నవనీత్ విజృంభణ | Navanith took six wickets | Sakshi
Sakshi News home page

నవనీత్ విజృంభణ

Oct 21 2013 12:10 AM | Updated on Sep 1 2017 11:49 PM

గోల్కొండ సీసీ బౌలర్ నవనీత్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 328 పరుగుల భారీ తేడాతో కాన్‌కార్డ్ జట్టుపై ఘన విజయం సాధించింది.

జింఖానా, న్యూస్‌లైన్: గోల్కొండ సీసీ బౌలర్ నవనీత్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 328 పరుగుల భారీ తేడాతో కాన్‌కార్డ్ జట్టుపై ఘన విజయం సాధించింది.
 
 ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత గోల్కొండ సీసీ జట్టు బ్యాటింగ్ చేయగా, బ్యాట్స్‌మన్ హరికుమార్ (149 నాటౌట్), ఖాజా (108 నాటౌట్) మెరుపు శతకాలతో అజేయంగా నిలవడంతో జట్టు ఆరు వికెట్ల నష్టానికి 477 పరుగుల భారీ స్కోరు చేసింది. అనూప్ (60), హర్ష (61) అర్ధ సెంచరీలతో చెలరేగగా, సుకేష్, సాయి శృతీశ్ చెరో 30 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాన్‌కార్డ్ జట్టు నవనీత్ ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. నితిన్ (53) అర్ధ సెంచరీతో రాణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement