లక్ష్యంవైపు దూసుకుపోతూ... | balakrishna ,satyadeva movie Shooting Began | Sakshi
Sakshi News home page

లక్ష్యంవైపు దూసుకుపోతూ...

Published Tue, Jul 1 2014 12:22 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

లక్ష్యంవైపు దూసుకుపోతూ... - Sakshi

లక్ష్యంవైపు దూసుకుపోతూ...

 గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారు. బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది.
 
 హైదరాబాద్ పరిసరాల్లో ఈ నెల 25 వరకూ చిత్రీకరణ జరుగుతుంది. బాలకృష్ణ, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ఈ భారీ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement