ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్
కవిత ఫోన్లు, పీఏ ఫోన్లు స్వాధీనం
కవితను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
రాత్రి 8.45గం. విమానంలో కవితను ఢిల్లీకి తరలింపు
కవిత ఇంటి ముందు గేటు బయట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
IT ED Raids, MLC Kavitha Arrest Updates:
BREAKING @ 09.00 PM
అరెస్ట్ ప్రొసీజర్‌కు సంబంధించి పంచనామా తయారుచేసిన ఈడీ
- లాఠీచార్జ్ మధ్య కవిత అరెస్ట్
- కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- బీఆర్‌ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి రూట్ క్లియర్ చేసిన పోలీసులు
- కవితను ఢిల్లీకి తీసుకెళ్తున్న పోలీసులు.
- మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:40 వరకు సెర్చ్ చేసినట్లు పేర్కొన్న ఈడీ.
- సాయంత్రం 5.20కి కవితను అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపిన ఈడీ
- పీఎమ్‌ఎల్‌ఏ యాక్ట్ 19 కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ.
- అనుమతి లేకుండా వచ్చి గొడవపడ్డారు: ఈడీ
- సాయంత్రం 6 గంటలకు అనుమతి లేకుండా 20 మంది లోపలికి వచ్చారు: ఈడీ
BREAKING @ 08.31 PM
- ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
- ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించిన ఢిల్లీ పోలీసులు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు.
- కవిత నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన ఈడీ.
- ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం
కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
- కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈ చర్యలు అనైతికం.
- విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.
- కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు
- ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం.. రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ అరెస్టు.
- ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే.. భవిష్యత్‌లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
- కవిత అరెస్టుపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
BREAKING @ 08.11 PM
కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారు: హరీష్‌రావు
- అంతా పథకం ప్రకారమే జరిగింది
- ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం
- కవితను అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం
- 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు.
- ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలన్నదే ప్లాన్
- పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోంది
BREAKING @ 08.00pm
- రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
- తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్న కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
- నిందితుడు అమిత్ అరోరా సమాచారంతో కవిత అరెస్ట్
- 4 రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్న ఈడీ
- సౌత్ లాబీ కీలక సమాచారాన్ని ఈడీకి అందించిన అరోరా
- లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ లాబీ
- రేపు ఉదయం అమిత్ అరోరాతోపాటు కవితను ప్రశ్నించనున్న ఈడీ
రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత హాజరు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టు నేరుగా ఈడీ ఆఫీస్‌కు కవిత
- రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే బీఆర్‌ఎస్ నాయకురాలు
- రేపు ఉదయం కవితకు మెడికల్ టెస్టు
- రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
- విచారణ కోసం కవితను కస్టడీ కోరనున్న ఈడీ
BREAKING @ 07.20pm
కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు
- కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కవిత.
- రాత్రి. 8:45కి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్న అధికారులు.
- రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ.
- కవిత ఇంటి దగ్గర ఈడీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు.
- కవితను తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ యత్నం.
- బీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టి వాహనానికి రూట్ క్లియర్ చేసిన పోలీసులు.
పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత
- పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు
- ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత.
- శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి.
BIG BREAKING @ 07.00pm
- కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు
- ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్న ఈడీ అధికారులు.
- కవితను తీసుకెళ్లే రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు
- రాత్రి. 8:55కి ఫ్లైట్ బుక్ చేసిన అధికారులు
- బీఆర్‌ఎస్ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు.
లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలు
BIG BREAKING @ 6.30pm
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ ప్రకటన
- సాయంత్రం 5:20 నిమిషాలకు కవిత అరెస్ట్ చేశాం.
- మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం.
- ఆమె అరెస్ట్ చేసినట్లు భర్త అనిల్‌కు తెలిపాం.
BIG BREAKING @ 5.45pm
- ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్
- కవిత ఫోన్లు, పీఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ
- ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
- కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
- రాత్రి 8.45గంటల విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్‌కు ముందు ED అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. కవితను ఢిల్లీ తరలించే అవకాశముంది.
BRS MLC K Kavitha is being brought to Delhi by ED: Sources
(file pic) pic.twitter.com/23NM1P7cEc
— ANI (@ANI) March 15, 2024
ఛార్జ్‌షీట్‌లో కవితపై మోపిన అభియోగాలు ఏంటంటే.?
ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది.
- అరుణ్‌పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్‌పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు.
- ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్‌కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్‌ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు.
- మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్‌లై ఖాతాకు బదిలీ అయ్యాయి.
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్‌వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్‌వోసీ ఇవ్వాలని జీఎంఆర్‌ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్‌లో అరుణ్ పిళ్‌లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్‌పిళ్లై సేట్‌మెంట్ల ద్వారా వెల్లడైంది.
- ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్‌నాయర్‌తో కవిత, అరుణ్‌పిళ్‌లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్‌పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
- కిక్‌బ్యాక్‌ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్‌లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్‌గ్రూప్ నుంచి కిక్‌బ్యాక్‌లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్‌నాయర్‌కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్‌నాయర్‌కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు.
- ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్‌గ్రూపు నుంచి విజయ్‌నాయర్‌కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది.
- భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్‌లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్‌పిళ్‌లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్‌పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్‌పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్‌లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు.
- దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్‌లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్‌పిళ్‌లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్‌కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు.
BIG BREAKING @ 5.30pm
- కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ED
- కాసేపట్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం
- కవిత నివాసం వద్ద కవిత అనుచరుల నిరసన
- బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
- కవిత ఇంటి ముందు గేటు బయట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసే దిశగా ED అడుగులు వేస్తోంది. ఇప్పటికే కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది.
లాయర్లు, కవిత వర్గం ఏమంటోంది?
- ఒక మహిళను సాయంత్రం 6గంటలకు అరెస్ట్ చేయరాదు
- సుప్రీంకోర్టుకు ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించారు
- CrPC సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు,
- 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారు,
- గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది.
- సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు
- దర్యాప్తు సంస్థకు ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో ఇస్తారు
- పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్ట్ చేయడం రాజకీయ కక్షే
నాలుగు గంటలుగా కొనసాగుతున్న సోదాలు
- ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు
- మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు
- కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు.
- ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు.
- కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు
- ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు
- కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ
కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారు?:
- సోమ భరత్ కుమార్, బీఆర్‌ఎస్ లీగల్ సెల్.
- సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్‌లో ఉంది.
- కేసు పెండింగ్‌లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు?
- ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు.
- ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది.
- ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉంది.
- ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు.
కవిత ఇంటికి చేరుకున్న అడ్వకేట్ భరత్
- కవిత నివాసంలోకి అనుమతించని అధికారులుజ
- ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్వకేట్ భరత్
- సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అనుమతించే ప్రసక్తి లేదని తెలిపిన అధికారులు.
- మరికొంత సమయం పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడి
- ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామన్న అధికారులు.
- అప్పుడు లోపలికి పిలుస్తామని అడ్వకేట్‌కు చెప్పిన అధికారులు.
మూడు గంటలుగా కొనసాగుతున్న సోదాలు
- ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు
- మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు
- కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు.
- ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు.
- కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు
- ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు
- కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కవితతోపాటు ఆమె భర్త వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ, ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment