భయపెడుతూ... నవ్విస్తుంది! | Trisha announces her horror comedy | Sakshi
Sakshi News home page

భయపెడుతూ... నవ్విస్తుంది!

Published Sat, Mar 21 2015 10:19 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

భయపెడుతూ... నవ్విస్తుంది! - Sakshi

భయపెడుతూ... నవ్విస్తుంది!

త్రిష ఈ ఏడాది చాలా బిజీ. తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే బాలకృష్ణ సరసన ‘లయన్’ చిత్రంలోనూ, తమిళంలో ‘అప్పా టక్కర్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ‘భోగి’ అనే చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారామె. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది త్రిభాషా చిత్రం కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో యం. గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘లవ్ యు బంగారం’ దర్శకుడు గోవి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
 
 ఈ చిత్రకథ విని చాలా ఉద్వేగానికి గురయ్యాననీ, పాత్ర కూడా చాలా బాగుందనీ, అందుకే మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించానని త్రిష పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తనకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న గిరిధిర్ నిర్మాణ సంస్థలో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఇది హారర్, కామెడీ మూవీ అనీ, మే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నామనీ గిరిధర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement