![Karisma Kapoor wants to spread awareness about mental health issues - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/11/karishma-kapur.jpg.webp?itok=FbIApbMI)
కరిష్మా కపూర్
ఓ స్కూల్ ఫెస్టివల్‌కి అతిథిగా వెళ్లారు కథానాయిక కరిష్మా కపూర్. స్ఫూర్తిదాయకమైన మాటలతో పాటు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను తెలిపేలా మాట్లాడారామె. లైఫ్‌లో మెంటల్ హెల్త్ ప్రాముఖ్యత గురించి మీ అభిప్రాయం ఏంటీ? అన్న ప్రశ్నను కరిష్మా ముందు ఉంచితే... ‘‘మానసిక ఆరోగ్యం గురించి మనమందరం తెలుసుకుని ఉండాలన్నది నా అభిప్రాయం. పిల్లలకు కూడా తల్లిదండ్రులు అవగాహన కలిగించాలి. కానీ, కొందరు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తారు. అది సరి కాదు. సొసైటీలో మెంటల్ హెల్త్ టాపిక్‌ని నిషేధించలేదు. మాట్లాడితే తప్పేం కాదు’’ అన్నారు. బాలీవుడ్ కథానాయికలు దీపికా పదుకోన్, అనుష్కాశర్మ మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ను ఫేస్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే మెంటల్ హెల్త్ గురించి నటి ఆలియా భట్ సోదరి షాహీన్ భట్ ఓ పుస్తకం కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment