Tirupati: TTD Arranges Tight Security At Tirumala Temple - Sakshi
Sakshi News home page

తిరుమల భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి

Published Tue, May 23 2023 12:32 PM | Last Updated on Tue, May 23 2023 5:28 PM

Tirupati: TTD Arranges Tight Security To Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటివల జరిగిన ఘటనల నేపథ్యంలో భద్రతను మరింత బలోపేతం చెయ్యాలని టీటీడీ నిర్ణయించుకుంది. అందుకోసం ప్రత్యేక చర్యలను తీసుకోనుంది. ఈ క్రమంలో అన్నమయ్య భవన్‌లో టీటీడీ అధికారులు, పోలిసులు కేంద్ర ఐబీ, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశం జరపనుంది.

ఈ సమావేశంలో టీటీడీ భద్రతా ఏర్పాట్లు పై భధ్రతాధికారులు, పోలిసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెయ్యనున్నారు. తిరుమల భద్రత మెరుగుపరచడానికి టీటీడీ భద్రత అధికారుల సూచనలను కోరింది. ఈ నేపథ్యంలో వారు తిరుమలలో భద్రతను పరిశీలించి 15 రోజుల్లో నివేదికను టీటీడికి సమర్పించనున్నారు.

చదవండి: ‘మా భర్తలను సొంత జిల్లాలకు బదిలీ చేయండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement