ఆహా.. అల్లం చాయ్‌.. ఇంకేం కావాలి: కవిత | International Tea Day: MLC Kavitha Shares Selfie While Drink Allam Tea | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడి.. అందుకే కప్పు అల్లం టీ: ఎమ్మెల్సీ కవిత

Published Tue, Dec 15 2020 2:09 PM | Last Updated on Tue, Dec 15 2020 5:11 PM

International Tea Day: MLC Kavitha Shares Selfie While Drink Allam Tea - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం ఓ కప్పు టీ కడుపున పడితేనే రోజు ప్రారంభం అవుతోంది. సామాన్యుడి నుంచి ధనికుడిని సైతం ఉదయం లేవగానే ఆహ్లదపరిచే టీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి చాయ్‌కి గుర్తింపుగా డిసెంబర్‌ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

‘తీరిక లేకుండా పనితో అలసిపోయినప్పుడు మధ్యలో ఒక కప్పు వేడి వేడి అల్లం టీ తాగితే వచ్చే మజా కంటే మరింకేం ఉండదు. నేడు ఇంటర్నేషన్‌ టీ డే. ఈ సందర్భంగా అల్లం చాయ్‌ తాగుతున్న నా సెల్ఫీని మీతో పంచుకుంటున్న. అలాగే నా ఫాలోవర్స్‌ కూడా టీ తాగుతున్న మీ సెల్ఫీని నాతో పంచుకోండి’ అంటూ కవిత ట్వీట్‌ చేశారు. కవిత పిలుపు మేరకు ఆమె ట్విటర్‌ ఫాలోవర్స్‌ అంతా టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోలను ఆమెతో షేర్‌ చేసుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement