బాలకృష్ణ సరసన త్రిష! | Trisha with Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ సరసన త్రిష!

Published Thu, May 29 2014 5:44 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ-త్రిష - Sakshi

బాలకృష్ణ-త్రిష

హీరో నందమూరి బాలకృష్ణ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో మంచి జోరుమీదున్నారు. 'లెజెండ్‌' సినిమాతో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్న బాలయ్య, ఆ వెంటనే ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి  హిందూపురం శాసనసభ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినా బాలయ్యకు సినిమా రంగాన్ని వదిలిపెట్టే ఉద్దేశం మాత్రంలేదు.  ఈ విధంగా వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య అదే జోరు మీద కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఇది బాలయ్య  98వ చిత్రం.

ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్గా నటించబోతోంది.  తొలిసారిగా త్రిష బాలకృష్ణతో నటించనుంది. ప్రముఖ వ్యాపారవేత్త  రుద్రపతి రమణరావు నిర్మాతగా భారా బడ్జెట్తో యువ దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాలో త్రిష నటించడం ఖరారైన తరువాత, బాలకృష్ణతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె ట్విట్ చేశారు. అంతేకాకుండా బాలయ్య సరసన తొలిసారిగా నటించడం తనకు ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఈ సినిమాలో త్రిషతోపాటు మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది.

పూర్తి యాక్షన్, ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు జూన్ 2న లాంచనంగా ప్రారంభమవుతుంది. బాలకృష్ణ చాలా పవర్ఫుల్ పాత్ర పోషించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం తన పుట్టిన రోజు జూన్ పది నుంచి మొదలు పెడతారు. ఈ చిత్రానికి 'గాడ్సే' అనే పేరు ఖరారు చేసినట్లు సినీవర్గాల సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement