Actress Trisha And Aiswarya Rai Bachchan Selfie At Ponniyin Selvan Set, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Trisha -Aiswarya Rai Selfie: అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్‌ సెల్ఫీ వైరల్‌

Published Sat, Sep 24 2022 10:57 AM | Last Updated on Sat, Sep 24 2022 11:09 AM

Trisha Aiswarya Rai Bachchan Pose For Selfie On Ponniyin Selvan - Sakshi

తమిళ సినిమా: అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్‌ ఇండియా, మాజీ మిస్‌ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే.. ఆ దృశ్యం అభిమానులకు కనుల పండుగే అవుతుంది. ఇలాంటి పుత్తడి బొమ్మలు ఐశ్వర్యరాయ్, త్రిష కలిసి ఒకే చిత్రంలో నటించడం కచ్చితంగా విశేషమే అవుతుంది. అలాంటి చిత్రమే పొన్నియిన్‌ సెల్వన్‌. వీరితో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్‌ ప్రభు, ప్రకాష్‌ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దీనికి మణిరత్నం సృష్టికర్త, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, రవివర్మ అదనపు బలం. రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్‌ ఇండియాత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. ఇందులో ఐశ్వర్య నందిని పాత్రలోనూ, త్రిష కుందవై పాత్రలోను నటించారు. వీరివి చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలట. మరి త్రిష విక్రమ్‌కు చెల్లెలిగానూ, జయం రవికి అక్కగాను నటించగా, ఐశ్వర్యరాయ్‌ ప్రతినాయకిగా నటించడం విశేషం.

వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు మణిరత్నం తెలిపారు. కాగా చిత్రంలో శత్రువులుగా నటించినా నిజజీవితంలో ఐశ్వర్యరాయ్, తాను మంచి స్నేహితులమయ్యామని త్రిష పేర్కొన్నారు. అంతేకాకుండా వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీని తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతూ లైక్‌ల మీద లైక్‌లు కొట్టిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement