సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడు హరీశ్ కుమార్ ఇలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. హీరోయిన్ కరిష్మా కపూర్ తనని కాపాడిందని, లేదంటే చనిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? హరీశ్ ఏం చెప్పాడు?
1990ల్లో హీరోగా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు హరీశ్ కుమార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే 'ప్రేమ్ ఖైదీ' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది. అది షూట్ చేస్తున్న సమయంలో తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కుమార్ షేర్ చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?)
'కరిష్మా.. స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్‌లో దూకి ఆమెని కాపాడతాను. సినిమాలో మీరు చూసిందైతే ఇదే. కానీ షూటింగ్‌లో మొత్తం రివర్స్‌లో జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదు. దీంతో పూల్‌లో దూకిన కాసేపటికే నేను మునిగిపోయాను. నేను ప్రాంక్ చేస్తున్నానని అందరూ అనుకున్నారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. నేను ఆమె స్విమ్ సూట్‌ని పట్టుకున్నాను. అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను' అని నటుడు హరీశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
హరీశ్ కుమార్.. తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్‌స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత తదితర చిత్రాల్లో నటించాడు. హిందీ, మలయాళంలోనూ పలు మూవీస్ చేశాడు. 2017 వరకు నటుడిగా పనిచేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు.
(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)
Comments
Please login to add a commentAdd a comment