తిరుమల: ఆధునిక టెక్నాలజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 2 రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంలో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌లను వాడాలనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు.
యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ..భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు.
భద్రతాంశాల పరిశీలన..
అంతకుముందు శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, కమాండ్ కంట్రోల్ రూం తదితర ప్రాంతాలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిషోర్, ఇంటెలిజె¯Œన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్కా్వడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీస్, అటవీ, అగి్నమాపక, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత
Comments
Please login to add a commentAdd a comment