aiswarya rai
-
నీలి కళ్ల పోలిక.. ఈ హీరోయిన్ కెరీర్ కొంపముంచింది! (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా వైరల్ (ఫోటోలు)
-
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్ దుస్తుల్లో కార్పెట్‌పై హొయలుపోతూ కనిపించింది.యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్‌తో ఆ ఫెస్టివల్‌కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు
భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్- 2023 జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు సెమీస్‌లో భారత్ Vs న్యూజిలాండ్ మధ్య పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్‌లో కేవలం నాగుగు విజయాలను మాత్రమే నమోదుచేసిన పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ఓటములను పాక్ అభిమానులతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. ఓ ఓపెన్ డిబేట్లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ మాట్లాడాడు. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పట్ల చెత్త వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ' ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే' అంటూ హద్దులు దాటాడు . రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఐశ్వర్య రాయ్ ఇంట్లో బాత్రూమ్లు క్లీన్ చేయడానికి కూడా పనికిరావు అంటూ రజాక్‌ను ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు కోరిన అబ్దుల్ రజాక్ భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్య రాయ్‌కు అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పాడు. 'ఆ సమయలో నేను క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను. క్రికెట్‌కు సంబంధించిన ఉదాహరణను ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకోకుండా నోరు జారి ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. అది నా ఉద్దేశ్యం కాదు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను.' అని రజాక్ అన్నారు. వివరణ ఇచ్చిన షాహిద్ అఫ్రిది ఐశ్వర్య రాయ్ గురించి రజాక్ వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ నవ్వారని ఆ సమయంలో తాను నవ్వానని చెప్పాడు. కానీ రజాక్ మాటలు తనకు ఆ సమయంలో అర్థం కాలేదని షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. 'ఆ సమయంలో అందరూ నవ్వుతున్నారు. ఆ మాటలు నేను గమనించలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, రజాక్ మాటలను నాకు షేర్ చేశారు. ఆ వీడియో క్లిప్‌ను మళ్లీ విన్నాను. అప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను వెంటనే రజాక్‌తో మాట్లాడి.. క్షమాపణ చెప్పమని కోరడం జరిగింది. ఎందుకంటే అలాంటి వ్యాఖ్య ఎవరి గురించి చేయకూడదు.' అని అఫ్రిది అన్నారు. తప్పు పట్టిన షోయబ్ అక్తర్ షోయబ్ అక్తర్ కూడా రజాక్ వ్యాఖ్యలను ఖండించాడు. స్త్రీలపై ఇలాంటి జోక్,పోలిక సరికాదని అన్నారు. 'ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదు. ఆ సమయంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తులు నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా తప్పే. ఆ సమయంలో వారు రజాక్‌ను తప్పు పట్టాల్సింది. ఇది క్షమించరాని తప్పు. అతనిపై తిరగబడి హెచ్చరించాల్సింది.' అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Shameful example given by Abdul Razzaq. #AbdulRazzaq #CWC23 pic.twitter.com/AOboOVHoQU — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) November 13, 2023 We were talking about cricket yesterday, and I meant to give a different example, but Aishwarya's name slipped out of my mouth. I'm sorry 🙏 #AishwaryaRai #AbdulRazzaq pic.twitter.com/LKp2uFNxXm — Abdul Razzaq (@AbdulRazzaq_PAK) November 14, 2023 -
శతాబ్దాల నాటి పండుగ.. వేదికపై ఐశ్వర్య రాయ్, అనుష్కతో పాటు ఈ స్టార్స్ కూడా..
కర్ణాటకలో కంబళ ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ఇది శతాబ్దాల నాటి ఆనవాయతీ. వారి సంస్కృతి సంప్రదాయంలో ఇదొక భాగం.. అందుకే కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలలో రిషభ్ శెట్టి పాల్గొంటాడు. ఆ సినిమాలో కూడా వాటిని రియల్‌గానే ఆయన చిత్రీకరించారు. నవంబర్‌లో ప్రారంభమై మార్చి వరకు జరిగే వార్షిక పండుగ సీజన్‌గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది పోటీల కోసం కర్ణాటక సన్నద్ధమవుతోంది. ఈసారి అతి పొడవైన ట్రాక్‌ను నిర్మిస్తున్నట్టు కంబళ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశోక్‌కుమార్ రాయ్ వెల్లడించారు. పోటీలలో భాగంగా శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు.. గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంట బాగా పండాలని దేవుడుకి ప్రార్థిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా ఈ కంబళ పోటీలు కొనసాగుతున్నా ఈ మధ్య ఎక్కువగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పోటీలు తీర ప్రాంతానికే పరిమితం. కానీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బెంగళూరు వేదికగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి రూ. 1.50 లక్షల నగదు అందించినున్నారు. తీర ప్రాంతానికే పరిమితం అయిన ఈ పోటీలను ఈసారి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. బెంగళూరులో ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా.. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ కంబళ పోటీలు.. తొలిసారిగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈసారి జరగనున్న కంబళ పోటీలకు ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, కేజీఎఫ్ యష్, దర్శన్‌లతో పాటు క్రికెటర్ కే.ఎల్ రాహుల్ కూడా ఈ రెండు రోజుల ఈవెంట్లో పాల్గొంటారని అశోక్ రాయ్ తెలిపారు. -
ఐశ్వర్యరాయ్ సాంగ్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే: స్టార్ హీరో
బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్.. ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా చేశారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్.. ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ మూవీలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్ 'లే గయీ' వంటి పాటలకు డ్యాన్సర్‌గా పని చేశాడు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్ కరిష్మా కపూర్ పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని 'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది. నేను షాట్‌ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్ నుంచి తిట్లు కూడా తిన్నాను. నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు. ఐశ్వర్యరాయ్ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్ సినిమాలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాటలో కనిపించాడు షాహిద్. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్‌గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్‌కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్‌గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్ తెలిపాడు. (ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత) -
ఐశ్వర్య రాయ్ తో విడాకులు ? అభిషేక్ బచ్చన్ షాకింగ్ రియాక్షన్
-
ఎవరికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది: ఐశ్వర్యరాయ్
అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందాల యువరాణి నందిని పాత్రలో కనిపించనుంది.రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనంతరం విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి. ఈ సిరీస్‌లో మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐశ్వర్య తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా కూతురు ఆరాధ్య ఓసారి సెట్స్‌కి వచ్చింది. ఒక పీరియాడికల్ డ్రామా మొదటి సారి చూడడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. అదే సమయంలో మణిరత్నం సర్ పిలిచి మరీ ఆరాధ్యకి ఓ సీన్ కోసం కట్ చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు అలాంటి అవకాశం మాలో ఎవరికీ రాలేదు. కానీ అది ఆరాధ్యకి దక్కింది. అందుకే సెట్లో అందరం ఆశ్చర్యపోయాం. నాకూ, నా కూతురికి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిపోతుంది' అంటూ ఐష్ చెప్పుకొచ్చింది. The perfect choice 🔥 thanks #ManiRatnam 🙏♥️ Nandini Devi is coming on 30 sep 2022#AishwaryaRai#AishwaryaRaiBachchan #PonniyinSelvan #ps1 pic.twitter.com/BnnU7bTXtF — Nandini (@LiveLonly1) September 21, 2022 -
అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్ సెల్ఫీ వైరల్
తమిళ సినిమా: అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్ ఇండియా, మాజీ మిస్ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే.. ఆ దృశ్యం అభిమానులకు కనుల పండుగే అవుతుంది. ఇలాంటి పుత్తడి బొమ్మలు ఐశ్వర్యరాయ్, త్రిష కలిసి ఒకే చిత్రంలో నటించడం కచ్చితంగా విశేషమే అవుతుంది. అలాంటి చిత్రమే పొన్నియిన్ సెల్వన్. వీరితో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి మణిరత్నం సృష్టికర్త, ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ అదనపు బలం. రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్ ఇండియాత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. ఇందులో ఐశ్వర్య నందిని పాత్రలోనూ, త్రిష కుందవై పాత్రలోను నటించారు. వీరివి చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలట. మరి త్రిష విక్రమ్‌కు చెల్లెలిగానూ, జయం రవికి అక్కగాను నటించగా, ఐశ్వర్యరాయ్ ప్రతినాయకిగా నటించడం విశేషం. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు మణిరత్నం తెలిపారు. కాగా చిత్రంలో శత్రువులుగా నటించినా నిజజీవితంలో ఐశ్వర్యరాయ్, తాను మంచి స్నేహితులమయ్యామని త్రిష పేర్కొన్నారు. అంతేకాకుండా వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీని తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ లైక్‌ల మీద లైక్‌లు కొట్టిస్తున్నాయి. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్‌తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు మేకప్‌తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్‌తో, మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి. ఐశ్వర్యరాయ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ దీపికా పదుకొనే విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ ప్రియాంక చొప్రా విత్ అవుట్ మేకప్- విత్ మేకప్ అలియా భట్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అనుష్క శర్మ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ కరీనా కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సోనమ్ కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ నర్గిస్ ఫఖ్రీ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అమీషా పటేల్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సుష్మిత సేన్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ -
వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్
సాక్షి,ముంబై: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. అయితే తన తండ్రి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య) కాగా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు ఇటీవల కరోనా సోకడంతో హాస్పిటల్లో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీనికిముందే సీనియర్ బచ్చన్, అభిషేక్‌కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నానావతి హాస్పిటల్లో చేరారు. అయితే అమితాబ్ భార్య, నటి జయాబచ్చన్, మిగతా కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. (అది నకిలీ వార్త) Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽 Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff. — Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020 -
సర్ప్రైజ్? ఐష్ మళ్లీ తల్లి కాబోతున్నారా?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళంలో పడేశారు. సర్ప్రైజ్ అంటూ చేసిన ఒక్క ట్వీట్‌తో ఆయన అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఆయన శుక్రవారం చేసిన ట్వీట్ నెటిజన్లను కూడా ఆలోచనలో పడేసింది. ‘హాయ్! మీ అందరికి ఒక సర్ప్రైజ్.. వేచి చూస్తూ ఉండండి’ అని అభిషేక్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఉత్సుకత మొదలైంది. ఏమై ఉంటుందబ్బా అని కొందరు మెదడుకు పదును పెడుతోంటే.. మరికొందరు ఉండబట్టలేక సందేహాలు గుప్పిస్తున్నారు. ‘మరో జునియర్ బచ్చన్ రాబోతున్నారా.. మాజీ విశ్వసుందరి మరోసారి తల్లి కాబోతున్నారా?, అరాధ్యాకు చెల్లి లేక తమ్ముడు రాబోతున్నారా’ అంటూ ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెన్సీపై కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా అభిషేక్ ‘ధూమ్-5’ చిత్రం గురించి ఏదైనా చెప్పబోతున్నారా, లేక ఆయన సినీ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అంటూ ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కి ఏమైందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి)కి ఇకనుంచి అభిషేక్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారా అని ట్వీట్ చేశారు. అయితే అసలు విషయం ఎంటన్నది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ సందేహాలకు, ఆందోళనకు తెరపడాలంటే అభిషేక్ మరో సర్ప్రైజ్ ట్వీట్ కోసం వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటిస్తున్న ‘బాబ్ బిస్వాస్’ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించినట్లు సమాచారం. Hey guys! Have a surprise for all of you. Stay tuned!! 😁 — Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020 -
సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై..
ముంబై : సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యరాయ్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మదర్స్ డే సందర్భంగా కూతురు ఆరాద్యను పెదాలపై ముద్దాడుతూ ఐశ్వర్యరాయ్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కూతురిని అలా పెదాలపై ముద్దాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అలా పిల్లలను ముద్దాటం లైంగికంగా వేధించటమే అని, పెదాలపై ముద్దాడి భారతదేశ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారని కొందరు స్పందిచగా. 5-6 సంవత్సరాల పిల్లలను బలవంతంగా ముద్దు పెట్టుకోవటం నేరమని మరి కొందరు స్పందించారు. కొందరైతే హద్దులు దాటి ‘‘చిన్న పిల్లలతో సెక్స్ మంచిది కాదని, లెస్బియన్స్’’ అంటూ స్సందించారు. ఇన్‌స్టాగ్రాంలో చేరిన వారంలోనే ఈ రకమైన స్పందన రావటం ఐశ్వర్యరాయ్‌కి ఓ చేదు అనుభవమే. ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం తల్లి తన కూతుర్ని అలా పెదాలపై ముద్దాడటంలో తప్పేమిలేదంటున్నారు. తల్లి ప్రేమలో కూడా బూతును వెతుకుతున్న వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు. -
అమితాబ్ స్థానంలో వేరొకరా?
హమారే సాథ్ హాట్ సీట్ మే హై.. కంప్యూటర్ జీ లాక్ కర్ దీజియే.. ఈ డైలాగులు చెప్పాలంటే గంభీరమైన బేస్ వాయిస్ ఉండాల్సిందే. ఆ వాయిస్ అమితాబ్ బచ్చన్‌ది అయ్యి తీరాల్సిందే. ఆయన స్థానంలో మరొకరిని కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు. అలాంటిది ఈసారి సీజన్‌కు మాత్రం అమితాబ్‌కు బదులు ఆయన కోడలు, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను తీసుకొస్తారని, ఆమె కాదంటే అలనాటి మేటినటి మాధురీ దీక్షిత్‌కు అవకాశం ఇస్తారని కూడా వదంతులు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ షో నిర్వాహకులు కొట్టిపారేశారు. తాము ఇప్పటివరకు ఎవరరికీ అలా చెప్పలేదన్నారు. ఇలాంటి విషయాలు ఎక్కడినుంచి వస్తాయో తమకు తెలియడం లేదని, కేబీసీకి హోస్ట్ అంటే అమితాబేనని, ఆయన స్థానంలో వేరొకరు వచ్చేందుకు అవకాశమే లేదని కేబీసీ నిర్మాతలు చెప్పారు. ఇప్పటివరకు 8 సీజన్ల పాటు అప్రతిహతంగా నడిచిన కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఈసారి హోస్ట్ మారుతారని వచ్చిన కథనాలను వారు కొట్టిపారేశారు. ఒక్క మూడో సీజన్లో మాత్రం షారుక్ ఖాన్‌ను అమితాబ్‌కు బదులుగా హోస్ట్‌గా ఉంచినా, ఆ సీజన్ ఏమాత్రం సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బిగ్ బీనే తీసుకురాక తప్పలేదు. దాంతో మరోసారి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకునే పరిస్థితిలో నిర్మాతలు లేరని తెలుస్తోంది. -
విశ్లేషణం : అంతఃసౌందర్యమే ఆమె ఐశ్వర్యం
ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి. ఐశ్వర్యారాయ్... ప్రపంచాన్ని మైమరపించిన సౌందర్యం! మోడలింగ్‌తో మెరిపించి, ప్రపంచ సుందరిగా మురిపించి, అందమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, బచ్చన్ ఇంటి కోడలుగా మెప్పించి, ఆరాధ్యకు తల్లిగా ఆనందాన్ని అనుభవిస్తున్న అందాలరాశి. మరి ఈ సౌందర్య దేవత వ్యక్తిత్వం కూడా అందమైనదేనా? అందమైన ఆత్మవిశ్వాసం... సెలబ్రిటీతో మాట్లాడకుండా కేవలం వారి పబ్లిక్ బిహేవియర్‌ను మాత్రమే పరిశీలించి వ్యక్తిత్వాన్ని అంచనావేయడం కష్టమైన పనే, కానీ అసాధ్యం కాదు. ఒక వ్యక్తి ఒక్క పదం కూడా మాట్లాడకపోయినా బాడీలాంగ్వేజ్, హావభావాలు వారి అంతరంగం గురించి అనేక విషయాలు వివరిస్తాయి. అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎంచుకునే మాటలు వారి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఐశ్వర్య కాలుమీద కాలు వేసుకుని హుందాగా కూర్చుంటుంది. చేతులు రెండూ కలిపి ఉంచి, అవసరమైనప్పుడు, ఏమైనా వ్యక్తం చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంది. దీన్ని బట్టి ఆమె ఆత్మవిశ్వాసంతో ఉంటుందని, మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో సెలక్టివ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కాస్త పైకి చూసి, ఆ తర్వాత ఎదుటివారివైపు సూటిగా చూస్తూ మాట్లాడుతుంది. ఆమె విజువల్ పర్సన్ అని అర్థమవుతుంది. గలగలా మాట్లాడుతూ... కిలకిలా నవ్వుతూ, అప్పుడప్పుడూ నాలుక బయటకు పెట్టి తిప్పేస్తూ... ఎదుటివారిని గిలిగింతలు పెట్టేస్తుంది. ఇలా నవ్వడం, నాలుకను తిప్పేయడం ఫ్లర్టింగ్ అనిపించినా... అది నెర్వస్‌నెస్‌ను దాచుకునే ప్రయత్నంలో భాగమని కూడా అనుకోవచ్చు. ఇక తానేదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా సెటైరికల్‌గా చెప్పాలనుకున్నప్పుడు కొటేషన్ మార్క్‌ను వేళ్లతో చూపించడం ఐశ్వర్య ప్రత్యేక శైలి. మధ్యేమార్గం... అందమైన అమ్మాయి... అందులోనూ గ్లామర్ఫీల్డ్... ఎన్ని పుకార్లు పుట్టుకొస్తాయో అందరికీ తెలుసు. ఐశ్వర్య గురించి ఎన్నో పుకార్లు, మరెన్నో వివాదాలు. వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మౌనంగా ఉంటుంది, లేదంటే దాటవేస్తుంది, మరీ ఒత్తిడి చేస్తే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందే తప్ప... ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడాన్ని బట్టి ఆమె సంయమనాన్ని అర్థం చేసుకోవచ్చు. బుద్ధుని మధ్యేమార్గమే తన మార్గమని ఆమె చెప్పే మాటలు కేవలం మాటలు మాత్రమే కాదని, తాను నిజంగా ఆచరిస్తుందని అర్థమవుతుంది. జీవితం గురించి తాను ఎలాంటి ప్రణాళికలు వేసుకోనని, ఎలా వస్తే అలా జీవితాన్ని స్వీకరిస్తానని చెప్పడం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. కానీ తనగురించి అవాస్తవాలు రాసినప్పుడు ఎలాంటి జంకూగొంకూ లేకుండా మీడియాను సైతం విమర్శిస్తుంది. అందమైన మనసు... ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి, ఆ మాటల్లోని మనసును అర్థం చేసుకోవాలి. చాలాకాలం కిందటే ఐశ్వర్యారాయ్ ఫౌండేషన్ స్థాపించి, దాని ద్వారా సమాజసేవ చేస్తున్న విషయం చాలామందికి తెలీదు. అలాగే పెటా, నేత్రదానం, పోలియో నిర్మూలన తదితర సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. 1994 లో మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యాక... మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారని అడిగితే... మదర్ థెరిస్సా అని చెప్పింది. సెలబ్రిటీలు అలాగే చెప్తారని అనుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే... తన పనిమనిషని చెప్పింది. కొడుకు హీమోఫిలియాతో బాధపడుతున్నా చెదరని ఆమె ఆత్మవిశ్వాసమే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పడం ఐశ్వర్య ఎంత డౌన్ టూ ఎర్త్‌గా ఉంటుందో వెల్లడిస్తుంది. డబ్బుతో మనం సంతోషాన్ని కొనలేం, కానీ ఆ డబ్బుతో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు అని చెప్పడం ఆమె అందమైన మనసుకు ఒక ఉదాహరణ మాత్రమే. షి ఈజ్ యాన్ ఇన్క్రెడిబుల్ ఉమన్! - విశేష్, సైకాలజిస్ట్