- కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈఓ
- ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్, ముగ్గురికి ఛార్జి మెమోలు
సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శల వెల్లువ
Published Thu, Sep 29 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
అన్నవరం:
సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శలు వచ్చిన నేప«ధ్యంలో ఆ విభాగంలో పనిచేసే పలువురి సిబ్బందిపై ఈఓ కె.నాగేశ్వరరావు గురువారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సత్యదేవుని ప్రసాదం నిల్వ ఉండడం లేదని సామర్లకోటకు చెందిన ప్రయివేట్ స్కూల్ ఉపాధ్యాయుడు వాపోయిన విషయం మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయం విదితమే. బుధవారం కూడా కొంతమంది భక్తులు ఇదే విధమైన ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన గురువారం సంబంధిత విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి ప్రసాదం నాణ్యతగా ఉండక పోవడానికి కారణాలపై ^è ర్చించారు. అనంతరం ప్రసాదం కుక్ పీఎస్‌ఎస్‌వి ప్రసాదరావు, గోధుమ నూక మర ఆడే ప్యాకర్ ఎన్. లక్ష్మణరావును సస్పెండ్ చేశారు. సంబంధిత విభాగ సూపరెంటెండెంట్ పీవీఎస్ భాస్కర్, గుమస్తాలు వరహాలరావు, లక్ష్మీనారాయణలకు ఛార్జి మెమోలు జారీ చేశారు.
Advertisement
Advertisement