Airport Road
-
బైక్‌పైనే ముద్దుముచ్చట
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలో కొందరు జంటలు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అదే మాదిరిగా ఒక యువకుడు తన లవర్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్ నడిపిన వీడియో బయటకు వచ్చింది. యలహంక సమీపంలో ఎయిర్‌పోర్టు రోడ్డులో ఒక యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద యువతిని కూర్చోబెట్టుకుని కేరింతలు కొడుతూ దూసుకెళ్లాడు.ఇద్దరూ హెల్మెట్ కూడా ధరించలేదు. కొందరు పౌరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోకిరీ జంట నిర్వాకం వైరల్‌గా మారింది. మే 17న ఈ తతంగం జరిగినట్టు తెలుస్తోంది. ఆ జంటకు చీవాట్లు పెడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. -
Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు?
మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్ టెండూల్కర్ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు. సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్ అటువైపు చూసి స్వీట్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద నుంచి క్లౌడ్ 9లోకి వెళ్లిన హరీష్ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్’ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్ ధరించాను చూడు’ అన్నాడు. హరీష్ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ వెనుక ‘టెండూల్కర్ 10 ఐ మిస్ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్ టెండూల్కర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్ అయింది. అయిదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
అలిగిన వేళనే అందాలి
ఆయనో ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రారంభోత్సవానికి ఆయనకు ఆహ్వానం అందింది. అయితే ‘‘ఆ కార్యక్రమం ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు. తనను ఎందుకు సంప్రదించలేదు’’ అంటూ అలిగారు. ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇక అనుచరులు కూడా తమ ఎమ్మెల్యేకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని నానారచ్చ చేశారు. దెబ్బకు దిగొచ్చిన అధినాయకత్వం ఆయన ఆగ్రహ జ్వాలలను చల్లబరిచేందుకు అభివృద్ధి నిధులు రూ.రెండు కోట్లు కేటాయించేసింది. అయితే ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు ప్రయోజనం కలిగేలా నిధులు ఇవ్వడమేంటని? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చదవండి మరి. మధురపూడి(రాజానగరం) : ఇటీవల మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్‌పోర్టు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇండిగో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమ విషయమై తనతో ఎందుకు చర్చించలేదని స్థానిక ఎమ్మెల్యే అలిగారు. ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. ఆయన అనుయాయులు ఎయిర్‌పోర్టు మెయిన్ గేటు వద్ద ధర్నాకు ఉపక్రమించారు. తమ నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నిధులను ఎయిర్‌పోర్టు రోడ్డుకు ఇరువైపులా కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అభివృద్ధి పేరిట సుమారు రూ.రెండు కోట్లు.. అధికారపార్టీ అధినాయకత్వం అలిగిన వారిని బుజ్జిగించడానికి వడ్డింపులు వడ్డిస్తోంది. అభివృద్ధి పేరుతో నిధుల కేటాయింపు జరుగుతోంది. దానిలో భాగంగానే ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌కు ఎయిర్‌పోర్టు రోడ్డు అభివృద్ధి పేరిట సుమారు రూ.రెండు కోట్ల నిధులు కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటు పనుల నిమిత్తం కేటాయించారు. ఈ మేరకు శంకుస్థాపన, శిలాఫలకం ఏర్పాటు చేశారు. దీనికి రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి, ఎంపీ మాగంటి మురళీమోహన్, గుడా చైర్మన్ గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ పనులు 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతాయి. ఎయిర్‌పోర్టు నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వరకు పనులు జరగాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు రోడ్డుకిరువైపులా కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటు పనులు తక్షణ అవసరం కాదని పలువురు చెబుతున్నారు. నిధులను కైంకర్యం చేయడానికే ఈ పనులని పలువురు వాపోతున్నారు. రాజకీయ లబ్ధికోసం నీరు–చెట్టు తరహా పనులు జరిపిస్తూ ఉంటారని, ఎయిర్‌పోర్టు రోడ్డులో నిర్వహించే పనులు ఈ కోవకే చెందుతాయని స్థానికులు విమర్శిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టు రోడ్డులో భారీ ధర్నా
కొత్తగా ప్రకటించిన జిల్లాల జాబితాలో ఉన్న శంషాబాద్‌కు అదే పేరు కొనసాగించాలంటూ భారీ ధర్నా జరిగింది. మంగళవారం ఉదయం అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో అఖిలపక్షాల నేతలు రాస్తారోకోకు దిగారు. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిరసన సాగిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కారణంగా ఈ మార్గంలో గంటకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ప్రాణాలు తీసిన బైక్ రేసింగ్
-
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
బళ్లారి అర్బన్ : దసరా పండుగను పురస్కరించుకుని నగ రంలోని గురుశాంతప్ప లేఔట్లోగల సీతారామ ఆశ్రమంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు నేతి సీతారామయ్య శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 25న బాలదేవి, 26న త్రిపురసుందరి దేవి, 27న లలితాదేవి, 28న అన్నపూర్ణాదేవి, 29న గాయత్రీదేవి, 30న చండికాదేవి, 1న మహాసరస్వతి, మహాలక్ష్మి, 2న మహాదుర్గ మహాకాళి, దుర్గాష్టమి, మహర్నవమి, 3న రాజరాజేశ్వరిదేవి అవతారాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవార్లకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమాలు, ఉదయం గోపూజ, సాయంత్రం 6 గంటల నుంచి లక్ష వత్తుల దీపోత్సవం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మహాలక్ష్మి ఆలయంలో నేటినుంచి నవరాత్రి ఉత్సవాలు బళ్లారి (తోరణగల్లు) : స్థానిక ఎయిర్పోర్ట్ రోడ్డులోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో గురువారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారిని అక్టోబర్ 3 వరకు వరుసగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, కొల్హాపురి మహాలక్ష్మి అవతారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం శ్రీరామనగర్ : స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బుధవారం ప్రధాన అర్చకుడు కాశీ వెంకట సత్యనారాయణ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, స్వర్ణకవచ అలంకరణ, 7 గంటలకు ప్రార్థివ లింగార్చన, బిల్వ అర్చన, 8 గంటలకు కుంకుమార్చన ఉంటాయని తెలిపారు. కాగా ఆంధ్ర నుంచి పదివేల మంది వేదపండితులతో చండీ హోమం జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మినీడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పీ.ధర్మారావు, సభ్యులు మన్నె కృష్ణమూర్తి, డీఆర్.ప్రసాద్, టీ.జయరామిరెడ్డి, చిలుకూరి బుజ్జి, ఏ చంటిరాజు తెలిపారు.