తన సినిమాలతో కుర్రకారును ఓ ఊపు ఊపిన హీరోయిన్ కరిష్మా కపూర్. పలువురు బడా హీరోలతోనూ జతకట్టి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుందావిడ. ఆన్‌స్క్రీన్‌లో తన నటనతో కట్టిపడేసే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితం ఎంతోకాలం సవ్యంగా సాగలేదు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కొడుకు కియాన్ పుట్టిన తర్వాత దాన్ని నన్నోసారి వేసుకోమన్నారు. తల్లినయ్యాక నా శరీరం కొద్దిగా లావైంది. ఆ డ్రెస్ నాకు పట్టలేదు. అది చూసిన సంజయ్ కోపంతో నన్ను లాగి కొట్టమని అతడి తల్లికి చెప్పాడు. అతడి ప్రవర్తనను తప్పు పట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుక్కే సపోర్ట్ చేసేది' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కరిష్మా. ఇలా ఎన్నో వివాదాల నడుమ కరిష్మా, సంజయ్‌లకు 2016లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలు సమైరా, కియాన్ రాజ్ కపూర్ బాధ్యతలను తల్లికే అప్పజెపుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం.
చదవండి: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే: పోస్ట్‌మార్టమ్ సిబ్బంది
వర్షం డైరెక్టర్ మా బాబాయి, ఆయన పోయిన నెలకే నాన్న చనిపోయారు: కమెడియన్ కూతురు
Comments
Please login to add a commentAdd a comment