Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు? | Sachin Tendulkar meets fan and askiing airport route | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు?

Published Sun, Feb 4 2024 4:12 AM | Last Updated on Sun, Feb 4 2024 4:12 AM

Sachin Tendulkar meets fan and askiing airport route - Sakshi

మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్‌ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్‌ టెండూల్కర్‌ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు. సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్‌ అటువైపు చూసి స్వీట్‌ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్‌ టెండూల్కర్‌. రోడ్డు మీద నుంచి క్లౌడ్‌ 9లోకి వెళ్లిన హరీష్‌ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్‌’ అన్నాడు.

ఆటోగ్రాఫ్‌ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్‌ హెల్మెట్‌ ధరించి డ్రైవ్‌ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్‌ ధరించాను చూడు’ అన్నాడు.
 
హరీష్‌ ధరించిన ముంబై ఇండియన్స్‌ జెర్సీ వెనుక ‘టెండూల్కర్‌ 10 ఐ మిస్‌ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్‌ టెండూల్కర్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్‌ అయింది. అయిదు మిలియన్‌లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement