International Tea Day
-
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్
ఒసేయ్.. తల పగిలిపోతుంది కాసింత టీ పొయ్యవే ..గట్టిగా భార్య భారతి మీద అరిచాడు సూర్యం.రండి..రండి.. చాన్నాళ్ళకు వచ్చారు కూర్చోండి.. టీ తాగుతారామామా చికాగ్గా ఉంది అలా వెళ్లి మంచి అల్లం టీ తాగి వద్దాం రా మామా పిలిచాడు రామకృష్ణహలో అమీర్ భాయ్ దో చాయ్ దేదో కేకేశాడు లక్ష్మణ్ఇలా చినుకులు పడుతుండగా అలా నీ కళ్ళలోకి చూస్తూ వేడివేడి టీ పెదాలను తాకుతుంటే అచ్చం నిన్ను ముద్దాడినట్లె ఉంటుంది ప్రియా.. పొయిటిక్ గా చెబుతున్నాడు దీపక్తెల్లారి ఆరైంది ఇంకా టీ లేకపోతే ఎలాగూ..కోడలు పిల్లా నాకూ మీ మామయ్యకు స్ట్రాంగ్ ఇలాచి టీ తీసుకురామ్మా.. ఆర్థర్ వేసింది అత్త అనసూయఈరోజు బోర్డు మీటింగ్..మంచి టీ ఓ ఇరవై చెప్పండి.. చెక్ లిస్టులో రాసేసాడు ఎండీపిల్లాడికి జ్వరం..దగ్గు ఉంది .కాస్త అల్లం టీ ఇవ్వండి గొంతు రిలీఫ్ వస్తుంది.. ఓ డాక్టర్ సూచనట్రైనెక్కి అరగంట అయింది ఇంకా టీ కుర్రాడు రాలేదేంటి..కిటికీలోంచి చూస్తూ గొనుక్కున్నాడు రాకేష్సర్ మీకు ఏ టీ తేమ్మంటారు.. అల్లం టీ..ఇలాచి టీ..గ్రీన్ టీ.. లెమన్ టీ.. హెర్బల్ టీ.. ఏదిమ్మంటారు అడిగింది ఎయిర్ హోస్టెస్..పొద్దంతా రిక్షా లాగి లాగి తల వాచిపోతోంది.. ఓ టీ పడితే తప్ప ఇంకో ట్రిప్ లోడ్ ఎత్తలేను అంటూ టీ బంక్ వైపు పరుగుతీసాడు నర్సయ్యదేశంలో ఎక్కడ ఏ స్థాయిలో .. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా వారిమధ్య వారధి టీ.. దేశ రాజకీయాలన్నీ చర్చకు వచ్చేది కూడా టీ బంకుల దగ్గరేటకీమని మూడ్ మార్చేస్తుంది..మనసు బాగా లేకపోయినా.. ఒంట్లో బాలేకపోయినా.. ఇంట్లో బాలేకపోయినా ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా సరే ...ఇలాంటి ఎన్నో చిన్నచిన్న సమస్యలను టీ చటుక్కున పరిష్కరించేస్తుంది.. అడగ్గానే డబ్బు సరిపోక.. భర్త నక్లెస్ కొనలేదని మూడు రోజులుగా జగడమాడి మాటలు మానేసి అటు తిరిగి మూతి ముడుచుకుని కూర్చున్న ప్రశాంతి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్న వేళ ఎలాగైనా శ్రీమతిని మచ్చిక చేసుకోవాలని మూడు రోజులుగా భర్త శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తనకు ఇష్టమైన యాలకుల టీ చేసి రెండుకప్పుల్లో పోసి ఒక కప్పును ప్రశాంతి ముందుకు జరిపి ఏమంటుందో ఏమో అని కాస్త భయంతో బెదురు చూపులు చూస్తున్న శ్రీకాంత్ కు ఆఫర్ తగిలేసింది.. ఘమాఘమలాడే టీ సువాసనతో ప్రశాంతి కోపం కూడా ఆవిరైపోయింది. భర్తను దగ్గరకు తీసుకుని నెక్లెస్ ఏముంది..డబ్బులున్నపుడు కొందాం లెండి అంటూ అల్లుకుపోయింది.విద్యార్థులను మేల్కొలిపే ఆత్మీయ హస్తం టీఇప్పటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధించేందుకు గంటలు గంటలు.. ఒక్కోసారి నైట్ అవుట్.. అంటే తెల్లార్లు చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండేందుకు.. శరీరం డస్సిపోకుండా ఉండేందుకు.. కోల్పోయిన శక్తిని మళ్లీ రీచార్జ్ చేసుకునేందుకు. చదివింది మైండ్ లోకి ఎక్కేందుకు .. నిద్ర రాకుండా.. మూత పడిపోకుండా ఉండేందుకు కూడా టీ ఆత్మీయ మిత్రుల పక్కనే నిలబడి ఉంటుంది. ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నారు అంటే ఇక ఆ సిలబస్ అంతు తేల్చేయాల్సిందే. రెప్పల మూతపడుతున్న తరుణంలో.. లేవయ్యా.. బోలెడు సిలబస్ ఉంది నిద్రపోతే ఎలా.. అంటూ ఆ టీ కప్ మనల్ని నిద్రలేపి పుస్తకం వైపు చూసేలా చేస్తుంది..సర్జరీలు చేసి అలసిపోయే డాక్టర్లు.. వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని అలవోకగా పూర్తిచేసే డ్రైవర్లు.. పరిశోధన విద్యార్థులు శాస్త్రవేత్తలు ఒకరేమిటి,. అన్ని రంగాల వారికి టి అనేది ఒక ఔషధం.. అందమైన వ్యసనం.. ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ.. ఆ వెచ్చదనాన్ని టీ కప్పులో ఆస్వాదించడం కొందరికి ఒక ఇష్టమైన దినచర్య. సాయంత్రం వేళ కొండల్లోకి వెళ్లిపోతున్న సూర్యుని చూస్తూ మళ్ళీ ఓ టీ తీసుకోవడం మరికొందరికి ప్రియమైన ప్రక్రియ. ఇలా అన్నివర్గాల వారినీ కలిపి ఉంచే టీ కి కూడా అన్ని సందర్భాల్లో ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అందరం టీ తాగుదాం.. ఆరోగ్యంగా ఉందాం.- సిమ్మాదిరప్పన్న -
అలసిన దేహానికో'టీ'..! భారత్‌లో మొదటిసారిగా..
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.1793 నుంచే..అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.సహజమైన పానీయం..టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్‌కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్‌లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్‌కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ! -
International Tea Day: ఆసక్తికరమైన ఈ సంగతులు తెలుసా?
-
చాయ్ లవర్స్ కోసం: కూల్‌గా ఉంటే హాట్‌గా, హాట్‌గా ఉంటే కూల్‌గా!
మీరు కూల్‌గా ఉంటే.. హాట్‌గా హాట్‌గా ఉంటే కూల్‌గా క్షణాల్లో మార్చేస్తుంది. అంతేనా వాన కురిసినా.. ఫ్రెండ్స్‌తో గాసిప్ టైం అయినా..తలనొప్పి వచ్చినా... పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నా.. అంతెందుకు పొద్దున లేవగానే మన బుర్రలో వచ్చే ఏకైక థాట్ టీ. ఫ్రెష్‌గా వేడి వేడి టీ పడందే రోజు మొదలుకాదు చాలా మందికి. టీ అంటే కేవలం ఒక రిఫ్రెష్ డ్రింకే మాత్రమేనా. కానే కాదు..అదొక సెంటిమెంట్..ఎమోషన్. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు మే నెలలోనే ఈ డేను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకాల హిస్టరీ ఏంటి? మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచన మేరకు భారత ప్రభుత్వం యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌కి ప్రతిపాదించింది.అలా తొలి ఇంటర్నేషనల్ టీ దినోత్సవాన్ని 2005లో ఢిల్లీలో నిర్వహించారు.ఎందుకంటే చాలా దేశాలలో ఈ నెలలోనే టీ ఉత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. తేయాకు కార్మికుల సురక్షిత పని పరిస్థితులు, సరైన వ్యాపార నిర్వహణతోపాటు తేయాకు ఉత్పత్తిని మెరుగుపరిచే పరిస్థితులపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి ఏడాది మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ టీ దినోత్సవం అనేది సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, టీ ఆర్థిక ప్రాధాన్యతను సెలబ్రేట్ చేసుకోవడం, తేయాకుఉత్పత్తిని రక్షించి, దాని ప్రయోజనాలను ముందు తరాలకు అందించేలా 'ఫీల్డ్ నుండి కప్పు వరకు' అనే నినాదంతో ఈ డేను నిర్వహిస్తారు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిల్లో టీ కూడా ఒకటి. 2007లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారత దేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం టీలో 80 శాతం ఇండయన్సే వినియోగిస్తున్నారు. ఇక్కడ 5వేల సంవత్సరాలకు పైగా టీ మూలాలు విస్తరించి ఉన్నాయట. టీ అంటే ఒక భావోద్వేగం. సంతోషమైనా, ఉత్సాహమైనా, అలసిపోయినా సందర్భం ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ టీ. దానికి చిట పట చినుకుల్లో పకోడీ తోడైతే ఆహా ఆ రంగు రుచి వాసనలతో మరో ప్రపంచంలో విహరిస్తాం. లక్షల మందికి ఉపాధినందిస్తున్న ఈ తేనీటిని సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి దీనిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. వీటిలో కొన్ని కాశ్మీరీ కహ్వా, అల్లం టీ, తులసి టీ, సులైమాని టీ, రోంగా టీ, మసాలా టీ, లెమన్‌గ్రాస్ టీ, గ్రీన్ టీ. బెల్లం, మిరియాల టీ, అబ్బో.. ఈ లిస్ట్ చాలా పెద్దది. మన బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా రకరకాల టీలు ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల సంపూర్ణ మిశ్రం టీ. హల్దీ టీ రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయాన్ని శుభ్రపరిస్తే.. తేనె నిమ్మకాయ అల్లం దట్టించిన టీ గొంతు నొప్పి , జలుబుకు చక్కటి చిట్కా. అలాగే హనీ లెమన్ జింజర్ టీ, ఆమ్లా అల్లం టీ ద్వారా విటమిన్ సీ దొరుకుతుంది. దీంతో బరువు తగ్గించుకోవచ్చు. డిటాక్స్ డైట్లో అల్లం అజ్వైన్ లెమన్ టీ, జింజర్ అజ్వైన్ లెమన్ టీ చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంత మవుతుందని నిపుణులు కూడా నమ్ముతున్నారు. మరోవైపు సాహసికుడు,టీ ప్రేమికుడు, ఆండ్రూ హ్యూస్ చరిత్రలో అత్యధిక టీ పార్టీని నిర్వహించిన ఘనత సాధించారు. బ్లాక్ , గ్రీన్ టీ, పిప్పరమెంటు, చమోమిలే వంటి టీలను ఆయన అందించారట. నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ 2, మే 5, 2021న 6,496 మీటర్ల ఎత్తులో, ఆండ్రూ 15 మంది అధిరోహకుల బృందంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మరి మీరు కూడా మంచి టీ పార్టీతో మీ స్నేహితులతో ఇంటర్నేషనల్ టీ డేని ఎంజాయ్ చేయండి. -
International Tea Day: అమ్మా... టీ పెట్టనా...
ఉదయం టీ, సాయంత్రం టీ, నాన్న స్నేహితులు వస్తే టీ, బంధువులు వస్తే టీ, రంగు, రుచి, చిక్కదనం టీలో ఉంటే కుటుంబ బంధాలలో కూడా చిక్కదనం వస్తుంది. టీ సమయాలు కుటుంబ సమయాలే. టీ అంగళ్లు మేలిమి మీటింగ్ పాయింట్లే. ‘నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం’. ఏమిచ్చి టీ రుణం తీర్చుకోగలం? కాఫీకి కొన్ని మర్యాదలుంటాయి. ఫిల్టర్ కాఫీ అనీ ఇన్స్టంట్ కాఫీ అని ఫలానా కాఫీ గింజలనీ ఇంకేదో ఇంకేదో అనీ. టీకి ఇవన్నీ ఉండవు. కొన్ని పాలు కొన్ని నీళ్లు రెండు స్పూన్ల టీ పౌడర్, మూడు చెంచాల చక్కెర... టీ రెడీ. ‘ఏ కులమూ నీదంటే ప్రతి కులమూ నాదండీ’ అని పాడేది టీ ఒక్కటే. మహరాజులూ తాగుతారు. నిరుపేదా తాగుతాడు. ఇంట్లో అమ్మ ఏదైనా చెప్పాలన్నా, చెప్పుకోవాలన్నా కాసింత టీ పడేసి వాటిని కప్పుల్లో పోసుకొని వస్తే వినడానికి అందరూ రెడీ. కూల్డ్రింకులు, స్వీట్ హాట్ రెడీగా ఏ మధ్యతరగతి ఇంట్లో ఉంటుంది చెప్పండి? కాని టీ పౌడర్ గ్యారంటీగా ఉంటుంది. సమయానికి పాలు లేకపోతే పొరుగింట్లో దొరకవా ఏంటి? ఇంటికి స్నేహితులొచ్చినా, బంధువులొచ్చినా క్షణాల్లో టీ రెడీ. ఇంటి మర్యాదను కాపాడే పానీయం అది. ఇంటి బడ్జెట్‌ను కాపాడే పానీయం కూడా. ఉదయాన్నే లేచి నాన్న బయటకు వెళ్లి ఓ రౌండ్ టీ తాగి వచ్చినా రెండిడ్లీ అమ్మ చేసినవి తిన్నాక అమ్మ పెట్టే టీ తాగుతూ ఆఫీసుకో పనికో రెడీ అవడం బాగుంటుంది. ఆ టీ తాగే సమయం లో అమ్మ ఏ బడ్జెట్ ప్రతిపాదన చేసినా ఓకే అయిపోతుంది. పిల్లలను నిద్ర లేపడానికి చాలా ఇళ్లల్లో టీ ఒక ఆయుధం. బెడ్ టీ తాగే ఇళ్లు కొన్ని. ‘బ్రెష్ టీ’ తాగే ఇళ్లు కొన్ని. పరీక్షల వేళ పిల్లలకు ఫ్లాస్కు లో టీ పోసి సిద్ధం చేయడం సగటు తల్లిదండ్రుల కనీస బాధ్యత. ‘ఇతర పానీయాలు’ తాగే స్నేహితులకు దూరం ఉండమని చెప్పే తల్లిదండ్రులు టీ తాగే స్నేహితులతో తిరిగితే మాత్రం సంతోషిస్తారు. టీ బంకు ప్రపంచ జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తారు. అక్క పెళ్లిచూపులు, వదినకు అన్నయ్యతో పేచీలు, పక్కింటి వారితో పార్కింగ్ ఇష్యూ, చెల్లెలికి సంగీతం టీచరు ఫైనలైజేషను... ఏ పని అయినా టీతోనే కదా ముగుస్తుంది. ఇంటికి ప్లంబర్ వచ్చినా, ఎలక్ట్రీషియన్ వచ్చినా, పెయింటర్ వచ్చినా అమ్మ వారికో టీ చేసిచ్చి పని చక్కగా చేయిస్తుంది కదా. ఒకప్పుడు టీతో పాటు సాసర్ ఇవ్వడం మర్యాదగా ఉండేది. ఇప్పుడు కప్పు సాసర్ను వదిలించుకుంది. ఒకప్పుడు టీ నేరుగా తెచ్చిపెట్టడం మర్యాదగా ఉండేది. ఇప్పుడు ‘మీకు చక్కర వేయాలా వద్దా’ అని ప్రత్యేకంగా అడగాల్సి వస్తోంది. కొందరు యాలకుల టీ అడుగుతారు. కొందరు అల్లం దంచి కొట్టమంటారు. గ్రీన్ టీ తాగే ఆరోగ్యధీరులు కొందరు. లెమన్ టీ కొందరి ప్రిఫరెన్స్. ఎన్ని పేర్లు పెట్టినా నలుగురు కూడితే స్టౌ మీదకు ఎక్కాల్సిన పానీయం టీనే కదా. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ‘అమ్మా... టీ పెట్టవా’ అని సంవత్సరమంతా అడిగి ఆమె చేతి మీద తాగడం కాదు. ‘అమ్మా... టీ పెట్టనా’ అని ఇవాళ టీ పెట్టి ఆమెకు కప్పు ఇచ్చి పక్కన కూచోండి. కొలత కావాలా? నలుగురు మనుషులకు టీ చేయాలంటే మూడు కప్పుల పాలు, ఒకటిన్నర కప్పుల నీళ్లు, మూడు ఫుల్ చెంచాల టీ పొడి, మూడు ఫుల్ చెంచాల చక్కెర. అంతే. టీ రెడీ. ఎంజాయ్ టీ. – సాక్షి ఫ్యామిలీ -
ఆహా.. అల్లం చాయ్.. ఇంకేం కావాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: ఉదయం ఓ కప్పు టీ కడుపున పడితేనే రోజు ప్రారంభం అవుతోంది. సామాన్యుడి నుంచి ధనికుడిని సైతం ఉదయం లేవగానే ఆహ్లదపరిచే టీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి చాయ్‌కి గుర్తింపుగా డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘తీరిక లేకుండా పనితో అలసిపోయినప్పుడు మధ్యలో ఒక కప్పు వేడి వేడి అల్లం టీ తాగితే వచ్చే మజా కంటే మరింకేం ఉండదు. నేడు ఇంటర్నేషన్ టీ డే. ఈ సందర్భంగా అల్లం చాయ్ తాగుతున్న నా సెల్ఫీని మీతో పంచుకుంటున్న. అలాగే నా ఫాలోవర్స్ కూడా టీ తాగుతున్న మీ సెల్ఫీని నాతో పంచుకోండి’ అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత పిలుపు మేరకు ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోలను ఆమెతో షేర్ చేసుకుంటున్నారు. Nothing feels better than a piping hot cup of Ginger Tea or what we fondly call Allam Chai in the middle of a super hectic day! Here, I share my selfie with my cup of tea, would absolutely enjoy looking at your selfie with a cup of tea too! #InternationalTeaDay pic.twitter.com/fquxMyt0zK — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2020 -
ఇది తాగితే స్వర్గం కనబడాల్సిందే!
టీ చుక్క నోటిలో పడనిదే చాలా మందికి రోజు మొదలవదు. ఎంత ఒత్తిడి లో ఉన్నా చటుక్కున ఛాయ్ తాగితే స్ట్రెస్ ఇట్టే ఎగిరిపోతుంది. అందుకే ఛాయ్ గొప్పతనాన్ని చాటి చెబుతూ ఎంతో మంది కవితలు, పాటలు రాశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా తేయాకు చరిత్ర, టీ తాగడం వల్ల కలిగే లాభాలు మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
టీ ఇచ్చే కిక్కే వేరు..!