karishma kapoor
-
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్‌తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో!
వినాయకవి చవితి పండుగను చిన్నా, పెద్దా అంతా దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించు కుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. తాజాగా గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు నిండుగా కనిపించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కపుల్, రణబీర్ కపూర్, అలియాభట్ ముద్దుల తనయ రాహా తండ్రి ఒడిలో మరింత ముద్దుగా కనిపించింది. ఇంకా స్టార్ కిడ్స్ ఆదార్ జైన్, అలేఖా అద్వానీ, కరీనా కపూర్ కుమారులు జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ కూడా అందంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) తమ ఇంట్లో జరిగిన గణనాధుడి వేడుకలకు సంబంధించిన ఫోటోలను (సెప్టెంబర్ 15) ఆదివారం కరిష్మా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో రణధీర్ కపూర్, బబితా కపూర్ కరిష్మా కపూర్, కరీనా కపూర్, జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, రాహా కపూర్ , ఇతరులున్నారు. "గణపతి బప్పా మోరియా", అంటూ అంతా కలిసి గణపతి బప్పాకు పూజలు అనంతరం ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే కపూర్ కుటుంబంలో రాహా తల్లి అలియా భట్ , కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ మిస్ అయ్యారు.అలాగే నానమ్మ నీతా కపూర్‌తో, చిన్నారి రాహా క్యూట్ ఇంటరాక్షన్ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ చంకలో ఒదిగిపోయిన రాహా, నానమ్మను చూసి లిటిల్ ప్రిన్సెస్ తెగ సంతోష పడింది. సోమవారం ఉదయం వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) తన రాబోయే చిత్రం జిగ్రా ప్రమోషన్లో అలియా బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ మూవీ యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ స్టార్డం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ రామాయణంలో శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు. ఇదీ చదవండి: వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా? -
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
-
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడు హరీశ్ కుమార్ ఇలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. హీరోయిన్ కరిష్మా కపూర్ తనని కాపాడిందని, లేదంటే చనిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? హరీశ్ ఏం చెప్పాడు?1990ల్లో హీరోగా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు హరీశ్ కుమార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే 'ప్రేమ్ ఖైదీ' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది. అది షూట్ చేస్తున్న సమయంలో తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కుమార్ షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?)'కరిష్మా.. స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్‌లో దూకి ఆమెని కాపాడతాను. సినిమాలో మీరు చూసిందైతే ఇదే. కానీ షూటింగ్లో మొత్తం రివర్స్‌లో జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదు. దీంతో పూల్‌లో దూకిన కాసేపటికే నేను మునిగిపోయాను. నేను ప్రాంక్ చేస్తున్నానని అందరూ అనుకున్నారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. నేను ఆమె స్విమ్ సూట్‌ని పట్టుకున్నాను. అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను' అని నటుడు హరీశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.హరీశ్ కుమార్.. తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత తదితర చిత్రాల్లో నటించాడు. హిందీ, మలయాళంలోనూ పలు మూవీస్ చేశాడు. 2017 వరకు నటుడిగా పనిచేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే) -
వేలం పాటలో నన్ను అమ్మేయాలని చూశాడు: హీరోయిన్
అన్ని ప్రేమకథలు సుఖాంతం కావు.. ఇక్కడ చెప్పుకునే జంట కూడా అదే కోవలోకి వస్తుంది. హీరో అభిషేక్ బచ్చన్- హీరోయిన్ కరిష్మా కపూర్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం జరిగింది. తర్వాత పలు కారణాలతో అది రద్దయిపోయింది. అనంతరం అభిషేక్.. రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడిపాడు, కానీ అది కూడా సెట్ కాలేదు. చివరకు ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2003లో పెళ్లి అటు కరిష్మా కపూర్.. 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది. వీరికి సమీరా, కిరణ్ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య పొరపచ్చాలు రావడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా 2016లో మంజూరయ్యాయి. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కరిష్మా ప్రస్తుతం 'మర్డర్ ముబారక్' అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ క్రమంలో ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వేలానికి పెట్టాలని.. గతంలోని ఓ ఇంటర్వ్యూలో కరిష్మా మాట్లాడుతూ.. భర్తతో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తన స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి తీసుకొచ్చాడని వాపోయింది. ఒకానొక సమయంలో తనను వేలానికి పెట్టి అమ్మేయాలని చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి తన తల్లితో కొట్టించాలని చూశాడని బాధపడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో పడరాని కష్టాలు పడుతుండటంతో ఆమె తండ్రి రణ్‌ధీర్ కపూర్ తల్లడిల్లిపోయాడు. డబ్బు వెనక పరుగెత్తాల్సిన అవసరం లేదు సమాజంలో మా స్థాయేంటో, మా స్థానమేంటో అందరికీ తెలుసు. మేము డబ్బుకోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మాకు ప్రతిభ, డబ్బు.. రెండింటినీ ఇచ్చాడు. ఆ సంజయ్.. థర్డ్ క్లాస్ వ్యక్తి.. అతడితో పెళ్లంటేనే నాకిష్టం లేదు. వాడెప్పుడూ నా కూతుర్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నా బిడ్డను వదిలేసి మరో అమ్మాయితో తిరిగాడు. అతడెలాంటివాడో ఢిల్లీ మొత్తానికి తెలుసు అంటూ ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే! చదవండి: సూర్య కంటే జ్యోతిక ఆస్తి ఎక్కువ? ఎవరి దగ్గర ఎంతంటే? -
డైరెక్ట్‌గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, జానర్లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్లో జరిగిన ఓ మర్డర్ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్‌గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్ సాంగ్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే: స్టార్ హీరో
బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్.. ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా చేశారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్.. ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ మూవీలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్ 'లే గయీ' వంటి పాటలకు డ్యాన్సర్‌గా పని చేశాడు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్ కరిష్మా కపూర్ పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని 'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది. నేను షాట్‌ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్ నుంచి తిట్లు కూడా తిన్నాను. నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు. ఐశ్వర్యరాయ్ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్ సినిమాలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాటలో కనిపించాడు షాహిద్. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్‌గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్‌కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్‌గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్ తెలిపాడు. (ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత) -
మాజీ భర్తతో డిన్నర్‌కు వెళ్లిన హీరోయిన్, వీడియో వైరల్
కొందరికి ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించదు. మరికొందరు మాత్రం ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అవుతారు. ఆ జాబితాలోకే వస్తుంది హీరోయిన్ కరిష్మా కపూర్. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. 2012లో డేంజరస్ ఇష్క్ చిత్రంలో చివరిసారి పూర్తి స్థాయిలో నటించిన ఆమె ఆ తర్వాత బాంబే టాకీస్, జీరో సినిమాల్లో కొద్ది నిమిషాలే అతిథి పాత్రలో మెరిసింది. దాదాపు పదేళ్ల తర్వాత మర్డర్ ముబారక్ అనే సినిమా చేస్తోంది. మధ్యలో వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేసింది. మాజీ భర్తతో డిన్నర్.. ఇకపోతే గతంలో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఆదివారం నాడు మాజీ భర్తతో కలిసి ముంబైలో రెస్టారెంట్‌కు వెళ్లింది కరిష్మా. ఇద్దరూ డిన్నర్ చేసి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న కెమెరామన్లు వారి ఫోటోలను క్లిక్‌మనిపించడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. విడాకుల సమయంలో దుమ్మెత్తిపోసుకున్నారు, ఇప్పుడు ఇలా కలిసిపోయారేంటి? ఇది నిజమేనా? నటిస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలోనూ కరిష్మా కొడుకు కిరణ్ రాజ్ బర్త్‌డేను కలిసే సెలబ్రేట్ చేశారు. సంజయ్ భార్య ప్రియ కూడా తన పిల్లలతో కలిసి ఈ వేడుకలో పాల్గొంది. కరిష్మా- సంజయ్ విడాకులు.. 2003లో ఢిల్లీ వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది కరిష్మా. వీరికి సమీరా, కిరణ్ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2016లో విడాకులు మంజూరు అవగా పిల్లల బాధ్యతను తల్లికే అప్పజెప్పింది న్యాయస్థానం. 2017లో ప్రియను పెళ్లాడాడు సంజయ్. ఇది ప్రియకు కూడా రెండో వివాహమే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: శర్వానంద్‌కు యాక్సిడెంట్ -
హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
-
డ్రెస్ పట్టడం లేదని మాజీ భర్త నన్ను కొట్టబోయాడు: హీరోయిన్
తన సినిమాలతో కుర్రకారును ఓ ఊపు ఊపిన హీరోయిన్ కరిష్మా కపూర్. పలువురు బడా హీరోలతోనూ జతకట్టి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుందావిడ. ఆన్‌స్క్రీన్‌లో తన నటనతో కట్టిపడేసే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితం ఎంతోకాలం సవ్యంగా సాగలేదు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కొడుకు కియాన్ పుట్టిన తర్వాత దాన్ని నన్నోసారి వేసుకోమన్నారు. తల్లినయ్యాక నా శరీరం కొద్దిగా లావైంది. ఆ డ్రెస్ నాకు పట్టలేదు. అది చూసిన సంజయ్ కోపంతో నన్ను లాగి కొట్టమని అతడి తల్లికి చెప్పాడు. అతడి ప్రవర్తనను తప్పు పట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుక్కే సపోర్ట్ చేసేది' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కరిష్మా. ఇలా ఎన్నో వివాదాల నడుమ కరిష్మా, సంజయ్‌లకు 2016లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలు సమైరా, కియాన్ రాజ్ కపూర్ బాధ్యతలను తల్లికే అప్పజెపుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. చదవండి: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే: పోస్ట్‌మార్టమ్ సిబ్బంది వర్షం డైరెక్టర్ మా బాబాయి, ఆయన పోయిన నెలకే నాన్న చనిపోయారు: కమెడియన్ కూతురు -
రెండో పెళ్లిపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. ఫేవరెట్ కలర్ ఏదన్న ప్రశ్నకు బ్లాక్ డ్రెస్‌లో ఉన్న వీడియో క్లిప్‌కు షేర్ చేసింది. ఇష్టమైన ఫుడ్ ఏది? అన్న క్వశ్చన్‌కు బిర్యానీ అని బదులిచ్చింది. రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? అంటే వీళ్లిద్దరూ ఇష్టమేనంది. 'మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అని ఓ నెటిజన్ అడగ్గా అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంటే తను రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సూచనప్రాయంగా చెప్పుకొచ్చింది. కాగా కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను 2003లో పెళ్లి చేసుకుంది. వీరికి సమైరా, కియాన్ ఇద్దరు సంతానం. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2014లో విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకోగా 2016లో విడాకులు మంజూరయ్యాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: అమెజాన్ ప్రైమ్‌లో 40 ఒరిజినల్ వెబ్ సిరీస్, సినిమాలు ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్, ఆచార్య బయటపడేనా? -
నిశ్చితార్థం రద్దు చేసుకున్న అభిషేక్, కరిష్మా!
అన్నీ అనుకున్నట్టే జరిగితే కరిష్మా కపూర్ జీవితం ఇంకోలా ఉండేది. అభిషేక్ బచ్చన్ జత అయ్యేవాడు. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నిశ్చితార్థం జరిగింది! కానీ బ్రేక్ అయింది.. ఆ ఇద్దరి భవిష్యత్ పట్ల పెద్దవాళ్లకున్న అభద్రత అడ్డొచ్చి. దాంతో వాళ్లిద్దరూ తమ ప్రేమనూ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.. అసలా ప్రేమ్ కహానీ ఎక్కడ మొదలైంది? తనతోపాటు అజయ్ దేవ్గన్ రవీనాతోనూ లవ్ గేమ్ ఆడుతున్నాడని తెలిసి సైలెంట్‌గా అతణ్ణించి తప్పుకొని దృష్టంతా కెరీర్ మీదే పెట్టింది కరిష్మా. ఆ సమయంలోనే రాజ్‌కపూర్ కూతురి కొడుకు నిఖిల్ నందా పెళ్లి నిశ్చయమైంది అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్‌తో. అప్పుడే కరిష్మా, అభిషేక్‌ల మధ్య స్నేహం కుదిరింది. శ్వేత, నిఖిల్ నందా పెళ్లి (1997)లో అభిషేక్, కరిష్మాల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అప్పటికి బాలీవుడ్లో కరిష్మా పెద్ద స్టార్. అభిషేక్ ఇంకా కెరీరే మొదలుపెట్టలేదు. దాంతో తమ ప్రేమ వ్యవహారం బయటపడకుండా రహస్యంగా ఉంచడం వాళ్లకు తేలికైంది. అలా మూడేళ్లు గడిచిపోయాయి. రెఫ్యూజీ అభిషేక్ బచ్చన్ సినీరంగ ప్రవేశానికి(2000) ముహూర్తం సిద్ధమైంది రెఫ్యూజీ సినిమాతో. అందులో కథానాయిక కరిష్మా కపూర్ చెల్లెలు కరీనా కపూర్. అప్పుడు కరిష్మా, అభిషేక్ ప్రేమ సంగతి బయటపడింది. ఇటు అభిషేక్ బచ్చన్, అటు కరీనా కెరీర్ మీదే దృష్టి పెట్టిన ఆ రెండు కుటుంబాలూ కరిష్మా, అభిషేక్ లవ్ గురించి వినీవిననట్టే ఊరుకున్నాయి. 60 వ బర్త్‌డే.. మరో రెండేళ్లు దాటాయి. కరిష్మా, అభిషేక్‌లకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు పెద్దలు. అమితాబ్ బచ్చన్ 60వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిపించారు. అంతా బాగుంది.. పెళ్లవడమే తరువాయి అనుకున్నారంతా. ఆ ప్రేమ పక్షులూ పెళ్లి తర్వాత కలసి ఉండే జీవితం గురించి కలలు కనడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ రెండు కుటుంబాలు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేశాయి. ఇరు వర్గాల అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా షాక్. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆరా తీయడానికి మీడియా చాలా ప్రయత్నించింది. రెండు వైపుల వాళ్లు వ్యూహాత్మక మౌనం వహించారు. కరిష్మా, అభిషేక్ కూడా ఏ రోజూ పెదవి విప్పలేదు. ఇప్పటికీ ఆ కారణం బయటకు రాలేదు. గుసగుసలు.. కరిష్మా, అభిషేక్‌ల నిశ్చితార్థం తర్వాత కొన్నాళ్లకు బచ్చన్ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పటికి అభిషేక్‌నూ సక్సెస్ వరించలేదు. ఇవన్నీ సింగిల్ పేరెంట్‌గా ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన కరిష్మా తల్లి బబితలో అభద్రతను కలిగించాయి. తనలా తన కూతురి పరిస్థితి కాకూడదనే భయంతో పెళ్లికి ముందే తండ్రి ఆస్తిలో నుంచి కొంత కొడుకు అభిషేక్ పేరు మీద రాయమని బబిత అమితాబ్ బచ్చన్ కోరిందని.. ఆమె అలా అడగడంతో జయ బచ్చన్ నొచ్చుకుందని.. తల్లి బాధపడ్డం అభిషేక్‌కు నచ్చలేదని.. అందుకే ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని బాలీవుడ్లో గుసగుసలు. అంతేకాదు భవిష్యత్‌లో ఎప్పుడూ కరిష్మా వంక కన్నెత్తి చూడనని అభిషేక్ తన తల్లికి మాటిచ్చాడనీ ఆ వినికిడి. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయింది. తర్వాత.. కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లిచేసుకుంది. అది కలహాల కాపురంగానే ముగిసిపోయింది. ఇటు అభిషేక్.. రాణి ముఖర్జీ ప్రేమలో పడ్డాడు. పెళ్లిదాకా వెళతారనే అనుకున్నారంతా. కాని వెళ్లలేదు. కారణం.. జయ బచ్చన్. రాణీ ముఖర్జీ, జయ బచ్చన్ కలసి ‘లగా చునరీ మే దాగ్’ అనే సినిమాలో నటించారు. ఆ సెట్స్ మీద రాణీ, జయాకు గొడవ జరిగి రాణి కాస్త దురుసుగా మాట్లాడిందట. దాంతో జయ .. అభిషేక్‌తో రాణి సన్నిహితంగా మెలగడాన్ని ఇష్టపడలేదని.. అమ్మ అభీష్టాన్ని అభిషేక్ మన్నించక తప్పలేదని అందుకే రాణితోనూ బ్రేకప్ తప్పనిసరి అయిందని పేర్కొంటాయి బాలీవుడ్ వర్గాలు. నిజానికి రాణి ముఖర్జీని బచ్చన్ కుటుంబం చాలా ఇష్టపడింది. ముఖ్యంగా జయ. కారణం రాణి కూడా తనలాగే బెంగాలీ కావడం. అదీగాక ఆ అమ్మాయికి సహనమూ ఎక్కువేనని, అభిషేక్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనీ ఆ కుటుంబం ఆ ఇద్దరి ప్రేమను మనసారా అంగీకరించింది. ‘లగా చునరీ మే దాగ్’ ఆ అనుబంధాన్ని తెంచేసి మాయని మచ్చలా మిగిలిపోయింది. - ఎస్సార్ చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్‌గణ్ ఓ ప్లే బాయ్! -
రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్‌స్టోరీ
• మొహబ్బతే ‘ఫ్యామిలీ మెన్’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్’ ట్యాగ్‌ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్ దేవ్గన్ ఒకడు. ఆశ్చర్యపోనవసరం లేదు.. అతని లవ్ లిస్ట్‌లో కాజోల్ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్ ఉన్నారు. అజయ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్ లవ్ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్ సోదరి నీలం దేవగన్ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి. ఆ ప్రేమ ‘దిల్వాలే’ సినిమా సెట్స్ మీద మొదలైంది. ‘ఏక్ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్‌గా లేడు ఆ రిలేషన్ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. ఆ సమయంలోనే.. అజయ్‌కి కరిష్మా కపూర్ ఫ్రెండ్ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్’లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్‌కి ఫోన్ చేసేది (అప్పుడు సెల్ ఫోన్లు లేవు.. ల్యాండ్ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్‌కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్ ఫోన్ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్‌లో కరిష్మా, అజయ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది. అజయ్ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా’లో నటించినా అజయ్ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని, ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్ కాజోల్ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు. చిరాకు, చిటపటలతోనే.. కాజోల్, అజయ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘హల్చల్’. ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్ దేవ్‌గన్‌కు గలగలా మాట్లాడే కాజోల్ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం. అవును.. అజయ్ కరిష్మాతో.. కాజోల్ కార్తిక్ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు. వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది.. కార్తిక్ మెహతాతో తన రిలేషన్‌కు సంబంధించి అజయ్‌ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్‌కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్కు ప్రేమ భావనను పంచింది. ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే ‘పెళ్లి’ మంత్రంగా మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ! అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది. ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం. లెటర్స్ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు లెటర్స్ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్ హాస్పిటల్లో చేరితే మంచిదనీ కామెంట్ చేశాడు. ఈ ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కూడా ఇగిరిపోయింది. - ఎస్సార్ చదవండి: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై దాడి? -
‘చింటూ అంకుల్.. మిమ్నల్ని మిస్సవుతున్నా’
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ మరణంతో కపూర్ కుటుంబం సహా దేశమంతా దిగ్భ్రాంతికి లోనయింది. చాకొలెట్ బాయ్‌తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో అప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇక కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ బర్త్‌డే సంర్భంగా రిషీతో కపూర్ కుటుంబ సభ్యులందరూ ఉన్న ఫోటోను కరిష్మా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ హార్ట్ సింబల్‌ను జత చేశారు. అంతకుముందు తాత రాజ్ కపూర్, చిన్నాన్న రిషీ కపూర్‌తో తన చిన్ననాటి ఫోటోను కరిష్మా షేర్ చేశారు. ‘చింటూ అంకుల్ మీతో ఇక రెస్టారెంట్లు, వంటకాల గురించి డిస్కస్ చేయడం మిస్సవుతా’నంటూ కరిష్మా ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. చదవండి : అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్ -
పిల్లలతో కలిసి విరాళమిచ్చిన బాలీవుడ్ నటి
కరోనాతో పోరాడుతున్న వారికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ముందుకు వచ్చింది. తన ఇద్దరు పిల్లలు సమీరా కపూర్, కియాన్ కపూర్‌తో కలిసి విరాళం ఇచ్చినట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విరాళానికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. "ప్రతీ ప్రాణం అవసరమైనదే.. అందుకే నా పిల్లలతో పాటు పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నా వంతు సాయం చేశాను. చిన్న సాయం ఎంతమంది ప్రాణాలనైనా కాపాడవచ్చు. అందుకే మీరు కూడా కదలండి. మన దేశం కోసం, మానవత్వం కోసం మీ వంతు సాయం చేయండి" అని అభిమానులకు పిలుపునిచ్చింది. అయితే ఎంత డబ్బు విరాళంగా ఇచ్చిందన్న విషయాన్ని వెల్లడించలేదు. ఆమె సోదరి కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్ సైతం పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌తోపాటు యునిసెఫ్, ఐఏహెచ్‌వీ సంస్థలకు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరిష్మా హ్యాండ్ బ్యాగ్ ధర వింటే షాక్’) -
పిల్లల్ని సముదాయించడం కోసం..
మార్చి 11 నుంచి ఆల్ట్–బాలాజీ ఎంటర్టైన్మెంట్స్లో కరిష్మా కపూర్ నటిస్తున్న ‘మెంటల్‌హుడ్’ వెబ్ సిరీస్ మొదలవుతున్నాయి. మదర్‌హుడ్ (మాతృత్వం) కి దగ్గరగా ఉన్న ఈ మెంటల్‌హుడ్ అనే మాటలో.. పిల్లలు తల్లికి ఎంతగా పిచ్చిపట్టిస్తారో చెప్పే అర్థం గుంభనంగా ఉంది. ఈ సిరీస్ కథాంశం కూడా అదే. పిల్లల్ని సముదాయించడం కోసం తల్లి నిత్యం వేసే ఆసనాలను ఏక్తాకపూర్ చూపించబోతున్నారు. ‘‘నాకు వచ్చిన అవార్డులన్నీ ఒక ఎత్తు, నా పిల్లలు ఒక ఎత్తు. నా కెరీర్ మొత్తం ఒకటి, వీళ్లిద్దరూ ఒకటి’’ అని మెంటల్‌హుడ్ ట్రైలర్ విడుదల సందర్భంగా కూతురు సమీరను, కొడుకు కయాలను చూపిస్తూ కరిష్మా అన్నారు. కరిష్మకు 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్‌మేన్‌తో పెళ్లయింది. 2016లో ఆయనతో విడిపోయారు. -
‘కరిష్మా హ్యాండ్ బ్యాగ్ ధర వింటే షాక్’
ముంబై : బాలీవుడ్ భామలు తమ హోదాను చాటేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. డ్రెస్‌లు, యాక్సెసరీలకు లక్షలకు లక్షలు వెచ్చించడంలో ముందుండేందుకు వారు పోటీపడతారు. తాజాగా కరిష్మా కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌తో సందడి చేశారు. బ్లాక్ కలర్ టాప్, బాటమ్లతో పాటు అదే రంగు షూస్‌తో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. ఇక కరిష్మా ధరించిన టాన్ బిర్కిన్ బ్యాగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ బ్యాగ్ ధర 15,000 యూఎస్ డాలర్లు కాగా, మన కరెన్సీలో రూ 10 లక్షల పైమాటే. -
మెంటల్ రైడ్
సిల్వర్ స్క్రీన్‌పై కరిష్మా కపూర్ ఎంతటి సక్సెస్ఫుల్ హీరోయినో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై కూడా సత్తా చాటి వీక్షకుల మెప్పు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎంటర్ అయ్యారు. ‘మెంటల్ హుడ్’ అనే వెబ్ సీరిస్‌లో నటిస్తున్నారు. ‘‘టైమ్‌తో సంబంధం లేకుండా రౌండ్‌ది క్లాక్ అమ్మకు పని ఉంటుంది. కానీ అది ఈ ప్రపంచంలోనే నా ఫేవరెట్ వర్క్. ప్రతిరోజూ కొత్త పాఠమే. ఓ సరికొత్త చాలెంజ్‌నే. అయినా పని చేస్తూనే కొత్త విషయాలు నేర్చుకుంటుంటాం. ఈ మెంటల్ రైడ్‌లో నాతో పాటు జాయిన్ అవ్వండి ’’ అని కరిష్మా పేర్కొన్నారు. కరిష్మా కోహ్లీ దర్శకత్వంలో ఈ సిరీస్‌ను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునే తల్లి పాత్రలో నటించారు కరిష్మా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏడేళ్ల తర్వాత ఈ వెబ్ సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చారు కరిష్మా. హిందీ మూవీ ‘డేంజరేస్ ఇష్క్’ (2012) తర్వాత ఆమె మరో ఫుల్ లెంగ్త్ రోల్లో నటించలేదు. -
మాట్లాడితే తప్పేం కాదు
ఓ స్కూల్ ఫెస్టివల్‌కి అతిథిగా వెళ్లారు కథానాయిక కరిష్మా కపూర్. స్ఫూర్తిదాయకమైన మాటలతో పాటు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను తెలిపేలా మాట్లాడారామె. లైఫ్‌లో మెంటల్ హెల్త్ ప్రాముఖ్యత గురించి మీ అభిప్రాయం ఏంటీ? అన్న ప్రశ్నను కరిష్మా ముందు ఉంచితే... ‘‘మానసిక ఆరోగ్యం గురించి మనమందరం తెలుసుకుని ఉండాలన్నది నా అభిప్రాయం. పిల్లలకు కూడా తల్లిదండ్రులు అవగాహన కలిగించాలి. కానీ, కొందరు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తారు. అది సరి కాదు. సొసైటీలో మెంటల్ హెల్త్ టాపిక్‌ని నిషేధించలేదు. మాట్లాడితే తప్పేం కాదు’’ అన్నారు. బాలీవుడ్ కథానాయికలు దీపికా పదుకోన్, అనుష్కాశర్మ మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ను ఫేస్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే మెంటల్ హెల్త్ గురించి నటి ఆలియా భట్ సోదరి షాహీన్ భట్ ఓ పుస్తకం కూడా రాశారు. -
హైదరాబాద్‌లో కరిష్మా సందడి
-
కోహ్లి 'ఫస్ట్ లవ్' ఎవరో తెలుసా!
న్యూఢిల్లీ: మైదానంలో విశ్వరూపం చూపుతూ.. సయమొచ్చినప్పుడల్లా రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఆరాధ్య దైవమయ్యాడు. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ మైదానంలో ప్రదర్శనతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. గాఢమైన ప్రేమలో మునిగిపోయి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నకోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క బ్రేకప్ కథనాలు కంచికి చేరి వీరు మళ్లీ ఒకటయ్యారు. ఈ ప్రేమజంట మళ్లీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. నూనుగు మీసాల యవ్వనప్రాయంలో తాను కరిష్మా కపూర్ అంటే పడి చచ్చేవాడినని, ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ లాంటి భావన ఆమెతోనే మొదలైందని చెప్పుకొచ్చాడు. విరాట్ కుర్ర వయస్సులో ఉన్నప్పుడు కరిష్మా కపూర్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలింది. అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పుడు కరిష్మా సినిమాల నుంచి తప్పుకుంది. విరాట్ క్రికెట్ రంగంలో దూసుకుపోతూ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో తన యుక్తప్రాయం గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కోహ్లి ఈ విషయాలు తెలిపాడు. -
మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా
కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నారు గానీ, ఆమె జీవితానికి సంబంధించిన నిజం ఏంటో ఎవరికీ తెలియదని ఆమె సోదరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ ఖాన్ చెబుతోంది. అయితే ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారం కాబట్టి తాను మాత్రం దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనంది. ఇది కరిష్మాకు చాలా కష్టకాలమని మాత్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పర అంగీకారంతో సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకుంటుందని అందరూ భావించినా, కరిష్మా మాత్రం కేసు పోరాడతానంటూ ముందుకెళ్లింది. సుదీర్ఘకాలం వాదనల తర్వాత మళ్లీ చివరకు పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరయ్యాయి. అంతకుముందు సంజయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. కానీ సందీప్‌కు అప్పటికే పెళ్లి అయిపోవడం, అతడికి ఇంకా విడాకులు రాకముందే కరిష్మాతో తిరిగితే ఇబ్బంది అవుతుందని న్యాయవాదులు చెప్పడంతో అతడు కూడా ఆమెకు కొంతకాలం దూరమయ్యాడు. అతడికి కూడా విడాకులు వస్తే ఆ తర్వాత వీళ్లిద్దరి బంధం ఎటు తిరుగుతుందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. -
మీ నవ్వులతో నగరాన్ని వెలిగించొచ్చు!
♦ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ♦ ఆర్భాటంగా ప్రారంభమైన బాలల చిత్రోత్సవం సాక్షి, హైదరాబాద్: ‘మీ నవ్వులతో భాగ్యనగరాన్ని దేదీప్యమానంగా వెలిగించవచ్చు’ అని కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ చిన్నారులనుద్దేశించి అన్నారు. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం శనివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో రాజ్యవర్ధన్ మాట్లాడుతూ... ‘బాలల నవ్వులు చూస్తుంటే మాన్స్టర్ సినిమా గుర్తుకు వస్తోంది. అందులో నవ్వులతో విద్యుచ్ఛక్తిని తయారు చేయడం కథాంశం. ఇక్కడ చేరిన మీ అందరి నవ్వుల్లో అలా ఓ అద్భుతమైన వెలుగు ఉద్భవిస్తోంది. హైదరాబాద్‌ను బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా మార్చే ఆలోచనలో ఉన్నాం. పిల్లలంతా ఈ ఉత్సవంలో పాల్గొని మధుర జ్ఞాపకాలతో ఇంటికి వెళ్లాలి. ప్రపంచమంతా ఆశావహ దృక్పథంలో సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు. 7 రోజులు... 400 చిత్రాలు... రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... ‘ఈ చిత్రోత్సవాలకు వేదికగా నగరాన్ని తరచూ ఎంపిక చేయడం సంతోషం కలిగిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా 14 థియేటర్లలో ఏడు రోజుల పాటు 400 చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సవాలుగా తీసుకొని నిర్వహిస్తోంది. 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. సినీ నిర్మాతలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుంది’ అన్నారు. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) చైర్మన్ ముకేష్‌ఖన్నా మాట్లాడుతూ... ‘మిమ్మల్ని చూస్తుంటే 1997లో నేను నటించిన శక్తిమాన్ ధారావాహికలోని పాటలో వసుైధైక కుటుంబం గుర్తుకు వస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులంతా కలసి ఈ ఉత్సవాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నా’ అన్నారు. ప్రముఖ నటి టబూ మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన నగరంలో ఈ అద్భుత వేడుక జరగడం ఆనందంగా ఉంది. నా కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది. అందుకే హైదరాబాద్ ఎప్పుడూ నాకు స్పెషలే’ అని చెప్పారు. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ మాట్లాడుతూ... ‘నాకు ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్. సోదరి కరిష్మాకపూర్ కుమార్తె నటించిన బీ హ్యాపీ షార్ట్ ఫిల్మ్ ఈ పోటీలో ఉండటం ఒక కారణమైతే... బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలను ఒకే చోట కలుసుకోవడం మరో కారణం’ అన్నారు. కేంద్ర సమాచార శాఖ సినిమా విభాగం డెరైక్టర్ దీపక్ కుమార్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పర్యాటకాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కిషన్‌రావు, సీఎఫ్ఎస్ఐ కార్యనిర్వహణాధికారి శ్రవణ్‌కుమార్, ఐ అండ్ పీఆర్ సెక్రటరీ సునీల్ అరోరా పాల్గొన్నారు. -
రీ ఎంట్రీపై ఆలోచించలేదు
ప్రస్తుతం బాలీవుడ్లో రీ ఎంట్రీ సీజన్ నడుస్తోంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యారాయ్ లాంటి టాప్ హీరోయిన్స్ అందరూ లాంగ్ గ్యాప్ తరువాత తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు. అయితే ఇదే వరుసలో కపూర్ ఫ్యామిలీ బ్యూటీ కరిష్మా కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతోందని భారీ ప్రచారమే జరిగింది. ఈ వార్తలను ఖండించింది కరిష్మా. ఇప్పట్లో రీ ఎంట్రీ ఆలోచనే లేదంటూ తేల్చేసింది కరిష్మా. ప్రస్తుతం తన పిల్లలు సమీరా, కియాన్ రాజ్ కపూర్లు చాలా చిన్న వాళ్లని, తన ఆలోచనంతా వారి గురించే అని చెబుతోంది. సినిమా అయినా మరేదైనా తనకు పిల్లల తర్వాతే అంటోంది. ఇటీవల ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను గమనిస్తున్నానంటున్న కరిష్మా, ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ చేస్తున్న తరహా లేడీ ఓరియంటెడ్ కథలు తన దగ్గరకు కూడా వచ్చాయని, అయితే ఇప్పట్లో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదు కనుక ఆ సినిమాలు అంగీకరించలేదని చెప్పింది.