బాలకృష్ణతో త్రిష సెల్ఫీ | trisha finds balayya uber cool | Sakshi
Sakshi News home page

బాలకృష్ణతో త్రిష సెల్ఫీ

Published Wed, Nov 12 2014 10:57 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణతో త్రిష సెల్ఫీ - Sakshi

బాలకృష్ణతో త్రిష సెల్ఫీ

హీరోయిన్ త్రిష 'సెల్ఫీ'లతో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణతో కలిసి 'సెల్ఫీ' తీసి తన ట్విటర్ పేజీలో పోస్టు చేసింది. బాలకృష్ణ 98వ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ విశాఖ జిల్లా అరకులో జరుగుతోంది. బాలకృష్ణతో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్న త్రిష.. ఆయనతో కలిసి సెల్ఫీ ఫోటో దిగింది. ఈ ఫోటోలను ట్విటర్ లో పెట్టింది.

బహుముఖ ప్రతిభ, మంచి మనసు కలిగిన బాలయ్యతో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందంటూ కామెంట్ పోస్టు చేసింది. తెరపై రౌద్ర పాత్రల్లో ఎక్కువగా కనిపించే బాలకృష్ణ సెల్ఫీలో పన్నీ ఫోజులిచ్చారు. శింబు, సానియా మీర్జా తదితరులతో కలిసి దిగిన సెల్ఫీలను అంతకుముందు త్రిష తన ట్విటర్ లో పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement