేవస్థానానికి లబ్ధి చేకూరే పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం ఆరో వ్యవస్థాపక ధర్మకర్తగా ఇనుగంటి వంశానికి చెందిన రాజా ఇనుగంటి వేంకట రోహిత్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆగమ పాఠశాలకు శంకుస్థాపన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు 2016 నవంబర్‌లో శంకుస్థాపన జరిగింది. రూ.రెండు కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దాత సహకారంతో తూర్పు రాజగోపురం దిగువన సత్యదేవ యాగశాలకు గత ఏడాది శంకుస్థాపన జరిగినా ఈ ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం (మఖ) నాడు మాత్రమే జరిగే ఆయుష్యహోమం కంచి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామీజీ సూచనలతో రోజూ జరిగేలా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇది భక్తుల భాగస్వామ్యంతో రూ.రెండు వేలు టిక్కెట్‌తో నిర్వహిస్తున్నారు. అందువల్ల వారానికి రెండు లేదా మూడు పర్యాయాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ‘వృక్ష ప్రసాదం’ భక్తుల నామ, జన్మనక్షత్రాన్ని బట్టి నాటుకోవల్సిన వివిధ మొక్కలను ’వృక్షప్రసాదం’గా ఈ ఏప్రిల్ నుంచి దేవస్థానంలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో వీఐపీలకు మాత్రమే లభించే వేదపండితుల ఆశీస్సులు రూ.558 టిక్కెట్‌తో భక్తులు కూడా అందజేస్తున్నారు. కొండ దిగువ నుంచి ఎగువ వరకూ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తి గీతాలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినిపిస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎ¯ŒSఎంఆర్, వ్రత పురోహితులకు బయోమెట్రిక్ అటెండె¯Œ్స ఏర్పాటు చేసి విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బంది, పురోహితులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 సీసీ కెమేరాలు ఉండగా 96 కెమేరాలకు పెంచారు. రెండు ఘాట్‌రోడ్లు, మెట్లదారితో బాటు దేవస్థానంలోని అన్ని ప్రాంతాలను సీసీ కెమేరాల పరిధిలోకి తెచ్చారు. ఇది అటు భద్రతా చర్యల కింద ఉపయోగపడడంతో బాటు, విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బందిని గుర్తించేందుకు ఉపకరిస్తోంది. హుండీ లెక్కింపునకు ఈ ఏడాది నుంచే టేబుల్స్ ఉపయోగిస్తున్నారు. గతంలో సిబ్బంది తివాచీల మీద కూర్చుని లెక్కిండం వల్ల ఆలస్యమయ్యేది. టేబుల్స్ మీద నగదు పరిచి లెక్కించే విధానం ప్రారంభించాక రూ.కోటి అయినా సాయంత్రానికి లెక్కింపు పూర్తి చేస్తున్నారు. పెరిగిన కానుకలు సత్యదేవుని నిత్యకల్యాణంలో స్వామివారికి పట్టువస్రా్తలు సమర్పించేందుకు రూ.558 టిక్కెట్ పెట్టారు. రోజూ కనీసం పదిమంది ఈ టిక్కెట్ కొనుగోలు చేసి పట్టువస్రా్తలు సమర్పిస్తున్నారు. సత్యదేవుని ప్రధానాలయం వద్ద పెద్ద హుండీ ఏర్పాటు చేసి ఆ హుండీ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే ఏర్పాటు చేశారు. దీంతో ఆ హుండీలో పడే కానుకలు పెరిగాయి. వ్రతాలు, కేశఖండన శాలలో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేసే పద్ధతిని నిరోధించారు. çఫలితంగా ఆ మేరకు ఆదాయం కూడా పెరిగింది. 2017లో దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందేలా కృషి చేస్తామని చైర్మ¯ŒS రోíßహిత్, ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. వెబ్‌సైట్‌కు ప్రశంసలు అన్నవరం దేవస్థానం వెబ్సైట్ అటు డిజై¯ŒS పరంగా, సమాచార పరంగా అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు పొందింది. ఈఓ కే నాగేశ్వరరావుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ మేరకు అభినందనలు తెలియచేసి జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది సత్యదేవుని కల్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణం ద్రో¯ŒS కెమేరాతో చిత్రీకరించారు. -
ప్రతి సోపానానికీ భక్తజన నీరాజనం
ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం అన్నవరం : రత్నగిరి వాసుడు సత్యదేవుని కోవెలకు దారి తీసే సోపానాలు గు రువారం స్వామి, అమ్మవార్ల సమక్షంలో భక్తుల నీరాజనాలందుకున్నాయి. గురువారం ’మెట్లోత్సవం’ సందర్భంగా ము త్తయిదువులు పూసిన పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణ, ఆపై కర్పూర హార తి, నైవేద్యంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రతి మెట్టునూ స్వామి వారి అంశగా భావించి పూజించా రు. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మెట్ల మార్గంలో పల్లకీ మీద ఊరేగిస్తూ కొండ దిగువకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజ ల అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణ, కోలాట నృత్యాల మధ్య గ్రా మంలో ఊరేగించారు. అనంతరం తొలి పాంచా పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఉదయం 9.30 గంటలకు శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గల తొలి మెట్టును ముత్తయిదువులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించగా ఈఓ నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి, మెట్టు కు హారతి ఇచ్చి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఆ హారతి ఇచ్చిన మెట్ల మీదు గా స్వామి,అమ్మవార్లను పల్లకీ మీద ఊరేగించారు. అనంతరం ముత్తయిదువులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ, పూలతో అలంకరించగా పండితులు ఒక తమలపాకుపై హారతి కర్పూరం, మరో తమలపాకుపై పటికబెల్లం నివేదించగా భక్తులు ఆ హారతి వెలిగించి, స్వామి, అమ్మవార్లను ఆ మెట్ల మీదుగా ఊరేగించారు. ఇలా మొత్తం 450 మెట్లకు పూజలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.చివరగా అనివేటి మండపం మెట్ల వద్ద హారతి వెలిగించడంతో కార్యక్రమం ముగిసింది. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, సత్యదేవుని ఆలయ ప్ర«ధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని మెట్లోత్సవం ఏర్పాట్లపై ఈఓ సమీక్ష
రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అన్నవరం : ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఈనెల 15వతేదీ గురువారం నిర్వహించనున్న సత్యదేవుని మెట్లోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కొండదిగువన తొలిపాంచా వద్ద నుంచి ప్రధానాలయం వరకూ ఉన్న మెట్లన్నింటినీ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మెట్లకు, వాటికిరువైపులా ఉన్న గోడలకు తెలుపు, కాషాయం రంగులను వేయించాలని ఆదేశించారు. అదే విధంగా కార్యక్రమానికి ముందు రోజు నుంచి మెట్ల మార్గంలో గల యాచకులను అక్కడి నుంచి పంపించి వేయాలని ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్ కొండలరావు, ప్రైవేట్ శానిటరీ ఏజెన్సీ ఇ¯ŒSచార్జి కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం వివరాలు.. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఊరేగింపుగా మెట్ల మార్గాన కొండదిగువకు తీసుకువస్తారు. తొలిపాంచా వద్ద గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఘనంగా ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి మెట్ల దారిలోని ప్రతిమెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి హారతి వెలిగిస్తూ, పల్లకీపై స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ప్రధానాలయానికి చేరుస్తారు. -
10 నుంచి సత్యదేవునికి ఆయుష్య హోమం
ప్రతి శనివారం ఏలేశ్వరం ఆలయంలో వ్రతాల నిర్వహణ దేవస్థానం ఛైర్మన్, ఈఓ వెల్లడి అన్నవరం: మార్గశిర ఏకాదశి సందర్భగా ఈ నెల పదో తేదీ (శనివారం) నుంచి అన్నవరం దేవస్థానంలో రెండు విశేష కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు దేవస్థానం ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం విలేకర్లకు తెలిపారు. సత్యదేవునికి నిత్యం ఆయుష్యహోమం... కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీజయేంద్ర సరస్వతి స్వామి సూచనల ప్రకారం ఈ నెల పదో తేదీ శనివారం నుంచి ప్రతి రోజూ సత్యదేవునికి ఆయుష్య హోమం నిర్వహించడానికి నిర్ణయించారు. ఇప్పటి వరకూ సత్యదేవుని జన్మనక్షత్రం మఖనాడు మాత్రమే అంటే 27 రోజులకు ఒకసారి మాత్రమే ఈ ఆయుష్య హోమం నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకూ దేవస్థానంలోని దర్బారు మండపంలో ఈ హోమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలంటే రూ.రెండు వేలు చెల్లించి టిక్కెట్ తీసుంటే వారి గోత్రనామాలతో ఈ హోమం చేస్తారు. ఒక టిక్కెట్ పై నలుగురు కుటుంభ సభ్యులు హోమంలో పాల్గొనవచ్చు. స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. స్వామివారి కల్యాణ భక్తులతో అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ ఆయుష్య హోమంలో పాల్గొనేందుకు భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేయని రోజుల్లో దేవస్థానమే ఈ హోమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఆయుష్య హోమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 9491249982, 9491249989 ఫో¯ŒS నెంబర్లకు ఫో¯ŒS చేయాలని సూచించారు. ఏలేశ్వరం సత్యదేవుని ఆలయంలో స్వామివారి వ్రతాలు అన్నవరం దేవస్థానం దత్తత తీసుకున్న ఏలేశ్వరంలోని సత్యదేవుని ఆలయంలో కూడా ఈ నెల పదో తేదీ నుంచి ప్రతి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకూ సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తారు. ఇందుకు గాను రూ.150 టిక్కెట్ తీసుకోవాలి. పూర్తి వివరాలకు 9959160432 నెంబర్‌కు ఫో¯ŒS చేయాలని కోరారు. -
25 నుంచి సామూహిక సత్యదేవ దీక్షలు
హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేష¯ŒS (ఎస్ఐటీఏ) ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో హిందూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి తెలిపారు. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా సీతానగరంలో మూడు రోజులు జరిగిన గిరిజన, హరిజన, కోయదొర, కొండరెడ్ల, వాల్మీకి శాఖలకు చెందిన అర్చక శిక్షణ శిబిరానికి హాజరై తిరిగి వెడుతున్న ఆయన శనివారం రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ సూచనల మేరకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి అడ్డతీగల గ్రామంలోని పవనగిరిపై తొలివిడత సామూహిక సత్యదేవుని దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. దీక్షావస్రా్తలు, ఇతర సామగ్రిని అన్నవరం దేవస్థానం అందజేస్తుందన్నారు. గిరిజన గ్రామాలు, దళిత వాడల్లో 500 ఆలయాలను నిర్మించడానికి దేవాదాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు. ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ ఇప్పటికి రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో అడ్డతీగలలోని పవనగిరిపై నిర్మించిన ఋషిపీఠం కల్యాణమండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. -
అన్నవరానికి భక్తుల తాకిడి
విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శనం పెరిగిన వ్యాపారం అన్నవరం : సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సాధారణంగా ఆశ్వయుజమాసంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ¿¶ క్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని దర్శించి పూజలు చేస్తున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారం రోజుల్లో సుమారు 1.50 లక్షల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోగా, 12వేల వ్రతాలు జరిగాయి. ఒక్క ఆదివారమే సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2,203 వ్రతాలు జరిగాయి. భక్తుల రాకతో కొండ దిగువన వ్యాపారాలు పెరిగాయి. దేవస్థానానికి సుమారు రూ.రెండు కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొండ దిగువన సత్యదేవుని తొలిపాంచా వద్ద పూజాద్రవ్యాలు, స్వామివారి ప్రసాదాలు, ఫ్యాన్సీ సామాన్లకు గిరాకీ పెరిగింది. కార్తీకమాస ఏర్పాట్లపై నేడు సమావేశం అన్నవరం : ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాస ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రత్నగిరిపై దేవస్థానం–ప్రభుత్వ అధికారుల సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఇతర శాఖల సిబ్బంది హాజరుకానున్నారు. ఈనెల 25న చేపట్టనున్న సత్యదీక్షలు, నవంబర్ 11న జరగనున్న సత్యదేవుని తెప్సోత్సవం, 14న జరిగే గిరి ప్రదక్షిణ, 27న స్వామివారి అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. -
సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శల వెల్లువ
కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈఓ ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్, ముగ్గురికి ఛార్జి మెమోలు అన్నవరం: సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శలు వచ్చిన నేప«ధ్యంలో ఆ విభాగంలో పనిచేసే పలువురి సిబ్బందిపై ఈఓ కె.నాగేశ్వరరావు గురువారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సత్యదేవుని ప్రసాదం నిల్వ ఉండడం లేదని సామర్లకోటకు చెందిన ప్రయివేట్ స్కూల్ ఉపాధ్యాయుడు వాపోయిన విషయం మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయం విదితమే. బుధవారం కూడా కొంతమంది భక్తులు ఇదే విధమైన ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన గురువారం సంబంధిత విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి ప్రసాదం నాణ్యతగా ఉండక పోవడానికి కారణాలపై ^è ర్చించారు. అనంతరం ప్రసాదం కుక్ పీఎస్‌ఎస్‌వి ప్రసాదరావు, గోధుమ నూక మర ఆడే ప్యాకర్ ఎన్. లక్ష్మణరావును సస్పెండ్ చేశారు. సంబంధిత విభాగ సూపరెంటెండెంట్ పీవీఎస్ భాస్కర్, గుమస్తాలు వరహాలరావు, లక్ష్మీనారాయణలకు ఛార్జి మెమోలు జారీ చేశారు. -
సత్యదేవుని అంతరాలయానికి సువర్ణశోభ
అంతరాలయంపైకప్పునకు బంగారు తాపడం రూ.40 లక్షలతో చేయించనున్న సీఎంఆర్ అధినేత వెంకటరమణ అన్నవరం : సత్యదేవుని అంతరాలయంలోని గోడల పైకప్పును బంగారు రేకుతో తాపడం చే యించడానికి విశాఖ పట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎం. వెంకటరమణ సంసిద్ధత వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా సత్యదేవుని దర్శించి పూజలు చేశా రు. అనంతరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును కలిసి తన కోరి కను తెలిపారు. గతంలో ఆయన స్వామివారి అంతరాలయం గోడలకు సుమారు రూ.40 లక్షల వ్యయంతో బంగారు రేకు తాపడం చేయించారు. అంతరాలయం పైకప్పునకు కూడా బంగారు తాపడం చేయిస్తాన్నారు. అందుకు అంచనాలు రూపొందించాలని దేవస్థాన అధికారులకు సూచించారు. అలాగే వనదుర్గ అమ్మవారికి బంగారు మకరతోరణం, వింజూమరలు, ఆలయద్వారాలకు బంగారు రేకు తాపడం సమర్పించడానికి కూడా ఆయన అంగీకరించారు. దాత కోరిక మేరకు బంగారు రేకు తాపడం చేయించడానికి అవసరమయ్యే అంచనాలు తయారు చేసి ఇవ్వాలని దేవస్థానం డిప్యూటీ స్థపతి ఐ.ప్రసాద్‌ను ఈఓ ఆదేశించారు. ఆలయం పైకప్పు మినహా ఆలయమంతా స్వర్ణమయమే.. ఇప్పటికే సత్యదేవుని ఆలయంలో ప్రధాన ద్వారాలకు, ఆలయ గోడలకు దాతల సహకారంతో స్వర్ణరేకు తాపడం చేశారు. ఇపుడు అంతరాలయం పైకప్పు కూ డా స్వర్ణమయం అయితే ఇక మిగిలేది ముఖ మండపం పైకప్పు మాత్రమే. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
మూడు రోజుల్లో 50 వేలమంది రాక దేవస్థానానికి రూ.40 లక్షల రాబడి అన్నవరం : సత్యదేవుని సన్నిధికి గత మూడు రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణంగా భాద్రపదమాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు కనుక భక్తులు పెద్దగా ఆలయానికి రారు. అయితే ఈసారి వరుసగా సెలవులు రావడం, దానికి తోడు ఆదివారం, సోమవారం దశమి, ఏకాదశి కలిసి రావడంతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారి ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు భక్తులతో నిండిపోయాయి. శని, ఆది, సోమవారాల్లో సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దేవస్థానానికి సుమారు రూ.40 లక్షల ఆదాయం లభించింది. వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. ఈ మూడు రోజులూ తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయానికి రావడం ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి రద్దీ పెరిగింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో భక్తులు రత్నగిరిపై ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
సత్యదేవుని సన్నిధిలో ఉప లోకాయుక్త
అన్నవరం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులందించి, స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, ఎస్సై పార్థసారథి తదితరులు వారి వెంట ఉన్నారు. -
గోమాతా! నమోస్తుతే!
రత్నగిరిపై ఘనంగా గోపూజా మహోత్సవం అన్నవరం : కృష్ణాష్టమి సందర్భంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుని ఆలయప్రాంగణంలో సామూహిక గోపూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో దేవస్థానంలోని రామాలయం ఎదురుగా గల ఆలయప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని గోవులను పూజించారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్ద గల కళావేదిక వద్దకు తీసుకువచ్చారు. పండితులు స్వామి, అమ్మవార్లకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం గోశాల, రత్నగిరి సప్తగోకులం నుంచి తెచ్చి 25 గోవులను పూజించారు. గోవులో లక్ష్మీ,గౌరీ,సరస్వతీ మాతలు కొలువై ఉంటారని, మూడుకోట్ల దేవతలు. చతుర్దశ పురాణాలు నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచామృతాల్లో గోక్షీరం, నెయ్యి, పెరుగు గోవు నుంచి వచ్చేవేనని, వీటితో బాటు గోమూత్రం, గోమయం విశేష ప్రాధాన్యత కల్గినవని తెలిపారు. యజ్ఞ, యాగాదుల్లో గోవు నుంచి వచ్చే ఈ ఐదింటిని తప్పక ఉపయోగిస్తారని తెలిపారు. గోధూళి సైతం పవిత్రమైనదని వివరించారు. వ్యవసాయంలో కూడా గోవుకున్న ప్రాధాన్యత గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారన్నారు. పండితులు గోవు శరీరంలోని ఏ భాగంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడో వివరిస్తూ గోవులకు ఈఓ నాగేశ్వరరావు దంపతులతో, భక్తులతో పూజలు చేయించారు. అనంతరం వేదపండితులు గోమాతలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. బియ్యం, బెల్లం, ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని తినిపించారు. తరువాత ఆ క్షీరాన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. నేడు రత్నగిరిపై సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజ శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని నిత్యకల్యాణ మండపం, దాని పక్కనే గల వాయవ్య, నైరుతీ మండపాలలో సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ గురువారం విలేకర్లకు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి పూజలు ప్రారంభిస్తారని, 9 గంటలకే మహిళలు మండపాల వద్దకు చేరుకోవాలని సూచించారు. వచ్చిన వాళ్లందరితో పూజలు చేయిస్తారన్నారు. రెండు వేల మందికి పైగా పూజలాచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాల్గొనే మహిళలు కొబ్బరికాయ, అరటిపళ్లు, రాగి లేదా ఇత్తడి చెంబు, పూలు, గాజులు తెచ్చుకోవాలని తెలిపారు. పూజకు అవసరమయ్యే పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, జాకెట్టుముక్క, అమ్మవారి రూపు, తోరం దేవస్థానం అందచేస్తుందని తెలిపారు. పూజలనంతరం మహిళలకు, వారితో వచ్చిన వారికి స్వామివారి దర్శనం, ఉచిత భోజనసౌకర్యం కల్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ దేవస్థానంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
సత్యదేవుని నిత్య పూజలపై చిన్నచూపు
అషో్టత్తరం, సహస్రంపై ప్రచారం కల్పించని అధికారులు దేవస్థానంలో వాటిని నిర్వహిస్తున్నారన్న సంగతే తెలియని పరిస్థితి జూలైలో జరిగిన వ్రతాలు 22 వేలు కాగా నిత్యపూజలు చేయించుకున్నది 42మందే! అన్నవరం : ఏ దేవాలయంలో అయినా ఎంత ఎక్కువ పూజలు జరిగితే అంత శక్తి అక్కడి దేవతామూర్తులకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నిత్యం అర్చనలు, అగ్నిహోత్రం వంటి కార్యక్రమాలు ఈ విధంగా వచ్చినవే. కలియుగదైవం వేంకటేశ్వరస్వామికి తిరుమలలో తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి తలుపులు మూసివేసే వరకూ ఎన్నోరకాల పూజలు భక్తుల భాగస్వామ్యంతో చేస్తుంటారు. అయితే అన్నవరం దేవస్థానంలో మాత్రం ఒక్క స్వామివారి వ్రతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి స్వామి,అమ్మవార్లకు భక్తులు చేయించే అషో్టత్తరం, సహస్రం వంటి పూజలకు దాదాపుగా మంగళం పాడేశారు. ఒకప్పుడు పూజలే ఎక్కువ అన్నవరం దేవస్థానంలో జరిగే పూజల గురించి చెప్పమంటే అందరూ స్వామివారి వ్రతం గురించే చెబుతారు. సత్యదేవుడు, అమ్మవార్లకు ఉదయం, సాయంత్రం అషో్టత్తరం, సహస్రం వంటి పూజలు కూడా నిర్వహిస్తారు. అషో్టత్తరం టికెట్ రూ.20, సహస్రం రూ.40, యంత్రాలయంలో శివునికి అభిషేకం టిక్కెట్టు రూ.వంద గా నిర్ణయించారు. కానీ ఈ పూజల విషయం ఎవరికీ తెలియదు. కారణం ప్రచారం లేకపోవడమే. ఒకవేళ ప్రచారం చేస్తే వ్రతాలు చేయించుకునే భక్తులు ఈ పూజలు చేయించుకుంటే ఆదాయం తగ్గిపోతుందని అనుకుంటున్నారేమో తెలియదు. 25 సంవత్సరాల క్రితం వరకూ ప్రధాన ఆలయంలోనే స్వామి, అమ్మవార్లకు ఇరువైపులా గల ద్వారాల వద్ద భక్తులను కూర్చోబెట్టి వీటిని చేయించేవారు. ఆ తరువాత భక్తులు పెరగడంతో ఆ పూజలను దర్బారు మండపంలోకి మార్చారు. దర్బారు మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం నిలిపివేశాక ఈ పూజలు క్రమేపీ తగ్గించేశారు. ఈ పూజలు ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో చేస్తున్నారు. ఈ పూజల టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కౌంటర్లో వాకబు చేస్తే రోజుకు ఒకటో రెండో టిక్కెట్లు విక్రయిస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. జూలై నెలలో దేవస్థానంలో 22 వేల వ్రతాలు జరిగి సుమారు రూ.60 లక్షల ఆదాయం రాగా కేవలం 42మంది మాత్రమే అషో్టత్తరం, సహస్రం, అభిషేకాలు చేయించుకోవడంతో రూ.2 వేల రాబడి వచ్చింది. దీన్నిబట్టి ఈ పూజల గురించి భక్తులకు తెలియడం లేదని అర్థమౌతోంది. ప్రచారమేది? స్వామివారికి అషో్టత్తరం, సహస్రం చేయించాలంటే టికెట్లు ఎక్కడ దొరుకుతాయో, ఏ సమయంలో చేస్తారో చెప్పే నాథుడే లేడు. ఎంతసేపు స్వామివారి వ్రతాల టికెట్ల గురించి మైకులో చెబుతారు తప్ప ఈ పూజల గురించి చెప్పరు. -
ఘనంగా సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవం
స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకాభిషేకం ఆయుష్యహోమం, పూర్ణాహుతి అన్నవరం : అన్నవరం సత్యదేవుని 126వ ఆవిర్భావ దినోత్సవం శ్రావణశుద్ధ విదియ గురువారం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం మఖ కూడా కలిసి రావడంతో పలు కార్యక్రమాలు తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పాలు,పెరుగు, నెయ్యి, తేనె, పళ్లరసాలు, కొబ్బరినీరు, మంచిగంధంతో మహాన్యాసపూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరించారు. ఉదయం ఆరు గంటల స్వామివారి దర్శనం కలుగచేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్బారు మండపంలో ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆయుష్యహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారి ప్రతిరూపాలు బాల, కుమారి, సువాసినులుగా ఆయా వయసు బాలికలు, ముత్తయిదువలకు పాదపూజ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దంపతులు హోమద్రవ్యాలను హోమగుండంలో వేయగా వచ్చిన పెద్ద మంట వచ్చి సుమారు పది నిమిషాలు వెలిగింది. స్వామివారి మాహాత్మ్యం వల్లే ఈ అద్భుతం జరిగిందని పండితులన్నారు. స్వామి, అమ్మవార్లకు వేదాశీస్సులందచేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ‘కాయం’ ప్రసాదాన్ని, స్వామివారి గోధుమ నూక ప్రసాదాన్ని నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితులకు సత్కారం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రికి చెందిన మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదవాచస్పతి చిర్రావూరి శ్రీరామశర్మ, దేవస్థానం వైదిక సలహాదారు ఎంవీఆర్ శర్మ, అయ్యగారి జోగిసోమయాజులు, విష్ణుభట్ల హనుమత్ సోమయాజి, అన్నవరానికి చెందిన యనమండ్ర సూర్యనారాయణ అవధానులను ౖచైర్మన్, ఈఓలు సత్కరించారు. ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున నగదు, దుశ్శాలువా, స్వామి ప్రసాదాలను అందచేశారు. విశ్రాంత వ్రతబ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి, విశ్రాంత వ్రతపురోహితుడు, పంచాంగకర్త తొయ్యేటి సుబ్రహ్మణ్యం, మంగళంపల్లి కృష్ణభగవాన్జీలను కూడా సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. కోలాటం, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
బాలకృష్ణతో 101వ సినిమా చేస్తా
కాకినాడ : యువరత్న నందమూరి బాలకృష్ణతో 101వ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శకుడు వక్కపట్ల సూర్య వెంకట సత్యనారాయణమూర్తి (సత్యదేవా) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన పినపళ్లలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే బాలకృష్ణతో తీసిన ‘లయన్’ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందని, టేకింగ్‌పరంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తరువాత తన సినిమా ఉంటుందన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తీసే సినిమాకు కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. పుష్కరకాలం క్రితం దర్శకరత్న దాసరికి పరిచయం చేసి, తనకు సినీ జీవితాన్నిచ్చిన మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి తనకు గురుతుల్యులన్నారు. దర్శకుడు సత్యదేవాతో ఫొటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. -
లక్ష్యంవైపు దూసుకుపోతూ...
గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారు. బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ నెల 25 వరకూ చిత్రీకరణ జరుగుతుంది. బాలకృష్ణ, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ఈ భారీ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత. -
బాలకృష్ణ సరసన త్రిష!