harish kumar
-
ధర్మవరంలో బీజేపీ దౌర్జన్యకాండ
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీ‹Ùకుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీల నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వారి దాడిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమే‹Ùతో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లెలో ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై.. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం మ«ధ్యాహ్నం ధర్మవరం సబ్‌జైలుకు వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా, ఆయన డ్రైవర్ రామాంజి మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్‌కుమార్ నేతృత్వంలోని గూండాలు వారి వాహనాలను అడ్డుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ రామాంజిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో రామాంజి అక్కడి నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అంతటితో ఆగని బీజేపీ, కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్‌జైలులో ఉండగా లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, కార్యకర్త శీలా విజయ్‌కుమార్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమే‹Ùపైనా పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. చోద్యం చూసిన పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్నా అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మరికొందరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారు. ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి బీజం వేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌జైలు ఘటనల అనంతరం ఆయన ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల్లో మంత్రి సత్యకుమార్ అనుచరులు, కూటమి పార్టీల నాయకుల దందాలు, దౌర్జన్యాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలసి సబ్‌జైల్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తన డ్రైవర్ రామాంజిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బీజేపీతోపాటు కూటమి పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారన్నారు. దివ్యాంగుడు, ఆరోగ్యం సరిగా లేని అమర్నాథ్రెడ్డిని, విజయ్‌ని దారుణంగా కొట్టారన్నారు. దాడిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌పైనా పోలీస్ లాఠీలతో కొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రాలేదని, పోలీసు స్టేసన్ కూడా సబ్ జైలు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మూడు గంటల పాటు పోలీసులు వారి దౌర్జన్యాలకు పూర్తిగా సహకరించారన్నారు. ధర్మవరంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యకుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. ధర్మవరంలో శాంతి నెలకొల్పేందుకు తమ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులో ఉంచామని, ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సైతం వేలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్మవరం వస్తామంటూ ఫోన్లు చేసినా శాంతింపజేశామన్నారు. కూటమి నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
-
ఎన్నికల హింసపై ఈసీ సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు. ఆకస్మిక బదిలీలతో సమస్యలు..సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బుధవారం సచివాలయంలో సమావేశమై చర్చించారు. విధి నిర్వహణలో ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్చించారు. వీరిని ఇప్పటికే గుర్తించామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. -
డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తా సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్‌కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ కలిగిన అధికారుల పేర్లను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ద్వారకా తిరుమలరావు, హరీష్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సీఎస్ పంపించగా.. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నిక సంఘం హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. కాగా, అనంతపురం డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
-
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడు హరీశ్ కుమార్ ఇలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. హీరోయిన్ కరిష్మా కపూర్ తనని కాపాడిందని, లేదంటే చనిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? హరీశ్ ఏం చెప్పాడు?1990ల్లో హీరోగా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు హరీశ్ కుమార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే 'ప్రేమ్ ఖైదీ' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది. అది షూట్ చేస్తున్న సమయంలో తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కుమార్ షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?)'కరిష్మా.. స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్‌లో దూకి ఆమెని కాపాడతాను. సినిమాలో మీరు చూసిందైతే ఇదే. కానీ షూటింగ్లో మొత్తం రివర్స్‌లో జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదు. దీంతో పూల్‌లో దూకిన కాసేపటికే నేను మునిగిపోయాను. నేను ప్రాంక్ చేస్తున్నానని అందరూ అనుకున్నారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. నేను ఆమె స్విమ్ సూట్‌ని పట్టుకున్నాను. అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను' అని నటుడు హరీశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.హరీశ్ కుమార్.. తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత తదితర చిత్రాల్లో నటించాడు. హిందీ, మలయాళంలోనూ పలు మూవీస్ చేశాడు. 2017 వరకు నటుడిగా పనిచేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే) -
Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు?
మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్ టెండూల్కర్ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు. సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్ అటువైపు చూసి స్వీట్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద నుంచి క్లౌడ్ 9లోకి వెళ్లిన హరీష్ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్’ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్ ధరించాను చూడు’ అన్నాడు. హరీష్ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ వెనుక ‘టెండూల్కర్ 10 ఐ మిస్ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్ టెండూల్కర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్ అయింది. అయిదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్‌స్టేషన్ ఆవరణలో యువతి ఒక్కసారిగా..
ఆదిలాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ముసాయిపేట్కు చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన చందల హరీశ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో 2022 మార్చిలో ప్రియుడు ఇంటి వద్ద సుజాత భైఠాయించింది. ఈ క్రమంలో హరీశ్ తల్లిదండ్రులు నిర్మల్‌కు మకాం మార్చారు. దాదాపు 18 నెలల నుంచి సుజాత తన సమీప బంధువులతో కలిసి ప్రియుడు హరీశ్‌కుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఇరువర్గాల కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించారు. ఈ వివరాలను ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించానికి వెళ్లారు. పెళ్లికి హరీశ్‌కుమార్ నిరాకరించడంతో యువతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. వెంటనే స్థానిక ఎస్సై నరేశ్ పోలీసు వాహనంలో పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రసుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై వివరణ కోరగా ఇరువర్గాల కులపెద్దలు పోలీస్‌స్టేషన్ బయట మాట్లాడుకున్నారు. హరీశ్‌కుమార్ పెళ్లికి నిరాకరించడంతో పోలీస్‌స్టేషన్ గేటు బయట సుజాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు. -
ఆధునిక టెక్నాలజీతో తిరుమలలో పటిష్ట భద్రత: హరీష్ కుమార్ గుప్తా
తిరుమల: ఆధునిక టెక్నాలజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 2 రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంలో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ..భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. భద్రతాంశాల పరిశీలన.. అంతకుముందు శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, కమాండ్ కంట్రోల్ రూం తదితర ప్రాంతాలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజె¯Œన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్కా్వడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీస్, అటవీ, అగి్నమాపక, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత -
20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్‌ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల జాబితా ఇదీ.. (1) బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (2) కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), పల్నాడు జిల్లా, (3)ఎ.సురేశ్‌బాబు.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (4)కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్), విజయవాడ (5) కె.శ్రీధర్.. ఎస్పీ(ఎస్ఐబీ), (6) కె.తిరుమలేశ్వరరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (7) ఎం.సత్తిబాబు.. డీసీపీ, విజయవాడ, (8) ఎంవీ మాధవరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (9) జె.రామమోహన్‌రావు.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, (10) ఎన్.శ్రీదేవిరావు.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (11) ఇ.అశోక్‌కుమార్.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (12) ఎ.రమాదేవి.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ (13)కేజీవీ సరిత.. ఎస్పీ, సీఐడీ (14) కె.ఆనందరెడ్డి.. డీసీపీ, విశాఖపట్నం (15) కె.చక్రవర్తి.. ఎస్పీ, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్, తిరుపతి (16) కె.ఈశ్వరరావు.. ఏడీసీ, గవర్నర్ (17) కె.చౌడేశ్వరి.. ఎస్ఆర్పీ, గుంతకల్(18) ఇ.సుప్రజ.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ(19) కేవీ శ్రీనివాసరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్, (20) కె.లావణ్యలక్ష్మి.. ఎస్పీ, ట్రాన్స్‌కో (21) ఎం.సుందరరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్ -
ఏపీ: 20 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ఏపీలో 20 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పోస్టింగ్‌లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ డీసీపీగా మోకా సత్తిబాబు, విశాఖపట్నం డీసీపీగా ఆనంద్ రెడ్డిగా నియామకమయ్యారు. -
Hyderabad: అమ్ముతావా.. చస్తావా!
సాక్షి, బంజారాహిల్స్: తక్కువ ధరకే ఖరీదైన భూమిని విక్రయించాలని కొంత కాలంగా బెదిరించినా తమ మాట వినలేదనే కోపంతో నగరంలోని బంజారాహిల్స్ పరిధిలో దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం కౌడిపల్లికి చెందిన కొత్త హరీష్‌కుమార్ (36)కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన కౌడిపల్లి టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, కౌడిపల్లి సర్పంచ్ ఎ.సుధీర్‌రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, బుర్దరం పేట సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయికోటి రాజు, టి.సంతోష్‌రావు, ఎస్కే ఆసిఫ్, లింగం తదితరులతో పాటు మొత్తం 18 మంది మూడు కార్లలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. ►యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ భవానీ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకుంటున్న హరీష్ కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన కాలర్ పట్టుకొని కారులోకి ఈడ్చుకొచ్చారు. అడ్డుగా వచ్చిన హరీష్ తమ్ముడు మహేష్‌ను కొట్టుకుంటూ కారులోకి ఎక్కిస్తుండగా ఆయన తప్పించుకొని సమీపంలో దాక్కున్నాడు. హరీష్‌ను కిడ్నాప్ చేసి మూడు కార్లలో నర్సాపూర్ అడవుల వైపు వెళ్లారు. ►తప్పించుకున్న మహేష్ డయల్ 100కు ఫోన్ చేసి తన సోదరుడు హరీష్ కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసిన కృష్ణగౌడ్ నంబర్ తీసుకొని వెంటనే హరీష్‌ను తీసుకొని రావాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ కృష్ణగౌడ్, సుధీర్‌రెడ్డి తదితరులు బాధిత హరీష్‌ను కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ►తన దుస్తులు విప్పేసి దారి పొడవునా తీవ్రంగా కొట్టారని, తొమ్మిది ఎకరాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ హెచ్చరించారని, లేకపోతే నర్సాపూర్ అడవుల్లో పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తనను కిడ్నాప్ చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ►తనకు ప్రాణహాని ఉందంటూ సెప్టెంబర్ 17న కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని బాధితుడు ఆరోపించారు. ఆ రోజు తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే తనను కిడ్నాప్ చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. కాగా.. కిడ్నాపర్లు విదేశాలకు వెళ్తున్న ఓ ఎమ్మెల్యేకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తూ ఈ పని చేశారని సమాచారం. -
అన్ని భాషల్లో అందగాడు.. ఈ హీరో గుర్తున్నాడా?
Actor Harish Kumar Special Story: ఒక యాక్టర్ ఎక్కువ కాలం కెరీర్లో కొనసాగాలంటే రకరకాల పరిస్థితులు అనుకూలించాలి. ఏదో ఒక కారణం వాళ్లను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ సొంత ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా ఆ వ్యతిరేకతను అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండాలి. బాల నటుడిగా మొదలైన హరీష్ కుమార్ నటనా ప్రస్థానం.. అన్ని భాషల్లో అందగాడనే ట్యాగ్‌తో హీరోగా రాణించగలిగే అవకాశాల్ని తెచ్చిపెట్టింది. కానీ, ఎందుకనో అది ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఈ విషయంలో చాలామంది పొరపడుతుంటారు కూడా. హరీష్ కుమార్(46).. నాలుగు దశాబ్దల నటుడు. కెరీర్ మొదట్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. అప్పట్లో ఇది ఒక రికార్డు కూడా. ఆపై హీరోగా కూడా ఇవే భాషల్లో రాణించాడు. సుమారు 280 సినిమాల్లో నటించిన హరీష్‌కు అభిమానుల్లో ‘హ్యాండ్సమ్ స్టార్’ ఒక ట్యాగ్‌లైన్ ఉండేది. అక్కినేని నాగేశ్వర రావు, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్ చక్రవర్తి, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, గోవిందా.. ఇలా దాదాపు అన్ని భాషల్లో టాప్‌హీరోలతో నటించిన ఘనత హరీష్‌కు ఉంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత కారణాలతో తెరపై కనిపించడం తగ్గించేశాడు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నాడు. 1995లో సంగీతను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా!(ఆగష్టు 1 కాదు.. 14న ఆయన పుట్టినరోజు). ‘యంగ్’ హీరో రోల్స్‌లో.. హైద్రాబాద్‌లో పుట్టి, పెరిగిన హరీష్.. చిన్న వయసుకే నటనలోకి దిగాడు. ముద్దుల కొడుకు(1979) ద్వారా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై సీతామాలక్క్క్ష్మి, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం, నా దేశం, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తదితర సినిమాల్లో నటించాడు. హిందీలో ఎనిమిదేళ్లకే అడుగుపెట్టి, ఆపై తమిళ్ సినిమాల్లోనూ అగ్ర హీరోల యంగ్ వెర్షన్ రోల్స్‌లో సుమారు 20 చిత్రాల్లో మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతున్న టైంలో లీడ్ హీరోగా పెద్ద సక్సెస్ అందుకున్న ఘనత హరీష్ ఖాతాలో ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆంధ్ర కేసరి.. హరీష్‌కు తొలి నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఓ రేంజ్ హిట్.. హరీష్ హీరో అయ్యింది పదమూడేళ్లకే. మలయాళంలో రొమాంటిక్ లవ్ స్టోరీ ‘డైసీ’ ద్వారా హీరో అయ్యాడు. స్కూల్ టీనేజ్ లవ్ స్టోరీతో నడిచే ఈ మూవీకి ప్రతాప్ పోతన్ డైరెక్టర్ కాగా, కమల్ హాసన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. ట్రాజెడీ కథగా 1988లో రిలీజ్ అయిన డైసీ భారీ హిట్ అయ్యింది. ఆపై హరీష్‌కు తమిళం, తెలుగు, హిందీలోనూ హీరోగా అవకాశాలు దక్కాయి. ఫ్యామిలీ హీరో హీరోగా అవకాశాలు దక్కకముందు సపోర్టింగ్ రోల్స్‌తో అలరించాడు హరీష్. ఆపై ఈవీవీ-రామానాయుడు కాంబోలో వచ్చిన ‘ప్రేమ ఖైదీ’ ద్వారా సెన్సేషన్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అటుపై ‘పెళ్ళాం చెపితే వినాలి, రౌడీ ఇన్స్పెక్టర్, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేత, ఏవండీ ఆవిడ వచ్చింది, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం, జైలర్‌గారి అబ్బాయి, ఎస్పీ పరుశరాం చిత్రాలతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగా అలరించాడు.1996లో జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ‘ఒహొ నా పెళ్ళంట’కు బెస్ట్యాక్టర్గా స్పెషల్ జ్యూరీ నంది అందుకున్నాడు. ఆపై గోకులంలో సీత, డాడీ డాడీ తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్‌తో ఈవీవీ పెళ్లైంది కానీ(2007)లో నటించాడు. ఇక హిందీలో కరిష్మా కపూర్ ఫస్ట్ హీరో కూడా హరీషే. ప్రేమ ఖైదీ హిందీ రీమేక్‌లో హరీష్ సరసన నటించడం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది కరిష్మా. ఆపై హిందీలో(దాదాపు నలభై చిత్రాలు), మూడు తమిళ సినిమాలు, ఏడేనిమిది కన్నడ సినిమాలతో హరీష్ నటుడిగా, హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక బాలీవుడ్లో గోవిందాతో ప్రత్యేక అనుబంధం ఉంది హరీష్‌కు. అందుకే చాలా సినిమాల్లో తన పక్కన అవకాశం ఇచ్చాడు ఆయన. ఆపై చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన ‘ఆ గయా హీరో’(2018)లోనూ హరీష్‌కు ఓ రోల్ ఇప్పించాడు గోవిందా. ఆ ఐదు సినిమాల వల్లే.. హీరోగా మిగతా భాషల్లో అవకాశాలు దక్కుతున్న టైంలో.. హరీష్ మీద ‘థర్డ్ గ్రేడ్’ అనే ట్యాగ్ ప్రచారంలోకి వచ్చింది. అందుకు కారణం మలయాళంలో డైసీ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ ఆ తరహా చిత్రాలే కావడం. రొమాంటిక్ కథల పేరుతో మలయాళంలో వరుసబెట్టి ఐదారు సినిమాల్లో నటించాడు హరీష్. ఇవే హరీష్‌పై నెగెటివ్ ముద్రను వేశాయి. అయితే ఆ టైంలో మీడియా ఫోకస్ ఎక్కువగా లేకపోవడం, ఉన్న మీడియా హౌజ్‌లు కూడా ఆ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేయలేదు. దీంతో హరీష్ కెరీర్ మసకబారడానికి ఆ సినిమాలే ఓ కారణంగా భావిస్తుంటారు చాలామంది. కానీ, ఈ సినిమాలు చేసినా కూడా.. హరీష్ బాలీవుడ్‌తో సహా మిగతా భాషల్లో హీరోగా రాణించాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు ఎందుకనో!. -సాక్షి, వెబ్‌డెస్క్ -
20 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డ్స్ ఏడీజీగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆర్కే మీనాకు ఏడీజీగా పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎవరు.. ఎక్కడంటే.. - వెయిటింగ్లో ఉన్న పి.హరికుమార్కు ఐజీ లీగల్‌గా పోస్టింగ్ - ఎస్ఐబీ డీఐజీ సిహెచ్ శ్రీకాంత్‌కు ఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్‌కు ఐజీగా పదోన్నతి. మెరైన్ ఐజీగా పోస్టింగ్ - సీఐడీ డీఐజీ ప్రభాకరరావుకు ఐజీగా పదోన్నతి. గుంటూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్‌లాల్ సాండ్ ఎన్ఫోర్స్మెంట్కు బదిలీ. ఎక్సైజ్ ప్రొహిబిషన్ అదనపు బాధ్యతలు - విజయవాడ జాయింట్ సీపీ డి.నాగేంద్రకుమార్ పదోన్నతిపై ఐజీగా పీ అండ్ ఎల్‌కు బదిలీ - కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డికి డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏసీబీ జాయింట్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఇంటెలిజెన్స్ ఎస్పీ జి.విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - డీసీపీ విజయవాడ అడ్మిన్ ఎస్.హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి. సీఐడీకి బదిలీ - ఎస్ఐబీ ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు డీఐజీగా పదోన్నతి. ఏసీబీకి బదిలీ - ఎస్వీ రాజశేఖర్‌బాబుకు డీఐజీగా పదోన్నతి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ శాంతి భద్రతల విభాగం కో–ఆర్టినేటర్‌గా బదిలీ - ఇంటెలిజెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు డీఐజీగా పదోన్నతి. ఏలూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - పార్వతీపురం ఏఎస్పీ గరుడ్ స్మిత్ సునీల్ నర్సీపట్నం ఓఎస్డీకి బదిలీ - వేకెన్సీలో ఉన్న బి.కృష్ణారావు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - చింతూరు ఓఎస్డీ అమిత్ బర్డార్ కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - బొబ్బిలి ఏఎస్పీ గౌతమి సాలి అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కర్నూలుకు బదిలీ -
మహిళా పోలీసులకే మిగమిగ అవసరం
తమిళసినిమా: మిగమిగ అవసరం చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలిపారు. ఇంతకు ముందు అమెదిపడై 2, కంగారు చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి మూడవ చిత్రానికి తానే దర్శకుడిగా అవతారమెత్తారు. ఆయన స్వీయ నిర్మిస్తున్న చిత్రానికి మిగ మిగ అవసరం అని పేరు నిర్ణయించారు. శ్రీప్రియాంక నాయకిగా సెంట్రిక్ పాత్రను పోషిస్తున్న ఇందులో హరీశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో దర్శకుడు సీమాన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో లళక్కు ఎన్ ముత్తరామన్, సేతుపతి లింగ, పరంజ్యోతి, దర్శకుడు సరవణ శక్తి నటిస్తున్నారు. దర్శకుడు జగన్ కథ, కథనాన్ని అందించిన ఈ చిత్రాన్ని సురేశ్ కామాక్ష్మి స్వీయ దర్శకత్వంలో తన వి.హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మిగ మిగ అవసరం చిత్రంలో మహిళా పోలీసుల మనోధైర్యాన్ని, మానవత్వాన్ని, వాటితో పాటు వాళ్ల సమస్యలను అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన ట్లు తెలిపారు. అందువల్ల ఈ చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. -
సంకల్పమే శ్వాసగా!
డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినం జీవితానికి ఒక ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని జయించాలనే తపన ఉండాలి.ఆ తపన లేని వారికి అణువంత సమస్య కూడా కొండంత కనిపించి వెనక్కి తగ్గుతారు. తపన ఉన్నవాళ్లకు కొండంత సమస్య కూడా అణువంతైనా ప్రభావం చూపదు! ఈ కోవకు చెందిన వ్యక్తి అహ్మదాబాద్(గుజరాత్)కు చెందిన హరీష్ కుమార్. పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు హరీష్ (కుడి చేయి దిగువభాగం పుట్టుకతోనే లేదు). తనకు రెండు చేతులు లేకపోవడం గురించి హరీష్‌కు బాధగా ఉండేది. అయితే అది కొంతకాలం వరకు మాత్రమే... ఆ తరువాత దాన్ని అధిగమించాడు. చదువులో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఐఐటి, ఢిల్లీ నుంచి యంటెక్ పూర్తిచేశాడు. ఆ తరువాత... పద్దెనిమిది సంవత్సరాల పాటు టెలికామ్ సెక్టార్లో జనరల్ మేనేజర్‌తో సహా రకరకాల హోదాల్లో పనిచేశాడు. ఒకసారి మిత్రుడు ఒకరు హరీష్‌కు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకంలో దీపా మాలిక్ గురించి చదివి ఉత్తేజితుడయ్యాడు హరీష్. సై్పన్ సర్జరీ జరిగిన దీపా మాలిక్ డ్రైవింగ్‌లో రికార్డులు సృష్టించారు. రోజువారి యాంత్రిక జీవితంలో పడి తనకు ఇష్టమైన డ్రైవింగ్‌ను మరిచిపోయిన విషయం హరీష్‌కు అప్పుడు గుర్తుకువచ్చింది. మనసు మళ్లీ డ్రైవింగ్ వైపు లాగింది. తాను కూడా దీపామాలిక్ మాదిరిగా రికార్డ్ సృష్టించాలనే కోరిక పెరిగింది. అలా... తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు హరీష్. 28 రాష్ట్రాల గుండా 15,963 కిలోమీటర్ల దూరాన్ని 29 రోజులలో ఒక మామూలు కారులో కవర్ చేసిన ‘ఫస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్’గా డ్రైవింగ్‌లో నేషనల్ రికార్డ్ సృష్టించాడు. ఆ తరువాత... 6,000 కిలోమీటర్లను (అహ్మదాబాద్- ఢిల్లీ- కోల్‌కతా-చెన్నై- ముంబాయి-అహ్మదాబాద్) 129 గంటల్లో పూర్తిచేసి మరో రికార్డ్ నెలకొల్పాడు. ఈ రెండూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకున్నాయి. ఈ రెండు విజయాలు తన మనసుకు ఎంతో తృప్తినిచ్చాయి. ఆ తరువాత మళ్లీ... కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించాడు హరీష్ కుమార్. ఆ సమయంలో చాలామంది వికలాంగులు హరీష్‌ను సంప్రదించారు.‘‘మీలాగే రికార్డ్‌లు నెలకొల్పాలని ఉంది. డ్రైవింగ్ అంటే ఇష్టం. కానీ డ్రైవింగ్ రాదు. నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చేవి. అవమానాలు ఎదురయ్యేవి.’’ అనేవారు. వారి ఆవేదన హరీష్‌ను ఆలోచింపచేసింది. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. డ్రైవింగ్ లెసైన్స్ కోసం తాను ఎంత ఇబ్బంది పడింది, ఎందరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది... ఒక్కటొక్కటిగా గుర్తుకొచ్చింది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి, డ్రైవింగ్ లెసైన్స్ పొందడానికి ఎవరూ ఇబ్బందులు, అవమానాలు పడొద్దు అని... వికలాంగుల కోసం మన దేశంలో తొలి డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. దీనికి ముందు ప్రభుత్వ అధికారులను కలుసుకున్నాడు. వారు చెప్పిన విషయం షాకింగ్‌గా అనిపించింది. వికలాంగుల కోసం మన దేశంలో ఒక్క డ్రైవింగ్ స్కూలు కూడా లేదు!‘ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అనిపించింది. ఏమైతేనేం... హరీష్ కోరికను మన్నించి వికలాంగుల కోసం ‘డ్రైవింగ్ స్కూల్’ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మొదటిసారి 150 మంది చేరి డ్రైవింగ్ నేర్చుకొని లెసైన్సులు కూడా పొందారు. వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ‘ఎబిలిటీ ఆన్ వీల్స్’ అనే పుస్తకం కూడా రాశాడు హరీష్ కుమార్. ఈ పుస్తకంలో... స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నవారి పట్టుదల, నైపుణ్యాల గురించి వివరంగా రాశాడు. మరిన్ని నగరాలలో వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్లు ఏర్పడాలని, ఏర్పాటు చేయాలనుకునేవారికి తన సహయ సహాకారాలు ఉంటాయంటున్నారు హరీష్ కుమార్.హరీష్ కుమార్ ‘డ్రైవింగ్ స్కూల్’ వినూత్న ఆలోచన ఎందరిలోనో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు...ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.‘డ్రైవింగ్’ అనేది మనకు సంబంధించిన విషయం కాదనుకునేవారిని దగ్గరికి తీసుకొని వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ‘మేము సైతం’ అంటూ అణువణువూ సంకల్పబలాన్ని నింపుతుంది. -
టీడీపీ, బీజేపీల మధ్య పొడిచిన పొత్తు!
సదాశివపేట, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు విషయంలో కొలిక్కి రావాల్సి ఉంది. ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు మంగళ, బుధవారాల్లో సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ తీసుకోగా అభ్యర్థిని కూడా ప్రకటించారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఇందులో ఏడు సీట్లు కావాలని బీజేపీ కోరుతుంది. పెద్దాపూర్, నిజాంపూర్, వెల్టూర్, వెంకటాపూర్, కంభాలపల్లి, బాబిల్‌గామ్, నందికంది లేదా మద్దికుంట ఎంపీటీసీ స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల కోఆర్డినేటర్ హరీష్‌కుమార్, జిల్లా నాయకుడు కోవూరి సంగమేశ్వర్ టీడీపీ నాయకులను కోరారు. ఏడు స్థానాలు కాకుండా ఐదింటితో సరిపెట్టుకోవాలని బీజేపీ నాయకులకు టీడీపీ నేతలు సూచించారు. చివరకు ఐదు లేదా ఆరు స్థానాలు బీజేపీకి ఇచ్చి మిగతా స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం వరకు స్పష్టత వస్తుందన్నారు. పొత్తుల ఇరు పార్టీలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎంపీపీ పీఠాన్ని ఎవరు తీసుకోవాలి అనే విషయమై మరోమారు చర్చిస్తామని ఆయన తెలిపారు. -
నవనీత్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: గోల్కొండ సీసీ బౌలర్ నవనీత్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 328 పరుగుల భారీ తేడాతో కాన్కార్డ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత గోల్కొండ సీసీ జట్టు బ్యాటింగ్ చేయగా, బ్యాట్స్‌మన్ హరికుమార్ (149 నాటౌట్), ఖాజా (108 నాటౌట్) మెరుపు శతకాలతో అజేయంగా నిలవడంతో జట్టు ఆరు వికెట్ల నష్టానికి 477 పరుగుల భారీ స్కోరు చేసింది. అనూప్ (60), హర్ష (61) అర్ధ సెంచరీలతో చెలరేగగా, సుకేష్, సాయి శృతీశ్ చెరో 30 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాన్కార్డ్ జట్టు నవనీత్ ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. నితిన్ (53) అర్ధ సెంచరీతో రాణించాడు.