Shahid Kapoor Recalls Spoiling Karisma Kapoor, Aishwarya Rai Songs - Sakshi
Sakshi News home page

Shahid Kapoor: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్‌కు: షాహిద్ కపూర్

Published Thu, Jun 8 2023 12:51 PM | Last Updated on Thu, Jun 8 2023 1:03 PM

Shahid Kapoor Recalls Spoiling Karisma Kapoor Aishwarya Rai Songs - Sakshi

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ క‌పూర్‌.. ఒక‌ప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా కూడా చేశారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కెరీర్ మొద‌ట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్‌ మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్‌, రాయ్‌ కపూర్‌ ఫిల్మ్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి.

గతంలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌  కరిష్మా కపూర్,  ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్‌..   ఐశ్వర్య రాయ్ నటించిన తాల్‌ మూవీలోని   'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్    'లే గయీ' వంటి పాటలకు  డ్యాన్సర్‌గా పని చేశాడు.  

(ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఇదే!)


కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్

కరిష్మా కపూర్‌  పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని  'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది.  నేను షాట్‌ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్‌ నుంచి తిట్లు కూడా తిన్నాను.  నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు.

ఐశ్వర్యరాయ్‌ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం 
దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్‌ సినిమాలోని  'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే'  పాటలో కనిపించాడు షాహిద్‌. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్‌గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్‌కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్‌గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్‌ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్‌ తెలిపాడు.

(ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement