High Technology
-
ఆధునిక టెక్నాలజీతో తిరుమలలో పటిష్ట భద్రత: హరీష్ కుమార్ గుప్తా
తిరుమల: ఆధునిక టెక్నాలజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 2 రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంలో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ..భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. భద్రతాంశాల పరిశీలన.. అంతకుముందు శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, కమాండ్ కంట్రోల్ రూం తదితర ప్రాంతాలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజె¯Œన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్కా్వడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీస్, అటవీ, అగి్నమాపక, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత -
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఎవరిదంటే..
Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్‌ఫోన్ డాటా థ్రెట్’. ఫోన్ ఎంతటి అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట! ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌ను క్వీన్ ఎలిజబెత్ II వాడుతున్నారట!. బకింగ్హమ్ ప్యాలెస్‌లో క్వీన్ ఛాంబర్లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్ చేసినా ఆమె ఆ ఫోన్‌తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఏజెన్సీ స్ఫుతినిక్ ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించే మొబైల్ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్లో ఫేస్బుక్ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. ఇక ఫేస్బుక్ మెసేజ్‌లు ఇంకా ఎన్క్రిప్షన్కు(సెండర్- రీడర్ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. కానీ, ఎలిజబెత్ రాణి వాడుతున్న ఫోన్లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని, అందువల్ల ఆ ఫోన్లో ఉండే ఫేస్బుక్ మాత్రమే కాదు.. ఫోన్లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని యూకేపాడ్కాస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ఇంతకీ ఫోన్ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్‌ను ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్ ఛార్జ్ డౌన్ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాండిల్ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్ జాన్ వారెన్) స్పుత్నిక్ సారాంశం. సీక్రెట్ ఫేస్బుక్ అకౌంట్ అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్బుక్) అందించే ఫేస్బుక్ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్ రాణి ఫోన్లో ఒక రహస్య ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్.. అదీ 95 ఏళ్ల బ్రిటన్ మహరాణి వాడుతున్నారనే స్టింగ్ ఆపరేషన్ కథనాలు టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్‌ను వాడుతున్నారని తెలుస్తోంది. -
హచ్ డాగ్‌లా వెంటే.. వెన్నంటే..
2014, మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది... అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు.. మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు.. విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్ క్లోజ్ చేశారు.. ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్.. ఇరిడియం నెక్ట్స్.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఇలా.. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ సిస్టం ద్వారా ట్రాక్ చేస్తున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ అందుతుంది. ఎంహెచ్ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్ బాక్స్ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
నిర్లక్ష్యం నీడన నిఘా వ్యవస్థ
=సీసీ కెమెరాల ఏర్పాటులో టీటీడీ జాప్యం =టెండర్ల దశ దాటని వైనం సాక్షి, తిరుపతి: నిఘా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్య త ఇవ్వాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ)లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటు వ్యవహారాన్నే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. గత జూలైలో జరిగి న టీటీడీ ట్రస్టుబోర్డు సమావేశంలో తిరుమల, తిరుపతి, ముఖ్య నగరాల్లోని ఆలయాల్లో నిఘా పెంచడం కోసం రెండువేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.62కోట్లు కేటాయించారు. బ్రహ్మోత్సవాల లోపు సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయి తే బ్రహ్మోత్సవాలు ముగిసినా టెండర్ల ప్రక్రియ దాటకపోవడం విమర్శలకు తావిస్తోంది. అత్యాధునిక విలువలతో కూడిన హైటెక్నాలజీ సోఫెస్టికేటెడ్ కెమెరాల ధరలో వ్యత్యాసముండడంతో ప్రస్తుతం కేటాయించిన రూ.62 కోట్లు సరిపోవడం లేదని తెలుస్తోంది. ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉండడం, ఇదే సమయంలో ఈవో ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీ కావడం, కొత్తగా ఎంజీ.గోపాల్ బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమైనట్లు సమాచారం. కొత్త ఈవో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం కలిగిన కెమెరాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికిగాను ఆయన తన నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ (టెక్నికల్), ఐజీపీ (ఇంటలిజెన్స్)లతో కమిటీని నియమించారు. వీరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై కెమెరాల కొనుగో లు, సామర్థ్యంపై చర్చించినట్లు తెలు స్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి స్థాయిలో కెమెరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 14 లోకల్ కంట్రోల్ రూమ్‌లు తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను కంట్రోల్ చేయడానికి 14 లోకల్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తిరుమల, తిరుపతిలో ఈ కంట్రోలు రూములు ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కెమెరాలను ఇంటర్నెట్ ద్వారా తిరుపతిలోనే కంట్రోలింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భాగస్వామ్యం అవసరం లక్షల మంది భద్రతకు సంబంధించిన సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండాలని భావి స్తున్నాం. ఈవో ప్రభుత్వ అధికారులతో కలసి కమిటీని నియమించారు. అనుభవజ్ఞులైన అధికారుల సలహాలతో కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే దీనికి తుదిరూపు వస్తుంది. - అశోక్‌కుమార్, సీవీఎస్వో, టీటీడీ