సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసే ముందు ఆమెకు అరెస్ట్ వారెంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చారు.
2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి, గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కాం వైపుకు దారి తీసిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా కవితను అరెస్ట్ చేసింది ఈడీ. కవిత ఇంట్లో నాలుగు గంటలకుపైగా సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను ఆరెస్ట్ చేశారు అధికారులు.
లిక్కర్ స్కాంలో కథ ఎప్పుడు మొదలైంది?
- ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్‌పర్ట్ కమిటి వేసిన ఢిల్లీ ప్రభుత్వం
- ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటి వేసిన ప్రభుత్వం
- ఎక్స్‌పర్ట్ కమిటి సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీ ప్రభుత్వం
- చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభత్వం
- ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీలోని ఆమ్ అద్మీ ప్రభుత్వం
- నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చిన అప్పటి మంత్రుల కమిటీ... మార్చి 2021లో మంత్రుల కమిటి సిఫార్సును OK చేసిన ఢిల్లీ క్యాబినెట్
- ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది
- ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.9500 కోట్లు పెరుగుతుందని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపిన ప్రభుత్వం
- దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి ఓకే చెప్పిన ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్
- అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మెలిక పెట్టారు.
- కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో తెరుచుకున్న 849 మద్యం దుకాణాలు
- కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం
- తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించిన లిక్కర్ పాలసీ
- ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం
- కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో... వెలుగులోకి స్కాం
- 2022 ఏప్రిల్‌లో నరేష్ కుమార్... ఢిల్లీ చీఫ్ సెక్రెటరీగా నియామకం
- ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్
- లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని... మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించిన చీఫ్ సెక్రెటరీ
- కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు డిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు
- ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు
- ఓ వైపు చీఫ్ సెక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
- తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కన్నా దాదాపు 35శాతం తక్కువ ఆదాయం వచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
లిక్కర్ స్కాం.. ఆరోపణలు
- మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి
- మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది.
- మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారు.
- మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది.
- ప్రతీ బీర్ కేస్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాపీ చేసింది.
- ఎల్-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్‌లు ఇచ్చారు.
- అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు గుర్తించిన సీబీఐ
- రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించిన సీబీఐ
- మనిష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment